Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN FEATURE NEWS
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters! FEATURE NEWS
  • చిన్న పెట్టుబడి… పెద్ద ఫలితం ! రూ.22 ల‌క్షల పెట్టుబ‌డికి రూ.49 లక్ష‌ల వ‌డ్డీ! సుకన్య సమృద్ధి పథకంలో సాధ్యమేనా? Small Investment… Big Gains! ₹22 Lakh Investment Yields ₹49 Lakh Interest – Is It Possible with Sukanya Samriddhi Scheme? FEATURE NEWS

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వార్షిక వేతనం రూ.845.77 కోట్లకు పెంపు Microsoft CEO Satya Nadella’s Annual Salary Increased to ₹845.77 Crore

Posted on 23/10/2025 By admin No Comments on మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వార్షిక వేతనం రూ.845.77 కోట్లకు పెంపు Microsoft CEO Satya Nadella’s Annual Salary Increased to ₹845.77 Crore

టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల వార్షిక వేతనం కొత్త రికార్డు సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆయనకు ఈసారి గణనీయమైన పెంపు లభించింది. కంపెనీ తాజా ఆర్థిక నివేదికల ప్రకారం నాదెళ్ల మొత్తం పారితోషికం డాలర్లలో 101.3 మిలియన్‌ (భారత కరెన్సీలో సుమారు రూ.845.77 కోట్లు)గా నమోదైంది. 2024లో ఆయన పొందిన $79.1 మిలియన్‌ (రూ.664 కోట్లు) తో పోలిస్తే ఈసారి వేతనం 22 శాతం ఎక్కువగా ఉందని కంపెనీ వెల్లడించింది. కాగా కంపెనీ పనితీరు, మార్కెట్‌ విలువ, AI విభాగంలో మైక్రోసాఫ్ట్‌ సాధించిన పురోగతిని దృష్టిలో ఉంచుకుని ఈ పెంపు అమలులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. నాదెళ్ల వేతనంలో బేసిక్‌ సాలరీతో పాటు స్టాక్‌ ఆప్షన్లు, బోనస్‌లు, ఇతర ప్రోత్సాహకాలు ఉన్నాయి. సంస్థలో ఆయన నాయకత్వం వల్ల గత కొన్నేళ్లుగా మైక్రోసాఫ్ట్‌ లాభాలు గణనీయంగా పెరిగినట్లు బోర్డు పేర్కొంది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగాల్లో సత్య నాదెళ్ల తీసుకువచ్చిన మార్పులు కంపెనీని కొత్త స్థాయికి తీసుకెళ్లాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌ మార్కెట్‌ విలువ ప్రపంచంలో రెండో అతిపెద్ద టెక్‌ సంస్థగా నిలిచింది. ఈ క్రమంలో నాదెళ్ల వేతన పెంపు “సముచితం” అని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

తెలంగాణ తేజం..Telangana Tejam

1967 ఆగస్టు 19న హైదరాబాద్‌లో జన్మించిన సత్య నాదెళ్ల బాల్యం నుంచే విజ్ఞానంపై మక్కువ చూపారు. చ‌దువులో ఎల్లప్పుడూ ప్రతిభ చూపిన ఆయన మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్ మిల్వాకీలో కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్ చ‌దివారు. అనంతరం చికాగో యూనివర్సిటీ బూత్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఎంబీఏ చేశారు.

1992లో మైక్రోసాఫ్ట్‌లో కి.. Joined Microsoft in 1992

1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరిన నాదెళ్ల, తన కృషి, విజన్‌ వల్ల సంస్థలోని కీలక బాధ్యతలు చేపట్టారు. క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ప్రొడక్టివిటీ సాఫ్ట్‌వేర్‌ల అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2014లో మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా నియమితులైన ఆయన, సంస్థను కొత్త దిశగా నడిపించారు. విండోస్‌ యుగం నుంచి క్లౌడ్‌–AI ఆధారిత వ్యాపార నమూనా వైపు మైక్రోసాఫ్ట్‌ను మలిచారు. ఆయన నాయకత్వంలో కంపెనీ లాభాలు, మార్కెట్‌ విలువలు రికార్డులను సృష్టించాయి. శాంత స్వభావం, స్పష్టమైన దృష్టి, కఠిన నిర్ణయాలు.. ఇవే నాదెళ్ల విజయ రహస్యాలు. ప్రపంచ టెక్‌ రంగంలో ఆయన ఇప్పుడు ఒక ప్రేరణాత్మక వ్యక్తిత్వం.

ఉద్యోగిగా మొదలై… సీఈఓగా శిఖరానికి! Started as an employee… reached the pinnacle as CEO!

– సత్య నాదెళ్ల 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరిన సమయంలో ఆయనను ఎవరు గుర్తించలేదు… కానీ తన పనితీరుతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆదిలో విండోస్‌ డెవలప్‌మెంట్‌ టీమ్‌లో ఇంజనీర్‌గా పనిచేసి, క్లౌడ్‌, సర్వర్‌ రంగాలపై దృష్టిపెట్టారు.

– ఆ త‌ర్వాత‌ క్లౌడ్‌ విభాగానికి కొత్త ఊపు తెచ్చారు. 2000లలో మైక్రోసాఫ్ట్‌ దిశ మారుస్తుండగా, నాదెళ్ల క్లౌడ్‌ కంప్యూటింగ్‌ విభాగం బాధ్యతలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో Azure సేవలు విపరీతంగా పెరిగి, కంపెనీ లాభాల్లో కీలక భాగమయ్యాయి. ఇదే ఆయనకు మైక్రోసాఫ్ట్‌ బోర్డులో ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.

2014లో సీఈఓగా నియామకం ..Appointed as CEO in 2014

2014లో స్టీవ్‌ బాల్మర్‌ స్థానంలో సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా నియమించారు. ఆ సమయంలో కంపెనీ వృద్ధి మందగమనం దశలో ఉండగా, ఆయన తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు మైక్రోసాఫ్ట్‌ను తిరిగి శిఖరానికి చేర్చాయి.

AI యుగానికి మైక్రోసాఫ్ట్‌ మార్పు..Microsoft’s Transformation for the AI Era

నాదెళ్ల నేతృత్వంలో మైక్రోసాఫ్ట్‌ కృత్రిమ మేధ (AI) రంగంలో విప్లవాత్మక పురోగతి సాధించింది. OpenAIతో భాగస్వామ్యం, Copilot, ChatGPT Integration, Azure AI లాంటి ఆవిష్కరణలు సంస్థకు కొత్త శకం తెచ్చాయి.

లాభాల్లో రికార్డులు..Record Profits

ఆయన నాయకత్వంలో కంపెనీ మార్కెట్‌ విలువ $3 ట్రిలియన్‌ దాటింది. మైక్రోసాఫ్ట్‌ చరిత్రలోనే అత్యధిక లాభాలు, అత్యధిక వేతన ప్యాకేజ్‌ పొందిన సీఈఓలలో ఒకరుగా నాదెళ్ల నిలిచారు.

సత్య నాదెళ్ల జీవిత‌ పాఠాలు..Life Lessons from Satya Nadella

1. విజన్‌ క్లియర్‌గా ఉండాలి. భవిష్యత్తు మన ఆలోచనలలోనే మొదలవుతుంది.

2. లీడర్‌ అంటే టీమ్‌కి స్ఫూర్తి అని ఆయన ఎప్పుడూ చెబుతారు . నాయకుడు అంటే ఆదేశించేవాడు కాదు, ప్రేరేపించేవాడు. తన బృందం ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం, ప్రతి ఉద్యోగిని భాగస్వామిగా చూడడం ఆయన నాయకత్వానికి బలం.

3. తప్పిదాలనుంచి నేర్చుకోవాల‌నేది నాదెళ్ల అభిప్రాయం . విఫలమవడం తప్పు కాదు, నేర్చుకోకపోవడమే తప్పు. అని చెబుతుంటారు. ప్రతి వైఫల్యాన్ని ఒక పాఠంగా తీసుకుని ముందుకు సాగడం ఆయన జీవన విధానం.

4. సానుభూతి, వినయం నాదెళ్ల నాయకత్వానికి మూలస్తంభాలు. టెక్నాలజీ మనుషుల జీవితాలను మెరుగుపర్చడానికే ఉండాలి. అనే ఆయన దృక్పథం, మైక్రోసాఫ్ట్‌ సంస్కృతిని పూర్తిగా మార్చింది.

5. ఎప్పటికీ నేర్చుకోవడాన్ని ఆపొద్దని సత్య నాదెళ్ల చెబుతారు . “Learn it all, don’t know it all.”
తన బృందానికి కూడా అదే పాఠం చెబుతారు. ఎప్పుడూ కొత్తగా నేర్చుకోవడమే విజయ రహస్యం అని ఆయన నమ్మకం.

నాదెళ్ల భ‌విష్య‌త్‌ ప్రణాళికలు..Nadella’s Future Plans

– నాదెళ్ల అభిప్రాయం ప్రకారం.. కృత్రిమ మేధ (AI) కేవలం యంత్రాల ఆధిపత్యం కాదు. మనుషుల సృజనాత్మకతకు సహాయక శక్తి. AIని విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, వ్యాపార రంగాల్లో విస్తరింపజేయాలని ఆయన ప్రణాళిక. మైక్రోసాఫ్ట్‌ ఇప్పటికే Copilot, Azure AI, ChatGPT Integration వంటి ప్రాజెక్టుల ద్వారా ఆ దిశగా అడుగులు వేస్తోంది.

– నాదెళ్ల భవిష్యత్తు లక్ష్యాల్లో ఒకటి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌. ఈ టెక్నాలజీతో భారీ డేటా ప్రాసెసింగ్‌, సెక్యూరిటీ సొల్యూషన్లు, మెడికల్‌ రీసెర్చ్‌ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా మైక్రోసాఫ్ట్‌ దూసుకెళ్తోంది.

– సస్టైనబిలిటీ & గ్రీన్‌ టెక్ ఇది నాదెళ్ల మరో ప్రధాన లక్ష్యం. టెక్నాలజీతో పర్యావరణ పరిరక్షణ.
2030 నాటికి కార్బన్‌ న్యూట్రల్‌ కంపెనీగా మైక్రోసాఫ్ట్‌ను తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది. పునర్వినియోగ శక్తి వినియోగం, గ్రీన్‌ డేటా సెంటర్లు ఆయన ప్రణాళికలో భాగం.

– ఎప్పటికీ నేర్చుకుంటూ ఉండటం, కొత్తగా ఆవిష్కరించడం .. ఇదే మైక్రోసాఫ్ట్‌ సంస్కృతి కావాలి” అని నాదెళ్ల స్పష్టం చేశారు. స్టార్టప్‌లతో భాగస్వామ్యం, AI ఆధారిత టూల్స్‌, భవిష్యత్‌ ప్రాజెక్టులు అన్నీ ఈ దిశగా సాగుతున్నాయి.

– టెక్నాలజీ అందరికీ చేరాలన్నదే నాదెళ్ల ధ్యేయం. అందుకే మైక్రోసాఫ్ట్‌ ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక విద్యా కార్యక్రమాలు, AI శిక్షణా ప్రాజెక్టులు, డిజిటల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలు చేపడుతోంది.

ఉద్యోగుల‌కు రాసిన లేఖలో ఏం చెప్పారంటే.. What He Said in the Letter to Employees

ప్రపంచం కృత్రిమ మేధ (AI) దిశగా వేగంగా మారుతున్న నేపథ్యంలో, మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల ఉద్యోగులకు రాసిన లేఖలో కంపెనీ ప్రాధాన్యతలు, భవిష్యత్తుపై దృష్టి త‌దితర అంశాల‌ను వివరించారు.

ప్రధానాంశాలు..Key Highlights..

సంస్థ స్థాపించి 50 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా మైక్రోసాఫ్ట్‌ ఇంకా టెక్‌లో ముందంజలో ఉంది. న‌వీన‌ ఆవిష్కరణల్లో కంపెనీ ఎప్పుడూ ముందుంటుంది. ఈ వేగాన్ని సమతుల్యంగా నిలిపి ఉంచడం కష్టం. విజయం కోసం నిరంత‌రం ఆలోచించాలి. భద్రత, నాణ్యత, AI ఆవిష్కరణల లక్ష్యాలను సాధించడ‌మే ల‌క్ష్యం.
మైక్రోసాఫ్ట్‌ సేవలు ప్రపంచానికి కీలకంగా ఉన్నాయి. AI మౌలిక సదుపాయాల్లో అగ్రగామిగా కొనసాగుతోంది. 70 ప్రాంతాల్లో 400+ డేటా సెంటర్లు నిర్వ‌హిస్తున్నాం. విస్కాన్సిన్‌లో అత్యంత శక్తివంతమైన AI డేటా సెంటర్ ను ప్ర‌క‌టించాం. భూమి మీద ప్రతి వ్యక్తికి ప్రయోజనం చేకూర్చే విధంగా సాంకేతికతను సృష్టించడానికి క‌ట్టుబ‌డి ఉన్నాం. ఉద్యోగాలు సృష్టించడం, సైబర్‌ భద్రత, డిజిటల్ స్థిరత్వం బలోపేతం వంటి కార్యక్రమాల్లో అంకితభావంతో ప‌నిచేయాలి. భవిష్యత్తుపై దృష్టి పెట్టి, నిరంతరం స్వీయాభివృద్ధి సాధించాలి. ప్రతి ఆవిష్కరణ, ప్రతి టెక్‌ ప్రాజెక్ట్ ప్రపంచానికి సేవగా ఉండాలి.

 

419
FEATURE NEWS Tags:Appointed as CEO in 2014, Joined Microsoft in 1992, Key Highlights, Life Lessons from Satya Nadella, Microsoft’s Transformation for the AI Era, Nadella’s Future Plans, Record Profits, Started as an employee… reached the pinnacle as CEO!, Telangana Tejam, What He Said in the Letter to Employees

Post navigation

Previous Post: భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌.. ఒక్క రోజులో రూ.6 వేలు త‌గ్గింపు.. Gold Prices Plunge Sharply ..Price Drops ₹6,000 in a Single Day
Next Post: ఇక‌పై బ్యాంకు ఖాతాకు న‌లుగురు నామినీలు! న‌వంబ‌ర్ 1 నుంచి అమ‌లులోకి.. Now Four Nominees Allowed per Bank Account! Effective from November 1

Related Posts

  • రివైజ్డ్ ITR గడువు పెంపు.. టాక్స్ పేయర్లకు ఊర‌ట‌! Revised ITR Deadline Extended: Big Relief for Taxpayers! FEATURE NEWS
  • యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్.. నిజంగా లక్షల ఆదాయమా? One Million Views on YouTube… Can It Really Earn Lakhs? FEATURE NEWS
  • ఎల్‌ఐసీలో డెత్ క్లెయిం చేసుకోవ‌డం ఎలా how to apply for death claim in LIC FEATURE NEWS
  • ఉద్యోగ అస్థిరతలో ఇల్లు కాపాడుకోవడం ఎలా? బ్యాంకుల అరాచ‌కం నుంచి బ‌య‌ట‌ప‌డ‌డం ఎలా? How to Protect Your Home Amid Job Uncertainty? How to Safeguard Yourself from Bank Actions? FEATURE NEWS
  • దుబాయ్‌లో చౌక బంగారం… భారత్‌లో అమ్మితే నిజంగా లాభమా? Cheap Gold in Dubai… Is It Profitable to Sell in India? FEATURE NEWS
  • ఐటీ షేర్లను క్షణాల్లో కూల్చేసిన ఏఐ.. AI Shock Rocks IT Stocks FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ‘టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ జాగ్రత్త‌లు తీసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వ్‌! Things to Check Before Buying Term Insurance .. Or You May Face Trouble!
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters!
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • పెన్షన్ టెన్షన్ వద్దు.. LIC ‘మ్యాజిక్’ పాలసీలతో జీవితాంతం ఆదాయం! No Pension Worries.. Lifetime Income with LIC ‘Magic’ Policies! INSURANCE
  • ఆరోగ్య బీమా వైపు ప్ర‌జ‌ల చూపు… రూ.1.2 లక్షల కోట్లకు చేరిన‌ ప్రీమియం.. People Turning Towards Health Insurance… Premiums Reach ₹1.2 Lakh Crore INSURANCE
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN FEATURE NEWS
  • 2025లో రూ.30 లక్షల కోట్లకు పెరిగిన మదుపర్ల సంపద..Investor Wealth Rises to ₹30 Lakh Crores in 2025 FEATURE NEWS
  • హెడ్‌ ఆఫీస్‌–బ్రాంచీల మధ్య సేవలకు జీఎస్‌టీఏ వ‌ర్తిస్తుందా? GST on Services Between Head Office and Branches? FEATURE NEWS
  • డబ్బును పొదుపు చేసుకునే ప‌ది మార్గాలు 10 best ways to save money FINICAL PLANNING
  • ల‌వ్ విత్ మ‌నీ love with money FINICAL PLANNING
  • గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌..LIC Housing Finance cuts home loan interest rates FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme