what is scuttlebutt investing in stock market SCUTTLEBUTT అనే ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం
స్టాక్ మార్కెట్ కు సంబంధించి మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే చాలా విషయాలను పరిగణనలోకి తీసుకుంటాం. వాటన్నిటి ఆధారంగా మనం పెట్టుబడి కొనసాగించి లాభాలు పొందేందుకు ప్రయత్నిస్తాం. అయితే మనం అవలంభించే విధానాలు అన్ని సందర్భాల్లోనూ లాభాలు ఇ వ్వకపోవచ్చు. కానీ ఇప్పడు మనం చెప్పకోబోయే స్ట్రాటజీ మాత్రం చాలా పక్కాగా ఫాలో అయిలే ఖచ్చితంగా మన ఇన్వెస్ట్‌మెంట్ లాభదాయక మార్గంలో వెళ్తుందనడంలో సందేహంలేదు.
మనకు ఇన్వెస్ట్‌మెంట్ గురువు అంటే గుర్తుకు వచ్చేవారు warren buffett. మరి ఆయన గురువు ఎవరంటే.. అందరు చెప్పే పేరు Benjamin Gram. warren buffett కు ఆయన investment philosophy నేర్పిన గురువు. అయితే warren buffett portfolio లో ఎప్పుడు గుర్తింపు వచ్చిందంటే.. Philip fisher ఇన్వెస్ట్‌మెంట్ strategy ని implement చేసిన తర్వాతే. అప్పటి నుంచే ఆయన investment లో growth వచ్చిందని చెబుతుంటారు. మన investment గురువు warren buffett ఫాలో అయిన Philip fisher ముఖ్యమైన investment strategy ని ఇప్పుడు తెలుసుకుందాం. Philip fisher తన stock selectionలో ఎంపిక చేసుకునే check list ను కూడా ఓసారి చూద్దాం. మన investment కోసం stock ను select చేసుకునే క్రమంలో ఈ చెక్‌లిస్ట్‌ను వాడితే bad కంపెనీస్‌ను avoid చేసుకోవచ్చు.
Philip fisher stock selection strategyలో ముఖ్యమైనది SCUTTLEBUTT ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజీ. దీని గురించి తెలుసుకోవాలంటే ఆయన రాసిన COMMON STOCKS AND UNCOMMON PROFITS
అనే బుక్ చదవాలి. అసలు SCUTTLEBUTT అంటే పుకారు లేదా గాసిప్, రూమర్ అని అర్థం. అదే ఒక ఇన్వెస్టర్ కి SCUTTLEBUTT అంటే కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ ని మార్కెట్లో అథంటిక్ పర్సన్ ద్వారా తెలుసుకోవడం. ఈ SCUTTLEBUTT టెక్నిక్ ఒక ఇన్వెస్ట్ మెంట్ మెథడ్. ఉదాహరణకు.. మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేముందు దాని గురించి ఆ ఇండస్ట్రీలో ఉన్నవారితో కలిసి మాట్లాడి తెలుసుకోవడం.
SCUTTLEBUTT TECHNIC లో ఉపయోగించే 4 SOURCES గురించి తెలుసుకుందాం
REPRESENTATIVES OF COMPETITORS
పోటీదారుల ప్రతినిధులు…
సాధారణంగా మనం ఒక కంపెనీకి గురించి తెలుసుకోవాలంటే.. ఆ కంపెనీ ఎంప్లాయ్స్ ని అడిగితే కరెక్ట్ గా చెప్పరు. కంపెనీ వాస్తవ పరిస్థితులను చెప్పకపోవచ్చు. లేదంటే ఆ కంపెనీ products ను high up చేసి చెబుతుంటారు. ఇలా కాకుండా ఆ కంపెనీ దగ్గరకు వెళ్లి.. competitors ను అడిగితే ఆ కంపెనీ బలాలు, బలహీనతలు అన్నీ మనకి తెలిసిపోతాయి. ఇలా మనం అన్ని కంపెనీలు గురించి డేటాను ఈజీగా తెలుసుకోవచ్చు. ఇలా సేకరించిన సమాచారం 90 శాతం కరెక్ట్‌గా ఉంటుంది. మనం ఏదైనా స్టాక్ లో ఇన్వెస్ట్ చేసేముందు ఆ కంపెనీ గురించి, ఆ కంపెనీ ఎక్స్ ఎంప్లాయ్ ని అడిగి సమాచారం తీసుకుంటే మంచిది. ఉదాహరణకు డా.రెడ్డీస్ గురించి తెలుసుకోవాలంటే..ఆ కంపెనీ ఉద్యోగులను అడిగితే సరైన సమాచారం రాకపోవచ్చు. అదే ఆ కంపెనీ competitors ను అడిగితే వాస్తవ పరిస్థితి తెలుస్తుంది.
FORMER EMPLOYEES
మాజీ ఉద్యోగులు
సాధారణంగా మనం FORMER EMPLOYEES దగ్గరికి వెళ్ళి కంపెనీ గురించి అడిగినట్లయితే సగం ఇన్ఫర్మేషనే దొరుకుతుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే… ఆ EMPLOYEES ఏ కారణంతో రిజైన్ చేశారో క్లియర్ గా తెలుసుకోవాలి. ఇక మనం సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్లయితే కొంత సమాచారం సేకరించొచ్చు. ఆ కంపెనీ గురించి వారు బాగా మాట్లాడుతుంటే.. ఆ కంపెనీతో వాళ్ళకి రిలేషన్ షిప్ బాగున్నట్లు. అంతేకాకుండా కంపెనీ సేల్స్, వాల్యూమ్స్ ఎలా ఉన్నాయో మనకి తెలుస్తుంది. కంపెనీ గురించి మనం సప్లయర్స్ తో మాట్లాడుతున్నప్పుడు మనతో freeగా మాట్లాడలేకపోతే అప్పుడు మనం ఆ కంపెనీ కంటే కాంపిటేటర్స్ దగ్గర నుంచి వీళ్ళకి ఎక్కువ సేల్స్ వస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలి.
CUSTOMERS
కస్టమర్లు…
మనం కంపెనీ CUSTOMERS దగ్గరికి వెళ్ళి ఆ కంపెనీ products లో వాళ్ళకి ఏమి నచ్చిందో తర్వాత సేల్స్ సర్వీస్ ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత టైమ్ ఎవ్వరికీ లేదు. అప్పట్లో Philip fisher బుక్ రాసే సమయంలో ఇంత టెక్నాలజీ అందుబాటులో లేదు కాబట్టి ఆ కంపెనీ కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి సమాచారం సేకరించే వారు. అయితే ఇప్పుడు ఆ సమస్య లేదు. మనకు అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. గూగుల్ లో కంపెనీ గురించి సెర్చ్ చేస్తే ఫీడ్ బ్యాక్ రూపంలో చాలా సమాచారం తెలుస్తుంది. ఆ కంపెనీ ఉత్పత్తులు, అమ్మకాల గురించి తెలుసుకోవచ్చు.
Philip fisher stock selectionలో ఉపయోగించే కొన్ని పాయింట్ల చెక్ లిస్ట్ ను ఓసారి పరిశీలిద్దాం
* EXPANDING MARKET
మార్కెట్ విస్తరణ
మనం ఏ కంపెనీ ని సెలక్ట్ చేసుకుంటామో ఆ కంపెనీ products గాని సర్వీసెస్ గాని EXPANDING MARKET లో ఉండాలి. కానీ సింకింగ్ మార్కెట్ లో ఉండకూడదు. ఉదాహరణకు కేస్ టెక్నాలజీ అనేది EXPANDING MARKET product. ఇలాంటి కంపెనీని మనం సెలక్ట్ చేసుకోవాలి. అదే సింకింగ్ మార్కెట్ అంటే.. ఉదాహరణకు hath way కేబుల్స్ కంపెనీ industry అనేది సింకింగ్ మార్కెట్ అంటారు. ఎందుకంటే ఈ industry ని OTT PLATFORMS, DTH SERVICES సింకింగ్ చేస్తుంటాయి. అందుకే ఇలాంటి మార్కెట్‌లో మనం ఇన్వెస్ట్ చేయకూడదు.
* DEVELOP NEW PRODUCT
కొత్త ఉత్పత్తిని అభివృద్ధి చేయండి
మనం ఏ కంపెనీ అయితే సెలక్ట్ చేసుకుంటున్నామో .. ఆ కంపెనీ యొక్క మేనేజ్ మెంట్ కొత్త products ను డెవలప్ చేయడానికి డిటర్మైండ్ అయి ఉండాలి. ఎందుకంటే ఒకటే product సక్సెస్ పుల్ గా ఉండిపోదు. అందుకని కొత్త కొత్త innovations ఇస్తూ ఉండాలి. ఉదాహరణకు.. ఒకప్పుడు మార్కెట్ లీడర్ అయిన నోకియా సెల్‌ఫోన్ కంపెనీ ..కొత్త టెక్నాలజీ androidని అడాప్ట్ చేసుకోకపోవడం వల్ల ఇప్పుడు మార్కెట్‌లోనే లేకుండా పోయింది. అందుకే మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త innovations productsని తీసుకురావడం చాలా ముఖ్యం
* EFFICIENT RESEARCH AND DEVELOPMENT
సమర్థవంతమైన పరిశోధన, అభివృద్ధి
చాలా కంపెనీస్ కి రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ తప్పకుండా ఉంటుంది. కాని రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ లో స్పెండ్ చేసిన ప్రతి రూపాయికి ఎంత లాభం వస్తుందో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి.
* ABOVE AVERAGE SALES ORGANIZATION
సగటు కంటే ఎక్కువ అమ్మకాల సంస్థ
ఇది చాలా బేసిక్ పారామీటర్. మనం సెలక్ట్ చేసుకున్న కంపెనీ యొక్క సేల్స్ కాంపిటేషవ్ కంపెనీస్ కంటే ABOVE AVERAGE లో ఉండాలి.
* HANDSOME PROFIT MARGIN
హ్యాండ్సమ్ ప్రాఫిట్ మార్జిన్
మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీ మంచి profits నే కాదు మంచి మార్జిన్ కూడా ఇవ్వాలి. ఉదాహరణకు మనం ఐపీ, stock analysis వీడియోస్ చూసేటప్పుడు అందులో financials మాట్లాడేటప్పుడు MARGINపై ఆసక్తి చూపుతుంటాం. ఒక కంపెనీకి మంచి profits మార్జిన్ ఉంటే ఆ కంపెనీ product యొక్క డిమాండ్ చాలా ఎక్కువ ఉందని మనం తెలుసుకోవచ్చు.
* KEEPING THAT PROFIT MARGIN
లాభాల మార్జిన్‌ను కొనసాగించడం
మనం ఇన్వెస్ట్ చేసే కంపెనీ మనం ఇన్వెస్ట్ చేసేటపుడు మంచి profit మార్జిన్ జనరేట్ చేస్తే సరిపోదు. ప్యూచర్లో కూడా అలాంటి profit మార్జిన్ జనరేట్ చేసే కంపెనీ అయ్యి ఉండాలి. ఆ కంపెనీ ఎప్పుడైతే కొత్త కొత్త innovation products ను మార్కెట్‌లోకి తీసుకొస్తుందో అప్పుడే ఇది సాధ్యమవుతుంది.
* GREAT LABOUT RELATIONS
గొప్ప కార్మిక సంబంధాలు…
ఎంప్లాయిస్ కి మేనేజ్ మెంట్ కి మంచి relationship ఉండాలి. ఎందుకంటే ఎంప్లాయీస్ కంపెనీకి మూలధనం. ఉదాహరణకు.. టీవీఎస్ మోటార్స్‌లో ఒక డైరెక్టర్ వేణు శ్రీనివాసన్ తన కంపెనీలో ఎంప్లాయిస్ వేసుకునే dress code (uniform) నే ఆయన కూడా వేసుకుంటారు. అంతేగాకుండా ఉద్యోగులు ఎక్కడ తింటారో ఆయన కూడా అక్కడే తింటారు. ఇలాంటి చర్యల వల్ల మేనేజ్‌మెంట్ , ఉద్యోగులు వేర్వేరు కాదనే భావన ఎంప్లాయిస్ లో కలుగుతుంది. అందరూ సమానమనే ఫీలింగ్ ఏర్పడుతుంది.
* AWESOME EXECUTIVE RELATIONS
అద్భుతమైన కార్యనిర్వాహక సంబంధాలు …
మనం ఇన్వెస్ట్ చేసే కంపెనీ యొక్క ప్రమోటర్ కి, ఎగ్జిక్యూటవ్‌కి మంచి రిలేషన్ షిప్ ఉండాలి. ఎందుకంటే.. ఎగ్జిక్యూటివ్స్ can make the company.. are break the company. కంపెనీ గురించి ప్రమోటర్స్ కంటే ఎగ్జిక్యూటివ్స్ బాగా మాట్లాడగలరు. మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసే కంపెనీ ఇలాంటి రిలేషన్ షిప్ maintain చేసే కంపెనీ అయి ఉండాలి.
* DEPTH IN MANAGEMENT
నిర్వహణలో లోతు
మనం ఇన్వెస్ట్ మెంట్ చేసే కంపెనీ ఏదైతే ఉందో ఒక్కరు మేనేజ్ చేసే కంపెనీ అయ్యి ఉండకూడదు. ఎందుకంటే ఓ ఒక్క వ్యక్తి రిజైన్ చేసినట్లయితే ఆ కంపెనీ సమస్యల్లో పడుతుంది. అదే మల్టీ స్టారర్ మేనేజ్ మెంట్ కంపెనీ అయితే ఒకరు లేకపోయినా మరొకరు ఆ కంపెనీని హ్యాండిల్ చేసుకోగలుగుతారు.
* GREAT COST ANALYSIS
గొప్ప వ్యయ విశ్లేషణ
కంపెనీ యొక్క expensesపై మేనేజ్ మెంట్ కి full control ఉండాలి. ఉదాహరణకు రా మెటీరియల్ పై ఎంత ఖర్చు చేస్తున్నారో, productionపై ఎంత వస్తుంది, వీటన్నింటిపై మేనేజ్ మెంట్ కి ఐడియా ఉండాలి. ఆ control ఉంటే.. ఆయా కంపెనీలు మంచి మార్జిన్స్‌ను పొందుతాయి. అలా లేకుంటే ఆ కంపెనీల మార్జిన్స్ స్థిరంగా ఉండవు.
* GREAT INDUSTRY SPECIFICS
ఇండస్ట్రీ స్పెసిఫిక్స్
ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క కీ పారామీటర్ ఉంటుంది. అది ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీ డిఫర్ అవుతుంది. అది మనం క్లియర్ గా తెలుసుకోవాలి. ఉదాహరణకు రిటైల్ కంపెనీకి inventory management ఒక కీ పారామీటర్. డీ మార్ట్‌లో self creation circle చాలా fast గా move on అవుతుంది. ఇది ఎంత fast గా కదిలితే అంత fast గా money rotate అవుతుంది. ఇలా ఒక్కో ఇండస్ట్రీకి ఒక్కో కీ పారామీటర్ ఉంటుంది. వీటి ఆధారంగా మనం డెసిషన్ తీసుకోవాలి.
* దీర్ఘకాలంలో లాభాలు
తన ప్రస్తుత లాభాలు తగ్గుతాయని, దానివలన స్టాక్ price పై ప్రభావం పడుతుందని ఏదైనా కంపెనీ కొత్త టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేయడానికి వెనుకడుగు వేస్తుందో అలాంటి కంపెనీల్లో మనం ఇన్వెస్ట్ చేయకపోవడం మంచిది. అలా కాకుండా ప్రస్తుత లాభాలు తగ్గినా పర్వాలేదు కానీ future growth అవసరం అంటూ కొత్త టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేసే కంపెనీల్లో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్ లో మంచి profits వస్తాయి.
* LOW RISK FOR DILUTION
మనం సెలక్ట్ చేసుకున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి క్యాష్ జనరేటింగ్ కంపెనీస్ అయితే చాలా బెటర్. ఎందుకంటే ఆ కంపెనీస్ ఖర్చులు చెయ్యాలనుకున్నా, కొత్త టెక్నాలజీలో ఇన్వెస్ట్ చెయ్యాలనుకున్నా, అప్పు చేయవలిసిన అవసరం ఉండదు. అదే క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ అయితే కొత్తగా project ఏదైనా చెయ్యాలనుకుంటే డెట్ తీసుకోవలిసి ఉంటుంది. అందువలన మనం సెలక్ట్ చేసుకున్న కంపెనీ క్యాష్ జనరేట్ కంపెనీ అయితే చాలా మంచిది.
* COMMUNICATES RISKS TOO
రిస్క్‌లను కూడా కమ్యూనికేట్ చేస్తుంది
మనం సెలక్ట్ చేసుకున్న కంపెనీ పోజిటివ్ న్యూస్ నే కాకుండా నెగిటివ్ న్యూస్ ని కూడా ప్రకటించే విధంగా ఉండాలి. అలాంటి కంపెనీలను మనం సెలక్ట్ చేసుకోవాలి.
Leave a Reply