Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • UPI చెల్లింపుల సౌలభ్యం – తెలియకుండానే పెరుగుతున్న ఖర్చులు.. UPI Payments and Hidden Spending.. How Convenience Is Changing Personal Finance FEATURE NEWS
  • ఎన్‌పీఎస్ కొత్త నిబంధనలు – రిటైర్మెంట్ ప్రయోజనాల్లో భారీ మార్పులు.. NPS New Rules.. Major Changes in Retirement Benefits and Withdrawal Flexibility FEATURE NEWS
  • సెక్షన్ 194P కింద సూపర్ సీనియర్ సిటిజన్లకు ఐటీఆర్ మినహాయింపు .. Section 194P Relief for Super Senior Citizens.. Understanding ITR Exemption Rules FEATURE NEWS
  • క్రెడిట్ కార్డు చెల్లింపుల్లో మార్పులు… ఓటీపీ సడలింపులించిన ఆర్‌బీఐ.. Changes in Credit Card Payments… RBI Eases OTP Rules FEATURE NEWS
  • ఈఎంఐ సౌలభ్యం… ఆర్థిక ఒత్తిడికి మార్గమా? EMI Convenience… A Path to Financial Pressure? FEATURE NEWS
  • అద్దె ఇల్లు ఖాళీ చేస్తే… మరమ్మత్తుల భారం ఎవరిది? Vacating a Rented House… Who Bears the Repair Costs? FEATURE NEWS
  • పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్… డబ్బు డబుల్.. భద్రతకు భ‌రోసా! Post Office Savings Scheme… Safe Path to Wealth Growth FEATURE NEWS
  • పాన్ కార్డు కొత్త నిబంధనలు… ప్రతి లావాదేవీలో కీలకం! PAN Card New Rules… A Must for Every Financial Move FEATURE NEWS
  • క్రెడిట్ రిపోర్ట్‌లో పొరపాట్లు… భవిష్యత్తు రుణాలపై ముప్పు! Errors in Credit Report… A Silent Threat to Your Financial Future FEATURE NEWS
  • మధ్యతరగతి ‘సంపద’ మాయం… జీతం పెరిగినా జేబు ఖాళీ! The Middle-Class Wealth Illusion… Rising Salaries, Shrinking Reality FEATURE NEWS

మళ్లీ పెరిగిన‌ బంగారం, వెండి ధరలు.. Gold and Silver Prices Rise Again

Posted on 09/02/2026 By admin No Comments on మళ్లీ పెరిగిన‌ బంగారం, వెండి ధరలు.. Gold and Silver Prices Rise Again

ఇటీవల వరుసగా పడిపోతూ పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేసిన బంగారం, వెండి ధరలు (Gold and Silver Prices Rise) మళ్లీ పైబాట పట్టాయి. గత కొన్ని రోజులుగా భారీ కరెక్షన్‌తో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఈ రెండు లోహాలు, తాజాగా ఒక్కసారిగా పుంజుకోవడంతో మార్కెట్‌లో మళ్లీ ఉత్సాహం కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చిన సానుకూల సంకేతాలు, డాలర్ బలహీనత, చైనా నుంచి పెరిగిన డిమాండ్ ప్రభావంతో దేశీయంగానూ ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి.

