ఇంట్లో ఖాళీగా ఉన్న పసిడికి కొత్త దారి! అద్దెకు ఇవ్వండి.. ఆదాయం పొంద‌డి! A New Way to Use Idle Gold at Home: Lease It, Earn Income!

Posted by

ఇంట్లో బంగారు ఆభ‌ర‌ణాలు ఉంటే దొంగల భయం. ఒక‌వేళ బ్యాంకు లాకర్‌లో పెడితే వేల రూపాయలు చెల్లించుకోవాలి. కానీ ఇదే బంగారం ఇప్పుడు మీకీ ఆదాయం తెచ్చిపెట్టే అవకాశం అందుబాటులోకి తెచ్చింది. పసిడిని అద్దె/లీజ్‌ రూపంలో ఇచ్చి, వడ్డీ రూపంలో ఆదాయం పొందే మార్గం ఉంది. ప్రభుత్వరంగ బ్యాంకుల గోల్డ్‌ మనిటైజేషన్‌ స్కీమ్‌ (పసిడి నగదీకరణ పథకం) ద్వారా గానీ, ప్రైవేటు సంస్థల ‘గోల్డ్‌ లీజ్‌’ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా గానీ… బంగారం పెట్టుబడి రూపంలో మళ్లీ మదింపు పొందుతోంది.

మూలధనమే కాదు.. ఆదాయం కూడా! Not Just Capital… But Income Too!

భారతీయ కుటుంబాల్లో బంగారం కొనుగోలు సాంప్రదాయం. ఆభరణాల రూపంలో కావొచ్చు, బిస్కెట్ల రూపంలో కావొచ్చు. పసిడి విలువ పెరుగుతూనే ఉండటం వల్ల దీన్ని దీర్ఘకాలిక పెట్టుబడిగా భావిస్తారు. అయితే ఇల్లు, భూముల్లా బంగారం కూడా అద్దె ఇవ్వగలిగితే? ఆదాయం వచ్చి పడితే? ఇదే ఆలోచనతో పసిడి లీజ్‌ విధానం పాపులర్‌ అవుతోంది. విలువ పెరిగినా, ఇంట్లో దాచుకుంటే ఆదాయం రాకపోవడం ప్రజలను కొత్త మార్గాల వైపు నెడుతోంది.

ఎవరికి ఇవ్వొచ్చు? ఎంత‌ వడ్డీ? Who Can You Lease To? What Interest Will You Earn?

మేలిమి బంగారం బిస్కెట్ల రూపంలో ఉంటే, ఆభరణాల విక్రేతలు, రిఫైనర్లు, ఫ్యాబ్రికేటర్లు లాంటి వారికి అద్దెకు ఇవ్వొచ్చు. రోజువారీ వ్యాపారాల్లో వారికి పసిడి అవసరం ఉండటంతో ఈ లీజింగ్‌ మోడల్‌ ఉపయుక్తమవుతోంది. పూచీకత్తుతో బంగారం లీజ్ సుమారు 2% వడ్డీ వ‌స్తుంది. పూచీకత్తు లేకుండా లీజ్ అయితే సుమారు 4% వడ్డీ పొందొచ్చు. కొందరు బులియన్‌ డీలర్లు ప్రతి గ్రాముకు 50 పైసల వరకు నెలవారీ వడ్డీ ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఇక ఆభరణాలు లీజ్‌కు ఇస్తే, వాటిని కరిగించి 999 ప్యూరిటీ బార్లుగా మార్చి, తిరిగి మేలిమి బంగారంగానే ఇస్తారు. ఆభరణాల అసలు రూపం తిరిగి రాదన్న విషయం మాత్రం గుర్తుంచుకోవాలి.

లీజింగ్‌కి భారీ డిమాండ్‌.. Surging Demand for Gold Leasing

ఈ ఏడాదిలోనే బంగారం ధరలు 50% పైగా పెరగడంతో… ఈ పండుగ సీజన్‌ నుండి పసిడి లీజింగ్‌కి డిమాండ్‌ భారీగా పెర‌గ‌నుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు సెంట్రల్‌ బ్యాంకులు, బులియన్‌ బ్యాంకులే బంగారం లీజింగ్‌లో ముందుండేవి. ఇప్పుడు వ్యక్తిగత పెట్టుబడిదారులు కూడా గోల్డ్‌ లీజింగ్‌ వైపు అడుగులు వేస్తున్నారు.

ప్రైవేట్‌ సంస్థలు ఏం చెబుతున్నాయంటే? What Private Firms Are Saying

సురక్షితంపై అనుమానం ఉన్నవారికి సంస్థలు ఇలా చెబుతున్నాయి.
SafeGold: RF-ID, బీమా, ఆడిట్, ప్యూరిటీ హామీ
Monetary Metals: ఆర్ఎఫ్‌ఐడి , సెన్సర్లు ద్వారా ట్రాకింగ్
GoldStorm: ఆభరణాల కొరకు RF-ID ట్యాగ్, రియల్-టైం లెక్కలు, బీమా కవరేజ్ రక్షణతో పాటు ఉద్యోగి మోసం చేసినా రికవరీ సాధ్యం అంటున్నారు. పశ్చిమాసియాలో 2006 నుంచే ఈ విధానం నడుస్తోందని ఈ సంస్థలు పేర్కొంటున్నాయి. వడ్డీ రేట్లు ఎలా ఉంటాయంటే.. పూచీకత్తుతో బంగారానికి సుమారు 2%, పూచీకత్తు లేకుండా 4%, కొందరు వ్యాపారులు ప్రతి గ్రాముకు 50 పైసల వరకు నెలవారీ వడ్డీ ఇస్తున్నారు. ప్రైవేట్ సంస్థల లీజ్‌లో నష్టాల భయం ఉన్నా… సంస్థలు బీమా, RF-ID, కెమేరా, రేడియో ఫ్రీక్వెన్సీ ధ్రువీకరణ సాంకేతికతతో భద్రత కల్పిస్తున్నాయి.

ప్రైవేట్ సంస్థలకు లీజింగ్‌లో లాభమేమిటంటే..? How Do Private Firms Benefit from Leasing?

వ్యాపార కార్యకలాపాల కోసం వాటికి గోల్డ్ అవసరం. ఆభరణాల తయారీదారులు, రిఫైనర్లు, బులియన్‌ డీలర్లు రోజువారీ కార్యకలాపాల కోసం పసిడి బిస్కెట్లు లేదా మెటల్ అవసరం పడుతుంది. దీంతో మనం ఇచ్చిన బంగారం వీరి పనికి వస్తుంది. ఆ స్థిరమైన బంగారం ద్వారా వారి వ్యాపార కార్యకలాపాలు సాఫీగా నడుస్తాయి. తక్కువ వ్యయంతో అధిక లిక్విడిటీ పొందుతారు. స్థానికంగా లభ్యమయ్యే బంగారం వల్ల, కొత్తగా బంగారం కొనుగోలు చేయాల్సిన అవసరం తగ్గుతుంది. మనం ఇచ్చిన బంగారంపై 2%–4% వడ్డీ రూపంలో సంస్థలు చెల్లిస్తాయి.ఇది కంపెనీలకు పెద్ద నిధుల అవసరం లేకుండా, క్రమంగా వడ్డీ రూపంలో ఖర్చులు సరిపోతాయి. పెద్ద మొత్తంలో బంగారం అందుబాటులో ఉండటం వ‌ల్ల‌ కంపెనీని ప్రీమియం సప్లయర్‌గా గుర్తిస్తుంది. కస్టమర్, ఫ్యాబ్రికేటర్, రిటైల్ మార్కెట్లో ఈ విశ్వసనీయత వ్యాపారానికి లాభంగా ఉంటుంది. మ‌న బంగారం లీజుకు ఇవ్వ‌డం వ‌ల్ల అధిక‌ వడ్డీ ఆదాయం వ‌స్తుంది. కాల వ్య‌వ‌ధి ముగిసిన తర్వాత మేలిమి బంగారం తిరిగి పొందవచ్చు. ఇంట్లో దాచిన బంగారం పెద్ద రిస్క్ లేకుండా, లాభంగా మారుతుంది.

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ‘పసిడి నగదీకరణ పథకం..’ Gold Monetization Scheme in Public Sector Banks

ప్రైవేట్ సంస్థ‌ల వద్ద ఇబ్బందులు ఎదుర‌య్యే ప్రమాదం ఉన్నట్టు అనిపిస్తే, ప్రభుత్వరంగ బ్యాంకుల GMS (Gold Monetization Scheme) అత్యంత సురక్షిత మార్గం. ఇక్క‌డ వడ్డీ రేట్లు చూసుకుంటే SBI అయితే ఏడాదికి 0.50%, రెండేళ్ల‌కు 0.55%, మూడేళ్ల‌కు 0.60% ఉన్నాయి. మధ్యకాలం, దీర్ఘకాల పథకాలు మార్చి 2024 నుంచి నిలిపివేశారు.

ప్రక్రియ ఎలా ఉంటుంది? How Does the Process Work?

బ్యాంకులో గోల్డ్‌ డిపాజిట్‌ అకౌంట్‌ తెరవాలి. ఆభరణాలు, నాణేలు, బిస్కెట్ల రూపంలోని బంగారాన్ని కలెక్షన్‌ & టెస్టింగ్‌ సెంటర్‌ వద్ద జమ చేయాలి. కరిగించి 999 ప్యూరిటీకి మార్చి బరువు నిర్ధారిస్తారు. ఖాతాలో డిపాజిట్‌ కాగా… వడ్డీ రూపంలో రూపాయల్లో జమ అవుతుంది. గడువు తీరాక మేలిమి బంగారం లేదా నగదుగా తీసుకోవచ్చు. అయితే కనీసం 10 గ్రాములు స్వీకరిస్తారు. ప్రభుత్వ బ్యాంకులు కావడంతో… బంగారం పోతుందనే భయం ఉండదు. మీ బంగారం సురక్షితంగా ఉండాల‌నుకుంటే బ్యాంకుల పసిడి నగదీకరణ పథకం ఉత్త‌మం. అధిక వడ్డీ కావాలంటే ప్రైవేటు లీజింగ్‌, కానీ విశ్వసనీయ సంస్థలను మాత్రమే ఎంచుకోవాలి. ఆభరణాల రూపంలో ఇవ్వాలంటే ఆభరణం పాత రూపంలో తిరిగి రాదన్న విషయం తప్పక గుర్తుంచుకోవాలి.

బ్యాంకులకు లాభం ఏమిటి? How Do Banks Benefit?

మనం డిపాజిట్ చేసిన బంగారం ఆధారంగా బ్యాంకులు లీన్ కేటగిరీ కింద రుణాలను ఇవ్వవచ్చు. ఇది బ్యాంకులకు క్యాష్ ఫ్లో బలం ఇస్తుంది. విదేశీ మారక ద్రవ్య ఖర్చు తగ్గుతుంది. భారత్‌లో గోల్డ్ డిమాండ్ చాలా ఎక్కువ. దీన్ని దిగుమతి చేసుకోవడానికి విదేశీ కరెన్సీ ఖర్చు ఎక్కువ‌వుతోంది. అయితే స్థానికంగా బ్యాంకులు డిపాజిట్ చేసిన బంగారం అందుబాటులో ఉండటం వ‌ల్ల‌ విదేశీ బంగారం దిగుమతి అవసరాన్ని తగ్గిస్తుంది. ఇంట్లో వృథాగా ఉన్న బంగారం బ్యాంకుల్లో జమ కాబట్టి, సురక్షితంగా నిల్వ అవుతుంది.ఇదే సమయంలో, బ్యాంకులు డిమాండ్‌కు సరిపడే బంగారం సేకరిస్తాయి. అందుకే మార్కెట్‌లో గోల్డ్ సరఫరా సౌకర్యం పొందుతుంది. వడ్డీ ఆదాయం ద్వారా వినియోగదారులను ఆకర్షణగా నిలుస్తుంది. ప్ర‌జలకు వడ్డీ రూపంలో రాబడిని ఇస్తూ, బ్యాంకులు నియమిత డిపాజిటర్లను పొందుతాయి. దీని ద్వారా బ్యాంక్‌ ఖాతాల్లో స్థిరమైన నిధుల ప్రవాహం ఏర్పడుతుంది.

రిస్కులు? What Are the Risks?

ప్రైవేట్‌ సంస్థల్లో చూసుకుంటే వ్యాపారి పరారీ అయ్యే అవకాశం ఉంది. ప్యూరిటీ తగ్గించిపెట్టే ప్రమాదం ఉంది. తిరిగి పొందడంలో జాప్యం కూడా జ‌ర‌గొచ్చు. ప్రపంచ స్వర్ణ మండలి (WGC) కూడా ఇదే అంశంపై హెచ్చరిస్తోంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *