
ప్రపంచ ధనవంతుడైన, ఆసియా నెంబర్ వన్ గౌతమ్ అదానీ వ్యాపార ఎదుగుదలపై ఇటీవల మనం ఎన్నో ఆరోపణలు, వార్తలు విన్నాం. అత్యంత వేగంగా ధనవంతుడైన అదానీ కేవలం ప్రభుత్వ సహకారంతోనే ఇంతలా వ్యాపార విస్తరణ చేస్తున్నాడని దేశంలో ప్రతిపక్షాలు, ఆర్థిక నిపుణులు ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే ఇందులో నిజానిజాలు ఏమిటో, వాస్తవాలు ఏమిటో అనే సందే హం అందరిలోనూ ఉంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్ అదానీ కంపెనీపై సంచలన రిపోర్ట్ తయారు చేసింది. సంస్థలో జరుగుతున్న ఎన్నో నిజాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ప్రపంచ ధనవంతుడిగా ఎదుగుతున్న గౌతమ్ అదానీ అనుసరిస్తున్న స్ట్రాటజీ లోని లోపాలను బయటపెట్టింది. దీంతో ఇండియాలోని ఇన్వెస్టర్లు, అదానీ కంపెనీలకు అప్పులు ఇచ్చిన బ్యాంకులు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ఇండియన్ స్టాక్‌మార్కెట్ కూడా తీవ్ర ఆటుపోట్లకు లోనయ్యింది.
గౌతమ్ అదానీ ప్రపంచ ధనవంతుల్లో 3వ స్థానంలో ఉన్న వ్యక్తి.
2014లో 17వేల కోట్ల ఉన్న ఆస్తిని 2023 నాటికి రూ.10 లక్షల కోట్ల రూపాయిలకి చేర్చిన మేధావి.
ఇందులో గొప్ప విషయం ఏమిటంటే 3 సంవత్సరాలలోనే రూ.8 లక్షల కోట్ల విలువైన ఆస్తులను సంపాదించారు. అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ 120 బిలియన్ డాలర్స్. ఇందులో 100 బిలియన్ డాలర్స్ ఈ 3 సంవత్సరాల్లో వచ్చినవే. ఇలా సంపాదించడం ఒక్క అదానీకి తప్ప మరెవ్వరికీ సాధ్యంకాని పని.
1988 లో అదానీ ఎంటర్‌ప్రైజస్ ను గౌతం అదానీ ప్రారంభించారు. మామూలు వ్యాపారవేత్తగా ఉన్న అదానీ 2014 వరకూ ఎవ్వరికీ పెద్దగా తెలియదు. కనీస ఇండియా రిచ్ లిస్ట్‌లో కూడా అదానీ పేరు లేదు. కానీ అమాంతం 8 ఏళ్లలో ఇండియా నెంబర్ వన్ రిచెస్ట్ పెర్సన్, ఆసియా రిచెస్ట్ పెర్సన్ నుంచి ప్రపంచ ధనవంతులలో 3 వ స్థానానికి ఎదిగాడు. ఈ ఎదుగుదల కరోనా తర్వాత పరుగులు పెట్టిందనే చెప్పవచ్చు.
అదానీకి ఎలా సాధ్యమైంది
How is it possible for Adani
ప్రపంచ కుబేరులలో ముఖేష్ అంబానీ కూడా ఒకరు. అతనికి రిలయన్స్ కంపెనీ ఉంది. పెట్రోల్ బంకులు, జియో ఫోన్లు ఉన్నాయి. రతన్ టాటాకు కూడా ఉప్పు నుంచి ఉక్కు వరకు అనేక కంపెనీలు ఉన్నాయి. అవన్నీ కంటికి కనిపిస్తున్నాయి. మరి గౌతమ్ అదానీ కంపెనీల్లో ఇలాంటి పేరున్న ప్రోడక్ట్స్ ఏవీ లేవు. మరి ఆదాయం ఎలా వస్తుంది.? అతని దగ్గర ఉన్న కొన్ని కంపెనీలతో ప్రపంచ కుబేరులు ఎలా అయ్యారో అన్నదే పెద్ద ప్రశ్న.
3 సంవత్సరాలలో రూ.8లక్షల కోట్లు సంపాదించడం అసాధ్యమని అందరికీ తెలుసు. అందుకే అదానీ గ్రూప్ షేర్స్ ఎందుకు అంత పెరుగుతున్నాయో అన్న విషయం పై అమెరికాకి చెందిన హిండెన్ బర్గ్ సంస్థ కన్నేసింది. అదానీ లెక్కలు అంతుపట్టడానికి రెండేళ్ళు ఈ సంస్థ కష్టపడింది. అనుమానస్పదంగా కనిపించిన ప్రతి అంశాన్ని పట్టుకుని దానికి ఆధారాలు సంపాదించింది. అరడజన్ దేశాలకు పైగా సెర్చ్ చేసింది.
అదానీ గ్రూప్ కంపెనీలలో పనిచేసిన మాజీ ఉన్నత ఉద్యోగులతో పాటు సీనియర్ ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడింది. వాళ్ళచ్చిన సమాచారంతో వేలాది డాక్యుమెంట్లను పరిశీలించింది. ఫైనల్ గా ఒక రిపోర్ట్ ఇచ్చింది.
హిండెన్ బర్గ్ రిపోర్ట్‌లో ఏముంది..?
What is in the Hindenburgh report
అదానీ గ్రూప్ పనితీరుపై హిండెన్‌బర్గ్ మొత్తం 88 ప్రశ్నలను సంధించింది. ఎన్నె అవకతకవలపై నిలదీసింది. వాటిలో కొన్నింటిని ఇక్కడ చూద్దాం.
* పన్ను ఎగవేత దారులకు ట్యాక్స్ అలవెన్స్ గా పిలుచుకునే మారిషస్, సైప్రస్, కరేబియన్ ఇల్యాండ్స్, యునైటెడ్ అరబ్స్ ఎమిరేట్స్ దేశాల్లో అదానీ గ్రూప్ కొన్ని డొల్ల కంపెనీలు పెట్టింది. వాటి అడ్రస్సులు వెతికి పట్టుకున్న హిండెన్ బర్గ్ సంస్థ స్వయంగా ఆ కంపెనీలకు వెళ్లి వచ్చింది. అడ్రస్సు తప్ప అక్కడ మనుషులు లేరు. అక్కడ ఎలాంటి ఏక్టివిటీస్ జరగడం లేదని తెలుసుకుంది. కేవలం అదానీ గ్రూప్ ప్రమోటర్ల అవినీతి, మనీల్యాండరింగ్, గ్రూప్ లిస్టెడ్ కంపెనీల లాభాలను దారి మళ్లించేందుకు డొల్ల కంపెనీలు పెట్టినట్లు హిండెన్ బర్గ్ తన రిపోర్ట్ లో నిరూపించింది.
* డమ్మీ కంపెనీలలో ఏం జరుగుతుందో అన్న అసలు విషయం బయటపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో హిండెన్ బర్గ్ కూపీ లాగింది. ఈ దందా కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతుందని తెలిపింది.
* అదానీ గ్రూప్‌లోని ఏడు కంపెనీలపై హిండెన్ బర్గ్ క్లియర్ రిపోర్ట్ ఇచ్చింది. ఏడు లిస్టెడ్ కంపెనీల్లో 5 కంపెనీల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని తెలిపింది.
* అదానీ గ్రూప్ కంపెనీల్లో 22మంది డైరెక్టర్లలో 8మంది గౌతమ్ అదానీ ఫ్యామిలీ మెంబర్స్ కావడంతో కీలక నిర్ణయాలన్నీ కుటుంబ సభ్యుల చేతుల్లోనే జరిగాయి. ఇది తీవ్ర అభ్యంతరకరమైన విషయంగా ప్రస్తావించింది.
* అక్రమంగా రూ.1700కోట్లు డాలర్లు కాజేశారని ఆరోపణలపై అదానీ కుటుంబ సభ్యులపై ఏకంగా 4 సార్లు దర్యాప్తు జరిగింది.
* ఫోర్జరీ మోసాలపై అదానీ సోదరుడు రెండు సార్లు అరెస్ట్ అయ్యారు.
* వజ్రాల ఎగుమతి, దిగుమతి అక్రమాలపై అదానీ బావ సమీర్ వోరా పాత్రపై గతంలో దర్యాప్తు జరిగింది.
* గౌతమ్ అదానీ అన్న వినోద్ అదానీ విదేశాల్లో 38 సెల్ కంపెనీలు ఏర్పాటు చేశారని ఆరోపణలు ఉన్నాయి. విదేశాల్లో సొంత డొల్ల కంపెనీల ద్వారా 7 లిస్టెడ్ కంపెనీల షేర్లలో 90 శాతానికి పైగా పెట్టుబడులు పెట్టారని చెప్పింది.
* గుజరాత్ కి చెందిన స్టాక్ బ్రోకర్ కేతన్ పరేఖ్ తోనూ పరోక్ష సంబంధాలు ఉన్నాయి.
* అదానీని 3వ ప్రపంచ కుబేరునిగా మార్చిన కంపెనీలకు పెద్దగా ఊరు, పేరు లేని వ్యక్తులు ఆడిటర్లుగా ఉండడం అనుమానస్పదంగా మారింది.
* ఏడు లిస్టెడ్ కంపెనీలలో పబ్లిక్ ఇన్వెస్టర్ల పేర్లను అదానీ గ్రూప్ బయటపెట్టకపోవడం… ఇలా మొత్తంగా ఏడు కంపెనీలకు సంబంధించి కీలక వివరాలు బయటపెట్టింది హిండెన్ బర్గ్. ఈ ఒక్క విషయంతో అదానీ గ్రూప్ కంపెనీలు రూ. 50వేలు కోట్ల రూపాయిలు మార్కెట్ క్యాప్ కోల్పోయింది.
హిండెన్ బర్గ్ సంస్థకు ఉన్న క్రెడిబులిటీ ఏమిటి
What is the credibility of Hindenburg’s organization
ఇంటర్నేషన్ బిజినెస్‌లో డిగ్రీ చేసిన నాథన్ అండర్సన్ న్యూయార్క్‌లో 2017 వ సంవత్సరంలో ఫోరెన్సిక్ ఫైనాన్షియల్ రీసెర్చ్ సంస్థ పెట్టుకున్నాడు. ఆ సంస్థ పేరే హిండెన్ బర్గ్. కంపెనీల ఈక్విటీలు, డెరివేటివ్ ల గురించి డీప్ ఎనాలసిస్ చేస్తుంది ఈ సంస్థ. సూపర్ అనే చెప్పుకున్న కంపెనీలే హిడెన్ బర్గ్ టార్గెట్. వీటిలో ఏమైనా అకౌంటింగ్ ఇర్రెగ్యూలారిటీస్, మిస్ మేనేజ్ మెంట్స్, అన్ డిస్ క్లోజ్డ్ ట్రాన్జాక్షన్స్ ఉన్నాయా అనే దానిపై స్టడీ చేస్తుంది ఈ సంస్థ. ఎన్నో కంపెనీలలోని లోపాలను బయటపెట్టింది ఈ సంస్థ.
2020 సెప్టెంబర్ లో ఎలక్ట్రిక్ ట్రక్కు తయారు చేసే నికోలా కార్పోరేషన్ పై ఒక రిపోర్ట్ బయటపెట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తమ ట్రక్కులు హై స్పీడ్ తో వెళ్తాయంటూ నికోలా కంపెనీ ఇచ్చిన స్లోగన్ ను హిండెన్ బర్గ్ ఛాలెంజ్ చేసింది. ఆ ట్రక్కుల సత్తా ఎంత అనే విషయం పై స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ దెబ్బకు నికోలా స్టాక్ పడిపోయింది. 2020లో 34 బిలియన్ డాలర్స్ ఉన్న నికోలా కంపెనీ నెట్ వర్క్ హిండెన్ బర్గ్ రిపోర్ట్ తర్వాత 1.34 బిలియన్ డాలర్లకి దిగిపోయింది. అప్పుడు నికోలా కంపెనీ తప్పుడు స్టేట్ మెంట్ ఇచ్చామని ఒప్పుకుంటూ యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్స్ కి 125 మిలియన్ డాలర్ల ఫైన్ కట్టింది.
2017 నుండి 16 కంపెనీలు టార్గెట్ చేసి వాటిని పబ్లిక్ గా నిలబెట్టింది.
హిండెన్ బర్గ్ పరిశోధన మొదలుపెట్టిందంటే దాని లోతుతో పాటు దాని లోటుపాట్లను కూడా విడమరిచి చెబుతుంది. ఈ సంస్థ చెప్పే నిజంతో పాటు పక్కా ఆదారాలు పెడుతుంది. అందుకే అదానీ ఇన్వెస్టర్స్ షేక్ అవుతున్నారు.
అమెరికా సంస్థ ఇన్వెస్ట్ చేసేదాకా అదానీ గ్రూప్ మోసాన్ని ఇండియా మీడియా కనిపెట్టలేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
నిజానికి అదానీ గ్రూప్ లో పెద్ద దందా జరుగుతుందని జర్నలిస్ట్ సుచేతా దలాల్ గతంలో ధైర్యంగా ట్వీట్ చేశారు.
గౌతమ్ అదానీల కంపెనీలపై ఆరోపణలు చెయ్యాలంటే ఘట్స్ మాత్రమే కాకుండా తేడా వస్తే లీగల్ గా బారీ మూల్యం చెల్లించవలిసి వస్తుంది. అయినా సరే హిండెన్ బర్గ్ ధైర్యం చేసిందంటే అందులో ఎంతో కొంత నిజం ఉంటుందని నమ్మతున్నారు. వేలాది డాక్యుమెంట్స్ సంపాదించిన హిండెన్ బర్గ్ అదానీ డైరెక్టర్స్, ఆ కంపెనీ ఉన్నత ఉద్యోగులపై స్టింగ్ ఆపరేషన్ కూడా చేసినట్లు తెలుస్తుంది.
అదానీ గ్రూప్ అప్పులు ఎలా చేస్తుందో తెలుసుకుందాం
Let’s know how Adani Group makes loans
2015-16లో అదానీ ప్రోపర్టీస్ అనే సంస్థ అదానీ ట్రాన్సమిషన్ లో 9.05 శాతం వాటా కొనేసింది.
అసలు ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ట్రాన్సమిషన్ లో వాటా ఎందుకు కొన్నది అనే విషయం ఇప్పటికీ తెలియలేదు. కానీ రెండు సంవత్సరాల తర్వాత దానికి సమాధానం దొరికింది. 2 సంవత్సరాల తర్వాత అదానీ ట్రాన్సమిషన్ ధరలు విపరీతంగా పెరిగాయి. 2015లో రూ.27 ఉన్న అదానీ ట్రాన్సమిషన్ షేర్ రెండేళ్ళలోనే రూ.126 కి పెరిగింది. రూ.100 కోట్ల పెట్టుబడికి రూ.400 కోట్లు వచ్చాయి. ఏం చేయకుండానే అదానీ ప్రోపర్టీస్ ఎక్కువ లాభాన్ని పొందింది. ఈ లాభాన్ని చూపించి అందులో వాటాలను అమ్మి ప్రోజెక్ట్ లకు కావలిసిన నిధులు సమకూర్చుకుంది. 6 నెలల్లో రూ. 2లక్షల కోట్ల సంపద పెరగడం గౌతమ్ అదానీకి మాత్రమే సాధ్యమైన విషయం.
* అదానీ గ్రూప్ సుమారు రెండు లక్షల కోట్లు రూపాయలను మొత్తం అప్పుచేసింది. ఇండియాలోని అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలను అప్పుల కోసం వాడుకుంది. ఒక్క ఎల్ ఐ సీ సంస్థే సుమారు 80 వేల కోట్ల రూపాయలను అదానీ గ్రూప్లో పెట్టుబడిగా పెట్టింది. అంటే ఒకవేళ అదానీ గ్రూప్ పతనమైతే బ్యాంకులు, ఆర్థిక సంస్థలన్నీ తీవ్ర నష్టాలను చూడాల్సి వస్తుంది.
* 2022 ఫిబ్రవరి వరకు అదానీ ఆస్తులు విలువ రూ. 4.30 లక్షల కోట్లు. 6 నెలల్లో దానిని 6లక్షల 60 వేల కోట్లకు పెంచేశారు. గౌతమ్ అదానీ 5 లేదా 6 సంవత్సరాలలోనే బాగా డెవలప్ అయ్యారు. ఎయిర్ పోర్ట్, సీ పోర్ట్, కోల్, పవర్, అల్యూమినియం, సిమెంట్ తో పాటు మీడియా రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. త్వరలోనే 5జీ నెట్ వర్క్ రంగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 4 ఏళ్ళ క్రితం అదానీ ఎయిర్ పోర్ట్ రంగంలో లేదు. కానీ ప్రస్తుతం భారత్ కి వచ్చే విమాన ప్రయాణికుల్లో 25 శాతం అదానీ పోర్ట్ లలో దిగుతున్నారు.
* ఇక్కడ ప్రడిక్ట్ సైట్స్ అనే సంస్థ అదానీ గ్రూప్ కంపెనీలు ఏవీ సొంత పెట్టుబడితో రావడం లేదని, బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తుందని చెప్పింది. దీనినే బ్యాంకింగ్ లాంగ్వేజ్ లో ఓవర్ లిబరేట్ అంటారు. ఒక వేళ అదానీ కంపెనీలు నష్టాల్లో ఉంటే ఆ అప్పుల భారం బ్యాంకులపై పడుతుంది. ఇప్పుడు అదానీ గ్రూప్ లో ఏ కంపెనీ అయిన డీఫాల్ట్ అయితే అప్పుడు బ్యాంకింగ్ రంగమే కుప్పకూలే ప్రమాదముంది.
చివరిగా హిండెన్ బర్గ్ రిపోర్ట్ తర్వాత అదానీ గ్రూప్ ఇక ఆగమవడం ఖాయం అంటున్నారు. షేర్ల ప్రైస్ కొలాప్స్ అవ్వడం. లక్షల కోట్ల ఆవిరి అవ్వడం ఎంతో దూరంలో లేదంటున్నారు.
హిండెన్ బర్గ్ రిపోర్ట్ దెబ్బకు లక్ష కోట్ల మార్కెట్ క్యాప్ కోల్పోయింది అదానీ కంపెనీ.