Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

ఆగ‌ని పసిడి , వెండి ప‌రుగులు! Relentless Rally in Gold and Silver!

Posted on 22/01/2026 By admin No Comments on ఆగ‌ని పసిడి , వెండి ప‌రుగులు! Relentless Rally in Gold and Silver!

పసిడి పరుగులకు బ్రేకుల్లేవు. వెండి (Rally in Gold and Silver) కూడా అదే బాటలో దూసుకుపోతోంది. రోజురోజుకూ ధరలు ఆకాశాన్ని తాకుతూ కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఇప్పటికే లక్షన్నర మార్క్‌ను దాటిన మేలిమి బంగారం (24 క్యారెట్లు) ధర ఇప్పుడు మరింత పెరిగి కొనుగోలుదారులకు చుక్కలు చూపించింది. బంగారం, వెండి ధరలు తారాస్థాయికి చేరడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,58,950కు చేరి ఆల్‌టైం రికార్డు సృష్టించింది. ఒక్కరోజులోనే రూ.6,950 పెరగడం గమనార్హం. హైదరాబాద్‌ మార్కెట్‌లో అయితే ఏకంగా రూ.1.61 లక్షల స్థాయికి చేరింది. అంటే ఒక్కరోజులోనే రూ.9 వేలకుపైగా పెరుగుదల నమోదైంది.

నాలుగేళ్లలో నాలుగు రెట్లు! Fourfold Surge in Just Four Years!
– 2020లో పది గ్రాముల బంగారం ధర కేవలం రూ.40,000 మాత్రమే. కరోనా కాలంలో మొదలైన అనిశ్చిత పరిస్థితుల నుంచి ప్రపంచం ఇప్పటికీ పూర్తిగా కోలుకోకపోవడం, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధ భయాలు వంటి అంశాలు బంగారాన్ని ‘సురక్షిత పెట్టుబడి’గా మార్చాయి. ఫలితంగా గత నాలుగేళ్లలో బంగారం ధర దాదాపు 200 శాతం కంటే ఎక్కువగా పెరిగింది.
– 2024 జూలైలో పది గ్రాముల బంగారం ధర రూ.1,10,000గా ఉండగా, అక్టోబరు 20 నాటికి రూ.1,30,000కు చేరింది. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు హెచ్చుతగ్గులు కనిపించినా, ఈ ఏడాది జనవరి మొదటి తేదీ నుంచి ధర మళ్లీ పైబాట పట్టింది. రోజుకు గ్రాముకు రూ.300 నుంచి రూ.500 వరకు పెరుగుతూ రూ.1,58,950కు చేరింది. తులం ధర రూ.1,85,390గా నమోదైంది.

వెండిదీ అదే బాట… కిలో రూ.3.28 లక్షలు..Silver Joins the Rally… ₹3.28 Lakh per Kg
బంగారమే కాదు… వెండి కూడా పరుగులు (Rally in Gold and Silver)పెడుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.3,28,000కు చేరింది. ఏడాది కిందట ఇదే వెండి ధర కేవలం రూ.90,000 మాత్రమే. అంటే ఒక్క ఏడాదిలోనే నాలుగురెట్లు పెరిగింది. సోమవారం కిలో వెండి రూ.3,04,795గా ఉండగా, మంగళవారం రూ.3,20,000కు చేరింది. బుధవారం నాటికి రూ.3,28,000కు పెరిగింది. అంటే రెండు రోజుల్లోనే రూ.23,205 పెరిగింది. ఒక్కరోజులోనే కిలోకు రూ.24 వేల వరకు పెరగడం మార్కెట్‌ను షాక్‌కు గురి చేసింది.

ధరలు ఇలా… Prices at a Glance…
24 క్యారెట్లు బంగారం (10 గ్రాములు): రూ.1,58,950
24 క్యారెట్లు బంగారం (తులం): రూ.1,85,390
22 క్యారెట్లు బంగారం (10 గ్రాములు): రూ.1,43,550
22 క్యారెట్లు బంగారం (తులం): రూ.1,67,430
వెండి (కిలో): రూ.3,28,000

అంతర్జాతీయ ప్రభావమే ప్రధాన కారణం..International Factors Drive the Surge
(Rally in Gold and Silver)సోమవారం 24 క్యారెట్ల బంగారం రూ.1,48,650గా ఉండగా, మంగళవారం రూ.1,52,000, బుధవారం రూ.1,58,950కి చేరింది. అంటే ఒక్కరోజులోనే రూ.6,950 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం కూడా అదే బాటలో సోమవారం రూ.1,33,550 నుంచి బుధవారం రూ.1,43,550కి చేరి రూ.3,750 పెరిగింది. బంగారం, వెండి ధరలు ఈ స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ పరిణామాలేనని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ యూరోపియన్‌ దేశాలు, ఫ్రాన్స్‌పై భారీ సుంకాలు విధిస్తామంటూ హెచ్చరించడం, గ్రీన్‌లాండ్‌ స్వాధీనం, గాజా శాంతిమండలిపై వివాదాలు , ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధ భయాలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణత, స్టాక్‌ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు .. ఈ కారణాలతో మదుపర్లు షేర్ల నుంచి బయటకు వచ్చి బంగారం, వెండిలాంటి సురక్షిత సాధనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 4,849 డాలర్లకు చేరగా, ఔన్సు వెండి ధర చరిత్రలో తొలిసారి 94 డాలర్ల మార్క్‌ను దాటింది.

పెట్టుబడిదారులకు పండుగ..Windfall for Investors

(Rally in Gold and Silver)ఇటీవలి వరకు బంగారం కొనని వారు ఇప్పుడు ఆలోచనలో పడగా, గతంలో పెట్టుబడి పెట్టిన వారు మాత్రం ఆనందంలో మునిగిపోతున్నారు. 2020లో బంగారం కొనుగోలు చేసిన వారికి ఇప్పుడు రెండింతల రెట్టింపు లాభం లభిస్తోంది. పెట్టుబడి సాధనంగా బంగారం మరోసారి తన స్థిరత్వాన్ని నిరూపించుకుంది. ఒక‌పక్క‌ ధరలు పెరుగుతున్నా, పెట్టుబడిదారుల నుంచి డిమాండ్‌ తగ్గడం లేదు.

పెళ్లిళ్ల సీజన్‌… Wedding Season Worries…
వచ్చే నెల నుంచి పెళ్లిళ్ల సీజన్‌(Rally in Gold and Silver) ప్రారంభం కానుంది. పుస్తెలు, ఆభరణాలు, వెండి సామగ్రి కొనుగోలు తప్పనిసరి కావడంతో ధరల పెరుగుదలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శుక్రమౌఢ్యమి కొనసాగుతుండటంతో చాలామంది కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు. అయితే, ఆలస్యం చేసిన కొద్దీ ధరలు మరింత పెరుగుతున్నాయనే భయం కొనుగోలుదారులను కలవరపెడుతోంది.

ఇంకా పెరిగే అవకాశముందా? Will Prices Rise Further?
ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు, స్టాక్‌ మార్కెట్‌ అస్థిరత, డాలర్‌ బలపడటం వంటి అంశాలను పరిశీలిస్తే బంగారం, వెండి(Rally in Gold and Silver) ధరలు ఇంకా పెరిగే అవకాశమే ఎక్కువగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర బ్యాంకులు కూడా బంగారం నిల్వలను పెంచుకుంటుండటంతో దీర్ఘకాలంలో పసిడికి మరింత డిమాండ్‌ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. చైనా, రష్యా, టర్కీ, మధ్య ఆసియా దేశాలు డాలర్‌పై ఆధారాన్ని తగ్గించుకునే వ్యూహంలో భాగంగా బంగారం నిల్వలను భారీగా పెంచుతున్నాయి. ఇది మార్కెట్‌లో సరఫరా–డిమాండ్ సమీకరణాన్ని పూర్తిగా మార్చేసింది. సాధారణ పెట్టుబడిదారుల కంటే కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు చాలా స్థిరంగా, దీర్ఘకాలికంగా ఉంటాయి. అందుకే ధరలు తగ్గే అవకాశం తక్కువగా మారింది. ఏదేమైనా పసిడి, వెండి ధరలు ప్రస్తుతం సామాన్యుడి అందుబాటుకు దూరమవుతున్నాయి. పెట్టుబడిదారులకు ఇది లాభదాయకంగా మారినా, పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం కొనుగోలు చేసే వారికి మాత్రం భారంగా మారింది. అంతర్జాతీయ పరిణామాలు చల్లబడే వరకు ఈ పరుగులు ఆగే సూచనలు కనిపించడం లేదు.

డాలర్ బలం – రూపాయి బలహీనత..Strong Dollar, Weak Rupee
భారత మార్కెట్‌లో బంగారం (Rally in Gold and Silver)ధరలు అంతర్జాతీయ ధరలకంటే ఎక్కువగా పెరగడానికి ప్రధాన కారణం రూపాయి విలువ క్షీణత. డాలర్‌ బలపడుతున్న కొద్దీ దిగుమతి చేసే బంగారం ఖరీదవుతోంది. భారతదేశం అవసరాల్లో 90 శాతం కంటే ఎక్కువ బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. రూపాయి బలహీనపడితే బంగారం ధరలు దేశీయంగా మరింత ఎగబాకడం అనివార్యం.

వెండి: పెట్టుబడికే కాదు… పరిశ్రమల లోహం..Silver: Not Just an Investment, but an Industrial Metal
(Rally in Gold and Silver)వెండి ధర పెరుగుదల వెనుక మరో ప్రత్యేక కోణం ఉంది. బంగారం ప్రధానంగా పెట్టుబడి లోహం అయితే, వెండి పారిశ్రామిక లోహం కూడా. సోలార్‌ ప్యానెల్స్, ఎలక్ట్రిక్‌ వాహనాలు, బ్యాటరీ టెక్నాలజీ, 5G, ఎలక్ట్రానిక్స్ త‌దిత‌ర‌ రంగాల్లో వెండికి డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. సరఫరా మాత్రం అదే స్థాయిలో ఉండటంతో వెండి ధరలు ఒక్కసారిగా దూసుకుపోతున్నాయి. అందుకే వెండి పెరుగుదల వేగం బంగారంకన్నా ఎక్కువగా కనిపిస్తోంది.

స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు..Stock Market Volatility
దేశీయంగా, అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. వడ్డీ రేట్లపై స్పష్టత లేకపోవడం, జియోపాలిటికల్ రిస్క్, కార్పొరేట్ లాభాలపై సందేహాలు.. ఈ కారణాలతో ఈక్విటీ నుంచి బయటపడిన పెట్టుబడులు బంగారం, వెండిలోకి మళ్లుతున్నాయి. ఇది ధరలను మరింత పైకి నెడుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గితే ధరల్లో కొంత సవరణ (Correction) రావచ్చు. కానీ దీర్ఘకాలికంగా బంగారం ధరలు(Rally in Gold and Silver) దిగే అవకాశం తక్కువ. అంటే, స్వల్పకాలంలో హెచ్చుతగ్గులు కనిపించినా, దీర్ఘకాలంలో బంగారం, వెండి బలంగానే ఉండే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.

సామాన్యుడిపై ప్రభావం..Impact on the Common Man

(Rally in Gold and Silver) ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం, వెండి ధరల పెరుగుదల వెనుక బలమైన ఆర్థిక కారణాలున్నాయి. అంతర్జాతీయ రాజకీయాలు, డాలర్‌ బలం, పరిశ్రమల డిమాండ్‌ కలిసి పసిడి–వెండికి కొత్త ఎత్తులను చూపిస్తున్నాయి. ఈ పరుగులు ఎప్పటికీ కొనసాగకపోయినా, తక్షణంలో తగ్గే సూచనలు మాత్రం కనిపించడం లేదు. ఈ ధరల పెరుగుదల సామాన్యుడిపై రెండు విధాలుగా ప్రభావం చూపుతోంది. పెట్టుబడి చేసినవారికి లాభం ఉండ‌గా.. పెళ్లిళ్లు, శుభకార్యాలకు కొనుగోలు చేసే వారికి మాత్రం భారం త‌ప్ప‌దు. పెళ్లిళ్ల సీజన్‌లో ధరలు ఈ స్థాయిలో ఉండటం సామాన్య కుటుంబాల బడ్జెట్‌ను తారుమారు చేస్తోంది.

