సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల . ఆ కల సాకారం కోసం జీవితాంతం కష్టపడతారు. రూపాయి… రూపాయి పొదుపు చేసి ఇంటి నిర్మాణం చేపడతారు. మరికొందరు అప్పులు చేసి మరీ ఇంటిని కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ సమయంలో బ్యాంకు రుణం తప్పనిసరి. కాగా అవసరాలకు తగ్గట్టుగా రుణం అందక ఇబ్బంది పడుతుంటారు. దీంతో చాలామంది అధిక వడ్డీలకు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి మరింత అప్పుల్లో కూరుకుపోతుంటారు. అయితే ఇంటి రుణం కోసం బ్యాంకుల్లో మనకు కావాల్సినంత రుణం పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆదాయానికి తగిన రుణం..Loan According to Your Income
ఇంటి రుణం అంటే కేవలం బ్యాంకు ఫారములు నింపడం కాద. నమ్మకం, ఆర్థిక స్థిరత్వం, మంచి క్రెడిట్ ఉండాలి. ఈ అంశాలు సరిగా ఉంటే, కావాల్సినంత రుణం పొందడం కష్టం కాదు. కాగా బ్యాంకులు రుణం మంజూరు చేసే ముందు మీ ఆదాయం, ఉద్యోగ స్థిరత్వం, అప్పు చరిత్ర వంటి అంశాలను పరిశీలిస్తాయి.
స్థిరమైన జీతం ఉన్న ఉద్యోగం , లేదా బిజినెస్‌లో రెగ్యులర్ ఇన్కమ్ ఉంటే, రుణం పొందడం సులభం. సాలరీ స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ సరిగ్గా ఉంటే, రుణ పరిమితి పెరిగే అవకాశం ఉంటుంది.
క్రెడిట్ స్కోరు కీలకం..Credit Score is Key
ఇప్పుడు బ్యాంకులు మొదట చూసేది క్రెడిట్ స్కోరు (CIBIL Score). 750 పైగా స్కోరు ఉంటే రుణం సులభంగా మంజూరవుతుంది. EMIలను ఆలస్యంగా చెల్లించినా లేదా క్రెడిట్ కార్డు బకాయిలు ఉంటే స్కోరు పడిపోతుంది. కాబట్టి రుణం పొందే ముదు పాత బకాయిలను తీర్చేయడం మంచిది.
సరైన డాక్యుమెంట్లు ..Proper Documentation
రుణ ప్రక్రియలో డాక్యుమెంట్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఆదాయ ఆధారాలు (సాలరీ స్లిప్స్, ITRs), చిరునామా ధృవీకరణ, ఆస్తి పత్రాలు, బ్యాంక్ ఖాతా వివరాలు పక్కాగా ఉండాలి. ఇవి ముందుగానే సిద్ధం చేసుకుంటే, రుణం త్వరగా మంజూరవుతుంది.
కో-అప్లికెంట్‌తో మరింత రుణం.. Higher Loan with a Co-Applicant
ఇంట్లో ఒకరికి మాత్రమే ఆదాయం తక్కువగా ఉంటే భార్య/భర్త లేదా కుటుంబ సభ్యుడిని కో-అప్లికెంట్‌గా చేర్చండి. ఇలా చేస్తే, మొత్తం కుటుంబ ఆదాయం పెరిగినట్టవుతుంది. తద్వారా రుణ పరిమితి కూడా పెరుగుతుంది.
ముందస్తు డౌన్‌పేమెంట్ ..Advance Down Payment
బ్యాంకులు సాధారణంగా ఆస్తి విలువలో 75%–90% వరకే రుణం ఇస్తాయి. మిగతా మొత్తాన్ని మీరు డౌన్‌పేమెంట్‌గా ఇవ్వాలి. డౌన్‌పేమెంట్ ఎక్కువగా చేస్తే, బ్యాంకు విశ్వాసం పెరుగుతుంది . రుణం త్వరగా మంజూరవుతుంది.
రుణ పరిమితి పెంచుకోవాలంటే.. If You Want to Increase Your Loan Limit
పన్ను రిటర్న్స్ సకాలంలో ఫైల్ చేయాలి. సైడ్ ఇన్కమ్ (రెంట్, బిజినెస్, ఫ్రీలాన్స్) ఉంటే చూపించాలి.
క్రెడిట్ స్కోరును మెరుగుపరుచుకోవాలి. ఒకేసారి అనేక రుణాల కోసం దరఖాస్తు చేయకూడదు.
అప్పులు ఉన్నా .. Even If You Have Existing Loans
ఇతర రుణాలు ఉండటం వల్ల హోమ్ లోన్ పూర్తిగా తిరస్కరించబడదు. కానీ బ్యాంకు మీ చెల్లింపు సామర్థ్యాన్ని (repayment capacity) బట్టి రుణ పరిమితిని నిర్ణయిస్తుంది. మీరు ఇప్పటికే నెలసరి EMIలు ఎక్కువగా చెల్లిస్తున్నట్లయితే కొత్త రుణం పరిమితి తగ్గవచ్చు. మొత్తం ఆదాయంలో 40%–50% కన్నా ఎక్కువ EMIలు ఉండకూడదు అన్నది బ్యాంకుల సాధారణ నిబంధన.
డెట్-టు-ఇన్కమ్ రేషియో (DTI) కీలకం..Debt-to-Income (DTI) Ratio is Key
డెట్-టు-ఇన్కమ్ రేషియో అనేది బ్యాంకులు పరిశీలించే ప్రధాన అంశం. ఉదాహరణకు మీరు నెలకు ₹1 లక్ష సంపాదిస్తే.. ఇప్పటికే ₹40,000 EMIలు చెల్లిస్తున్నట్లయితే, మరో పెద్ద రుణం ఇవ్వడం బ్యాంకు రిస్క్‌గా చూస్తుంది. ఈ రేషియో తక్కువగా ఉంటే, హోమ్ లోన్ మంజూరయ్యే అవకాశం ఎక్కువ. ఇతర రుణాలు ఉన్నప్పుడు మీ క్రెడిట్ స్కోరు (CIBIL Score) స్థాయిని బ్యాంకు జాగ్రత్తగా పరిశీలిస్తుంది. సమయానికి EMIలు చెల్లిస్తే — స్కోరు బాగుంటుంది, రుణం సులభం. ఆలస్యాలు, డీఫాల్ట్లు ఉంటే — రుణం మంజూరయ్యే అవకాశం తగ్గుతుంది.
బ్యాంకుకు నిజమైన సమాచారం ఇవ్వాలి.. Provide Accurate Information to the Bank
రుణం కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు పాత రుణాల గురించి దాచడం ప్రమాదం. బ్యాంకులు క్రెడిట్ బ్యూరో డేటా ద్వారా అన్ని వివరాలు తెలుసుకుంటాయి. దాచిపెడితే అవిశ్వాసం ఏర్పడి రుణం తిరస్కరించబడే అవకాశం ఉంటుంది. పాత రుణాలపై బకాయిలను తీర్చేయాలి. క్రెడిట్ కార్డుల్లో లిమిట్ ఉపయోగాన్ని 30% లోపే ఉంచాలి. పన్ను రిటర్న్స్ సకాలంలో ఫైల్ చేయాలి. EMI చెల్లింపుల్లో ఎప్పుడూ ఆలస్యం చేయరాదు.
