అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల మార్పులపై ఇప్పటి వరకు అమెరికా, యూరప్, చైనా వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థల ప్రభావమే ఎక్కువగా కనిపించేది. అయితే గత కొంతకాలంగా పరిస్థితులు మారుతున్నాయి. ప్రపంచ ఆర్థిక సమీకరణల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తుండటంతో పాటు, బంగారం దిగుమతులు, వినియోగం, నిల్వల పరంగా కూడా భారత్ రికార్డు స్థాయిలో దూసుకుపోతుంది. దీంతో భవిష్యత్తులో “బంగారం ధరలు నిర్ణయించే స్థాయికి భారత్ చేరుకుంటుంది” అని నిపుణుల అంచనా.
బంగారం అంటే భారతీయులకు ప్రత్యేక ప్రేమ.. Indians’ Enduring Love for Gold
ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగ దేశాలు రెండు. ఒకటి చైనా..రెండోది భారత్. వీటిల్లో ముఖ్యంగా పండుగలు, వివాహాలు, ఉత్సవాలు, కుటుంబ సంప్రదాయాల్లో బంగారానికి ఉన్న విశేష ప్రాధాన్యత వల్ల భారత్‌లో డిమాండ్ ఎప్పుడూ శక్తివంతంగానే ఉంటుంది. సంవత్సరానికి భారత్‌లో సగటున 700–800 టన్నుల వరకు బంగారం వినియోగం జరుగుతుంది. పండుగల సీజన్, ముఖ్యంగా దసరా–దీపావళి–అక్షయ తృతీయ సమయంలో భారీ కొనుగోళ్లు జరుగుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో పంటల సీజన్ తరువాత డిమాండ్ పెరుగుతుంది. ఈ డిమాండ్ భారత్‌ను ప్రపంచ బంగారం వేదికపై అత్యంత కీలక దేశంగా నిలబెట్టింది.
రిజర్వ్ బ్యాంక్ భారీగా కొనుగోళ్లు ..RBI Steps Up Massive Gold Purchases
2020 కరోనా తరువాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్న నేపథ్యంలో అనేక దేశాలు తమ విదేశీ మారక నిల్వలలోని డాలర్లపై ఆధారాన్ని తగ్గించడానికి బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. భారత్ కూడా అదే దారిలో నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ రికార్డు స్థాయిలో బంగారం కొనుగోలు చేసింది. గత 3 సంవత్సరాల్లో రిజర్వ్ బ్యాంక్ 175 టన్నులకుపైగా బంగారం కొనుగోలు చేసింది. విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా నిరంతరం పెరుగుతుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇదే ధోరణి ప్రపంచవ్యాప్తంగా కొనసాగింది. బంగారాన్ని రిజర్వుల్లో ఉంచడం అంటే అంతర్జాతీయ వేదికపై భారత రూపాయి స్థిరత్వానికి దోహదపడుతుంది. అలాగే బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశమూ పెరుగుతుంది.
బంగారం దిగుమతుల్లో భారత్ దే అగ్రస్థానం..India Tops Global Gold Imports
భారత్ ప్రపంచ తయారీ పరిశ్రమల్లో పెద్ద స్థానం సంపాదించినట్లుగానే, బంగారం దిగుమతుల పరంగా కూడా అగ్రస్థానంలో నిలుస్తోంది. ఈ దిగుమతులు అంతర్జాతీయ బంగారం ధరలపై నేరుగా ప్రభావం చూపుతాయి. 2023లో భారత్ బంగారం దిగుమతులు పదిలక్షల కోట్ల రూపాయల మార్క్‌కు చేరువైంది. 2024లో దుబాయ్, స్విట్జర్లాండ్, సింగపూర్ దేశాల నుంచి అధిక దిగుమతి చేసుకుంది. ఒక దేశం అంత పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తే, ప్రపంచ మార్కెట్లో ధరల మార్పులను ప్రభావితం చేయడం సహజం.
భారత జువెలరీ పరిశ్రమ ..India’s Jewellery Industry
భారత్‌లోని జువెలరీ తయారీ ప్రపంచవ్యాప్తంగా పేరుపొందింది. ముఖ్యంగా సూరత్, ముంబై, హైదరాబాద్, చెన్నైలోని పరిశ్రమలు పేరొందాయి. ఇక్క నైపుణ్యం కలిగిన కళాకారులు ఉన్నారు. ఎగుమతుల్లో పెరుగుదల, డిజైన్లలో నూతనత వల్ల ప్రపంచపు జువెలరీ మార్కెట్లో భారత్ శాతం రెండు అంకెల వృద్ధిని కొనసాగిస్తోంది. జువెలరీ రంగం బలపడితే… ప్రభుత్వం తీసుకునే విధానాలన్నీ కలిసి బంగారం ధరలపై భారత ప్రభావం మరింత పెరుగుతుంది.
డాలర్ బలహీనత… భారత్‌కు అనుకూలం..Weak Dollar Works in India’s Favor
బంగారం ధరలలో ప్రధాన ఆటగాడు అమెరికన్ డాలర్. డాలర్ బలహీనపడితే బంగారం ధరలు పెరుగుతాయి.
డాలర్ బలపడితే ధరలు తగ్గుతాయి. అమెరికాలో వడ్డీ రేట్లు స్థిరం కావడం, recession భయాలు, బడ్జెట్ లోటు పెరగడం వంటివి డాలర్‌ను బలహీనపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ చేస్తున్న భారీ బంగారం కొనుగోళ్లు ప్రపంచ మార్కెట్‌ను భారత్ వైపు మళ్లిస్తోంది.
డిజిటల్ గోల్డ్ నుంచి గోల్డ్ బాండ్ల వరకు .. From Digital Gold to Gold Bonds
మునుపటి కాలంలో బంగారం అంటే ఆభరణమో, బంగారు నాణెమో మాత్రమే. కానీ ఇప్పుడుట్రెండ్ మారింది. సావరిన్ గోల్డ్ బాండ్లు, డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్‌లు, బంగారం మీద అప్పు పథకాలు.. ఇవన్నీ ప్రజలకు బంగారం కొనుగోలుపై కొత్త దారులు చూపుతున్నాయి. ప్రభుత్వం తరఫున పెద్ద ప్రయోజనాలు , వడ్డీ 2.5%, భద్రతా సమస్య లేకపోవడం, పన్ను రాయితీల వల్ల బంగారం మార్కెట్లో అధికారిక కొనుగోళ్లు పెరిగాయి. అవి అంతర్జాతీయ మార్కెట్లో భారత ప్రభావాన్ని బలోపేతం చేస్తాయి.
ప్రపంచ ఆర్థిక అనిశ్చితి .. బంగారం వైపు పరుగులు..Global Economic Uncertainty Sparks Rush to Gold
ప్రపంచంలో ప్రస్తుతం చైనా ఆర్థిక సంక్షోభం, అమెరికా–చైనా ఉద్రిక్తతలు, మధ్యప్రాచ్యంలో భవిష్యత్తు సంక్షోభాలు, యూరప్‌లో మాంద్యం.. ఇవన్నీ పెట్టుబడిదారులను బంగారం వైపు నెట్టుతున్నాయి. భారత్ ఈ సమయంలో అతిపెద్ద వినియోగదేశం కావడం వల్ల అంతర్జాతీయ ధరలపై నిర్ణాయాక పాత్ర పోషించే స్థాయికి చేరుతోంది. ఇప్పటి వరకు అమెరికా–చైనా డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు కదిలేవి. అయితే ఇప్పుడు భారత్ కూడా ఆ నిర్ణయాల్లో భాగస్వామి. కానుంది. భారీగా దిగుమతులు, బలపడుతున్న రిజర్వ్ బ్యాంక్ నిల్వలు, జువెలరీ ఎగుమతుల పెరుగుదల, దేశీయ డిమాండ్ నిరంతర శక్తి, వినియోగదారుల పెట్టుబడి పద్ధతుల మార్పు అనేవి భారత్ ప్రభావాన్ని అపూర్వ స్థాయికి తీసుకెళ్తున్నాయి.
దేశంలో 25,000 టన్నుల బంగారం ..India Holds 25,000 Tonnes of Gold
భారతీయుల వద్ద సుమారు 25 వేల టన్నుల బంగారం ఉంది. ప్రభుత్వ వద్ద 800 టన్నుల గోల్డ్ ఉంది. అయితే స్విట్జర్లాండ్ ప్రభుత్వం వద్ద 1,000 టన్నులు మాత్రమే బంగారం ఉంది. కానీ అక్కడి ప్రజల వద్ద 200 టన్నులే ఉంది. ఈ భారీ నిల్వ భారత ఆర్థిక శక్తిని తెలియజేస్తోంది. అయితే ఇంత బంగారం ఉన్నా… ధరలపై మనకు ప్రభావం లేకపోవడమే ఆశ్చర్యకరం .
పారదర్శకత అవసరం ..Transparency Needed
గోల్డ్ సోర్సింగ్, మార్కెటింగ్ విధానాల్లో సంపూర్ణ పారదర్శకత అవసరం. బీఐఎస్ హాల్‌మార్కింగ్ మంచి వ్యవస్థే కానీ, దీన్ని మరింత కఠినతరం చేయాలి. భారతీయ బంగారాన్ని గ్లోబల్ ఎక్స్చేంజీల్లో ట్రేడ్ చేయాలంటే విధానపరమైన సంస్కరణలు తప్పనిసరి. 2012–13లో ఆర్బీఐ అమలు చేసిన నిబంధన కారణంగా 24 క్యారెట్ బులియన్ ఎగుమతిపై నిషేధం ఉంది. ఈ నిబంధన కొనసాగుతున్నంత వరకు భారత బులియన్‌కు గ్లోబల్ ప్రీమియం రావడం కష్టమే.
ఎందుకు భారత్ ఇప్పటివరకు ‘ప్రైస్ టేకర్’గానే ఉంది? Why India Has Remained a Price Taker So Far
సొంత గనులు చాలా తక్కువ. దిగుమతులపై అధిక ఆధారత. లండన్ AM/PM బెంచ్‌మార్క్‌లను పాటించడం. గోల్డ్ బ్యాంకింగ్ వ్యవస్థ లేకపోవడం. పారదర్శక బులియన్ ట్రేడింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందకపోవడం. ఈ సమస్యలన్నీ భారత్‌ను బంగారం ధరలను స్వీకరించే దేశంగా నిలబెట్టాయి.
నిపుణుల అంచనా…Experts’ Estimates
ప్రస్తుతం బంగారం ధరలు టన్నుకు వేల కోట్ల రూపాయలను తాకుతున్నాయి. ఇందులో భారత్ పాత్ర ఎంతో కీలకం. ప్రపంచ బుల్ రన్లో భారత్ కీలక శక్తిగా మారిన నేపథ్యంలో బంగారం ట్రేడింగ్‌లో భారత భవిష్యత్తు అత్యంత శక్తివంతం కానుంది. భారత రిజర్వులు పెరగడం.. గ్లోబల్ మార్కెట్లకు సంకేతంగా మారింది. భారత్ డిమాండ్ ఆధారంగా ధరలు కదిలే రోజులు దగ్గరలోనే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
భవిష్యత్తులో ఏమి జరుగుతుందంటే ? Future Prospects
బంగారం ధరల నిర్ణయంలో భారత్ మాట మరింత బలంగా వినిపిస్తుంది. ప్రభుత్వం బంగారం దిగుమతుల విధానంలో మార్పులు చేస్తే, ప్రపంచ ధరలు నేరుగా ప్రభావితం అవుతాయి. డిజిటల్ గోల్డ్–SGBల ప్రభావం అంతర్జాతీయ వ్యూహాల్లో కనిపిస్తుంది. భారత్‌లో వచ్చే 20 సంవత్సరాలు బంగారం డిమాండ్ నిరంతరంగా పెరుగుతుందని అంచనా. చైనా, US డిమాండ్ మారినా, భారత మార్కెట్ బలంగా నిలుస్తుంది. మొత్తంగా బంగారం భవిష్యత్తు భారత్ చేతుల్లోనే ఉందని చెప్పొచ్చు.
