Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • పన్ను ఆదా కోసం ముందస్తు ప్రణాళిక – ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ప్లాన్ చేసుకోండి.. Plan Early for Tax Savings – Start at the Beginning of the Financial Year FEATURE NEWS
  • చైనా ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు – భారత్‌లో పెట్టుబడుల కొత్త దిశ..  Relaxation in Chinese FDI Rules – A New Direction for Investments in India FEATURE NEWS
  • మార్కెట్‌ అనిశ్చితిలో.. ఇండెక్స్‌ ఈటీఎఫ్‌లు ఎంత‌వ‌ర‌కు లాభం? In Market Uncertainty, How Profitable Are Index ETFs? FEATURE NEWS
  • విదేశీ మదుపర్ల భారీ ఉపసంహరణ – మార్కెట్‌పై ఒత్తిడి పెంచుతున్న ఎఫ్‌పీఐ విక్రయాలు.. Massive Foreign Investor Outflows – FPI Selling Pressure Weighs on Markets FEATURE NEWS
  • రాబడి మాత్రమే కాదు.. లిక్విడిటీ కూడా ముఖ్యం..! Returns Alone Aren’t Enough.. Liquidity Matters Too FEATURE NEWS
  • పిల్ల‌ల‌కు డబ్బు విలువ నేర్పిద్దాం.. అర్థిక అక్ష‌రాస్య‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పిద్దాం..! Teach Children the Value of Money.. Build Awareness on Financial Literacy FEATURE NEWS
  • ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్ల రికార్డు .. రూ.2.43 లక్షల కోట్లుగా న‌మోదు..! గ‌తేడాదితో పోలిస్తే 8.7 శాతం పెరుగుదల! Record GST Collections in April Reach ₹2.43 Lakh Crore; Up 8.7% Compared to Last Year FEATURE NEWS
  • అధిక‌ క్రెడిట్ కార్డులతో అధిక‌ రివార్డులు పొందొచ్చా? క‌ఠినంగా మారిన‌ ష‌ర‌తులు! Can More Credit Cards Bring More Rewards? Conditions Are Getting Tougher! FEATURE NEWS
  • రోజుకు రూ.500 పొదుపు.. 20 ఏళ్లలో రూ.1.48 కోట్ల నిధి! Save ₹500 a Day, Build ₹1.48 Crore in 20 Years! FEATURE NEWS
  • చెక్ రాసేటప్పుడు ఈ చిన్న పొరపాట్లు చేయకండి.. భారీ నష్టాలకు దారితీయొచ్చు.. Cheque Safety Rules.. Small Mistakes Can Lead to Big Financial Losses FEATURE NEWS

పిల్లల భవిష్యత్తు కోసం బెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్స్ ఇవే.. ! చిల్డ్రన్స్ డే స్పెషల్ Best Investment Options for Your Child’s Future

Posted on 14/11/202513/12/2025 By admin No Comments on పిల్లల భవిష్యత్తు కోసం బెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్స్ ఇవే.. ! చిల్డ్రన్స్ డే స్పెషల్ Best Investment Options for Your Child’s Future

పిల్లల భవిష్యత్తు… ప్రతి తల్లిదండ్రికి పెద్ద బాధ్యత. చదువు, ఆరోగ్యం, కెరీర్‌, పెళ్లి.. ఎన్నో ఖర్చులు ముందే కనిపిస్తాయి. వీటిని సులభంగా మేనేజ్‌ చేయాలంటే పిల్ల‌లు చిన్నప్పటి నుంచే సరైన పెట్టుబడులు పెట్టడం తప్పనిసరి. పిల్లల భవిష్యత్తు బలపడాలంటే ఇప్పుడే పెట్టుబడి(Best Investment Options for Child’s Future) ప్రారంభించాలి. చిన్న మొత్తాలైనా సరే… క్రమబద్ధమైన పెట్టుబడి పెద్ద విద్య ఖర్చులు, జీవిత అవసరాలనూ సులభంగా తీర్చగలదు. చిల్డ్రన్స్‌ డే సందర్బంగా నిపుణులు సూచిస్తున్న లాభదాయకమైన ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

సుకన్య‌ సమృద్ధి యోజన (SSY) Sukanya Samriddhi Yojana (SSY)

బాలికల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకం ఇది. మార్కెట్‌తో సంబంధం లేకుండా అధిక వడ్డీ రేటు ఇస్తుంది. పన్నుల నుంచి మినహాయింపు పొందొచ్చు. దీర్ఘకాలికంగా అత్యంత సురక్షిత పెట్టుబడి పొందొచ్చు. ఈ పథకం కేవలం ఆడపిల్లల కోసం మాత్రమే. పుట్టిన వెంటనే లేదా 10 ఏండ్ల వయసు లోపల అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. ఒక్క కుటుంబంలో రెండు బాలికల వరకు ఈ స్కీమ్ ప్రయోజనం లభిస్తుంది. స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌ అన్నింటిలోనూ సుకన్య సమృద్ధి యోజనే అత్యధిక వడ్డీ రేటు (8.2%) అందిస్తోంది. కౌంట్‌ ప్రారంభించడానికి కనీసం రూ.250 చాలు. ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం డిపాజిట్‌ రూ.250 నుంచి ₹1.5 లక్షల వరకు చేయవచ్చు. మీకు సాధ్యమైనంత మొత్తాన్ని ప్రతి ఏడాదీ డిపాజిట్‌ చేస్తే భవిష్యత్తులో భారీ మొత్తంలో పెరుగుతుంది. 21 సంవత్సరాలు పూర్తి అయినప్పుడు(Best Investment Options for Child’s Future) మెచ్యూరిటీ అవుతుంది. అయితే బాలిక కు 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత చదువు కోసమో, ఇతర అవసరాలకో 50% వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది.

మ్యూచువల్ ఫండ్‌ SIPలు ..Mutual Fund SIPs

పిల్లల విద్య ఖర్చులు పెరుగుతున్న నేపథ్యలో SIP ఉత్తమ ఎంపిక. నెలనెలా చిన్న మొత్తాలతో సిప్ ప్రారంభించవచ్చు. 10–15 ఏళ్లలో గణనీయమైన సంపద పెరుగుతుంది. Equity + Hybrid Funds బాగా పనిచేస్తాయి. పిల్లల కోసం దీర్ఘకాలికంగా మంచి ఫండ్‌ని సృష్టించాలనుకునే తల్లిదండ్రులు(Best Investment Options for Child’s Future) ఇప్పుడు చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌ను కూడా పరిశీలిస్తున్నారు. మార్కెట్ పెరుగుదలతో పాటు పిల్లల భవిష్యత్ ప్లానింగ్‌కి ఈ స్కీములు మంచి అవకాశాలను అందిస్తున్నాయి. చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్ పూర్తిగా మార్కెట్ ఆధారిత పెట్టుబడులు. మార్కెట్ పెరిగినప్పుడే రాబడులు ఆకట్టుకునేలా ఉంటాయి. అయితే ఇదే సమయంలో రిస్క్ కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంలో ఈక్విటీ మార్కెట్లు సాధారణంగా మంచి పెరుగుదల చూపుతాయి కాబట్టి పిల్లల కోసం 10–15 ఏళ్ల పెట్టుబడిగా ఇవి అనుకూలం. రిస్క్ స్వల్పంగా తీసుకోగలిగే, దీర్ఘకాలిక ప్లానింగ్ ఉన్న కుటుంబాలకు ఇవి సరైన ఎంపిక. పిల్లల ఉన్నత చదువు, విదేశీ విద్య, కెరీర్ డెవలప్‌మెంట్ లక్ష్యాల కోసం ఈ స్కీములే ఎక్కువగా ఎంచుకుంటున్నారు.

చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్‌ ప్లాన్లు (ఇన్సూరెన్స్‌ + సేవింగ్స్‌) Children’s Education Plans (Insurance + Savings)

LIC, SBI Life, HDFC Life వంటి సంస్థలు ప్రత్యేకంగా పిల్లల కోసం పథకాలు అందిస్తున్నాయి. నిర్దిష్ట వయసు తర్వాత విద్య ఖర్చులు తీర్చడానికి సహాయ‌ప‌డ‌తాయి. తల్లిదండ్రులకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే పిల్ల‌ల భవిష్యత్తుకు రక్షణ క‌ల్పిస్తాయి.

పబ్లిక్‌ ప్రవిడెంట్‌ ఫండ్‌ (PPF) Public Provident Fund (PPF)

పీపీఎఫ్‌లు అనేవి సేఫ్టీ + ట్యాక్స్‌ బెనిఫిట్‌. 15 ఏళ్ల లాకిన్ పీరియ‌డ్ ఉంటుంది. ప్రభుత్వ హామీతో కూడిన సురక్షిత పెట్టుబడి ఇది. దీర్ఘ‌కాలంలో పిల్లల‌ భవిష్యత్ కు ఈ నిధులు భ‌రోసా క‌ల్పిస్తాయి. పిల్లల కోసం పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రుల మొదటి ఎంపికల్లో ఒకటి మైనర్ పీపీఎఫ్ ఖాతా. దీర్ఘకాలిక పెట్టుబడిగా ఇది అత్యంత స్థిరమైన, సురక్షితమైన ఆప్షన్‌గా భావిస్తున్నారు. తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్ పిల్ల పేరు మీద మైనర్ PPF అకౌంట్ తెరవొచ్చు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు ఖాతాను పెద్దలు నిర్వహిస్తారు. ఈ ఖాతాకు 15 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. దీర్ఘకాలిక సేవింగ్స్ ప్లానింగ్‌ కోసం ఇది చక్కని మార్గం. అవసరమైతే కాలపరిమితిని మరింత పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ పెట్టుబడిపై పూర్తి పన్ను మినహాయింపు వర్తిస్తుంది. 80C కింద పెట్టుబడికి, వచ్చిన వడ్డీలకు, మెచూరిటీ మొత్తానికి పన్ను లేదు. సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కోరుకునే కుటుంబాలకు ఇది పెద్ద ఆకర్షణ. PPF దీర్ఘకాలికం కాబట్టి కాంపౌండింగ్ ప్రయోజనం బాగా పనిచేస్తుంది. చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా డిపాజిట్ చేస్తే.. 15 ఏళ్ల తర్వాత ఆకట్టుకునే ఫండ్ సిద్ధమవుతుంది. ఖాతా ప్రారంభించిన 6వ సంవత్సరానికి తరువాత కొంత మొత్తాన్ని పార్టియల్ విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇది కొన్ని షరతులకు మాత్రమే పరిమితం. కనుక అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది.

గోల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్ ..Gold Investments

గోల్డ్‌ ETFలు, సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు అనేవి ఫిజికల్‌ గోల్డ్‌ కంటే సురక్షితం. పెళ్లి, భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుంది.

విద్యాభ్యాసానికి ప్రత్యేక FDలు.. Special FDs for Education

బ్యాంకులు పిల్లల విద్య కోసం ప్రత్యేక Fixed Deposits అందిస్తున్నాయి. వడ్డీ రేట్లు సాధారణ FDల కంటే కొంచెం ఎక్కువ. రిస్క్‌ లేకుండా సేవింగ్స్‌ చేయాలనుకునే కుటుంబాలకు ఇవి సరైన ఎంపిక. పిల్లల భవిష్యత్ అవసరాలకు ముందుగానే సురక్షితమైన ఫండ్ సిద్ధం చేయాలనుకునే కుటుంబాలు చిల్డ్రన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వైపు ఆకర్షితమవుతున్నాయి. రిస్క్ లేకుండా, స్థిరమైన వడ్డీతో, లంప్‌సమ్ రిటర్న్స్ కోరుకునేవారికి ఇది మంచి ఎంపికగా మారింది. సాధారణ సేవింగ్స్ ఖాతాతో పోల్చితే పిల్లల ఎఫ్‌డీలకు ఎక్కువ వడ్డీ రేట్లు లభిస్తాయి.
బ్యాంకుల మధ్య రేట్లు కొద్దిగా మారినా, మొత్తం మీద రాబడులు గ్యారంటీగా ఉండటం వీటి ప్రధాన ఆకర్షణ.
చిల్డ్రన్ FD ప్రత్యేకత ఏమిటంటే ఒకేసారి లంప్‌సమ్ అమౌంట్ డిపాజిట్ చేస్తే, మెచూరిటీకి మంచి మొత్తాన్ని అందిస్తుంది. పిల్లల ఉన్నత చదువు, ట్యూషన్ ఫీజులు, భవిష్యత్ ప్లానింగ్ వంటి పెద్ద ఖర్చులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే, FDలో రిస్క్ దాదాపు లేదు.
పెట్టుబడి మొత్తం, వడ్డీ రెండూ ముందుగానే ఖచ్చితంగా తెలిసిపోతాయి. పిల్లల కోసం సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కోరుకునే కుటుంబాలకు ఇది బెస్ట్ ఆప్షన్.

NPS (మైనర్‌ అకౌంట్‌) ..NPS (Minor Account)

మైనర్‌ పేరుతో NPS ఓపెన్‌ చేసే అవకాశం ఉంది. అత్యల్ప పెట్టుబ‌డుల‌తో దీనిని ప్రారంభించొచ్చు. పిల్ల‌ల‌కు 18 ఏళ్లు వచ్చే సరికి మంచి కార్పస్‌ సిద్ధమవుతుంది. పిల్లల భవిష్యత్‌కు చిన్నప్పుడే పొదుపు ప్రారంభిస్తే.. పెద్దయ్యే సరికి మంచి మొత్తం సిద్ధమవుతుంది. అలాంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్‌ NPS వాత్సల్య యోజన. 18 ఏళ్ల లోపు పిల్లలందరికీ అందుబాటులో ఉండే ఈ పథకానికి ప్రస్తుతం మంచి స్పందన లభిస్తోంది. పిల్లలు మైనర్‌గా ఉన్నంతకాలం పేరెంట్స్ లేదా గార్డియన్స్ నిర్వహిస్తారు. 18 ఏళ్లు వచ్చిన తర్వాత అకౌంట్ సాధారణ NPS అకౌంట్‌గా మారిపోతుంది. సంవత్సరం పాటు కనీసం ₹1,000 డిపాజిట్ చేస్తే సరిపోతుంది. ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే కాంపౌండింగ్ పవర్‌తో పెద్ద ఫండ్ సిద్ధమవుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడిగా పిల్లలకు రిటైర్మెంట్ సేవింగ్స్ రూపంలో సహాయపడుతుంది. ముందుగా ప్రారంభిస్తే.. చిన్న మొత్తాలు కూడా పెద్ద లాభాలు ఇస్తాయి. NPS‌కు ప‌న్ను ప్రయోజనాలు వర్తిస్తాయి. ప్లాన్ దీర్ఘకాలికం కావడంతో మార్కెట్‌లోని హెచ్చు తగ్గులను తట్టుకుని మంచి రాబడులు ఇచ్చే అవకాశం ఉంది.

చిల్డ్రన్ రికరింగ్ డిపాజిట్ (RD) .. Children’s Recurring Deposit (RD)

పిల్లల చదువు, భవిష్యత్ ఖర్చులు, భద్రమైన సేవింగ్స్ కోసం చాలా కుటుంబాలు చిల్డ్రన్ రికరింగ్ డిపాజిట్ (RD) ను ఎంపిక చేసుకుంటున్నారు. చిన్న మొత్తాలను ప్రతి నెల క్రమం తప్పకుండా డిపాజిట్ చేస్తూ.. పిల్లలకు మంచి ఫండ్‌ని సృష్టించే అవకాశం ఇది. తల్లిదండ్రులు లేదా గార్డియన్ తమ పిల్లల పేరుతో చిల్డ్రన్స్ RD అకౌంట్ ప్రారంభించవచ్చు. ప్రతి నెల ఒక ఫిక్స్‌డ్ అమౌంట్ డిపాజిట్ చేయాలి. ఇలా ఏకకాలంలో సేవింగ్స్ అలవాటు కూడా పెరుగుతుంది. చిల్డ్రన్ RDలకు సాధారణ సేవింగ్స్ ఖాతా కంటే అధిక వడ్డీ రేటు లభిస్తుంది.
రేట్లు ప్రతి బ్యాంకులో కొంత మారుతూ ఉంటాయి. బ్యాంకింగ్ రంగంలో పోటీ పెరగడంతో చాలా బ్యాంకులు పిల్లల RDలకు ఆకర్షణీయ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి. స్టాక్ మార్కెట్ వంటి పెట్టుబడులతో పోలిస్తే RD పూర్తిగా సురక్షిత పెట్టుబడి. పెట్టిన మొత్తం, వడ్డీ రెండూ గ్యారంటీగా లభిస్తాయి. పిల్లల భవిష్యత్తు కోసం రిస్క్ తీసుకోకూడదనుకునే కుటుంబాలకు ఇది మంచి ఎంపిక. RD పూర్తి కాగానే వచ్చిన మొత్తం పిల్లల చదువు, హెల్త్, చిన్న పెట్టుబడులు, లేదా భవిష్యత్ ప్రణాళికలు కోసం వాడుకోవచ్చు. ప్రతి నెల చిన్న మొత్తాలు అయినా.. చివర్లో పెద్ద మొత్తంగా మారడం RD ప్రత్యేకత. పిల్లల కోసం క్రమం తప్పకుండా సేవింగ్ చేయాలనుకునే కుటుంబాలకు చిల్డ్రన్ RD చాలా సరైన మార్గం. రిస్క్ తక్కువ, రాబడి గ్యారంటీ, డిసిప్లిన్ సేవింగ్స్ ఇలా అన్నీ కలిపి ఈ స్కీమ్‌కు మంచి డిమాండ్ ఉంది.

607
FEATURE NEWS, FINICAL PLANNING, INVESTMENTS Tags:Children’s Education Plans (Insurance + Savings), Children’s Recurring Deposit (RD), Gold Investments, Mutual Fund SIPs, NPS (Minor Account), Public Provident Fund (PPF), Special FDs for Education, Sukanya Samriddhi Yojana (SSY)

Post navigation

Previous Post: భారతీయులు స్టాక్ మార్కెట్లో ఎందుకు పెట్టుబడి పెట్టడం లేదు? Why Indians Are Not Investing in the Stock Market
Next Post: ఎంత సంపాదిస్తున్నా.. డబ్బులు మిగ‌ల‌ట్లేదా..? అయితే ఈ తప్పులే కారణం! Earning More but Saving Nothing? Here’s What You’re Doing Wrong!

Related Posts

  • ముందస్తు వ్యాధుల పేరుతో క్లెయిం తిరస్కరిస్తే.. ఏం చేయాలో తెలుసా FEATURE NEWS
  • 2025లో రూ.30 లక్షల కోట్లకు పెరిగిన మదుపర్ల సంపద..Investor Wealth Rises to ₹30 Lakh Crores in 2025 FEATURE NEWS
  • పాన్ నిబంధ‌న‌ల్లో మార్పులు.. ! నగదు లావాదేవీలపై కట్టడి .. ! ఏప్రిల్ 1 నుంచి అమ‌లులోకి.. Changes in PAN Rules..! Curbs on Cash Transactions..! Effective from April 1..! FEATURE NEWS
  • ఒక్క మిస్డ్ కాల్‌తో రూ.50 లక్షల లోన్..! One Missed Call, Up to ₹50 Lakh Personal Loan FINICAL PLANNING
  • ఇన్వెస్టర్‌కి ఇవి త‌ప్ప‌నిస‌రి: వారెన్ బ‌ఫెట్‌ FINICAL PLANNING
  • How to Check EPF balance..? పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలి..? FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • పన్ను ఆదా కోసం ముందస్తు ప్రణాళిక – ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ప్లాన్ చేసుకోండి.. Plan Early for Tax Savings – Start at the Beginning of the Financial Year
  • చైనా ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు – భారత్‌లో పెట్టుబడుల కొత్త దిశ..  Relaxation in Chinese FDI Rules – A New Direction for Investments in India
  • మార్కెట్‌ అనిశ్చితిలో.. ఇండెక్స్‌ ఈటీఎఫ్‌లు ఎంత‌వ‌ర‌కు లాభం? In Market Uncertainty, How Profitable Are Index ETFs?
  • విదేశీ మదుపర్ల భారీ ఉపసంహరణ – మార్కెట్‌పై ఒత్తిడి పెంచుతున్న ఎఫ్‌పీఐ విక్రయాలు.. Massive Foreign Investor Outflows – FPI Selling Pressure Weighs on Markets
  • రాబడి మాత్రమే కాదు.. లిక్విడిటీ కూడా ముఖ్యం..! Returns Alone Aren’t Enough.. Liquidity Matters Too
  • పిల్ల‌ల‌కు డబ్బు విలువ నేర్పిద్దాం.. అర్థిక అక్ష‌రాస్య‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పిద్దాం..! Teach Children the Value of Money.. Build Awareness on Financial Literacy
  • ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్ల రికార్డు .. రూ.2.43 లక్షల కోట్లుగా న‌మోదు..! గ‌తేడాదితో పోలిస్తే 8.7 శాతం పెరుగుదల! Record GST Collections in April Reach ₹2.43 Lakh Crore; Up 8.7% Compared to Last Year
  • అధిక‌ క్రెడిట్ కార్డులతో అధిక‌ రివార్డులు పొందొచ్చా? క‌ఠినంగా మారిన‌ ష‌ర‌తులు! Can More Credit Cards Bring More Rewards? Conditions Are Getting Tougher!
  • రోజుకు రూ.500 పొదుపు.. 20 ఏళ్లలో రూ.1.48 కోట్ల నిధి! Save ₹500 a Day, Build ₹1.48 Crore in 20 Years!
  • చెక్ రాసేటప్పుడు ఈ చిన్న పొరపాట్లు చేయకండి.. భారీ నష్టాలకు దారితీయొచ్చు.. Cheque Safety Rules.. Small Mistakes Can Lead to Big Financial Losses
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account FEATURE NEWS
  • How to Design a Mutual Fund Portfolio మ్యూచువ‌ల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోను ఎలా డిజైన్ చేసుకోవాలి MUTUAL FUNDS
  • ఎస్‌బీఐ ఎఫ్‌డీ .. రూ.2 లక్షల పెట్టుబడితో రూ.1 లక్షకు పైగా లాభం! SBI FD Bonanza: Earn Over ₹1 Lakh Profit with a ₹2 Lakh Investment INVESTMENTS
  • స్టాక్‌ల‌లో ఉండే ర‌కాలేమిటి.. ఏ ర‌క‌మైన స్టాక్‌లో ఇన్వెస్ట్‌చేస్తే లాభాలు వ‌స్తాయి What are the types of stocks.. Investing in which type of stock will bring profits MARKET
  • రూపాయి నాణెం వెనుక ఉన్న ఆసక్తికర ఆర్థిక లెక్క ..! నష్టం వస్తున్నా ప్రభుత్వం ఎందుకు ముద్రిస్తోంది? The Interesting Economics Behind the One-Rupee Coin: Why Is the Government Minting Despite Losses? FEATURE NEWS
  • త‌ప్ప‌దు.. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాల్సిందే! FINICAL PLANNING
  • WHAT SHOULD AN NRI DO WITH HIS EPF ACCOUNT ఒక ఎన్ఆర్ఐ తన ఈపీఎఫ్‌ ఖాతాను ఏం చేయాలి FEATURE NEWS
  • జీడీపీ జోష్‌..!ఆరు త్రైమాసికాల గరిష్ఠానికి ఆర్థిక వృద్ధి! GDP Surge! Growth Hits Six-Quarter High FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme