పొగాకు ఉత్పత్తులు (Tobacco Products) ఆరోగ్యానికి హానికరమే కాకుండా, వినియోగదారుల జేబులకూ గట్టి దెబ్బతీస్తున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ ఉత్పత్తులపై జీఎస్‌టీ (వస్తు, సేవల పన్ను)కు అదనంగా ఎక్సైజ్ సుంకాన్ని విధించే నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ‘పొగాకుపై పన్ను విధానాలకు’ అనుగుణంగా ఈ చర్య తీసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాలు ప్రతి ఏడాదీ పొగాకు ఉత్పత్తులపై పన్నులు సవరిస్తూ, వ్యాపారాలను నియంత్రిస్తున్నారు. ఇది ప్రజారోగ్య పరిరక్షణకు, పొగాకు వినియోగాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై కొత్త పన్ను విధానాలను ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి తెచ్చింది. ఇదివరకు ఈ ఉత్పత్తులపై ఎక్సైజ్ రేట్లలో మార్పులు చివరిసారిగా ఏడేళ్ల క్రితం జరిగాయని అధికారులు తెలిపారు.
ప్రజలపై ప్రభావం..Impact on the Public
కేంద్రప్రభుత్వం పొగాకు ఉత్పత్తుల(Tobacco Products) పై జీఎస్‌టీ, ఎక్సైజ్ సుంకాలు పెంచుతూ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. కొత్త పన్నుల కారణంగా పొగాకు ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. సిగరెట్, బీడి, పాన్ మసాలా వంటివి కొద్దిగా ఎక్కువ ఖర్చుతో లభించవచ్చు. పొగాకు వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఆరోగ్యానికి లాభం. చికిత్సకు అయ్యే ఖర్చులు కూడా తగ్గుతాయి. ఇది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించే దిశలో ఒక కీలక అడుగు. వినియోగదారులు ఈ కొత్త పన్ను విధానాన్ని గమనించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
సిగరెట్లపై కొత్త పన్ను మార్పులు .. New Tax Changes on Cigarettes
జీఎస్‌టీ (GST) అమలుకు ముందు భారత్‌లో సిగరెట్ల (Cigarette Prices )పై ఏటా ఎక్సైజ్ సుంకం సవరించేవారు. అయితే, 2017 జులైలో జీఎస్‌టీ అమల్లోకి రావడం తర్వాత గత ఏడేళ్లుగా ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతానికి, జీఎస్‌టీ కింద గరిష్ఠ 28% పన్ను , పరిహార సుంకం మాత్రమే విధిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పన్ను పెంచడం ద్వారా సిగరెట్ల ధరలు అధికం అవుతాయి. దీంతో పొగాకు వినియోగం తగ్గి, ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. మరోవైపు పన్ను ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ విధంగా ప్రత్వం ప్రజారోగ్యం, ఆర్థిక లాభాల రెండు కోణాల్లో పరిమితి సాధించాలని లక్ష్యం పెట్టుకుంది. ఈ కొత్త మార్పులు 2026 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి .దీనిపై ఆర్థిక శాఖ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదులో అన్ని వివరాలు, పన్ను రేట్లు, పరిహార సుంకాలు స్పష్టంగా పేర్కొన్నాయి. రానున్న రోజుల్లో.. సిగరెట్, బీడి వంటి పొగాకు ఉత్పత్తుల (Tobacco Products)ధరలు పెరగ్గా.. అధిక ధరల కారణంగా వినియోగం తగ్గే అవకాశం ఉంది. దీని ఫలితంగా ప్రజల ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. ఏకంగా పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం ఉంటుందని ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇవి ఇప్పటికే ఉన్న జీఎస్‌టీ 40 శాతంకు అదనంగా ఉండనున్నాయి. పొడవు, ఫిల్టర్ ఆధారంగా 1,000 స్టిక్స్‌కు రూ.2,050–8,500 పన్ను విధిస్తారు. చిన్న, ఫిల్టర్ లేని సిగరెట్లకు తక్కువ పన్ను విధిస్తారు. చిన్న (65 మిమీ) నాన్ ఫిల్టర్ సిగరెట్లు, స్టిక్‌కి రూ.2.05 వరకు అదనపు సుంకం ఉంటుంది. చిన్న ఫిల్టర్ సిగరెట్లు – ప్రతి స్టిక్‌కి రూ.2.10, 65–70 మిమీ పొడవు సిగరెట్లు రూ.3.6–4 వరకు, పెద్ద సిగరెట్లు (70–75 మిమీ) – రూ.5.4 వరకు అదనపు సుంకం విధిస్తారు.
పాన్ మసాలా ఉత్పత్తులపై …On Pan Masala Products…
కేంద్ర ప్రభుత్వం పాన్ మసాలా ఉత్పత్తుల (Pan Masala Products)పై కూడా కొత్త పన్ను చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా పాన్ మసాలాపై ఆరోగ్య, జాతీయ భద్రత సెస్ విధిస్తారు. దీంతో వాటి ధరలు పెరుగుతాయి. అదేవిధంగా వాటి వినియోగం కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. దీని వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. గుట్కా 91%, నమిలే పొగాకు, జర్దా 82% అదనపు ఎక్సైజ్ సుంకం విధించనున్నారు. ఇందులో నమిలే పొగాకు, ఫిల్టర్ ఖైనీ, జర్దా, గుట్కా వంటి ఉత్పత్తులు ఉన్నాయి. కొత్త విధానం ప్రకారం ప్యాకేజీపై ఉన్న రిటైల్ MRP ఆధారంగా జీఎస్‌టీ , ఎక్సైజ్ విలువ లెక్కించబడుతుంది. అంటే ప్రతి ఉత్పత్తికి ఎక్కడైనా ఉన్న ప్యాకేజీ ధర ఆధారంగా పన్ను నిర్ణయించబడుతుంది. గుట్కా 91%, నమిలే పొగాకు, ఫిల్టర్ ఖైనీ, జర్దా సెంటెడ్ టొబాకో 82% పన్ను ఉంటుంది.
పాన్ మసాలా తయారీ ప్లాంట్లకు ఆరోగ్య సెస్..Health Cess on Pan Masala Manufacturing Plants
కేంద్ర ప్రభుత్వం పాన్ మసాలా (Pan Masala )తయారీ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యంపై కొత్త ఆరోగ్య సెస్ విధిస్తోంది. ఆర్థిక శాఖ ఇప్పటికే సంబంధ నిబంధనలను నోటిఫై చేసింది. ప్రతి తయారీ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఆధారంగా ఆరోగ్య సెస్ విధిస్తారు. వచ్చే ఆదాయం ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలు, పథకాల ద్వారా రాష్ట్రాలకు పంచుతారు. ముఖ్యంగా ప్రజారోగ్యం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తారు. నూతన విధానంతో పాన్ మసాలా ఉత్పత్తులపై పన్ను సిస్టమ్ స్పష్టత వస్తుంది. రాష్ట్రాలు ఆరోగ్య కార్యక్రమాలను బలోపేతం చేయగలవు.
ప్రజలు ఆరోగ్య పరిరక్షణలో నేరుగా లాభం పొందుతారు. ఈ మార్పు 2026 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది. నిబంధనల్లో భాగంగా.. అన్ని ప్యాకింగ్ మెషీన్లను సీసీటీవీతో మోనిటర్ చేయాలి. ఫుటేజ్ ను కనీసం 24 నెలల పాటు దాచి ఉంచాలి. ప్రతి మెషీన్ సంఖ్య, సామర్థ్యం వంటి వివరాలు రెగ్యులర్‌గా అధికారులకు అందించాలి. ఏదైనా మెషీన్ 15 రోజుల పాటు వరుసగా పనిచేయకపోతే, కంపెనీ ఎక్సైజ్ సుంకంలో తగ్గింపు పొందే అవకాశాన్ని కోల్పోతుంది. ఈ నిబంధనలు పౌచ్‌లలో ప్యాక్ చేసే కంపెనీలకు మాత్రమే వర్తిస్తాయి. ఇతర కంపెనీలకు ఈ నిబంధనలు వర్తించవు. ఈ విధానంతో ప్యాకింగ్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఏర్పడుతుంది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఎక్సైజ్ సుంకం సక్రమంగా వసూలు చేయవచ్చు. తయారీ విధానంపై నియంత్రణ పెరుగుతుంది
రాష్ట్రాలకు ఎక్సైజ్ సుంకం ఆదాయం .. Excise Duty Revenue for States
కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తుల(Tobacco Products)పై కొత్త ఎక్సైజ్ సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో, ఈ ఆదాయం రాష్ట్రాలకు ఎలా పంపిణీ అవుతుందనే అంశం కూడా స్పష్టమైంది. కేంద్ర పన్ను ఆదాయాలను ఒక పూల్‌గా చేసి, రాష్ట్రాలకు అందిస్తారు. ఆర్థిక కమిషన్ సిఫారసుల ప్రకారం, పూల్‌లో 41 శాతం భాగాన్ని రాష్ట్రాలు అందుకుంటాయి. అంటే ఎక్సైజ్ సుంకం పెరగడం వల్ల రాష్ట్రాల పన్ను ఆదాయం కూడా అధికమవుతుంది. దీనివల్ల రాష్ట్రాల అంతర్గత అభివృద్ధి పెరుగుతుంది. ప్రజారోగ్య, పౌర సౌకర్యాలపై ఖర్చు పెంచుకోవచ్చు. పొగాకు ఉత్పత్తుల వినియోగం తగ్గుతుంది. ఆరోగ్య రంగంలో మద్దతు సాధించవచ్చు. కేంద్ర–రాష్ట్రాల మధ్య ఆదాయ పంపిణీ సమతులంగా ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే… పొగాకు ఉత్పత్తులపై పెరుగుతున్న ఎక్సైజ్ సుంకం ద్వారా వచ్చిన నిధులు 41 శాతాన్ని రాష్ట్రాలకు తిరిగి పంపిణీ చేస్తారు. ఇది రాష్ట్రాల అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం, పౌర సౌకర్యాల పెంపు కోసం ఉపయోగపడుతుంది.
ప్రపంచ దేశాల్లో సిగరెట్ల పన్ను విధానం .. Cigarette Taxation Policies Around the World
ప్రపంచవ్యాప్తంగా సిగరెట్లపై బలమైన పన్ను విధానాలు ఉన్నాయి. దేశాల అవగాహన, ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ పద్ధతులు అమలులో ఉన్నాయి. బ్రిటన్, ఆస్ట్రేలియా.. సిగరెట్ల రిటెయిల్ ధరపై 80–85% పన్ను విధిస్తున్నాయి. ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఐరోపా సమాఖ్య దేశాలు – 75 నుంచి 80% పైగా పన్ను విధించాయి. తుర్కియే, దక్షిణాఫ్రికా, ఫిలిప్పైన్స్, చిలీ .. గత దశాబ్ద కాలంగా సిగరెట్లపై పన్ను పెంచుతున్నాయి. మనదేశం సిగరెట్ల రిటెయిల్ ధరపై సుమారు 53% పన్ను మాత్రమే (ప్రపంచ బ్యాంక్ అంచనా) విధిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు మేరకు రిటెయిల్ ధరలో కనీసం 75% పన్ను ఉండాలి. దీని ద్వారా వినియోగం తగ్గించి, ప్రజల ఆరోగ్యం కాపాడవచ్చు. కాగా మన దేశంలో సిగరెట్లపై పన్ను అధికం కాని 53% మాత్రమే. ఫలితంగా సిగరెట్ వినియోగం ఇంకా ఎక్కువగా ఉంది. కేంద్రం ఇటీవల జీఎస్‌టీ, ఎక్సైజ్ సుంకాలు పెంచుతూ ఈ వెనుకబడి ఉన్న స్థితిని సరిచేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రపంచ దేశాలు సిగరెట్లపై బలమైన పన్ను విధిస్తున్నాయి. భారత్ మాత్రం 53% పన్నుతో వెనుకబడింది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త జీఎస్‌టీ, ఎక్సైజ్ సుంకాలు పెరగడం ద్వారా వినియోగం తగ్గించడమే కాక, ప్రజల ఆరోగ్య రక్షణలో మార్పు రానుంది.
స్మగ్లింగ్ పెరిగే అవకాశం.. Risk of Increased Smuggling
కేంద్ర ప్రభుత్వం సిగరెట్లపై ఎక్సైజ్ సుంకం పెంపు చేసే విషయంపై పొగాకు పరిశ్రమ సంఘం , టొబాకో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (టీఐఐ), కేంద్రానికి విన్నపం చేసింది. ఎక్సైజ్ సుంకం పెద్ద మొత్తంలో ఒకేసారి పెరగడం వల్ల ధరలు మరింత పెరుగుతాయి. ఈ పరిస్థితిలో చట్టవ్యతిరేక వాణిజ్యం (స్మగ్లింగ్) మరింత పెరగొచ్చని హెచ్చరించారు. ఇదే జరిగితే.. లక్షల మంది రైతులు, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు, రిటైలర్లు నష్టపోవచ్చు. స్థానిక సరఫరా వ్యవస్థలు ప్రభావితమవుతాయి. దేశీయ పరిశ్రమకి కూడా నష్టాల బాటపట్టే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో పన్ను పెంపు పద్ధతులను సమీక్షించి, దశల వారీగా అమలు చేయాలని పొగాకు పరిశ్రమ సంఘం కోరుతోంది.

