
ఇటీవల పర్సనల్ లోన్స్ విరివిగా లభిస్తున్నాయి. బ్యాంకులే స్వయంగా ఫోన్ చేసి లోన్ తీసుకోండి అంటూ అడుగుతున్నాయి. ఇతర ఆన్‌లైన్ లోన్ యాప్స్ సంగతి సరేసరి. ఇక ఈ బ్యాంకులు ఇచ్చే పర్సనల్‌లోన్ ప్రాసెస్ ఏమిటి..? వడ్డీ ఎంత, ఈఎంఐ ఎంత అనే విషయాలు ఓ సారి చూద్దాం.
మనం అత్యవసర పరిస్థితుల్లో పర్సనల్ లోన్స్ తీసుకుంటాం. బ్యాంకులు ఈ లోన్స్ ని ఎటువంటి సెక్యూరిటీ లేకుండా మనకి ఇస్తాయి. కేవలం మనల్ని నమ్మి ఇస్తాయి కాబట్టి ఇవి అంత సురక్షితం కాదని బ్యాంకుల భావన. అందుకే వీటిపై అధిక వడ్డీ రేటు వసూలు చేస్తాయి. అయినా మనం అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ రుణం తీసుకుంటాం. ఈ రుణాన్ని ఈఎంఐ రూపంలో నెలవారీ చెల్లించే అవకాశం ఉంటుంది. అయితే మనం పర్సనల్ లోన్ తీసుకునేముందు బ్యాంకు వడ్డీ రేట్లు, కాలపరిమితి, ఆలస్య రుసుము వంటివి తెలుసుకోవాలి.
* ఏ బ్యాంకు వెబ్‌సైట్‌లోకి వెళ్లినా మనకు పర్సనల్ లోన్ వివరాలు దొరుకుతాయి. మనం మెసేజ్ చేయగానే మన ఎలిజిబిలిటీ వివరాలు అడుగుతుంది. నమోదు చేయగానే ఎంత వస్తుంది.. ఎంత వడ్డీ అని తెలుస్తుంది. వాటిని బట్టి మనం బ్యాంకు సిబ్బందితో మాట్లాడవచ్చు. ఇక్కడ రుణం మన జీతాన్ని బట్టి ఉంటుంది.
* మనకి లోన్స్ ఇవ్వాలంటే బ్యాంకు మన క్రెడిట్ స్కోర్ ని పరిశీలిస్తుంది. మనం లోన్ తిరిగి చెల్లించగల స్థోమత ఉంటేనే లోన్ ఇస్తారు. లేకపోతే మన అప్లికేషన్ తిరస్కరించే అవకాశం ఉంది. అందువల్ల లోన్ కోసం దాఖలు చేసుకునే ముందుగా క్రెడిట్ స్కోర్ ను మెరుగుపరుచుకోవడం చాలా అవసరం.
అధిక వడ్డీ..
పర్సనల్ లోన్స్ కి వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే చాలావరకు వ్యక్తిగత రుణాలకు ఎలాంటి హామీ ఉండదు. భద్రత తక్కువగా ఉంటుంది. బ్యాంకులు మినిమమ్ 11 శాతం నుంచి 16 శాతం వరకూ వడ్డీ రేట్లు వసూలు చేస్తాయి. ఇతర ఆర్థిక సంస్థల్లో దీనికంటే ఎక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి. వడ్డీ రేట్లు మనం రుణం తీర్చే వ్యవధి బట్టి ఉంటుంది. నెలవారీ వాయిదా ఉంటుంది. కాలపరిమితి ఎక్కువగా ఉంటే ఈఎంఐ తక్కువగా ఉంటుంది. క్రెడిట్ స్కోర్ బాగుంటే కూడా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశముంటుంది.
what is processing fees in personal loan
మనం పర్సనల్ లోన్ తీసుకున్నపుడు ప్రోసెసింగ్ ఫీజు ఉంటుంది. ఇవి మనకిచ్చే లోన్స్ బట్టి ఉంటుంది. బ్యాంకులన్నింటికీ ప్రాసెసింగ్ ఫీజు ఒకేలా ఉండదు. బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది.
మనం ఏదైనా కారణం చేత ఈఎమ్ఐ చెల్లించడం ఆలస్యం అయితే బ్యాంకులు ఎక్కువ వడ్డీలు విధిస్తాయి. మన అకౌంట్ లో సరిపోయినంత డబ్బులు లేకపోతే ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ తిరస్కరించినా ఆర్థిక సంస్థలు, బ్యాంకులు చాలా అధిక మొత్తంలో ఛార్జీలను వసూలు చేస్తాయి. ఇది ఒక్కోసారి ఈఎమ్ఐలో 5 శాతం నుంచి 10 శాతం వరకు కూడా ఉండే అవకాశముంది.
ముందే తీర్చినా..
మనం అత్యవసర పరిస్థితుల్లో లోన్స్ తీసుకుంటాం. నగదు అందిన వెంటనే కొంతమంది తిరిగి చెల్లిస్తారు. అందుకే గడువు ముగింపుకంటే ముందే ఖాతాను మూసివేస్తే ఛార్జస్ పడతాయా అనే సందేహం అందరికీ ఉంటుంది. ఇలా ముందే తీర్చేస్తే బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తాయి. వీటినే ప్రీ క్లోజింగ్ చార్జీలు అంటారు. కొన్ని బ్యాంకులు మాత్రం వీటిని వసూలు చేయవు.
ఈ రోజుల్లో చాలా మంది చిన్న చిన్న అవసరాలకు కూడా లోన్ తీసుకోవడానికి వెనుకడుగు వేయడం లేదు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, మొబైల్ యాప్‌లలో కూడా విరివిగా లోన్లు ఇవ్వడం వల్ల ప్రజలు మరింత ఉత్సాహంగా వీటి కోసం ఎగబడుతున్నారు. అయితే పర్సనల్ లోన్ కి వెళ్లే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలానే ఉన్నాయి.
పర్సనల్ లోన్ అంటే ఏమిటి.. దానిని ఎలా పొందాలి అనే విషయంలో ఇప్పటికీ చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. పర్సనల్ లోన్ అనేది ఉపాధి చరిత్ర, తిరిగి చెల్లించే సామర్థ్యం, ఆదాయ స్థాయి, చేసే పని, క్రెడిట్ హిస్టరీ వంటి ప్రమాణాల ఆధారంగా ఆర్థిక సంస్థలు అందించే రుణం. వినియోగదారు రుణంగా పిలువబడుతూ బహుళ ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది. దీన్ని వ్యక్తిగత అవసరాల కోసం, కుటుంబ అవసరాల కోసం తక్షణమే పొందవచ్చు.
What are the benefits of personal loan
హోమ్ లోన్ లేదా గోల్డ్ లోన్ వంటి ఇతర రకాల లోన్లకు మనం తప్పనిసరిగా అనేక డాక్యుమెంట్‌లను అందించాలి. అంతే కాకుండా ఇక్కడ ప్రాసెసింగ్ టైం కూడా చాలా ఎక్కువ పడుతుంది. పర్సనల్ లోన్‌లకు కనీస పత్రాలు ఇస్తే సరిపోతుంది. ఇందులో ఆమోద ప్రక్రియ కూడా చాలా త్వరగా జరుగుతుంది.
* వివిధ ఆర్థిక సంస్థలు పర్సనల్ లోన్ ను ఆన్‌లైన్ లో అందిస్తున్నాయి. ఇక్కడ మీ రీపేమెంట్ సామర్థ్యాన్ని ఒప్పించినట్లయితే లోన్ మొత్తం కొన్ని గంటల్లోనే పంపిణీ చేయబడుతుంది.
పర్సనల్ లోన్ లో మరొక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, రుణదాతలు మీ లోన్ కాలపరిమితిని ఎంచుకోవడానికి మీకు సౌలభ్యాన్ని అందిస్తారు.
సాధారణంగా, పర్సనల్ లోన్ కాలపరిమితి ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది. కాబట్టి, మీరు మీ రీపేమెంట్ కెపాసిటీ ఆధారంగా లోన్ టర్మ్‌ని ఎంచుకోవచ్చు. మనం తక్కువ కాలాన్నిఎంచుకుంటే చెల్లించే వడ్డీని ఆదా చేసుకోవచ్చు. రుణ మొత్తాన్ని కూడా వేగంగా తిరిగి చెల్లించవచ్చు.
* మనం పొందగలిగే లోన్ అనేది ఆదాయ స్థాయి, వృత్తి పై ఆధారపడి ఉంటుంది.
* రుణదాతలు లోన్ ఇచ్చే టప్పడు కొన్ని కాలిక్యులేషన్స్ ఆధారంగా మంజూరు చేస్తారు. సాధారణంగా రుణం అనేది నెల జీతాన్ని 12 తో గుణించి ఇస్తారు. అంటే ఇక్కడ మనం చెల్లించాల్సిన EMI అనేది మన నెలవారీ ఆదాయంలో 40% – 50% కంటే ఎక్కువగా ఉండకూడదనేది ప్రాథమిక నియమం.
* రుణ మొత్తాన్ని లెక్కించేటప్పుడు ఏవైనా బకాయిలు ఉంటే రుణదాతలు పరిశీలిస్తారు.
* వ్యాపార యజమాని లేదా స్వయం ఉపాధి పొందుతున్నట్లయితే లాభం నష్ట ప్రకటనలో నమోదు చేయబడిన లాభాల ఆధారంగా రుణ మొత్తాన్ని నిర్ణయిస్తారు. మీరు జీతం తీసుకునే ప్రొఫెషనల్ అయితే, రుణదాత మీ జీతం, ఇతర బాధ్యతల ఆధారంగా మొత్తాన్ని నిర్ణయిస్తారు.
How to apply for personal loan
పర్సనల్ లోన్‌కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి
ఈ రోజుల్లో పర్సనల్ లోన్ తీసుకోవడం చాలా సులభంగా మారింది. ఇప్పడన్ని సంస్థలు ఆన్‌లైన్లో రుణం ఇస్తుండడంతో చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అయితే చాలు రుణం పొందడం కష్టమేమీ కాదు.
ఇందుకోసం మనకు సంబంధించిన బేసిక్ డీటైల్స్‌ను ముందుగా సిద్ధం చేసుకోవాలి.
ఆదాయపు రుజువు (పే స్లిప్, బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్, ఐటీఆర్ ఫారమ్‌లు)ను సిద్ధం చేసుకోవాలి.
నివాస ధ్రువ పత్రం
గుర్తింపు కార్డు ( ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్)
మీ విద్యార్హత సర్టిఫికెట్‌లు.
డిగ్రీలు, లైసెన్స్ సర్టిఫైడ్ కాపీ (ఇది స్వయం ఉపాధి పొందుతున్న దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుంది).
డాక్యుమెంటేషన్ అనేది రుణదాత నుంచి రుణదాతకు మారుతూ ఉంటుంది. కానీ ప్రాథమికంగా పైన తెలిపినవి మాత్రం మన దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది. ఇవన్నీ దరఖాస్తు ఫారమ్‌తో పాటు మనం తప్పనిసరిగా అందించాల్సిన పత్రాలు.
వీటిని సిద్ధంగా ఉంచుకుని వీటికి ఫోటో కాపీలు తీసుకుని సంబంధిత బ్యాంకు వెబ్‌సైట్‌లో గానీ, ఫైనాన్స్ కంపెనీ మొబైల్ యాప్‌లో కానీ దరఖాస్తుతో పాటు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఇవన్నీ పూర్తి చేశాక బ్యాంకు ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేసి మీతో మాట్లాడి వివరాలను కన్‌ఫర్మ్ చేసుకుని మీ రుణ పరిమితిని తెలియజేస్తాడు. అప్పడు మీరు కనఫర్మేషన్ తెలియజేస్తే వెంటనే మీ బ్యాంకు ఖాతాలోకి రుణ మొత్తాన్ని జమ చేస్తారు. ఇదంతా సుమారుగా గంటల వ్యవధిలోనే పూర్తవుతుంది.
మన జీవిత భాగస్వామితో లేదా తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల వంటి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సంయుక్తంగా పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
సహ-రుణగ్రహీతతో పర్సనల్ లోన్ కోసం అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి ఏమిటంటే, రుణదాతలు లోన్ మొత్తాన్ని నిర్ణయించేటప్పుడు దరఖాస్తుదారుల ఇద్దరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అంటే ఇలా మనం అధిక రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, సహ-రుణగ్రహీత పేలవమైన క్రెడిట్ చరిత్రను కలిగి ఉన్నట్లయితే, రుణదాత మీ లోన్ దరఖాస్తును తిరస్కరించే ప్రమాదం ఉందని మనం తప్పక తెలుసుకోవాలి.
వడ్డీ రేటు గురించి తెలుసుకోవాల్సిందే
have to know about the interest rate
మీరు లోన్ తీసుకునేటప్పుడే మీరు చెల్లించాల్సిన వడ్డీ రేటు ఎంత? కాల పరిమితి ఎంత? అనే విషయాలను తప్పనిసరిగా మాట్లాడి ధ్రువీకరించుకోవాలి. ఏ నెలైనా చెల్లించడంలో ఆలస్యమైనా, లేదా మర్చిపోయినా పడే ఫైన్ ఎంత ఉంటుందో తెలుసుకోవాలి. అంతే కాకుండా లోన్ ఇచ్చేందుకు బ్యాంకులు తీసుకునే ప్రాసెసింగ్ చార్జీలు ఎంతో తప్పకుండా అవగాహన కలిగి ఉండాలి.
అసలు గడువు ముగిసేలోపు లోన్‌ను ముందస్తుగా చెల్లించాలని నిర్ణయించుకుంటే జప్తు రుసుము అని పిలువబడే పెనాల్టీ ఛార్జీలను విధించవచ్చు. ఈ పెనాల్టీ సాధారణంగా బకాయి మొత్తంలో ఒకటి నుండి రెండు శాతం వరకు ఉంటుంది.
ఇప్పుడు మీకు పర్సనల్ లోన్‌ల గురించి తెలిసింది కాబట్టి వివిధ రుణదాతల నుండి లోన్ ఆఫర్‌లను సరిపోల్చుకుని ఆన్‌లైన్‌లో పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీ ఖర్చులను తీర్చడానికి అవసరమైన మొత్తాన్ని పొందవచ్చు.
వివిధ ఆర్థిక అవసరాల కోసం చాలా మంది పర్సనల్ లోన్లు తీసుకుంటారన్న విషయం తెలిసిందే. చాలా వరకు బ్యాంకుల్లో పర్సనల్ లోన్లు అందరికీ రావు. మన సిబిల్ స్కోర్ అనేది ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుంది. మెరుగైన క్రెడిట్ స్కోరు ఉంటే తక్కువ వడ్డీకే బ్యాంకులు వ్యక్తిగత రుణాల్ని అందిస్తుంటాయి. క్రెడిట్ స్కోర్ కొంచెం తక్కువైతే వడ్డీ రేటు పెరుగుతుంది. మరీ తక్కువ స్కోర్ ఉంటే పూర్తిగా రుణాలనివ్వవు. పర్సనల్ లోన్లకు సంబంధించి వడ్డీ రేట్లు ఒక్కో బ్యాంకులో ఒక్కోలా ఉంటాయి.
* గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థలు నిర్దిష్ట కాలపరిమితికి సంబంధించి తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తుంటాయి.
* పండగ సీజన్ లో బ్యాంకులు ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. ఆఫర్లు ఉన్న సమయంలోనే బ్యాంకులో పర్సనల్ లోన్ కోసం అప్లై చేస్తే.. చాలా తక్కువ వడ్డీకే లోన్ పొందే వెసులుబాటు ఉంటుంది.
* లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు ఏయే బ్యాంకుల్లో లోన్లకు సంబంధించి వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు ఎలా ఉందో చూసుకోవాలి.