జులై 1 నుంచి దేశవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేసే కీలక ఆర్థిక మార్పులు (Financial Changes from July 1) అమల్లోకి రానున్నాయి. ఆధార్ వివరాల అప్డేట్కు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పిస్తుండగా.. పాస్‌పోర్ట్ పొందాలంటే మాత్రం ఇకపై మరింత ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరోవైపు క్రెడిట్‌కార్డుల ద్వారా ఎక్కువగా డిజిటల్ చెల్లింపులు చేసే వారికి రివార్డు పాయింట్లలో కోత పడనుంది. ఎయిర్పోర్ట్ లాంజ్ సదుపాయాలకూ కొత్త అర్హతలు అమల్లోకి వస్తున్నాయి. ఇదే సమయంలో ఆదాయపు పన్ను రిటర్నుల గడువు కూడా సమీపిస్తోంది. ఇలా జులై నెల తొలి రోజే సామాన్యుడి నుంచి ఉద్యోగి, వ్యాపారి, విదేశాలకు వెళ్లే విద్యార్థి వరకు ప్రతి వర్గాన్నీ ప్రభావితం చేసే పలు మార్పులు అమల్లోకి రానున్నాయి.
ఆధార్ అప్డేట్కు ఆరు నెలలు ఉచితం.. Free Aadhaar Update
ఆధార్‌లో ఈ-మెయిల్ వివరాలను సవరించుకోవాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం(Financial Changes from July 1) శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు ఈ-మెయిల్ అప్డేట్కు రూ.75 రుసుము ఉండగా.. జులై 1 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు ఈ సేవను పూర్తిగా ఉచితంగా అందించనుంది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) మొబైల్ యాప్ ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. డిజిటల్ సేవలు, బ్యాంకింగ్, ప్రభుత్వ పథకాల ప్రయోజనాల కోసం ఆధార్‌కు సరైన ఈ-మెయిల్ అనుసంధానం ఉండటం అవసరమని అధికారులు సూచిస్తున్నారు.
పాస్‌పోర్ట్‌కు భారీగా పెరిగిన రుసుములు.. Passport Fees Hiked
విదేశాలకు వెళ్లాలనుకునే వారికి జులై 1 నుంచి అదనపు భారం (Financial Changes from July 1) తప్పదు. కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ ఫీజులను భారీగా సవరించింది. 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్‌కు ఇప్పటివరకు రూ.1,500 ఉండగా.. ఇకపై రూ.2,500 చెల్లించాలి. తత్కాల్ సేవకు రూ.3,500 బదులుగా రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. 60 పేజీల పాస్‌పోర్ట్ ఫీజు రూ.2,000 నుంచి రూ.3,500కు పెరిగింది. దీనికి తత్కాల్ సేవ పొందాలంటే రూ.6,000 చెల్లించాల్సి ఉంటుంది. 18 ఏళ్లలోపు పిల్లలకు జారీ చేసే పాస్‌పోర్ట్ ఫీజు కూడా రూ.1,000 నుంచి రూ.1,750కు పెంచారు. విదేశీ విద్య, ఉద్యోగాలు, పర్యటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పెంపు లక్షలాది మందిపై ప్రభావం చూపనుంది.
ఎస్బీఐ కార్డుదారులకు రివార్డులపై కత్తెర.. SBI Card Reward Points Cut
ఫోన్‌పేతో కలిసి ఎస్బీఐ కార్డ్ అందిస్తున్న కో-బ్రాండెడ్ క్రెడిట్కార్డులపై రివార్డు పాయింట్లకు(Financial Changes from July 1) కత్తెర పడింది. జులై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఫోన్‌పే ఎస్బీఐ క్రెడిట్‌కార్డ్ పర్పుల్ వినియోగదారులకు ఇప్పటివరకు ఫోన్‌పే ద్వారా చేసిన లావాదేవీలపై నెలకు వెయ్యి రివార్డు పాయింట్లు లభించేవి. ఇకపై ఇన్సూరెన్స్ చెల్లింపులకు కేవలం 250 పాయింట్లు, ఇతర లావాదేవీలకు 750 పాయింట్లే లభిస్తాయి. అలాగే ఇతర ఆన్లైన్ లావాదేవీలపై గరిష్ఠ రివార్డు పాయింట్లను వెయ్యి నుంచి 750కు తగ్గించారు.
ప్రీమియం కార్డులకూ మినహాయింపు లేదు.. Premium Cards Also Hit
ఫోన్‌పే ఎస్బీఐ సెలెక్ట్ బ్లాక్ కార్డు వినియోగదారులకూ (Financial Changes from July 1) ఇదే పరిస్థితి. ఫోన్‌పే ద్వారా చేసే ఇన్సూరెన్స్ చెల్లింపులకు నెలకు 500 పాయింట్లు, ఇతర లావాదేవీలకు 1,500 పాయింట్లే లభిస్తాయి. ఇతర ఆన్లైన్ ఖర్చులపై రివార్డు పాయింట్ల పరిమితిని రెండు వేల నుంచి వెయ్యికి తగ్గించారు. అంతేకాదు… టోల్, బ్రిడ్జ్ ఫీజులు, బంగారం కొనుగోళ్లు, గిఫ్ట్‌లు, సావనీర్లు, విద్యా ఫీజులు, ఫోన్‌పే యాప్ కాకుండా ఇతర వేదికల ద్వారా చేసే యుటిలిటీ, ఇన్సూరెన్స్, యూపీఐ చెల్లింపులకు ఇకపై రివార్డు పాయింట్లు వర్తించవు. మిగిలిన ప్రయోజనాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.
హెచ్డీఎఫ్సీ లాంజ్ సౌకర్యానికీ కొత్త షరతు.. Airport Lounge Rules Changed
ఎయిర్పోర్ట్ లాంజ్ సదుపాయాన్ని వినియోగించుకునే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్‌కార్డు వినియోగదారులకు (Financial Changes from July 1) కూడా కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ఇకపై త్రైమాసికంలో కనీసం రూ.60 వేల విలువైన లావాదేవీలు చేసిన వారికి మాత్రమే తదుపరి త్రైమాసికంలో ఉచిత లాంజ్ యాక్సెస్ లభిస్తుంది. దీంతో లాంజ్ ప్రయోజనాలను కొనసాగించాలంటే కార్డు వినియోగాన్ని పెంచాల్సి ఉంటుంది.
ఐటీఆర్ దాఖలుకు గడువు సమీపం.. ITR Filing Deadline Near
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన (Financial Changes from July 1) ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి జులై 31 చివరి తేదీ. ప్రాథమిక మినహాయింపు పరిమితికి మించి ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ నిర్ణీత గడువులోపు రిటర్నులు సమర్పించాలి. ఆలస్యమైతే జరిమానాతో పాటు ఇతర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. బ్యాంకు రుణాలు, వీసా దరఖాస్తులు, ఆర్థిక లావాదేవీల్లో ఐటీఆర్‌కు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో చివరి రోజు వరకు వేచి ఉండకుండా ముందుగానే రిటర్నులు దాఖలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
చమురు ధరలపై ఆశలు.. Relief on Fuel Prices?
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలపై (Financial Changes from July 1) కూడా ఆశలు పెరిగాయి. ప్రభుత్వరంగ చమురు సంస్థలు ప్రతి నెల ఒకటో తేదీన అంతర్జాతీయ ధరలను సమీక్షించి ఎల్పీజీ ధరలను సవరిస్తుంటాయి. ఈసారి వాణిజ్య సిలిండర్లతో పాటు గృహ వినియోగ సిలిండర్ల ధరల్లోనూ ఊరట లభిస్తుందా అనే ఆసక్తి నెలకొంది. అయితే అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే దీనిపై స్పష్టత రానుంది.
ఒకేరోజు.. ఎన్నో మార్పులు.. A New Financial Calendar Begins
జులై 1 నుంచి (Financial Changes from July 1) అమల్లోకి వస్తున్న మార్పుల్లో కొన్ని ప్రజలకు ప్రయోజనం చేకూర్చేవి కాగా.. మరికొన్ని అదనపు భారం మోపేవిగా ఉన్నాయి. ఆధార్ అప్డేట్కు ఉచిత అవకాశం కల్పించడం సానుకూల పరిణామం. అయితే పాస్‌పోర్ట్ ఫీజుల పెంపు, క్రెడిట్‌కార్డు రివార్డుల కోత, లాంజ్ సదుపాయాలపై కొత్త నిబంధనలు వినియోగదారులపై ప్రభావం చూపనున్నాయి. మారిన నిబంధనలపై ముందుగానే అవగాహన పెంచుకొని తమ ఆర్థిక ప్రణాళికలను సవరించుకోవడం ద్వారా అదనపు భారం, అసౌకర్యాలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
