Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN FEATURE NEWS
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters! FEATURE NEWS
  • చిన్న పెట్టుబడి… పెద్ద ఫలితం ! రూ.22 ల‌క్షల పెట్టుబ‌డికి రూ.49 లక్ష‌ల వ‌డ్డీ! సుకన్య సమృద్ధి పథకంలో సాధ్యమేనా? Small Investment… Big Gains! ₹22 Lakh Investment Yields ₹49 Lakh Interest – Is It Possible with Sukanya Samriddhi Scheme? FEATURE NEWS

మ్యూచువల్‌ ఫండ్ సంస్థ‌లు వ‌సూలు చేసే రుసుములకు క‌ళ్లెం.. A Check on the Fees Charged by Mutual Fund Companies

Posted on 30/10/2025 By admin No Comments on మ్యూచువల్‌ ఫండ్ సంస్థ‌లు వ‌సూలు చేసే రుసుములకు క‌ళ్లెం.. A Check on the Fees Charged by Mutual Fund Companies

మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడిదారులకు శుభవార్త. ఫండ్‌ సంస్థలు వసూలు చేసే సర్వీస్‌, మేనేజ్‌మెంట్‌ ఛార్జీలను తగ్గించాలని మార్కెట్‌ నియంత్రణ సంస్థ SEBI ఆదేశించింది. దీని వల్ల చిన్న, మధ్యస్థ ఇన్వెస్టర్లకు గణనీయమైన లాభం చేకూరనుంది. మ్యూచువల్‌ ఫండ్‌ అంటే రిస్క్‌ ఉన్న పెట్టుబడి .కానీ ఇప్పుడు పారదర్శకతతో మరింత నమ్మకంగా మారబోతోంది. ఇక‌పై మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ఇన్వెస్టర్ల డబ్బుతో ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టే రోజులు పోయాయి. సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (SEBI) తాజా మార్గదర్శకాలు విడుదల చేస్తూ, ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల ఖర్చులపై కఠిన పరిమితులు విధించింది. ఫండ్‌ హౌస్‌లు ప్రచారాలు, కమిషన్‌లు, మేనేజ్‌మెంట్‌ ఫీజులు పేరుతో వసూలు చేస్తున్న మొత్తం (TER – Total Expense Ratio) ఇన్వెస్టర్ల రాబడిపై ప్రభావం చూపుతుందని SEBI గుర్తించింది. ఈ నేపథ్యంలో కొత్త నిబంధనల ప్రకారం ఖర్చులను మరింత పారదర్శకంగా చూపించాలని ఆదేశించింది.

కొత్త గైడ్‌లైన్స్‌ ప్రకారం.. As per the New Guidelines

ఈక్విటీ ఫండ్‌లపై గరిష్ఠ TER 2.25% కంటే ఎక్కువ వసూలు చేయరాదు.

డెబ్ట్‌ ఫండ్‌లకు 2% లోపే ఉండాలి.

అదనపు డిస్ట్రిబ్యూషన్‌ కమిషన్‌లు నిషేధం.

ఇన్వెస్టర్లకు లాభమే.. A Boon for Investors

సెబీ నిర్ణయం వల్ల ప్రతి ఇన్వెస్టర్‌కు లాభం చేకూరుతుంది. ఫండ్‌ రాబడిపై అనవసర ఖర్చుల భారం తగ్గుతుంది. దీర్ఘకాలంలో లాభాలు మరింత మెరుగ్గా కనిపిస్తాయి. అని నిపుణులు చెబుతున్నారు. ఇకపై ప్రతి ఫండ్‌ సంస్థ తమ ఖర్చు వివరాలను త్రైమాసిక ప్రాతిపదికన వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా వెల్లడించాలి. SEBI సమయానుకూల ఆడిట్లు నిర్వహించనుంది. కొన్ని సంస్థలు మాత్రం ఈ నిబంధనల వల్ల తమ ఆపరేషనల్‌ ఖర్చులు పెరిగి లాభాలు తగ్గుతాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ “ఇన్వెస్టర్ల ప్రయోజనం ముందు… లాభాలు తర్వాత!” అని SEBI స్పష్టం చేసింది .

ఛార్జీల తగ్గింపుతో ఊరట! Relief Through Reduced Charges!

గత కొంతకాలంగా మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలు “టోటల్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియో (TER)” పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయన్న ఫిర్యాదులు పెరిగాయి. ఈ నేపథ్యంలో SEBI సమీక్ష చేపట్టి, ఫండ్‌ సంస్థలు విధించే ఛార్జీలను తగ్గించే నిర్ణయం తీసుకుంది.

కొత్త పరిమితులు.. New Limits

ఈక్విటీ ఫండ్‌లపై గరిష్ఠ ఛార్జీ 2.25% నుంచి 2% కు తగ్గింపు.

డెబ్ట్‌ ఫండ్‌లపై 1.75% లోపే వసూలు చేయాలి.

డిస్ట్రిబ్యూటర్‌ కమిషన్‌లపై కూడా నియంత్రణలు విధించారు. ఉదాహరణకు ₹1 లక్ష పెట్టుబడిపై 0.25% ఛార్జీ తగ్గితే, సంవత్సరానికి సుమారు ₹250–₹300 వరకు నేరుగా ఆదా అవుతుంది. దీర్ఘకాలంలో ఈ తేడా వేల రూపాయలుగా మారుతుంది.

SEBI స్పష్టమైన హెచ్చరిక.. SEBI’s Clear Warning

ఫండ్‌ సంస్థలు ఈ మార్గదర్శకాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని SEBI హెచ్చరించింది. ప్రతి ఫండ్‌ హౌస్‌ తమ ఖర్చులను పారదర్శకంగా వెబ్‌సైట్‌లో ప్రకటించాలి అని ఆదేశించింది. “ఛార్జీల తగ్గింపుతో ఇన్వెస్టర్ల రాబడులు మరింత మెరుగ్గా కనిపిస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు ఆకర్షణీయంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు.

టీఈఆర్‌ పారదర్శకంగా .. TER Made Transparent

ఫండ్‌ సంస్థలు వసూలు చేసే టోటల్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియో (TER) వివరాలను పూర్తిగా పారదర్శకంగా ప్రకటించాలని సెబీ ఆదేశించింది. వాస్త‌వంగా ఇప్పటి వరకు చాలా ఫండ్‌ సంస్థలు TER వివరాలను స్పష్టంగా చూపించకపోవడంతో ఇన్వెస్టర్లు గందరగోళానికి గురయ్యేవారు. ఇకపై ప్రతి ఫండ్‌ హౌస్‌ ప్రతి త్రైమాసికం తమ TER రేట్లు, మార్పులు, ఖర్చు విభజన వివరాలను వెబ్‌సైట్‌లో స్పష్టంగా ప్రకటించాలి.

ఏం ఉంటుంది TERలో? What Does TER Include?

ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ ఫీజులు, మార్కెటింగ్‌ ఖర్చులు, డిస్ట్రిబ్యూషన్‌ కమిషన్‌లు .. ఇవన్నీ కలిసి ‘టోటల్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియో’. ఈ రేటు ఎక్కువైతే, ఇన్వెస్టర్‌ రాబడి తగ్గుతుంది. అందుకే SEBI ఇప్పుడు ఈ ఖర్చులను పూర్తిగా పబ్లిక్‌గా ప్రకటించాలని నిర్దేశించింది. TER వివరాలు స్పష్టంగా తెలిసినప్పుడు ఇన్వెస్టర్లు ఫండ్‌లను సరిపోల్చి చూసి నిర్ణయం తీసుకోవచ్చు. తక్కువ TER ఉన్న ఫండ్‌లో పెట్టుబడి పెడితే రాబడులు స్వయంగా పెరుగుతాయి. ఇకపైన ఖర్చులను దాచడం, మార్పులు చేయడం కష్టమే. ఇన్వెస్టర్‌ డబ్బు, ఇన్వెస్టర్‌కే ఇవ్వాలి అనే దిశగా SEBI అడుగు వేసింది.

TER అంటే.. What Is TER?

TER = (మొత్తం వార్షిక ఖర్చులు ÷ మొత్తం ఫండ్‌ ఆస్తులు) × 100. ఉదాహరణకు… మీరు ₹1,00,000 మ్యూచువల్‌ ఫండ్‌లో పెట్టుబడి పెట్టారని అనుకుందాం. ఆ ఫండ్‌ యొక్క TER 1.5% అయితే, సంవత్సరానికి ₹1,500 ఖర్చుగా తీసుకోబడుతుంది. అంటే మీరు చూసే రాబడి ఇప్పటికే ఆ ఖర్చును తీసేసి లెక్కించబడుతుంది.

ఎక్కువ TER అంటే? What Does a Higher TER Mean?

TER ఎక్కువగా ఉంటే ఫండ్‌ ఖర్చులు ఎక్కువ – రాబడి తక్కువ.
TER తక్కువగా ఉంటే ఫండ్‌ ఖర్చులు తక్కువ – రాబడి ఎక్కువ.
అందుకే ఇన్వెస్టర్లు ఎప్పుడూ ఫండ్‌ రాబడులకంటే ముందు TER కూడా తప్పక పరిశీలించాలి.

టీఈఆర్‌ తగ్గితే ఇన్వెస్టర్లకు లాభం ఎంతంటే? How Much Do Investors Gain When TER Drops?

మ్యూచువల్‌ ఫండ్‌లలో పెట్టుబడి పెడుతున్న వారు తరచుగా రాబడుల శాతం (returns)పైనే దృష్టి పెడతారు. కానీ ఫండ్‌ ఖర్చులు అంటే టోటల్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియో (TER) కూడా పెట్టుబడి లాభాలను నేరుగా ప్రభావితం చేస్తాయని చాలా మంది మరిచిపోతారు. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్‌ ₹1,00,000ను 10 సంవత్సరాలకు మ్యూచువల్‌ ఫండ్‌లో పెట్టారని అనుకుందాం. రాబడి రేటు 12% (గ్రాస్ రిటర్న్‌) , ఫండ్‌ ఖర్చు (TER) 1.5% ఉంటే
నికర రాబడి 10.5% అవుతుంది. 10 సంవత్సరాల తర్వాత విలువ = ₹1,00,000 × (1 + 10.5%)¹⁰ = ₹2,71,000 ఇప్పుడు అదే ఫండ్‌ లో TER తగ్గి 1% మాత్రమే అయితే నికర రాబడి 11% అవుతుంది. అప్పుడు దాని విలువ
₹1,00,000 × (1 + 11%)¹⁰ = ₹2,83,000 అవుతుంది. 0.5% TER తేడా వల్ల ₹12,000 అదనపు లాభం. దీర్ఘకాల పెట్టుబడిపై అయితే మరింత ప్రభావం ఉంటుంది. ₹5 లక్షల పెట్టుబడి 20 సంవత్సరాలకు TER 1.5% నుంచి 1%కి తగ్గితే ఫలితంగా తేడా ₹1.3 లక్షల పైగా ఉంటుంది. అంటే, TER తగ్గితే ఇన్వెస్టర్‌ లాభం పెరుగుతుంది .

డైరెక్ట్‌ ప్లాన్‌ అంటే ఏమిటి? What Is a Direct Plan?

డైరెక్ట్‌ ప్లాన్‌ అనేది మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ వద్ద నేరుగా పెట్టుబడి పెట్టే విధానం. అంటే ఇక్కడ మధ్యవర్తులు (డిస్ట్రిబ్యూటర్లు, ఏజెంట్లు) ఉండరు. దీంతో వారి కమిషన్‌ ఖర్చు తొలగిపోతుంది .అంటే TER తక్కువగా ఉంటుంది.

రెగ్యులర్‌ ప్లాన్‌ అంటే? What Is a Regular Plan?

రెగ్యులర్‌ ప్లాన్‌లో మీరు ఏజెంట్‌ లేదా డిస్ట్రిబ్యూటర్‌ ద్వారా పెట్టుబడి పెడతారు. అందుకే ఫండ్‌ సంస్థ ఆ ఏజెంట్‌కి కమిషన్‌ చెల్లిస్తుంది. ఈ కమిషన్‌నే ఫండ్‌ ఖర్చులో (TER) చేర్చుతారు. అందుకే రెగ్యులర్‌ ప్లాన్‌ TER ఎక్కువగా ఉంటుంది.

ఉదాహరణకు.. For Example…

ఒక మ్యూచువల్‌ ఫండ్‌ డైరెక్ట్‌ ప్లాన్‌ TER 1%, అదే రెగ్యులర్‌ ప్లాన్‌ TER 1.75% అని అనుకుందాం. మీరు ₹1,00,000 పెట్టుబడి పెట్టి, 15 సంవత్సరాలు కొనసాగిస్తే డైరెక్ట్‌ ప్లాన్‌ రాబడి 11% రెగ్యులర్‌ ప్లాన్‌ రాబడి 10.25% మాత్రమే వస్తుంది. డైరెక్ట్‌ ప్లాన్‌ చివరికి ₹4.80 లక్షలు, రెగ్యులర్‌ ప్లాన్‌ చివరికి ₹4.37 లక్షలు వ‌స్తుంది. అంటే కేవలం ఖర్చు తేడా వల్ల ₹43,000 అదనపు లాభం పొందొచ్చు.

