![stock market 2](https://www.dhanammoolam.com/wp-content/uploads/2024/03/stock-market-2.webp)
ఏ మాత్రం అనుభవం లేకుండా స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలనుకుంటే అంతకంటే బుద్ధి పొరపాటు ఇంకొకటి ఉండదు. తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించాలనే ఆశతో ఎంతో మంది అవగాహన లేక స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌పై ఆసక్తి చూపుతున్నారు. అధిక వడ్డీలకు నగదు తెచ్చి మరీ స్టాక్ మార్కెట్లో పెట్టి నష్టపోతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దాన్నుంచి బయటపడే మార్గం లేక కుటుంబంతో సహా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేట గ్రామంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ట్రేడింగ్‌లో తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించవచ్చనే ఉద్దేశంతో అప్పుతెచ్చి, పెట్టుబడులు పెడితే.. అనుభవరాహిత్యం కాటేసింది. రూ.30 లక్షలు ఆవిరైపోయాయి. నెలకు 5 నుంచి 10 రుపాయలకు వడ్డీకి తెచ్చిన మొత్తాన్ని తిరిగి చెల్లించలేక.. అప్పుల వారి వేధింపులు తాళలేక ఓ నిండు కుటుంబం శీతల పానీయంలో పురుగు మందు కలుపుకొని తాగి, ఆత్మహత్యకు పాల్పడింది. షేర్ మార్కెట్, ఆన్‌లైన్ గేమ్స్ కారణంగా మంచిర్యాల జిల్లాలో ఏడాది కాలంలో పది మంది ఆత్మహత్యలకు పాల్పడడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి విపత్కర పరిస్థితులను నివారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
ఎంతో చరిత్ర ఉన్న, వంద శాతం చట్టబద్ధమైన స్టాక్ మార్కెట్‌ను కూడా జూదం గా భావించడ వల్లే ఇంత పెద్ద ప్రమాదం చోటుచేసుకుంటుంది. స్టాక్‌మార్కెట్ అనేది పూర్తి అవగాహనతో కూడిన ఒక తెలివైన క్రయవిక్రయసాధనం. దీనిని కూడా ఒక వ్యాపారంగా భావించి, పూర్తి సన్నద్ధతతో నిర్వహిస్తేనే లాభాలు సాధ్యమవుతాయి.
ఏటా రూ.60,000 కోట్ల మేర నష్టం
Annual loss of Rs.60,000 crores
స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్, ఆప్షన్స్ (ఎఫ్‌ఎండ్) ట్రేడ్ చేస్తూ దేశంలోని అనేక కుటుంబాలు ఏటా రూ.60,000 కోట్ల మేర నష్టపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 90శాతం ఎఫ్‌ఎండ్ ఓ లావాదేవీలు మదుపరులకు నష్టాలే మిగులుస్తున్నాయి. ఇంత నష్టముప్పుతో కూడిన ఈ నిష్పత్తి కొన్నేళ్లుగా రిటైల్ ఇన్వెస్టర్స్ ప్రాతిపదికన పెరగడం కలవరపాటుకు గురిచేస్తోంది. 2022-23లో 65 లక్షల మంది చిన్న మదుపరులు ఎఫ్ అండ్ వో ట్రేడ్ చేశారు. 2023-24లో ఆ సంఖ్య 95.7 లక్షలకు చేరింది. అయితే, వీరిలో చాలామందికి స్టాక్ మార్కెట్‌పై సరైన అవగాహన లేదు. పైగా మార్కెట్లో అనూహ్యంగా వచ్చిపడే కుదుపులకు తట్టుకొని నష్టాలను తగ్గించుకునే సామర్థ్యమూ కొరవడుతోంది.
అనేక కారణాలు
Many factors
చాలా కుటుంబాలు స్టాక్ మార్కెట్లు, ఆన్‌లైన్ గేమింగ్స్‌లోకి దిగడానికి కారణం దురాశ ఒకటే కారణం కాదు. ఇంకా అనేక అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ రమ్మీ, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ ను కలిపి చూడలేం. అయితే ఈ మూడింట్లో చాలామంది మోసపోతున్నారు కాబట్టి.. ఇక్కడొక విషయం గుర్తించాలి. స్టాక్ మార్కెట్ అనేది ఒక లీగల్ ప్రాసెస్. బెట్టింగ్ అనేది జూదం లాంటింది. మరోవైపు క్విక్ మనీ కల్చర్ కు చాలామంది అలవాటు పడుతుండడం వల్ల అనేక అనర్ధాలు జరుగుతున్నాయి. కష్టపడి సంపాదించడం మానేసి.. రాత్రికి రాత్రి కుబేరుడు కావాలనుకోవడం తప్పు. కష్టపడి సంపాదించడానికి మార్గాలు తక్కువగా ఉన్నాయని అవగాహన లేకుండా స్టాక్ మార్కెట్లు, ఆన్‌లైన్ గేమింగ్స్‌లోకి దిగడం శ్రేయస్కరం కాదు. ఇందులో నెగ్గుకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అందరూ ఆ స్థాయిలో సంపాదించలేరు . ఉదాహరణకు స్టార్టప్‌లే చూసుకుందాం. మనం ఏదైనా స్టార్టప్ పెట్టి యూనికార్న్ అయిన వాళ్ళని చూస్తాం. 100 స్టార్టప్ లు పెడితే 10 స్టార్టప్ లు అడ్రస్ లేకుండా కూడా పోతాయి. ఆ స్టెబిలిటీ, ఆ సోషల్ సెక్యూరిటీ ఉన్నవాళ్ళు చాలా తక్కువమంది ఉన్నారన్న విషయాన్ని గుర్తించాలి.
వేర్ టు స్టాప్ అని తెలియాలి
Know where to stop
క్విక్ మనీ కల్చర్ కు అలవాటు పడిన వారు తెలిసో తెలియకో, ఏదో ఆకర్షణతోనో, పక్కవాడి ప్రోద్బలంతోనో ఈ స్టాక్ మార్కెట్లు, ఆన్‌లైన్ గేమింగ్స్‌లోకి ఎంటర్ అవుతారు. ఎప్పుడు ఎంటర్ అవుతారు అన్నది మన చేతిలో ఉండవచ్చు. కానీ ఎప్పుడు బయటికి వస్తామన్నది కూడా తెలియాలి. వేర్ టు స్టాప్ అని తెలియాలి. ఏ వ్యసనానికి అలవాటు పడిన వారైనా వేర్ టు స్టాప్ అన్నది తెలియకుంటే తీవ్ర అనర్థాలకు బలైపోకపత్పదు.
స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్.. Speculative investment
ప్రభుత్వాలు కూడా సామాన్య, మధ్యతరగతి వర్గాలకు న్యాయం చేయడం లేదు. కష్టపడి సంపాదించి సేవింగ్స్ చేస్తున్న వారికి వడ్డీ రేట్లు తగ్గించేస్తున్నారు. ఉదాహరణకు పోస్టల్ సేవింగ్స్ చూసుకుంటే వడ్డీ రేట్లు ఎంత తగ్గాయో చూడొచ్చు. బ్యాంక్ డిపాజిట్ వడ్డీ రేట్లు కూడా బాగా తగ్గిపోయాయి. మరోవైపు రూ. 10000 దాటితే ఇంట్రెస్ట్ పై కూడా ఇన్కమ్ టాక్స్ పడుతుంది. దీంతో ప్రజలు స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్ వైపుగా నెట్టివేయబడుతున్నారు. పెద్ద పెద్ద క్యాపిటలిస్టులకు ప్రజల నుంచి డబ్బు మొబిలైజ్ కావాల్సి ఉంది. ఇలా చేయకపోవడం వల్ల సేవింగ్స్ నుంచి స్టాక్ మార్కెట్ వైపుగా ప్రజలను ప్రభుత్వ విధానాలు డైవర్ట్ చేస్తున్నాయి .
వేరే మార్గాలకు మళ్లిస్తే
ఎఫ్ఎండ్ వో ట్రేడ్లో పెట్టే డబ్బులు దీర్ఘకాల పెట్టుబడిగా ఉపయోగపడవు. ఈ సొమ్మును మ్యూచువల్ ఫండ్లు, డిపాజిట్లు, బంగారం, స్థిరాస్తి వంటి పెట్టుబడి మార్గాలకు మళ్లించడం మేలు. దానివల్ల వారితో పాటు దేశార్థికానికీ ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ఉంది. 2047 కల్లా 30 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే లక్ష్యంతో దేశం ముందుకెళ్తుంది. అలాంటప్పుడు మదుపరులు పెట్టుబడిగా పెట్టే ప్రతి పైసా వారికి మంచి ప్రతిఫలాన్ని తెచ్చి పెట్టాలి. అప్పుడు ఆర్థిక వ్యవస్థ వృద్ధితో పాటు వారి సంపదా పెరుగుతుంది. ప్రభుత్వం కూడా చిన్న మదుపరుల్లో ఈ విషయంపై అవగాహన కల్పించాలి. నియంత్రణపరంగా చర్యలు చేపడుతూనే, వారిని చైతన్యపరచే కార్యక్రమాల మీద సెబీ దృష్టి సారించాలి.