ఫ్యూచర్స్ మార్కెట్‌లో .. In the Futures Market…
– ఫ్యూచర్స్ మార్కెట్‌లో వెండి ధరలు దాదాపు 5 శాతం వరకు పెరగడం గమనార్హం. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో మార్చి నెల వెండి కాంట్రాక్ట్ ఒక్కరోజులోనే 4.74 శాతం పెరిగి కిలోకు రూ.2,61,745కి చేరింది. అంటే ఒక్కరోజులోనే దాదాపు రూ.11 వేల వరకు పెరుగుదల నమోదైంది.
– ఇదే సమయంలో బంగారం కూడా వెండికి పోటీగా పైకెగసింది. ఏప్రిల్ కాంట్రాక్ట్‌లో 10 గ్రాముల మేలిమి పసిడి ధర 1.3 శాతం పెరిగి రూ.1,57,540 స్థాయికి చేరింది. అంటే దాదాపు రూ.2 వేల వరకు లాభపడింది. అంతర్జాతీయ విపణిలో కూడా ఇదే ధోరణి కనిపించింది. గత కొన్ని రోజులుగా కీలక స్థాయిలను కోల్పోయిన స్పాట్ గోల్డ్ మళ్లీ 5 వేల డాలర్ల మార్కును దాటడం మార్కెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఔన్సు పసిడి ధర 5,004 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, వెండి ఔన్సు ధర 81 డాలర్ల సమీపంలో కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో వచ్చిన ఈ పెరుగుదల ప్రభావం దేశీయ ధరలపై వెంటనే కనిపించింది.

బులియన్ మార్కెట్‌లో.. In the Bullion Market…
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో మళ్లీ పసిడికి డిమాండ్ పెరిగింది. మంగళవారం నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.1.60 లక్షల దాకా పలుకుతుండగా, వెండి ధర కిలోకు రూ.2.70 లక్షల పైనే కొనసాగుతోంది. ఇటీవల భారీ పతనం తర్వాత కొనుగోలుదారులు జాగ్రత్తగా వ్యవహరించినప్పటికీ, ధరలు కనిష్ఠ స్థాయిలకు చేరుకోవడంతో మళ్లీ మార్కెట్‌లోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.

కార‌ణాలివీ.. Here Are the Reasons…
– వాస్తవానికి బంగారం, వెండి (Gold and Silver Prices Rise)లో ఇటీవల చోటుచేసుకున్న పతనం సాధారణం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా వెండి ధరలు ఏకంగా సగం వరకు పడిపోవడం మార్కెట్‌ను షాక్‌కు గురి చేసింది. స్పెక్యులేటివ్ ట్రేడింగ్, భారీ లాభాల స్వీకరణ, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి వంటి అంశాలు కలిసి ఈ పతనానికి కారణమయ్యాయి. అయితే ధరలు దిగివచ్చిన ఈ దశను ట్రేడర్లు, దీర్ఘకాల పెట్టుబడిదారులు అవకాశంగా మార్చుకున్నారని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
– కనిష్ఠాల వద్ద నుంచి కొనుగోళ్లకు మద్దతు లభించడంతో ధరలు మళ్లీ పైకి లేచినట్లు అనలిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా వెండిలో పారిశ్రామిక వినియోగం ఎక్కువగా ఉండటం, భవిష్యత్ డిమాండ్‌పై అంచనాలు బలంగా ఉండటం ధరలకు బలం చేకూరుస్తోంది. బంగారానికి వస్తే సంప్రదాయ పెట్టుబడి సాధనంగా, అనిశ్చితి వేళల్లో భద్రమైన ఆస్తిగా పెట్టుబడిదారులు ఇప్పటికీ పసిడిపైనే ఆధారపడుతున్నారు.
– ఇక మరో కీలక కారణంగా డాలర్ విలువ పతనం మారింది. అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడితే బంగారం, వెండి (Gold and Silver Prices Rise)వంటి లోహాలు సాధారణంగా బలపడతాయి. ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొంది. అమెరికా ఆర్థిక గణాంకాలపై నెలకొన్న అనిశ్చితి కారణంగా డాలర్‌పై ఒత్తిడి పెరిగింది. దీని ప్రభావం నేరుగా లోహాల ధరలపై పడుతోంది.
– మరోవైపు చైనా నుంచి వస్తున్న సంకేతాలు కూడా బంగారానికి మద్దతుగా మారాయి. చైనా సెంట్రల్ బ్యాంక్ వరుసగా 15వ నెల కూడా భారీ మొత్తంలో పసిడిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగ దేశాల్లో ఒకటైన చైనా, తన విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటాను పెంచుతుండటం అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ను మరింత బలపరుస్తోంది. భవిష్యత్తులోనూ ఈ కొనుగోళ్లు కొనసాగవచ్చన్న అంచనాలు బంగారం ధరలకు ఊతమిస్తున్నాయి.

మ‌రింత పెరిగే అవ‌కాశం.. Chances of Further Upside Ahead…
– ఈ వారం వెలువడనున్న అమెరికా ఉద్యోగ గణాంకాలు, ద్రవ్యోల్బణ సూచీలు, ఫెడరల్ రిజర్వ్ తీసుకునే పరపతి విధాన నిర్ణయాలు బంగారం, వెండి ధర(Gold and Silver Prices Rise) లను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. వడ్డీ రేట్లపై ఫెడ్ ఎలా స్పందిస్తుందన్న దానిపైనే మార్కెట్ దిశ ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. వడ్డీ రేట్లు తగ్గే సంకేతాలు వస్తే బంగారం మరింత బలపడే అవకాశముందని అంచనా.
– ఇటీవల బంగారం, వెండి(Gold and Silver Prices Rise) లో వచ్చిన భారీ ఒడిదుడుకులకు చైనా ట్రేడర్ల స్పెక్యులేటివ్ ట్రేడింగే ప్రధాన కారణమని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ వ్యాఖ్యానించడం కూడా చర్చనీయాంశంగా మారింది. పెద్ద మొత్తాల్లో జరిగిన షార్ట్, లాంగ్ పొజిషన్లు ధరల్లో తీవ్ర కుదుపుకు కారణమయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు మార్కెట్‌లో పెట్టుబడిదారుల అప్రమత్తతను మరింత పెంచాయి.

దేశీయంగా చూస్తే.. Looking at the Domestic Market…
దేశీయంగా చూస్తే, పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో బంగారం డిమాండ్ మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పంటల ఆదాయం చేతికి రావడం, పండుగల కాలం సమీపించడంతో భౌతిక బంగారం కొనుగోళ్లు ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది కూడా ధరలకు మద్దతుగా నిలవవచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఊగిసలాట కొనసాగవచ్చు.. Volatility May Continue…
అయితే బంగారం , వెండి ధ‌ర‌ల‌(Gold and Silver Prices Rise) పెరుగుదల శాశ్వతమా? లేక తాత్కాలిక ఊపేనా? అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, తక్షణంగా ధరల్లో ఊగిసలాట కొనసాగవచ్చు. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఆర్థిక గణాంకాలు, సెంట్రల్ బ్యాంకుల విధానాలపై ఆధారపడి ధరలు మారవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. అందువల్ల పెట్టుబడిదారులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. మొత్తానికి ఇటీవల పతనంతో నిరాశ చెందిన బంగారం, వెండి పెట్టుబడిదారులకు తాజా పెరుగుదల కొంత ఊరటనిచ్చింది. మార్కెట్‌లో మళ్లీ ఉత్కంఠ నెలకొనగా, వచ్చే రోజుల్లో ధరల దిశపై అందరి చూపూ అంతర్జాతీయ పరిణామాలపైనే ఉంది. పసిడి–వెండి బాట మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

వెండి ఈటీఎఫ్ ర్యాలీ ఇలా.. Silver ETF Rally Explained…
వెండి ఈటీఎఫ్‌లు టాప్ గెయినర్స్‌గా నిలవడం మార్కెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది. గత వారం పతనంతో నష్టపోయిన వెండి ఈటీఎఫ్‌లు ఒక్కరోజులోనే రెండు అంకెల లాభాలు నమోదు చేశాయి. యాక్సిస్ సిల్వర్ ఈటీఎఫ్ దాదాపు 12 శాతం పెరిగి రూ.264.69 స్థాయికి చేరింది. ఈ ర్యాలీలో అత్యధిక లాభం నమోదు చేసిన ఫండ్ ఇదే. యూటీఐ సిల్వర్ ఈటీఎఫ్, గ్రో సిల్వర్ ఈటీఎఫ్ సుమారు 11 శాతం పెరిగాయి. నిప్పాన్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, టాటా సిల్వర్ ఈటీఎఫ్‌లు 10 శాతం కంటే ఎక్కువగా లాభపడ్డాయి. అలాగే జెరోధా, ఎస్బీఐ, కోటక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సిల్వర్ ఈటీఎఫ్‌లు కూడా దాదాపు 8 శాతం వరకు పెరిగాయి.

బంగారం ఈటీఎఫ్‌ల ర్యాలీ .. Gold ETF Rally…
వెండితో పోలిస్తే బంగారం ఈటీఎఫ్‌ల ర్యాలీ కొంత మితంగా ఉన్నప్పటికీ, అక్కడ కూడా స్పష్టమైన లాభాలు కనిపించాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లు సుమారు 3 నుంచి 5 శాతం వరకు పెరిగాయి. ఏంజెల్ వన్ గోల్డ్ ఈటీఎఫ్, ఎల్ఐసీ ఎంఎఫ్ గోల్డ్ ఈటీఎఫ్, జెరోధా గోల్డ్ ఈటీఎఫ్ దాదాపు 5 శాతం వరకు లాభపడ్డాయి. కోటక్, మోతీలాల్ ఓస్వాల్, నిప్పాన్ ఇండియా, ఎస్బీఐ, మిరే అసెట్ గోల్డ్ ఈటీఎఫ్‌లు సుమారు 3 శాతం పెరిగాయి. మొత్తంగా చూస్తే వెండి ఈటీఎఫ్‌ల ర్యాలీ, గోల్డ్ ఈటీఎఫ్‌ల కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో ఉండటం గమనార్హం.

 

 

108
FEATURE NEWS Tags:Chances of Further Upside Ahead…, Gold ETF Rally…, Here Are the Reasons…, In the Bullion Market…, In the Futures Market…, Looking at the Domestic Market…, Silver ETF Rally Explained…, Volatility May Continue…

Post navigation

Previous Post: క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్నారా? అయితే ఈ చార్జీల గురించి తెలుసుకోండి! Are You Using a Credit Card? Then Be Aware of These Hidden Charges!
Next Post: భారత్‌–అమెరికా వాణిజ్య ఒప్పందం .. జోష్‌లో మార్కెట్లు .. India–US Trade Deal Boosts Market Sentiment

Related Posts

  • దేశంలో కొన్ని రంగాల్లో భారీ వేతనాలు.. నైపుణ్యం ఉన్నవారికి కోట్లలో ప్యాకేజీలు! Huge Salaries in Some Sectors in India.. Companies Offering Crore Packages for Skilled Professionals! FEATURE NEWS
  • బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలనుకుంటున్నారా?.. అయితే ఇలా చేయండి! Planning to Close Your Bank Account?.. Here’s the Simple Process FEATURE NEWS
  • క్రెడిట్ స్కోర్ పెరిగేదెలా how to improve credit score FEATURE NEWS
  • ఏప్రిల్‌లో బ్యాంకులకు వరుస సెలవులు..! బ్యాంకింగ్ సేవ‌ల‌పై ప్ర‌భావం! Consecutive Bank Holidays in April..! Impact on Banking Services FEATURE NEWS
  • జనవరి 2026 లోపు ఇలా చేయండి ..! బీమా, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్‌, సిల్వ‌ర్‌, స్టాక్ మార్కెట్లలో పెట్టుబ‌డి వ్యూహాలు..! Investment Strategies, Insurance, Mutual Funds, and Stock Market Tips Until January 2026 FEATURE NEWS
  • రూపాయి పతనం… యూఏఈ నుంచి భారత్‌లోకి మూడిరెట్ల నగదు ప్రవాహం Rupee Slump Spurs Triple Cash Inflow from UAE to India FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • UPI చెల్లింపుల సౌలభ్యం – తెలియకుండానే పెరుగుతున్న ఖర్చులు.. UPI Payments and Hidden Spending.. How Convenience Is Changing Personal Finance
  • ఎన్‌పీఎస్ కొత్త నిబంధనలు – రిటైర్మెంట్ ప్రయోజనాల్లో భారీ మార్పులు.. NPS New Rules.. Major Changes in Retirement Benefits and Withdrawal Flexibility
  • సెక్షన్ 194P కింద సూపర్ సీనియర్ సిటిజన్లకు ఐటీఆర్ మినహాయింపు .. Section 194P Relief for Super Senior Citizens.. Understanding ITR Exemption Rules
  • క్రెడిట్ కార్డు చెల్లింపుల్లో మార్పులు… ఓటీపీ సడలింపులించిన ఆర్‌బీఐ.. Changes in Credit Card Payments… RBI Eases OTP Rules
  • ఈఎంఐ సౌలభ్యం… ఆర్థిక ఒత్తిడికి మార్గమా? EMI Convenience… A Path to Financial Pressure?
  • అద్దె ఇల్లు ఖాళీ చేస్తే… మరమ్మత్తుల భారం ఎవరిది? Vacating a Rented House… Who Bears the Repair Costs?
  • పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్… డబ్బు డబుల్.. భద్రతకు భ‌రోసా! Post Office Savings Scheme… Safe Path to Wealth Growth
  • పాన్ కార్డు కొత్త నిబంధనలు… ప్రతి లావాదేవీలో కీలకం! PAN Card New Rules… A Must for Every Financial Move
  • క్రెడిట్ రిపోర్ట్‌లో పొరపాట్లు… భవిష్యత్తు రుణాలపై ముప్పు! Errors in Credit Report… A Silent Threat to Your Financial Future
  • మధ్యతరగతి ‘సంపద’ మాయం… జీతం పెరిగినా జేబు ఖాళీ! The Middle-Class Wealth Illusion… Rising Salaries, Shrinking Reality
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Big Impact Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • ప్ర‌పంచంలోని అగ్రగామి కేంద్ర బ్యాంకులను మించి.. ఇళ్లలో బంగారం! Gold in Households Surpasses Top Central Banks Worldwide! FEATURE NEWS
  • ఇక ‘సర్‌ప్రైజ్ బిల్లులు’ ఉండవ్‌..! ఆ ధరలను ప్రైవేట్ ఆసుపత్రులు ముందుగానే వెల్లడించాలి! No More “Surprise Bills”! Private Hospitals Must Disclose Treatment Costs in Advance FEATURE NEWS
  • మన్మోహ‌న్‌ దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేశారు How did Manmohan affect the country’s economy FEATURE NEWS
  • భారత్ ఫారెక్స్ నిల్వల్లో రికార్డు పెరుగుదల.. రూపాయికి మరింత బలం! Record Surge in India’s Forex Reserves… Rupee Gains Further Strength! FEATURE NEWS
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters! FEATURE NEWS
  • అంతర్జాతీయంగా రికార్డు స్థాయికి పసిడి ధర .. తొలిసారిగా ఔన్సు 5000 డాలర్లకు.. రెండేళ్లలోనే ధర రెట్టింపు! Gold Hits Record High Internationally: Price Reaches $5,000 per Ounce for the First Time, Doubles in Two Years! FEATURE NEWS
  • `డి-మ‌ర్ట్` అధినేత ద‌మానీ పోర్ట్ ఫోలియో ఇదే.. MARKET
  • బంగారంపై పెట్టుబ‌డి.. దండ‌గే! FINICAL PLANNING

Copyright © 2026.

Powered by PressBook News Dark theme