స్వయం ఉపాధి పొందుతుంటే.. If You Are Self-Employed
ఉద్యోగం లేకపోయినా వ్యాపారం, స్వంత పనితో ఆదాయం సంపాదిస్తున్నవారికి ఇల్లు కొనాలన్న కోరిక మరింత ఎక్కువ. కానీ బ్యాంకులు ఎక్కువగా సాలరీ పొందే ఉద్యోగులను ప్రాధాన్యం ఇస్తాయి. కొన్ని బ్యాంకులు మాత్రం ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ప్రధానంగా నిర్ధారిత ఆదాయం ఉందా లేదా అన్నదే చూస్తాయి. అందుకే మీరు చిన్న వ్యాపారం, సొంత సంస్థ, కిరాణా షాప్, ఫ్రీలాన్స్, లేదా అద్దె ఆదాయం కలిగి ఉంటే సరైన రికార్డులు చూపిస్తే రుణం సాధ్యమే. లావాదేవీలు బ్యాంక్ ఖాతా ద్వారా జరిగేలా చూసుకోవాలి.
స్వయం ఉపాధి పొందేవారికి పత్రాల ప్రాముఖ్యత మరింత ఎక్కువ. గత 2–3 సంవత్సరాల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR), బ్యాంక్ స్టేట్మెంట్స్, వ్యాపార లైసెన్స్, GST రిజిస్ట్రేషన్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ తో పాటు మీ ఆదాయం స్థిరంగా ఉందని నిరూపించగలిగితే రుణం సులభం అవుతుంది. స్వయం ఉపాధి పొందే వారి వద్ద స్థిరమైన సాలరీ స్లిప్స్ లేకపోవడం వల్ల, బ్యాంకులు ఎక్కువగా క్రెడిట్ స్కోరు ఆధారపడి నిర్ణయం తీసుకుంటాయి. 750 పైగా స్కోరు ఉంటే రుణం మంజూరయ్యే అవకాశం ఎక్కువ. క్రెడిట్ కార్డు బకాయిలు లేకుండా, సమయానికి చెల్లింపులు చేస్తే రుణం త్వరగా మంజూరవుతుంది.
అధికంగా చెల్లిస్తే..? If You Pay More ?
ఇంటి రుణం తీసుకున్న తర్వాత, కొంతమంది వడ్డీ భారం తగ్గించుకోవడానికి ముందస్తు చెల్లింపులు (Prepayment) చేస్తారు. అంటే, రుణ కాలం ముగియకముందే ఎక్కువ మొత్తం చెల్లించడం. దీని వల్ల వడ్డీ మొత్తం తగ్గి, రుణ కాలం కూడా తగ్గుతుంది. దీని వల్ల త్వరగా “రుణ రహిత” జీవితానికి చేరుకోవచ్చు. క్రెడిట్ స్కోరు మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ₹40 లక్షల రుణం 20 సంవత్సరాలకు తీసుకున్నట్లయితే, మధ్యలో ₹5–₹10 లక్షలు చెల్లిస్తే మొత్తం వడ్డీపై లక్షల్లో ఆదా అవుతుంది.
కానీ జాగ్రత్త! But Be Careful!
అధికంగా చెల్లించే ముందు కొన్ని విషయాలు గమనించాలి. కొన్ని బ్యాంకులు ప్రి-పేమెంట్ ఛార్జీలు వసూలు చేస్తాయి. ఆ మొత్తాన్ని చెల్లించడానికి మీరు తీసుకున్న డబ్బు ఇతర అవసరాలకు ఉపయోగపడేదేనా అన్నది ఆలోచించాలి. అత్యవసర పరిస్థితుల్లో క్యాష్ అవసరమైతే కష్టంగా మారవచ్చు. ముందస్తుగా పెద్ద మొత్తం చెల్లించడం కష్టం అనిపిస్తే, EMI మొత్తాన్ని కాస్త పెంచడం ద్వారా కూడా వడ్డీ భారాన్ని తగ్గించవచ్చు. సంవత్సరానికి 5–10% EMI పెంచితేనే, రుణ కాలం 2–3 సంవత్సరాలు తగ్గిపోతుంది.
బ్యాంకులు & వడ్డీ రేట్లు ..Banks & Interest Rates
దేశంలోని ముఖ్యమైన బ్యాంకులు హోమ్ లోన్ వడ్డీ రేట్లను ఇలా అమలు చేస్తున్నాయి State Bank of India (SBI) – “7.50%, Bank of India, Central Bank of India, Bank of Maharashtra, Indian Overseas Bank కొన్ని ప్రభుత్వ బ్యాంకులు 7.35% నుంచి వడ్డీ రేట్లు వసూలు చేస్తున్నాయి. ICICI Bank ప్రైవేట్ బ్యాంకు హోమ్ లోన్ రేట్లు “8.75% – 9.40%” గా ఉన్నాయి. Axis Bank “8.75% నుంచి హోమ్ లోన్ రేట్లు ప్రారంభమవుతున్నాయి. వాస్తవంగా రేట్లు మీ క్రెడిట్ స్కోరు, ఆదాయం, ఆస్తి విలువ, రుణ కాలం వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి.
ఈఎంఐ చెల్లించకపోతే ? If You Don’t Pay Your EMI?
హోమ్ లోన్ తీసుకున్న తర్వాత ఎంఐలు (Equated Monthly Installments) ఆదాయానికి అనుగుణంగా చెల్లించకపోతే తద్వారా అనేక సమస్యలు ఎదురవుతాయి. ఈఎంఐల చెల్లింపు ఆలస్యమైతే లేట్ ఫీజులు / పెనాల్టీలు విధిస్తారు. మీ క్రెడిట్ స్కోరు తగ్గిపోవచ్చు . భవిష్యత్తులో రుణాలు పొందే అవకాశాలు తగ్గవచ్చు.
ఎక్కువ కాలం ఈఎంఐలు మిస్ అయితే బ్యాంకు ఆ రుణాన్ని Non-Performing Asset (NPA) గా గుర్తించవచ్చు.
అత్యంత పరిస్థితుల్లో, రుణ సంస్థ ఆస్తిని (భూభాగం / ఇల్లు) వేలం వేయొచ్చు.
ఇంటి రుణం EMI… పదవీ విరమణ వయసు దాటి కొనసాగితే ?
If Your Home Loan EMI Continues Beyond Retirement Age?
చాలామంది ఉద్యోగ జీవితంలో చివర్లోనే “సొంత ఇల్లు” కలను నెరవేర్చాలని చూస్తారు. కానీ బ్యాంకులు సాధారణంగా రుణ కాలాన్ని పదవీ విరమణ వయసు వరకు మాత్రమే మంజూరు చేస్తాయి. ఉదాహరణకు 58 ఏళ్ల వయసు వరకు ఉద్యోగం ఉంటే, రుణం గరిష్టంగా 15–20 సంవత్సరాలకు మాత్రమే ఇస్తారు. కానీ అప్పటికే 45–50 ఏళ్ల వయసులో రుణం తీసుకుంటే.. రుణం కొనసాగడం రిటైర్మెంట్ తర్వాత కూడా తప్పదు. వాస్తవంగా రిటైర్మెంట్ తర్వాత మీ జీతం ఆగిపోతుంది. కానీ EMI మాత్రం ఆగదు! అందుకే ముందుగానే పెన్షన్ ఆదాయం, అద్దె రాబడులు, పెట్టుబడుల ఆదాయం వంటి మార్గాలు ఉండాలి. బ్యాంకులు కొన్నిసార్లు పెన్షన్ లేదా రెంటల్ ఇన్కమ్ ఆధారంగా EMIలను కొనసాగించేందుకు అనుమతిస్తాయి. రిటైర్మెంట్ తర్వాత EMI భారం తగ్గించాలంటే కొడుకు/కూతురు లేదా భార్య/భర్తను కో-అప్లికెంట్‌గా చేర్చడం మంచిది. వారిద్దరి ఆదాయం కలిపి చూపించడం వల్ల బ్యాంకుకు భరోసా పెరుగుతుంది. రుణ కాలం కూడా ఎక్కువగా పొడిగించుకునే అవకాశం ఉంటుంది. పదవీ విరమణ వయసు దాటినా EMIలు కొనసాగడం తప్పు కాదు . కానీ ప్రణాళికతో, ముందస్తు సన్నాహాలతో ఉండాలి. రిటైర్మెంట్ తర్వాత కూడా సుఖంగా జీవించాలంటే, రుణాన్ని క్రమంగా తీర్చడం ఉత్తమం.
రీ-షెడ్యూల్ (Reschedule) చేయించుకోవచ్చు.. You Can Opt for a Loan Reschedule
బ్యాంకులు అవసరమైతే రుణ కాలాన్ని రీ-స్కెడ్యూల్ చేయడానికి అవకాశం ఇస్తాయి. అంటే, EMI మొత్తాన్ని తగ్గించి కాలాన్ని కాస్త పెంచుకోవచ్చు. ఇలా చేస్తే నెలవారీ భారం తగ్గుతుంది, కానీ మొత్తం వడ్డీ మాత్రం కాస్త ఎక్కువ అవుతుంది.
హోమ్ లోన్ టాప్-అప్ అంటే ఏమిటి? What is a Home Loan Top-Up?
ఇప్పటికే ఇంటి రుణం తీసుకున్నవారికి బ్యాంకులు “టాప్-అప్ లోన్” అనే సౌకర్యం ఇస్తాయి. అంటే, ఉన్న రుణంపై మరో అదనపు మొత్తాన్ని మంజూరు చేస్తారు. కొత్త రుణం తీసుకోవాల్సిన అవసరం లేకుండా, ఇదే ఖాతాలో అదనంగా నిధులు పొందవచ్చు. ఈ మొత్తాన్ని ఇంటి మరమ్మత్తులు, ఇంటీరియర్, ఫర్నిచర్, కొత్త గదులు వంటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. బ్యాంకులు రుణం పెంచే ముందు ఈ అంశాలను పరిశీలిస్తాయి . మీ ప్రస్తుత ఆదాయం (salary లేదా business income), EMI చెల్లింపుల చరిత్ర — సమయానికి చెల్లించారా లేదా? క్రెడిట్ స్కోరు (CIBIL), ఆస్తి ప్రస్తుత విలువ, మీరు 2–3 సంవత్సరాలుగా రుణం చెల్లిస్తూ, మంచి ట్రాక్ రికార్డు చూపిస్తే, బ్యాంకులు సులభంగా రుణం పెంచుతాయి.
ఎంతవరకు పెంచుకోవచ్చు? How Much Can You Increase It?
బ్యాంకు నియమాల ప్రకారం, మీరు తీసుకున్న రుణం మొత్తం ఆస్తి విలువలో 75%–80% మించకూడదు. ఉదాహరణకు – మీ ఇంటి ప్రస్తుత విలువ ₹50 లక్షలు అయితే, మొత్తం రుణం ₹40 లక్షల వరకు ఉండొచ్చు. మీరు ఇప్పటికే ₹30 లక్షల రుణం తీసుకుని చెల్లిస్తుంటే, మరో ₹10 లక్షల వరకు టాప్-అప్ రుణం పొందే అవకాశం ఉంటుంది. టాప్-అప్ లోన్ వడ్డీ రేట్లు సాధారణంగా హోమ్ లోన్ రేట్ల కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో 8% నుంచి 9.5% వరకు, ప్రైవేట్ బ్యాంకుల్లో 9% నుంచి 10.5% వరకు వడ్డీ రేట్లు ఉంటాయి. హోమ్ లోన్ పెంచుకోవడమే కాకుండా, ఆ మొత్తాన్ని ఎక్కడ వినియోగిస్తున్నామన్నది ముఖ్యం. అదనపు రుణం తీసుకునే ముందు మీ రుణ-ఆదాయం నిష్పత్తి (Debt-to-Income Ratio)ను లెక్కించుకోవాలి.