ఎవరికి డైరెక్ట్‌ ప్లాన్‌ సరైనది? Who Should Choose a Direct Plan?

మ్యూచువల్‌ ఫండ్‌లపై కొంత అవగాహన ఉన్నవారికి, స్వయంగా ఫండ్‌లను ఎంపిక చేసుకోగలవారికి, దీర్ఘకాల పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు డైరెక్ట్ ప్లాన్ ఉత్తమం. మీరు నేరుగా AMC (Asset Management Company) వెబ్‌సైట్‌లో
లేదా అధికారిక యాప్స్‌ / ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు.

 

318
FEATURE NEWS Tags:A Boon for Investors, As per the New Guidelines, For Example…, How Much Do Investors Gain When TER Drops?, New Limits, Relief Through Reduced Charges!, SEBI’s Clear Warning, TER Made Transparent, What Does a Higher TER Mean?, What Does TER Include?, What Is a Direct Plan?, What Is a Regular Plan?, What Is TER?, Who Should Choose a Direct Plan?

Post navigation

Previous Post: మీ జీతాన్ని 4 రెట్లు పెంచే రహస్యం! The Secret to Quadrupling Your Salary!
Next Post: అద్దె ఇల్లా.. సొంతిల్లా..? ఏది మంచిది? Which is Better – Renting or Owning a Home?

Related Posts

  • శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్ పొందొచ్చు..! అదెలాగో తెలుసుకుందాం! No Salary Slip? No Problem! Personal Loans Made Easy FEATURE NEWS
  • క్రెడిట్ కార్డు… వీళ్ల‌కి వ‌రం what are the benifits of credit cards FEATURE NEWS
  • 2024 సంవత్సరంలో Health insuranceలో మార్పులు తెలుసుకుందాం Let’s know the changes in health insurance in the year 2024 FEATURE NEWS
  • Tips to Clear your loans early రుణాలు త్వరగా తీర్చేందుకు చిట్కాలు FEATURE NEWS
  • పిల్ల‌ల పేరిట పొదుపుతో ప‌న్ను ప్ర‌యోజ‌నం FEATURE NEWS
  • బ్యాంకు ఖాతా ఫ్రీజ్ అయితే ఏం చేయాలో తెలుసా? Bank Account Frozen? Know What to Do Next FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ‘టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ జాగ్రత్త‌లు తీసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వ్‌! Things to Check Before Buying Term Insurance .. Or You May Face Trouble!
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters!
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • ఇక‌పై జ‌రిమానాతో పాన్- ఆధార్ లింక్‌ NEWS
  • కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్‌.. కార్పొరేట్ రంగం విలవిల.. IT కంపెనీలకు బిగ్ సవాల్ FEATURE NEWS
  • డిసెంబర్‌లో కీలక ఆర్థిక మార్పులు ఇవే.. Key Economic Changes Coming in December FEATURE NEWS
  • స్టాక్ మార్కెట్ కెరియ‌ర్‌ బాగుంటుందాcan i choose stock market as a carrier FEATURE NEWS
  • బీమా పాలసీల్లో ఉండే కొన్ని కీలక మినహాయింపులు తెలుసుకున్నారా! లేకుంటే న‌ష్ట‌మే! Do You Know the Key Exclusions in Insurance Policies? Ignore Them and You Could Pay a Heavy Price! INSURANCE
  • కొత్త కార్మిక చట్టాలు VS ఖర్చులు…! 2026లో ఇలా ప్లాన్ చేసుకోకపోతే నష్టపోతారు! New Labour Laws vs Rising Costs..! Fail to Plan This Way in 2026 — and You’ll Pay the Price! FINICAL PLANNING
  • ‘నో స్పెండ్‌ ఛాలెంజ్‌’ తో ఖర్చులకు బ్రేక్‌… Brake on Spending with the ‘No Spend Challenge’ MONEY TIPS
  • పోస్టాఫీస్ డెలివరీ సేవలలో కీలక మార్పులు.. ఇక నెక్ట్స్ డే డెలివరీ ! Key Changes in Post Office Delivery Services: Next-Day Delivery Now! FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme