మీరు భారతదేశంలో ఉద్యోగం చేస్తున్నారు. మీ జీతం నుంచి ప్రతి నెలా డెబిట్ అవుతున్న ఈపీఎఫ్ అనేది మీ పీఎఫ్ ఖాతాకు జమవుతుంది. దానిపై ప్రతి సంవత్సరం మంచి మొత్తంలోనే వడ్డీ జమవుతుంది. ఇలా జమవుతున్న పీఎఫ్ అనేది మనం అంత సులువుగా తీసుకోవడం కుదరదు. కానీ మీరు విదేశాలకు వెళ్లాల్సి వచ్చిందనుకుందాం. అప్పడు మీరు ఎన్ఆర్ఐగా మారుతారు. అలాంటి పరిస్థితుల్లో మీ పీఎఫ్ అకౌంట్‌ను, అందులో జమైన పీఎఫ్ మొత్తాన్ని ఏం చేయాలి అనే విషయంలో ఉన్న సందేహాలను ఓ సారి చూద్దాం.
మెరుగైన కెరీర్ అవకాశాలు, మెరుగైన జీవనశైలి కోసం భారతదేశం నుంచి మకాం మార్చడం అనేది చాలా మంది వ్యాపార నిపుణులు, ఉద్యోగులు తీసుకునే సాధారణ నిర్ణయం. అయితే NRIగా మీ ఉద్యోగి Provident Fund (EPF) ఖాతాను ఏం చేయాలనేది తెలుసుకోవాలి. చాలామంది ఇండియాలో ఉద్యోగాలు చేసినపుడు వారి ఈపీఎఫ్ అకౌంట్లో డబ్బులు Credit అవుతాయి. అయితే ఆ తర్వాత వాళ్లు విదేశాలకు వెళ్లిపోయి NRI గా సెటిల్ అయిపోతే వాళ్ళ పీఎఫ్ బ్యాలన్స్ ఏమౌతుందని తెలుసుకోవడం కీలకం. విదేశాల్లో జాబ్ చేస్తారు కాబట్టి ఇండియాలో వాళ్ల pf balance ఇన్ యాక్టివ్ అయిపోతుంది. ఆ డబ్బులు గవర్నమెంట్ కి వెళ్ళిపోతాయి. గవర్నమెంట్ ఆ నిధులను 7 సంవత్సరాల తర్వాత Senior Citizen Welfare Fund కి కలిపేస్తుంది. విదేశాల్లో జాబ్ వచ్చినపుడు ఇండియాలో ఈపీఎఫ్ బ్యాలెన్స్ సెటిల్ చేసుకుని క్లోజ్ చేసుకుంటే మంచిది.
NRIల కోసం EPF ఉపసంహరణ నియమాలు
EPF Withdrawal Rules for NRIs
మీరు NRIగా మారినప్పుడు, ఉద్యోగుల Provident Fund Act ప్రకారం ఇకపై మీ EPFకి విరాళం ఇవ్వడానికి వీలుండదు. అయితే NRIలు తమ EPF బ్యాలెన్స్‌ని ఉపసంహరించుకోవడానికి ఒక process ఉంది. దీనికి పదవీ విరమణ వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. సాధారణ పరిస్థితుల్లో, 58 ఏళ్లు నిండిన తర్వాత, పదవీ విరమణ చేసిన తర్వాత లేదా మీరు రెండు నెలలకు పైగా నిరుద్యోగులుగా ఉంటే EPF ఉపసంహరణలు చేయవచ్చు. అయితే NRIలకు ఒక ప్రత్యేక నిబంధన వర్తిస్తుంది. మీరు ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండా మొత్తం EPF బ్యాలెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవచ్చు. ఇందులో మీ Contributions, మీ Employer Contributions, ఆర్జిత వడ్డీ కూడా ఉంటాయి.
Using the online portal
ఆన్‌లైన్ పోర్టల్‌ను ఉపయోగించడం
మీ UAN ఆధార్‌తో లింక్ చేయబడితే, UAN నెంబర్ యూనిఫైడ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో EPF ఉపసంహరణకు దరఖాస్తు చేసుకునే అవకాశం మీకు ఉంది. మీరు మీ EPF బ్యాలెన్స్‌ని ఉపసంహరించుకునే process ను start చేయడానికి యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుంచి EPFO యొక్క UMANG యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్‌లో అవసరమైన సమాచారాన్ని నమోదు చేయాలి. మీరు ఉద్యోగాన్ని వదలడానికి గల కారణాన్ని తెలియజేయాలి. “విదేశాల్లో సెటిల్మెంట్”గా పేర్కొనడం తప్పనిసరి. మీరు JPEG లేదా PDF ఫార్మాట్‌లో సపోర్టింగ్ డాక్యుమెంట్‌లను బాగా స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయాలి. ధ్రువీకరణ కోసం OTP ని ఎంటర్ చేసి.. మీరు అభ్యర్థించిన విధంగా నమోదు చేయాలి. మీ దరఖాస్తు, డాక్యుమెంటేషన్ అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే, సాధారణంగా మీ Indian Employee Provident Fund ఖాతాలోని బ్యాలెన్స్ రెండు వారాల్లోగా బదిలీ అవుతుంది. అయితే నిబంధనలకు అనుగుణంగా సరైన డాక్యుమెంటేషన్ అవసరం.
NRIల కోసం EPF Withdrawal process
NRIగా EPF ఉపసంహరణ processను start చేసే ముందు, మీ పాస్‌పోర్ట్, వీసా సక్రమంగా ఉన్నాయా లేదో.. నిర్ధారించుకోండి. process ఆఫ్‌లైన్‌లో లేదా ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు.
Offline Process
మీ యజమాని నుంచి “EPF ఉపసంహరణ ఫారమ్” పొందండి లేదా EPF సంస్థ (EPFO) పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) మీ ఆధార్‌తో లింక్ చేయబడితే, మీరు నేరుగా స్థానిక EPFO కార్యాలయానికి వెళ్లవచ్చు. మీ UAN మీ ఆధార్‌తో లింక్ అవ్వకపోతే EPFO కార్యాలయంలో దరఖాస్తును సమర్పించే ముందు మీ యజమాని ఆమోదం అవసరం. ఫారమ్ ను పూర్తి వివరాలతో నింపాలి. ఉద్యోగాన్ని విడిచిపెట్టడానికి గల కారణాన్ని “విదేశాలలో సెటిల్‌మెంట్”గా పేర్కొ నాలి. అవసరమైన అన్ని Self-attested documents కాపీలను జత చేయాలి. పూర్తి చేసిన ఫారమ్‌ను స్థానిక EPFO కార్యాలయంలో సమర్పించాలి.
Online Process
UAN మీ ఆధార్‌తో లింక్ చేయబడితే, UAN మెంబర్ యూనిఫైడ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో EPF ఉపసంహరణకు దరఖాస్తు చేసుకోవచ్చు. లేకుంటే App Store లేదా Play Store నుంచి EPFO కి సంబంధించిన UMANG యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్‌లో అవసరమైన వివరాలను పూరించాలి. ఉద్యోగం నుంచి నిష్క్రమించడానికి గల కారణాన్ని “విదేశాల్లో సెటిల్మెంట్”గా పేర్కొనాలి. JPEG లేదా PDF ఫార్మాట్‌లో సపోర్టింగ్ డాక్యుమెంట్‌లను స్పష్టంగా స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయాలి. ధ్రువీకరణ కోసం OTPని ఎంటర్ చేయాలి. మీ దరఖాస్తు, డాక్యుమెంట్‌లు సక్రమంగా ఉన్నట్లయితే, మీ EPF బ్యాలెన్స్ సమగ్ర సమీక్ష తర్వాత రెండు వారాల్లో బదిలీ అవుతుంది.
what are the Documents Required for EPF Withdrawal EPF
ఉపసంహరణకు అవసరమైన పత్రాలు
EPF ఉపసంహరణ process సులభతరం చేయడానికి, మీరు కింది తెలిపిన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలి
– గుర్తింపు కోసం ఆధార్ కార్డ్
– పుట్టిన తేదీ ధ్రువపత్రం
– స్థానిక భారతీయ చిరునామా ధ్రువపత్రం
– UAN కేటాయించబడకపోతే EPF పాస్‌బుక్ సర్టిఫైడ్ కాపీ
– చివరి ఉద్యోగం నుండి నిష్క్రమించిన తేదీ, IFSC కోడ్‌తో బ్యాంక్ వివరాలు
– పాన్ కార్డ్
– వివాహ ధ్రువీకరణ పత్రం (మహిళా సభ్యులకు మాత్రమే, ఇంతకుముందు అవివాహితులు అయితే)
Inoperative EPF Account
పనిచేయని EPF ఖాతా
మీరు ఉద్యోగం మానేశారనుకుందాం.. అయినా మీ పీఎఫ్ ఖాతాను క్లోజ్ చేయకపోతే అప్పుడు కూడా మీ EPF ఖాతాలకు సంబంధించి మీకు 58 సంవత్సరాల వయసు వచ్చే వరకు వడ్డీ మీ ఖాతాలో జమ చేయబడుతుంది. అంటే మీరు ఉద్యోగం చేసినా, చేయకపోయినా మీ బ్యాలెన్స్ ఆ వయస్సు వరకు వడ్డీని పొందుతూనే ఉంటుంది.
Temporary relocation abroad
తాత్కాలికంగా విదేశాలకు మకాం మార్చడం
మీరు తాత్కాలికంగా విదేశాలకు మకాం మార్చుకుని, తిరిగి ఇండియాలో మీ ఉద్యోగాన్ని కొనసాగించాలని ప్లాన్ చేసుకుంటే, మీ EPF బ్యాలెన్స్‌ను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ సందర్భంలో, ఉపసంహరణకు దరఖాస్తు చేయనవసరం లేదు. మీ ఖాతా మూడు సంవత్సరాల పాటు పని చేస్తుంది. అందులో బ్యాలెన్స్ వడ్డీని పొందుతుంది. మీరు తిరిగి వచ్చిన తర్వాత, మీరు మీ UANని ఉపయోగించి కొత్త EPF ఖాతాకు బ్యాలెన్స్‌ని బదిలీ చేయవచ్చు. మీ ఖాతా మూడు సంవత్సరాలకు పైగా పనిచేయకుండా ఉంటే, స్థానిక EPFO కార్యాలయాలను సందర్శించడం ద్వారా దాని స్థితి అప్‌డేట్ చేయబడిందని నిర్ధారించుకోండి.