Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN FEATURE NEWS
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters! FEATURE NEWS
  • చిన్న పెట్టుబడి… పెద్ద ఫలితం ! రూ.22 ల‌క్షల పెట్టుబ‌డికి రూ.49 లక్ష‌ల వ‌డ్డీ! సుకన్య సమృద్ధి పథకంలో సాధ్యమేనా? Small Investment… Big Gains! ₹22 Lakh Investment Yields ₹49 Lakh Interest – Is It Possible with Sukanya Samriddhi Scheme? FEATURE NEWS

ఆస్తి బదిలీకి ఏది స‌రైంది? గిఫ్ట్ డీడ్ లేక వీలునామా? Which Is Better for Property Transfer: Gift Deed or Will?

Posted on 29/01/202629/01/2026 By admin No Comments on ఆస్తి బదిలీకి ఏది స‌రైంది? గిఫ్ట్ డీడ్ లేక వీలునామా? Which Is Better for Property Transfer: Gift Deed or Will?

మనిషి జీవితంలో ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తి… చివరికి ఎవరి చేతికి చేరాలన్నది చాలా కీలకమైన నిర్ణయం. ఆస్తిని తనకు ఇష్టమైన వ్యక్తికి బదిలీ చేయాలనుకున్నప్పుడు చాలా మందిలో కలిగే సందేహం ఒక్కటే…“జీవించి ఉండగానే గిఫ్ట్ డీడ్ (Gift Deed ) చేయడం మంచిదా? లేక మరణం తర్వాత అమలయ్యే వీలునామా (Will) రాయడమే ఉత్తమమా?” ఈ రెండింటి మధ్య తేడాలు, ప్రయోజనాలు, ప్రమాదాలు, చట్టపరమైన అంశాలు, పన్నుల ప్రభావం, కుటుంబ పరిస్థితుల ప్రకారం ఏది సరిపోతుందన్న విషయాలను ఇప్పుడు విపులంగా తెలుసుకుందాం.

ఆస్తి బదిలీకి ఉన్న మార్గాలు.. Ways for Property Transfer
భారతదేశంలో ఆస్తి బదిలీ ప్రధానంగా మూడు విధాలుగా జరుగుతుంది. గిఫ్ట్ డీడ్ (బహుమతి ద్వారా), వీలునామా (Will)
వారసత్వ చట్టాల ద్వారా (Succession) .. ఈ మూడు విధానాల్లో గిఫ్ట్ డీడ్‌, వీలునామాల మధ్యే ఎక్కువ చర్చ జరుగుతుంది.

గిఫ్ట్ డీడ్ అంటే ఏమిటి? What Is a Gift Deed?
భారతీయ కాంట్రాక్ట్ చట్టం, ఆస్తి బదిలీ చట్టం (Transfer of Property Act) ప్రకారం… ఒక వ్యక్తి తన సొంతంగా సంపాదించిన స్థిర లేదా చర ఆస్తిని ఎలాంటి ప్రతిఫలం లేకుండా మరో వ్యక్తికి బదిలీ చేయడాన్ని గిఫ్ట్‌గా పరిగణిస్తారు. ఈ బదిలీని చట్టబద్ధంగా అమలు చేయడానికి గిఫ్ట్ డీడ్ అనే పత్రం అవసరం.

గిఫ్ట్ డీడ్ ఎలా అమలవుతుంది? How Is a Gift Deed Executed?
గిఫ్ట్ డీడ్‌(Gift Deed ) ను స్టాంప్ పేపర్‌పై తయారు చేయాలి. సంబంధిత సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో తప్పనిసరిగా నమోదు చేయాలి. నమోదు అయిన రోజే ఆస్తి హక్కులు పూర్తిగా గ్రహీతకు బదిలీ అవుతాయి. అంటే… గిఫ్ట్ డీడ్ అమలైన క్షణం నుంచే ఆస్తిపై మీకు హక్కు ఉండదు.

గిఫ్ట్ డీడ్‌లో ముఖ్యమైన అంశాలు.. Key Aspects of a Gift Deed
– 18 ఏళ్లు నిండిన వ్యక్తి ఎవ‌రైనా గిఫ్ట్ డీడ్(Gift Deed ) ఇవ్వవచ్చు. అయితే వారి మానసిక స్థితి సక్రమంగా ఉండాలి. ఆస్తిపై పూర్తి హక్కు కలిగి ఉండాలి. గిఫ్ట్ డీడ్ ఇచ్చే వ్య‌క్తి దివాలా తీసిన వ్యక్తి కాకూడదు. మైన‌రై ఉండ‌కూడ‌దు. గిఫ్ట్ డీడ్ ద్వారా ఆస్తి బదిలీ తక్షణమే పూర్తవుతుంది. కుటుంబ సభ్యులకు ముందే ఆస్తి పంచి ఇవ్వవచ్చు. భవిష్యత్తులో వారసత్వ గొడవలు తగ్గుతాయి. కొన్ని రాష్ట్రాల్లో దగ్గరి బంధువులకు స్టాంప్ డ్యూటీ రాయితీ ఉంటుంది. గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఆస్తిపై మీకు ఎలాంటి హక్కు ఉండదు. జీవితాంతం అవసరాలకు ఆధారపడాల్సిన పరిస్థితి రావచ్చు. గిఫ్ట్ డీడ్‌ను ఒకసారి నమోదు చేస్తే…తిరిగి రద్దు చేయడం చాలా కష్టం. గిఫ్ట్ డీడ్‌పై ఆదాయపు పన్ను చట్టం – సెక్షన్ 56(2) అమ‌లవుతుంది. రూ.50,000కు మించిన గిఫ్ట్ ను బంధువు కాని వ్యక్తికి ఇచ్చినట్లయితే గ్రహీతకు అది పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం అవుతుంది. తల్లిదండ్రులు, భార్య/భర్త, పిల్లలు, సోదరులు, అక్కచెల్లెళ్లు కు ఇచ్చిన గిఫ్ట్‌లపై ఆదాయపన్ను మినహాయింపు ఉంటుంది.

వీలునామా అంటే ఏమిటి? What Is a Will?
వీలునామా (Will) అనేది… ఒక వ్యక్తి తన మరణం తర్వాత తన ఆస్తులు ఎవరికీ, ఎలా బదిలీ కావాలన్నదాన్ని స్పష్టంగా పేర్కొంటూ రాసే చట్టపరమైన పత్రం. వీలునామా అనేది మరణం తర్వాత మాత్రమే అమల్లోకి వస్తుంది. జీవించి ఉన్నంతకాలం ఆస్తిపై పూర్తి నియంత్రణ మీకే ఉంటుంది. దీనికి స్టాంప్ డ్యూటీ అవసరం లేదు. నమోదు తప్పనిసరి కాదు. మ‌న‌ దేశంలో వీలునామా రాయకపోవడం వల్లే…కుటుంబ గొడవలు, కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అదే వీలునామా రాయడం వల్ల మీరు జీవించి ఉన్నంతకాలం ఆస్తిని ఉపయోగించుకోవచ్చు. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు అవసరం లేదు. ఎప్పుడైనా వీలునామాను మార్చుకోవచ్చు లేదా రద్దు చేయవచ్చు. వీలునామా ద్వారా వచ్చిన ఆస్తిపై ఎస్టేట్ డ్యూటీ లేదు. వీలునామా నమోదు అనేది చట్టపరంగా తప్పనిసరి కాదు. కానీ నమోదైన వీలునామా కోర్టులో బలమైన ఆధారం. నకిలీ ఆరోపణలకు అవకాశం తక్కువ. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తగ్గుతాయి. కాబట్టి నిపుణులు నమోదైన వీలునామానే మెరుగైనద‌ని నిపుణులు చెబుతున్నారు. వీలునామా లేకుండా మరణిస్తే… ఆస్తి వారసత్వ చట్టాల ప్రకారం బదిలీ అవుతుంది. వృద్ధాప్యంలో భద్రత కావాలంటే.. ఆస్తిపై నియంత్రణ కొనసాగాలంటే.. కుటుంబ శాంతి కావాలంటే వీలునామా రాయ‌డం ఎంతో అవ‌స‌రం. అత్యవసర సహాయం చేయాలనుకున్నప్పుడు. చిన్న ఆస్తి మాత్రమే బదిలీ చేయాలనుకున్నప్పుడు గిఫ్ట్‌డీడ్ అవ‌స‌రం.

భవిష్యత్తు భద్రత ముఖ్యం .. Future Security Is Important
భావోద్వేగాలకన్నా భవిష్యత్తు భద్రత ముఖ్యం. పన్నుల కోసం మాత్రమే ఆస్తి బదిలీ చేయొద్దు న్యాయ నిపుణుల సలహాతోనే నిర్ణయం తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. ఆస్తి అనేది కేవలం డబ్బు కాదు…అది మీ జీవితానికి అద్దం. ఒక్క తప్పు నిర్ణయం మీ జీవితాంతం సమస్యలకు కారణం కావచ్చు. కాబట్టి…ఆస్తి బదిలీ విషయంలో తొందరపడకండి. సరైన మార్గం ఎంచుకోండి. మీ భవిష్యత్తును మీరు భద్రపరచుకోండి.

గిఫ్ట్ డీడ్ – రద్దు చేయగలమా? Can a Gift Deed Be Cancelled?
సాధారణంగా గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేయడం చాలా కష్టం. ఎందుకంటే, గిఫ్ట్ ఇచ్చిన వెంటనే ఆస్తి హక్కులు గ్రహీతకు వెళ్ళిపోతాయి. గ్రహీత ఇప్పటికే ఆస్తిని ఉపయోగించడం, నిర్వహించడం మొదలుపెడితే, రద్దు కఠినతరం. గ్రహీత మోసం లేదా వశంలో పెట్టి గిఫ్ట్ తీసుకున్నట్లయితే.. గిఫ్టర్ అనారోగ్యం, మానసిక స్థితి లోపం కారణంగా గిఫ్ట్ ఇచ్చినట్లయితే.. ఈ సందర్భాల్లో మాత్రమే చట్టపరంగా గిఫ్ట్ డీడ్ రద్దు కావచ్చు. అంటే, సాధారణ పరిస్థితుల్లో గిఫ్ట్ డీడ్ రద్దు సాధ్యం కాదు.

వీలునామా – రద్దు చేయగలమా? Can a Will Be Cancelled?
వీలునామా అనేది మరణం తర్వాత ఆస్తిని ఎవరికీ, ఎలా బదిలీ చేయాలనేది రాసే చట్టపరమైన పత్రం. వీలునామా రద్దు సాధ్యమే. వీలునామాను ఎప్పుడైనా రద్దు చేయవచ్చు. రద్దు లేదా మార్పులు వీలునామా రాసిన వ్యక్తి జీవితంలోనే మాత్రమే చేయవచ్చు. వ్యక్తి ఆస్తి బదిలీ విధానాన్ని, లబ్ధిదారులను, వాటిని సవరించుకోవచ్చు. కొత్త లబ్ధిదారులను చేర్చవచ్చు. గత వీలునామాను రద్దు చేసి, కొత్త దానిని నమోదు చేయవచ్చు. వీలునామా రద్దు చేయడం లేదా మార్చడం చాలా సులభం, మరియు చట్టపరంగా పరిమితులు తక్కువ.

 

 

 

183
FEATURE NEWS Tags:Can a Gift Deed Be Cancelled?, Can a Will Be Cancelled?, Future Security Is Important, How Is a Gift Deed Executed?, Key Aspects of a Gift Deed, Ways for Property Transfer, What Is a Gift Deed?, What Is a Will?

Post navigation

Previous Post: బడ్జెట్ రోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందో తెలుసా! Do You Know How the Stock Market Behaves on Budget Day?
Next Post: ఆరోగ్య బీమా తీసుకునే ముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోండి! Things You Must Know Before Buying Health Insurance!

Related Posts

  • వెనిజులాపై అమెరికా దాడి…భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత? US Strikes on Venezuela… How Will the Indian Stock Market Be Affected? FEATURE NEWS
  • ఇప్ప‌టివ‌ర‌కు క్రెడిట్ హిస్టరీ లేదా? అయితే ఇలా చేయండి! If You Don’t Have a Credit History Yet, Do This! FEATURE NEWS
  • ఇన్కమ్ టాక్స్‌ రీఫండ్ ఎందుకు ఆలస్యమవుతుంది..? స్టేటస్ తెలుసుకోవ‌డం ఎలా..? Why Is the Income Tax Refund Getting Delayed? How to Check Your Refund Status? FEATURE NEWS
  • కొత్త ఐటీఆర్‌ ఫారాలు.. జ‌న‌వ‌రి నుంచి అమ‌లు! New ITR Forms to Be Implemented from January! FEATURE NEWS
  • పశ్చిమాసియాలో మంట‌లు.. ప్రపంచమంతటా ప్రకంపనలు.. Blazing West Asia, Tremors Across the World FEATURE NEWS
  • దంపతుల జాయింట్ ప్రాపర్టీ ..! టాక్స్‌లో ఎంత ఆదా సాధ్యం? Joint Property for Married Couples ..! How Much Tax Can You Save? FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ‘టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ జాగ్రత్త‌లు తీసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వ్‌! Things to Check Before Buying Term Insurance .. Or You May Face Trouble!
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters!
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • పీఎఫ్‌ ఖాతా నుంచి LIC ప్రీమియం చెల్లించొచ్చు! LIC Premium from PF Account – A Financial Safety Option INSURANCE
  • 2026లో స్టాక్‌ మార్కెట్‌ సెలవుల జాబితా ఇదే..Here is the list of stock market holidays in 2026.. MARKET
  • మీ ఆదాయంలో EMI వాటా ఎంత?.. ఈ లిమిట్ దాటితే అప్పుల ఊబిలో కూరుకుపోక త‌ప్ప‌దు! What Percentage of Your Income Goes to EMIs?.. Cross This Limit and You Could Fall into a Debt Trap! FINICAL PLANNING
  • మ్యూచువల్‌ ఫండ్ సంస్థ‌లు వ‌సూలు చేసే రుసుములకు క‌ళ్లెం.. A Check on the Fees Charged by Mutual Fund Companies FEATURE NEWS
  • పెరుగుతున్న రిటైల్ వాటా how much percentage of retial investors india NEWS
  • బంగారం ధరలపై ఆర్‌బీఐ ఆందోళన..! గోల్డ్ లోన్ల‌పై జాగ్రత్తగా ఉండాలని బ్యాంకులకు సూచన..! RBI Concern Over Gold Prices..! Banks Advised to Be Cautious on Gold Loans..! FEATURE NEWS
  • 100% విదేశీ పెట్టుబడులకు అనుమతి.. ఇన్సూరెన్స్ రంగంలో ఎలాంటి మార్పులు వస్తాయ్..? 100% Foreign Investment Approval: What Changes Will It Bring to the Insurance Sector? INSURANCE
  • 15:65:20 రూల్ పాటించండి.. సంప‌న్నుల‌వ్వండి! Follow the 15:65:20 Rule… Become Wealthy! FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme