
ఏదైనా ఒక స్టాక్‌లో ఇనీషియల్ గా ఎంతైతే పెట్టుబడి చేస్తామో దానిపైన వీలైనన్ని ఎక్కువ రెట్ల ఆదాయాన్ని ఆ కంపెనీ ఇస్తే దానిని మల్టీ బాగర్ స్టాక్ అంటాం. ఇలాంటి మల్టీ బ్యాగర్ స్టాక్స్‌ని కనుగొని వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల స్టాక్ మార్కెట్లో మనం వీలైనంత ఎక్కువ రిటర్న్ పొందగలుగుతాం.
మల్టీ బాగ్ కంపెనీ స్టాక్స్ ఎలా ఉంటాయంటే వాటి ఫండమెంటల్స్ మిగతా కంపెనీల కంటే చాలా బలంగా ఉంటాయి. ఎదిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అదే ఇండస్ట్రీలో పోటీదారులు కంటే వీళ్ళ దగ్గర ఏదో ఒక కొత్త విషయం ఉంటుంది.
అసలు మల్టీ బాగర్ స్టాక్స్ కనుక్కోవడం ఎలా అనేది చాలా కష్టమైన విషయం. కొన్ని స్టెప్స్ ని పాటించినట్లయితే మల్టీ బాగర్ స్టాక్స్ ని కనుక్కోగలగడం కొంత సాధ్యమవుతుంది.
INITIAL SCREENING
*స్క్రీనింగ్ అంటే 6 వేలకి పైగా లిస్ట్ అయిన కంపెనీలలోని కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్న కంపెనీస్ ని ఎంచుకోవాలి.
* ఎంచుకోబోయే కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 500కోట్లు కంటే ఎక్కువ ఉండాలి.
* కంపెనీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 5 సంవత్సరాలు తీసుకుంటే 15 శాతం కంటే ఎక్కువ ఉండాలి. ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది ఎంత ఎక్కువ ఉంటే కంపెనీకి అంత మంచిది.
* ఎంచుకున్న కంపెనీ 5 సంవత్సరాలుగా రిటర్న్ ఆన్ ఈక్విటీ 20 శాతం కంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.
* గత 5 సంవత్సరాలుగా ఎంచుకున్న కంపెనీ సేల్స్ గ్రోత్ 10 శాతం కంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.
* 5 సంవత్సరాలుగా రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 15 శాతం కంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.
* స్క్రీనర్ డాట్ ఇన్ వెబ్ సైట్ లోకి వెళ్ళి అక్కడ కంపెనీస్ పేరు ఎంటర్ చేసినట్లయితే 6 వేలకి పైగా లిస్ట్ అయిన కంపెనీలను ప్లాష్ చేస్తుంది. అక్కడ నుంచి మన లక్ష్యాన్ని తగినట్లుగా ఉన్న కంపెనీలను ఎంచుకోవాలి.
WHAT IS QUANTITATIVE ANALASIS
క్వాంటిటీ అంటే నంబర్స్. కంపెనీకి సంబందించిన అన్నీ నంబర్స్ ని చెక్ చేసుకుని ఎనలైజ్ చేసుకోవాలి. ఈ నంబర్స్ అనేవి ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ ద్వారా తెలుస్తాయి.
ఈ ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ అనేది 3 రకాలుగా ఉంటుంది. అవి Profit account, balance sheet, cash flow statement. వీటిని పూర్తిగా అధ్యయనం చేసిన తరువాతే ముందుకు వెళ్లాలి.
ఇక్కడ కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ ని తీసుకుని, వాళ్ళ పర్ ఫార్మెన్స్ ఎలా ఉందో వాటికి సంబంధించి క్లియర్ గా తెలుసుకోవాలి.
ఒక కంపెనీని సెలక్ట్ చేసే ముందు అది ఏ ఇండస్ట్రీకి చెందినదో, ఆ ఇండస్ట్రీకి సంబంధించిన ఎదుగుదల ఎలా ఉందో చూడాలి. ఒక్కో రకమైన ఇండస్ట్రీ సెలక్ట్ చేసుకునేటప్పడు కొన్ని ప్రత్యేక విషయాలను పరిగణలోకి తీసుకోవాలి.
బ్యాంకింగ్ సెక్టార్ తీసుకుంటే దానికి సంబంధించి NET INTEREST INCOME చూడాలి.
NET INTEREST INCOME అనేది బ్యాంకింగ్ సెక్టార్ కి సంబంధించి ఎక్కువగా ఉంటే ఆ కంపెనీ మంచిగా ఫర్ ఫార్మ్ చేస్తున్నట్లే.
what is CAPITAL ADEQUACY RATIO
ఎన్నైతే అప్పులు, లయబిలిటీస్ ఉన్నాయో, ఎంత ఆస్తుల విలువ పెట్టుకున్నారో దానిపైనే ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే బ్యాంకులకు ఈ Capital Adequacy Ratio అనేది చాలా ముఖ్యం.
కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని సెలక్ట్ చేసుకుంటే వీళ్ళకి ఎక్కువ మోతాదులో క్యాపిటల్ ఎక్స్ పెన్సస్ ఉంటాయి. ఇలాంటి కంపెనీలను ఎంచుకున్నప్పుడు రుణాలు ఎలా ఉన్నాయి, వీళ్ళ సమర్థత ఏమిటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి.
Auto Industry కి సంబంధించిన కంపెనీని ఎంచుకున్నప్పుడు వీళ్ళు ఎక్కువగా సైకిల్స్‌కి గురవుతూ ఉంటారు. అదే విధంగా FMCG విషయానికి వస్తే వీటికి అప్పులు తక్కువగా ఉంటాయి. ఆపరేటింగ్ ఎక్స్ పెన్సస్ కూడా తక్కువగా ఉంటాయి. ఆపరేటింగ్ మార్జిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ ఎంచుకోబోయే కంపెనీ స్టాక్స్ పై అప్లై చేసి చూడాలి.
ఏదైనా కంపెనీకి సంబంధించి క్వాంటిటేటివ్ ఎనాలసిస్ ని తెలుసుకోవాలంటే స్క్రీనర్ డాట్ కమ్ కి వెళ్ళి కంపెనీ పేర్లు టైప్ చేస్తే అది మనకి మంచి ఇన్ఫర్మేషన్ ని ఇస్తుంది.
* క్వాంటిటేటివ్ ఎనాలసిస్ లో మొదట ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ని చూడాలి. అందులో కంపెనీ సేల్స్, లాభాలు ఏలా పెరిగాయో చూడాలి.
* సుమారు 10 సంవత్సరాలుగా సేవింగ్స్ అండ్ ఆపరేటింగ్ మార్జిన్ పెరిగాయా లేదా? బ్యాలన్స్ షీట్స్ కి వస్తే అక్కడ వీళ్ళకి ఉండే ఆస్తులు ఎలా పెరుగుతున్నాయి అనేది అర్థం చేసుకోవాలి.
WHAT IS DET EQUITY RATIO
కంపెనీకి సంబంధించి డెట్ ఎలా ఉంది.. కంపెనీ ఎంతలా అప్పుల మీద ఆధారపడి వ్యాపారాన్ని నడిపిస్తుందో చూడాలి. 10 సంవత్సరాలుగా వీళ్ళు అప్పులన్నీ తగ్గించుకుంటూ వచ్చిందో చూడాలి.
WORKING CAPITAL CYCLE .. కంపెనీ దగ్గర ఉండే కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ ని ఎంత సమయం లోపు క్యాష్ గా కన్వర్ట్ చేస్తున్నారో అనే దానిని కొలవడాన్ని Working Capital Cycle అంటారు. ఇది ఎలా ఉందో తెలుసుకోవాలి.
* CASHFLOW STATEMENT ద్వారా కంపెనీకి ఫ్రీ క్యాష్ ప్లో ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఇది పాజిటివ్ గా ఉందా లేదా నెగిటివ్ గా ఉందా చూడాలి.
ఏ కంపెనీకి అయిన క్వాంటిటేటివ్ ఎనాలసిస్ చేసినపుడు క్యాష్ ఫ్లో తర్వాత కొన్ని రేషియోస్ ని కనుక్కోవలిసి ఉంటుంది. ఒక షేర్ కి కంపెనీ ఎంత ఆదాయాన్ని తెచ్చిపెడుతుందో Earning per share ద్వారా చూడాలి.
* Earning per share.. ఇది పెరిగితే కంపెనీ సేల్స్ గ్రోత్ బాగున్నట్టే. వాళ్ళ మార్కెట్ షేర్ కూడా పెరుగుతున్నట్లే.
* Debt to equity Ratio.. అంటే ఒక కంపెనీ రుణం ఎంత తీసుకుందో ఈ రేషియో ద్వారా మనం తెలుసుకోవచ్చు.
* Return on Equity.. ఈక్విటీ షేర్ హోల్డర్స్ పెట్టే డబ్బులు ఏవైతే కంపెనీలో ఉంటాయో దాని ద్వారా వ్యాపారాన్ని నడిపించి ఎంత లాభాలు ఇవ్వగలుగుతున్నామో అనేది Return on Equity ద్వారా తెలుస్తుంది.
* Interest Coverage Ratio.. ఒక కంపెనీ రుణం తీసుకుని వ్యాపారాన్ని నడిపిస్తే, వాళ్ళకి వచ్చే ఎర్నింగ్ ఫర్ ఇంటరెస్ట్ నుంచి ఇంటరెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. దీన్ని ఎంత సులువుగా పే చేయగలుగుతున్నారో అనేది చూడాల్సి ఉంటుంది.
ఈ రేషియోస్ తర్వాత కొన్ని టర్నోవర్ రేషియోస్ ను పరిశీలించాలి. కంపెనీకి సంబంధించిన ఇన్వెంటరీ ఆస్తిని మిగతా ఆస్తితో పోల్చుకుంటే కంపెనీ ఎంతలా ఆస్తిని జనరేట్ చేస్తుందో తెలుస్తుంది.
WHAT IS QUALITATIVE ANALYSIS
కేవలం లెక్కలు, ఫినాన్షియల్ విషయాలు మాత్రమే కాకుండా, నాన్ ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ కూడా కంపెనీ ఎదుగుదలకి, వాళ్ళ పర్ఫార్మెన్స్ కి చాలా వరకు సహకరిస్తాయి. ఇలాంటివన్నీ క్వాలిటేటివ్ ఎనాలసిస్లోకి వస్తాయి.
* కంపెనీకి సంబంధించిన కార్పోరేట్ గవర్నెన్స్ కావచ్చు.. మేనేజ్ మెంట్ డీల్స్ కావచ్చు… పోటీదారుడు దగ్గర లేనివి, వీళ్ళ దగ్గర ఉన్నవి ఏమిటి అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి.
* కంపెనీకి సంబందించి బిజినెస్ మోడల్ ఎంత బాగుందో చుడాలి. Scalable ఎంతలా ఎదుగుతుంది.
* కంపెనీకి సంబంధించి నాయకత్వం ఎలా ఉంది? వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏమిటి, వాళ్ళ అనుభవాలు ఏమిటి అన్నీ తెలుసుకోవాలి.
* కంపెనీకి సంబంధించి corporate governance ఎటువంటి పాలసీ ని ఫాలో అవుతున్నారో, వాళ్ళకున్న రైట్స్ ఏమిటో తెలుసుకోవాలి.
* ఒక కంపెనీని చూసేటప్పుడు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ అడ్వంటేజ్ మిగతా వాళ్ళకి దొరకదు. దీనినే ఎకానమిక్ మోట్ అంటాం. ఇలాంటి ఎకానామిక్ మోట్ ఎంతలా ఉందనే విషయాన్ని చూసి అలాంటి కంపెనీలనుసెలెక్ట్ చేసుకోవాలి.
2015లో Nestle కంపెనీ లీడింగ్ ప్రోడక్ట్ అయిన Maggi ని ఎక్కువ ఎనర్జీ కంటెంట్ ఉందని బ్యాన్ చేశారు.
అప్పుడు 80 శాతం మార్కెట్ లీడర్ షిప్ ని కోల్పోయి ఈ కంపెనీ ఆదాయాలు కూడా పడిపోయాయి.
TIPS FOR FINDING MULTI BAGGER STOCKS
COMPATATIVE ADVANTAGE
ఏ కంపెనీకైతే కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఎకానమిక్ మోడ్‌లో ఉంటుందో అటువంటి కంపెనీలను మనం ఎంచుకోవాలి. అంటే మంచి పోటీతత్వంతో, ఇతర కంపెనీలను ఎంత ధీటుగా ఎదుర్కుంటుందో అనే విషయాన్ని మనం పరిశీలించాలి.
STRONG MANAGEMENT TEAM.. కంపెనీ మేనేజ్ మెంట్ ఎంత బలంగా ఉంటే అంత మంచిది.
GROWING INDUSTRIES
మారుతున్న కాలాన్ని బట్టి, కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఙానాన్ని అందిపుచ్చుకుని వ్యాపారం చేసే కంపెనీలను ఎంచుకుంటే వాటికి లాభాల స్వీకరణ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. వాటి వ్యాపార విధానంపై నమ్మకం ఉంటే మరింత లోతుగా పరిశీలించి అటువంటి కంపెనీస్ ని ఎంచుకోవడం మంచిది.
HISTORY OF CONSISTENT GROWTH
మనం ఎంచుకుంటున్న కంపెనీ ఎంత లాభం ఇచ్చిందో, ఎంత స్థిరంగా లాభాలను పొందుతుందో పరిశీలించాలి. గతం నుంచి ఎంతలా ఎదిగారో చూసుకుంటేనే బెటర్.
DON’T IGNORE SMALL CAP STOCKS
ఎక్కువగా స్మాల్ క్యాప్ కంపెనీలను ఇగ్నోర్ చేస్తాం. కానీ అటువంటి కంపెనీలకు పొటన్సియల్ కూడా ఎక్కువగా ఉంటుంది. అవి గ్రోత్ అవడానికి బాగా అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటి కంపెనీ మల్టీబ్యాగర్ రిటర్న్ ఇస్తాయి.
GIVE TIME, BE PATIENT
మల్టీ బాగర్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేటపుడు మనకి ఓర్పు, సహనం చాలా ముఖ్యం.