ముందు జాగ్రత్తలు ..Precautionary Measures
నిపుణుల సూచనల ప్రకారం ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం కన్నా దశలవారీగా పెట్టుబడి పెట్టడం మంచిది. ఆభరణాలకన్నా డిజిటల్ గోల్డ్, గోల్డ్ ETFలు ఖర్చు తక్కువ. వెండి విషయంలో అధిక ఊగిసలాటకు సిద్ధంగా ఉండాలి.

 

 

206
FEATURE NEWS Tags:but an Industrial Metal, Fourfold Surge in Just Four Years!, Impact on the Common Man, International Factors Drive the Surge, Precautionary Measures, Prices at a Glance…, Silver Joins the Rally… ₹3.28 Lakh per Kg, Silver: Not Just an Investment, Stock Market Volatility, Strong Dollar, Weak Rupee, Wedding Season Worries…, Will Prices Rise Further?, Windfall for Investors

Post navigation

Previous Post: కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్‌.. కార్పొరేట్ రంగం విలవిల.. IT కంపెనీలకు బిగ్ సవాల్
Next Post: పిల్లల చదువు కోసం NPS వాత్సల్య సరైన ఎంపికేనా? Is NPS Vatsalya the Right Choice for Children’s Education?

Related Posts

  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success! FEATURE NEWS
  • బడ్జెట్ ఎలా తయారవుతుందో తెలుసా? Behind the Scenes of Union Budget FEATURE NEWS
  • త్వరలో ఏకంగా 42 శాతం వరకు లాభం! 5 బెస్ట్ హోసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ ఇవే.. ! Up to 42% Returns Ahead! Here Are the 5 Best Housing Finance Stocks FEATURE NEWS
  • మొబైల్ , ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవ‌లు తెలుసుకుందామా! Mobile vs Internet Banking: Know the Key Services FEATURE NEWS
  • 2024 సంవత్సరంలో Health insuranceలో మార్పులు తెలుసుకుందాం Let’s know the changes in health insurance in the year 2024 FEATURE NEWS
  • రూ.100 లక్షల కోట్ల మైలురాయికి చేరిన ఎస్‌బీఐ .. SBI Reaches ₹100 Lakh Crore Milestone FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • ఈ కంపెనీల్లో భారీగా డివిడెంట్లు ! FEATURE NEWS
  • రెండోసారీ ఆర్‌బీఐ వడ్డీరేట్లలో మార్పుల్లేవ్‌… ఆర్థిక వ్యవస్థకు సంకేతాలేంటి? No Change in RBI Interest Rates for the Second Time… What Does It Signal for the Economy? FEATURE NEWS
  • బెస్ట్ మ్యూచువ‌ల్ ఫండ్స్‌ FINICAL PLANNING
  • బంగారం కొంటున్నారా! అయితే ఈ టిప్స్ పాటించండి! Buying Gold? Follow These Tips! FINICAL PLANNING
  • పీఎస్‌బీలు నాలుగే ఉంటాయా? బ్యాంకులను ప్ర‌భుత్వం విలీనం చేస్తుందా? Will PSBs Shrink to Just Four? Is the Government Planning Another Big Bank Merger? FEATURE NEWS
  • గృహ బీమా అవ‌స‌ర‌మా? Is Home Insurance Necessary? INSURANCE
  • క్రెడిట్ స్కోరు vs సిబిల్ స్కోరు.. ! ఈ రెండూ ఒకటేనా? Credit Score vs CIBIL Score: Are They the Same or Different? FEATURE NEWS
  • 2026లో మీ పోర్ట్‌ఫోలియో బలోపేతం కావాలా? అయితే పాటించాల్సిన‌ ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్ ఏమిటో తెలుసుకుందాం! Want to strengthen your portfolio in 2026? Here are the investment tips you must follow! INVESTMENTS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme