దేశంలో స్టాక్ మార్కెట్ పరుగులు పెడుతోంది. ప్రతి వారం కొత్త రికార్డులు నమోదవుతున్నా… ఇంకా చాలా మంది భారతీయులు షేర్లలో పెట్టుబడి పెట్టే విషయంలో వెనుకంజ వేస్తూనే ఉన్నారు. స్టాక్ మార్కెట్ అనేది దీర్ఘకాలిక సంపద సృష్టికి ఉత్తమమైన మార్గాలలో ఒకటి. కానీ సరైన అవగాహన, పద్ధతులు అవసరం. చిన్న మొత్తాలతో మొదలైనా… క్రమం తప్పకుండా పెట్టుబడి (Why Indians Are Not Investing in the Stock Market) పెడితే మంచి ఫలితాలు వస్తాయి. అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో భారతీయుల పెట్టుబడి అలవాట్లు మారుతున్నా… ఇంకా ఎక్కువమంది స్టాక్ మార్కెట్ వైపు రావాలి. అవగాహన పెరిగితే కుటుంబాల ఆర్థిక భవిష్యత్తు మరింత బలపడటం ఖాయం.
పరిజ్ఞానం లేకపోవడమే ప్రధాన కారణం..Lack of Awareness Is the Main Reason
గ్రామీణ ప్రాంతాలే కాదు… నగరాల్లో ఉన్నవారిలో చాలామందికి కూడా పెట్టుబడి గురించి సరైన అవగాహన లేదు. స్టాక్ మార్కెట్ అంటే ప్రమాదమే అన్న భయమే ఎక్కువ. దీర్ఘకాలిక లాభాలపై కన్నా, తక్షణ నష్టాలే కంటికి కనిపిస్తాయి.
రిస్క్ ఫ్యాక్టర్ ..The Risk Factor
‘డబ్బు పోతుంది’… ‘మార్కెట్ పడిపోతే?’… ఇటువంటి సందేహాలే ఎక్కువ. రిస్క్ మేనేజ్‌మెంట్, డైవర్సిఫికేషన్ వంటి ప్రాథమిక అంశాలు తెలియకపోవడంతో షేర్లవైపు అడుగు వేయడం కష్టంగా మారింది.
సాంప్రదాయ పెట్టుబడులే నమ్మకం.. Trust Still Lies in Traditional Investments
బంగారం… రియల్ ఎస్టేట్… బ్యాంక్ డిపాజిట్లు.. ఇవే ఇంకా చాలా మందికి సేఫ్టీ జోన్. వాటినే పెట్టుబడిగా భావించాలి అన్న నమ్మకం ఇంకా బలంగానే ఉంది. షేర్లలో పెట్టుబడి సమానంగా సురక్షితమని అర్థం చేసుకునే ప్రయత్నం తక్కువ.
మధ్యతరగతి ఆర్థిక ఒత్తిడులు…Financial Pressures on the Middle Class
ఇళ్లు, ఆరోగ్యం, చదువు, అప్పులు.. ఇలా ఒక కుటుంబంపై ఎన్నో భారాలు. ప్రతి నెలా కొంతమేర సేవింగ్స్ పెట్టాలన్న ఆలోచన ఉన్నా… షేర్లలో పెట్టడానికి అవసరమైన అదనపు నిధులు చాలామందికి దొరకడం లేదు.
మోసపూరిత పథకాలు ..Fraudulent Schemes
అనధికారిక చిట్స్, డబుల్ మనీ స్కీమ్స్, ఫిన్‌టెక్ మోసాలు.. తదితర వాటితో పెట్టుబడులపై చాలామంది నమ్మకం కోల్పోతున్నారు. రిస్క్ ఉన్న షేరు మార్కెట్‌లోకి రావాలనే ధైర్యం మరింత క్షీణిస్తోంది.
స్పష్టమైన మార్గదర్శకత్వం లేకపోవడం..Lack of Clear Guidance
SEBI రెగ్యులేషన్లు బలపడ్డా… పెట్టుబడిదారులకి అవసరమైన కన్సల్టెన్సీ, విశ్వసనీయ సలహాలు అందించేవాళ్లు అరుదు. యూత్ సోషల్ మీడియాలో కనిపించే రూమర్ల ఆధారంగా ట్రేడింగ్ చేస్తూ నష్టపోతున్నారు.
మార్పు రావాలంటే…For Change to Happen…
పాఠశాల స్థాయిలోనే ఆర్థిక విద్య అవసరం
ప్రభుత్వ–SEBI అవగాహన కార్యక్రమాలు
బ్యాంకులు, బ్రోకరేజ్ సంస్థల ద్వారా సరళమైన పెట్టుబడి మార్గదర్శకాలు
చిన్న మొత్తాలతో SIPలు ప్రోత్సహించడం
SEBI తాజా సర్వే ఏమంటోంది? Latest SEBI survey news
దేశంలో ఆర్థిక అవగాహన పెరుగుతున్నా… స్టాక్ మార్కెట్ వైపు భారతీయులు అడుగులు వేయడంలో ఇంకా చాలా మందికి సంకోచమే ఎక్కువ. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) విడుదల చేసిన తాజా సర్వే ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది.
అవగాహన పెరిగినా… Even as Awareness Rises…
దేశవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 53% మంది మ్యూచువల్ ఫండ్స్ వంటి కనీసం ఒక ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌పై అవగాహన కలిగి ఉన్నారు. అదే పదేళ్ల కిందట చేసిన సర్వేలో కేవలం 28.4% మంది అదీ పట్టణాల్లో ఉన్నవారు మాత్రమే మ్యూచువల్ ఫండ్లపై పెట్టుబడులు పెట్టినవారున్నారని (Why Indians Are Not Investing in the Stock Market)సెబీ పేర్కొంది. అప్పట్లో గ్రామీణులను కలుపుకున్నా ఈ సంఖ్య మరింత తక్కువ అని SEBI స్పష్టం చేసింది. ప్రస్తుతం చాలామందిలో అవగాహన పెరిగినా.. పెట్టుబడి పెట్టే వారి సంఖ్య మాత్రం చాలా తక్కువ. దేశంలో మొత్తం జనాభాలో కేవలం 9.5% మంది మాత్రమే సెక్యూరిటీస్ మార్కెట్ ఉత్పత్తుల్లో పెట్టుబడులు పెడుతున్నారు. తక్కువ రిస్క్‌తో ఉండే బ్యాంకు డిపాజిట్లు, బంగారం, రియల్ ఎస్టేట్‌లపై అత్యధికులు ఆసక్తి చూపుతున్నారు. దేశంలో 80% మంది పెట్టుబడుల విషయంలో ‘లో రిస్క్ టాలరెన్స్’ కలిగినవారే. రిస్క్ కొంచెం ఉన్న ఉత్పత్తులకే భయపడే మనస్తత్వం. అందుకే స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం లేదని సెబీ చెబుతోంది. పెట్టుబడులపై అవగాహన పెరగడం మంచి విషయం. కానీ రిస్క్ మేనేజ్‌మెంట్, క్రమబద్ధమైన పెట్టుబడి అలవాట్లు పెంపొందించకపోతే స్టాక్ మార్కెట్ పాల్గొనేవారి సంఖ్య పెరగదు” అని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
సేవింగ్స్‌లో పెరుగుతున్న అప్పుల భారం.. The Rising Debt Burden on Savings
భారతీయుల పొదుపులలో ఆర్థిక బాధ్యతల పాత్ర రోజురోజుకూ పెరుగుతోంది. 2011–12లో సేవింగ్స్‌లో 12% మాత్రమే ఫైనాన్షియల్ లయబిలిటీలైతే.. 2023–24 నాటికి అవి 26 శాతానికి పెరిగాయి. అంటే కుటుంబాలపై అప్పుల ఒత్తిడి రెండింతలు అయినట్టే. SEBI నివేదిక ప్రకారం సెక్యూరిటీస్ ఉత్పత్తుల్లో పెట్టుబడి పెట్టేవారిలో ఉద్యోగులు 23% కాగా, స్వయం ఉపాధి దారులు కేవలం 17% మాత్రమే. క్రమబద్ధమైన ఆదాయం ఉన్నవారు స్టాక్ మార్కెట్ వైపు ఎక్కువగా రాకపోవడానికి నష్ట భయం, అప్పులే కారణం.. పెట్టుబడి భయానికి పరిష్కారం అవగాహనే. రిస్క్ ఉన్నా దీర్ఘకాలంలో సరైన ప్లానింగ్‌తో మంచి ఫలితాలు వస్తాయి(Why Indians Are Not Investing in the Stock Market). అప్పుల పెరుగుదల కూడా సేవింగ్స్ కల్చర్‌ను ప్రభావితం చేస్తోంది. అని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఎలా పెట్టాలి? How to Invest in the Stock Market?
స్టాక్‌మార్కెట్… ఈ పేరు వినగానే కొందరికి ఉత్సాహం, మరికొందరికి భయం. అయితే సరైన పద్ధతులు పాటిస్తే మార్కెట్ పెట్టుబడులు సంపద సృష్టికి అత్యుత్తమ మార్గం. SEBI, ఆర్థిక నిపుణుల సూచనల ప్రకారం పెట్టుబడి & రిస్క్ మేనేజ్‌మెంట్ తదితర అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం..
డీమాట్ & ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి.. Open a Demat & Trading Account
SEBI రిజిస్టర్డ్ బ్రోకర్ ద్వారా డీమాట్ ఖాతా తెరవాలి. ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా, మొబైల్ నంబర్ ఉంటే చాలు.
చిన్న మొత్తాలతో .. Start With Small Amounts…
ఒక్కసారిగా పెద్ద మొత్తాలు స్టాక్ మార్కెట్‌లో పెట్టకూడదు. ₹500–₹1000 వంటి చిన్న మొత్తాలతో మొదలైతే మార్కెట్ ఎలా పనిచేస్తుందో అర్థమవుతుంది.
మ్యూచువల్ ఫండ్లతో తొలి అడుగు..Take the First Step With Mutual Funds
ప్రత్యక్షంగా షేర్లు కొనేందుకు తెలిసినవారికి మాత్రమే సౌకర్యం ఉంటుంది. కొత్తవారికి SIPల రూపంలో మ్యూచువల్ ఫండ్లు ఉత్తమం. ప్రొఫెషనల్‌గా ఫండ్ మేనేజర్లు మీ పెట్టుబడిని నిర్వహిస్తారు.
లాంగ్‌టెర్మ్ దృష్టి పెట్టండి.. Focus on the Long Term
3 నెలల లాభం–నష్టం కాదు. 3 నుంచి 5 సంవత్సరాల నిరీక్షించే వారు మాత్రమే మంచి ఫలితాలు అందుకుంటారు.
సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకోరాదు.. Don’t Make Decisions Based on Rumours
సోషల్ మీడియా రూమర్లపై నిర్ణయాలు తీసుకోరాదు. కంపెనీల ఫండమెంటల్స్, రిజల్ట్స్, అప్పులు, మార్కెట్ ప్లాన్.. ఇవన్నీ పరిశీలించి షేర్లలో పెట్టుబడి పెట్టాలి.
క్వాలిటీ కంపెనీలలోనే పెట్టుబడి పెట్టాలి.. Invest Only in Quality Companies
Strong financials, Consistent profits, Low debt, Good management ఉన్న కంపెనీలను మాత్రమే ఎంచుకోవాలి. వాటిల్లోనే పెట్టుబడి పెట్టాలి.
రిస్క్‌ను ఎలా తగ్గించుకోవాలంటే..? How to Reduce Risk?
– పెట్టుబడులను డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. ఒకే కంపెనీ, ఒకే రంగంలో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరం.
ITలో కొంత, బ్యాంకింగ్‌లో కొంత, FMCGలో కొంత ఇలా విభజిస్తే రిస్క్ తగ్గుతుంది.
– SIP అనేది మార్కెట్ ఊగిసలాటకు ఢీ చెప్పే మార్గం. నెలనెలా SIP చేస్తే మార్కెట్ ఎత్తుపల్లాలు మీ పెట్టుబడిపై పెద్దగా ప్రభావం చూపవు. రూ.1000 SIP కూడా భవిష్యత్తులో మంచి సంపదగా మారుతుంది.
– హై-రిస్క్ స్టాక్‌లకు దూరంగా ఉండాలి. ట్రెండింగ్ స్టాక్‌లు, ‘డబుల్ అయ్యే’ కంపెనీలు, ఎటువంటి హామీలు లేని సూచనలు పెట్టుబడిదారులను ఎక్కువగా నష్టపరుస్తాయి.
-ఎమర్జెన్సీ ఫండ్ తప్పనిసరి. 6 నెలల ఖర్చులు ఉండేలా అత్యవసర నిధి సిద్ధంగా ఉంచాలి. అప్పుడే మార్కెట్‌లో పెట్టుబడి ప్రశాంతంగా చేయగలుగుతారు.
– స్టాప్‌లాస్ ను వాడండి. ట్రేడింగ్ చేసే వారు తప్పనిసరిగా స్టాప్‌లాస్ Fix చేయాలి. ఊహించని నష్టాల నుంచి ఇది రక్షిస్తుంది.
– త్వరగా ధనవంతులవుదాం అన్న ఆలోచన వద్దు. స్టాక్ మార్కెట్ అనేది స్లో & స్టెడీ గేమ్. దీర్ఘకాలంలో రాబడులు అధికమే. కానీ క్రమశిక్షణ అవసరం.
నిపుణుల సూచన..Expert Advice
అవగాహన + క్రమబద్ధత + దీర్ఘకాలిక దృష్టి = సురక్షిత పెట్టుబడి” అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
రికార్డు స్థాయిలో మార్కెట్ పెరుగుతున్న ఈ సమయంలో సరైన పద్ధతులు పాటిస్తే, చిన్న పెట్టుబడిదారులూ పెద్ద విజయాలు సాధించవచ్చు.
