సొంతిల్లు సామాన్యుల కల. దీనికోసం జీవితాంతం కష్టపడుతుంటారు. అయితే ఈ రోజుల్లో ఇల్లు యజమాని కావడమంటే ఆషామాషీ కాదు. అయినా కూడా సొంతింటి కల నెరవేర్చుకునేందుకు చాలామంది ఎన్నో ప్రయాసలు పడుతున్నారు. కలల సౌధం నిర్మించుకుని.. ఓ ఇంటి వారయ్యేందుకు ప్రతిక్షణం కష్టపడుతున్నారు. ఇందుకోసం డబ్బును పోగు చేస్తుంటారు. మరికొంత హోం లోన్ తీసుకుని ఇంటిని కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత దీర్ఘకాలం పాటు ఈఎంఐలు కడుతూ ఉంటారు. దీనిపై ప్రతినెలా వడ్డీ భారం పడుతుంది. దీంతో నెలవారీ ఈఎంఐల కోసం తిరిగి కష్టపడక తప్పదు. ఈ లోపు అనుకోకుండా ఏదైనా డబ్బు అవసరం ఏర్పడితే ఈఎంఐలకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో హోం లోన్ అవసరం లేకుండా ఇంటిని ఎలా కొనుగోలు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హోమ్ లోన్ కంటే ఇన్వెస్ట్ చేయడమే మేలు
invest instead of home loan
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. జీవితంలో ఆ రెండు ఘట్టాలు దాటిన వారు సప్త సముద్రాలు దాటినట్టే లెక్క. అయితే లోన్ తీసుకొని ఇల్లు కొంటే అది ఆస్తి అవ్వదు.. అప్పు అవుతుంది. నెలవారీ మీ సంపాదనలో అన్ని ఈఎంఐలు కలిపి 50 శాతానికి మించకూడదు. ఒకవేళ ఈ పరిధిదాటితే ఇతర ఖర్చులకు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకే ప్రతినెలా వచ్చే ఆదాయం ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. అప్పటికే ఏదైనా లోన్లు, ఇతర అవసరాలకు చెల్లించాల్సినవి ఉంటే అందుకు తగిన ప్రణాళిక వేసుకోవాలి. తీరా ఇల్లు తీసుకుని ఈఎంఐలు చెల్లించకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నెలవారీగా రుణాల మొత్తం ఎంతో లెక్క తీయండి. క్రెడిట్ కార్డు చెల్లింపులు, ఇతర అప్పులు ఎంతనే వివరాలను తెలుసుకోవాలి. మారుతున్న జీవన శైలిలో భాగంగా భవిష్యత్తులో అవసరాలకు కొంత డబ్బును సమకూర్చుకోవాలి. పిల్లల చదువులు, ఇంటి అవసరాల కోసం నగదు పోగు చేసుకోవాలి. అనివార్య కారణాలతో జాబ్ పోయినా ఈఎంఐలు, ఇంటి ఖర్చులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు నుంచే ప్రణాళిక ప్రకారం డబ్బు కూడబెట్టాలి. అందుకోసం క్రమానుగత పెట్టుబడులను ఎంచుకుంటే మేలు. ఏదైనా అనారోగ్య పరిస్థితి తలెత్తితే కుటుంబ ఇబ్బంది పడకుండా మంచి ఆరోగ్య బీమా తీసుకోవాలి.
మ్యుచువల్ ఫండ్స్‌లో పెడితే లాభం
ఇళ్లు కొనాలనే ఆలోచన వచ్చినప్పడు బ్యాంకులో అప్పు తీసుకొని కొనాలా లేదా మ్యూచువల్ ఫండ్‌లో కొంతకాలం పాటు పెట్టుబడి పెట్టి అప్పడు వచ్చిన రాబడితో కొనాలా అనే విషయంలో కొంత స్పష్టత కలిగి ఉంటే మనం మంచి నిర్ణయం తీసుకోగలుగుతాం.
ఇక్కడ అప్పు చేసి ఇళ్లు కొనే కంటే ముందుగా మ్యూచువల్ ఫండ్‌లో కొంతకాలం ఇన్వెస్ట్ చేసి ఆ మొత్తంతో ఇళ్లు కొనడం ఉత్తమం అని నిపుణులు చెప్తున్నారు.
మీరు కొనాలనుకునే ఫ్లాట్ ధర రూ.50 లక్షలు అనుకుందాం. అందులో రూ.10 లక్షలు డౌన్ పేమెంట్ కట్టేందుకు సిద్ధంగా ఉంటే మరో రూ.40 లక్షలు లోన్ తీసుకోవాల్సిందే కదా. ముందుగా మీ దగ్గరున్న రూ.10 లక్షలను 15 శాతం వృద్ధి చెందే మ్యుచువల్ ఫండ్స్‌లో పదేళ్ల వరకూ ఇన్వెస్ట్మెంట్ చేయండి. దాంతో రూ.40.4 లక్షలు సమకూరుతాయి.
ఒకవేళ రూ.40 లక్షలు లోన్ తీసుకుని ఇప్పుడే ఇళ్లు కొనుగోలు చేస్తే 20 ఏళ్ల వ్యవధికిగాను 9 శాతం వడ్డీ లెక్కిస్తే నెలవారీ ఈఎంఐ రూ.36 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా అందులో నుంచి రూ.10 వేలు ప్రస్తుతం ఉంటున్న ఇంటి కిరాయికి కేటాయించవచ్చు. మిగతా రూ.26 వేలను పెట్టుబడి విధానం ద్వారా 14 శాతం వడ్డీ సమకూరే మ్యూచువల్ ఫండ్ ఎంచుకుని పదేళ్లపాటు ఇన్వెస్ట్ చేయవచ్చు. దాని ద్వారా మొత్తం రూ.68 లక్షలు సమకూరుతాయి.
– లమ్సమ్ గా పెట్టుబడి పెట్టిన రూ.10 లక్షల నుంచి రూ.40 లక్షలు, ప్రతినెలా ఈఎంఐ చెల్లించాల్సిన రూ.26 వేల నుంచి పదేళ్ల తర్వాత రూ.68 లక్షలు కలిపి మొత్తం మీ చేతిలో రూ.1.08 కోట్లు ఉంటాయి. రియల్ఎస్టేట్ ద్రవ్యోల్బణాన్ని లెక్కించినా ఆ డబ్బుతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పదేళ్ల తర్వాత ఫ్లాట్ కొనుగోలు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మనీ నాలెడ్జ్ అవసరం
Money knowledge is required
ఒకవేళ ఇన్‌కమ్ పెంచుకోలేని స్థితి లో ఉంటే కంపల్సరీగా తక్కువ రెంట్ కి ఇల్లు అద్దెకు తీసుకోవాలి. రూ. పదివేలు అనేది రెంట్ పే చేసుకొని 20 వేలును ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అప్పుడు 20k ని 12 ఇయర్స్ పాటు 12% రిటర్న్స్ తో ఇన్వెస్ట్ చేస్తే సుమారు రూ.65 లక్షల అమౌంట్ వస్తుంది. ఆ తర్వాత రూ. 65 లక్షల హౌస్ మాత్రమే కొనుక్కోవాలి. ఒకవేళ ఇంకా పెద్ద ఇల్లు కావాలంటే ఇన్‌కమ్ పెంచుకోవాలి. ఇందుకోసం ప్రతిఒక్కరూ మనీ నాలెడ్జ్‌తో ముందుకు సాగాల్సి ఉంటుంది. ఒకవేళ సొసైటల్ ప్రెజర్ తో బ్యాంక్స్ లో లోన్ తీసుకుని ఇల్లు కొంటే జీవితాంతం బ్యాంకు కి మీరు ఖైదీ అయిపోవడం ఖాయం.
కొన్ని రోజులకి బ్యాంకు వాళ్ళు వచ్చి ఈ హోమ్ లోన్ మీద టాప్ అప్ లోన్ ఇస్తామంటారు. పిల్లలకి ఫీజులు కట్టాలనో లేదా పెళ్లిళ్లకని .. ఏదో ఒక అవసరం వచ్చి మీరు టాప్ అప్ లోన్ తీసుకుంటే రిటైర్మెంట్ తర్వాత కూడా ఈ లోన్ ట్రాప్ నుంచి బయటకు రాలేరు.
లోన్‌కు దూరంగా ఉండడం మేలు
Better to stay away from loan
ఉద్యోగం చేసి సంపాదించే వాళ్ళు లోన్స్ కి దూరంగా ఉండడం మేలు. మనశాంతికి దగ్గరగా ఉంటారు. లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కునేటట్లయితే అది మనకి ఆస్తి అవ్వదు. ఆస్తి అంటే మన పాకెట్ లోకి డబ్బులు రావాలి. ఇప్పుడు మీరు హోమ్ లోన్ తీసుకొని ఇంటిని కొన్న తర్వాత దానిని రెంట్‌కు ఇస్తే.. కొంతవరకు ఈఎంఐ భారం తగ్గుతుంది. హౌస్ కి చేసే రిపేర్స్, రెనోవేషన్స్, దానికి కట్టే టాక్స్, ఇన్సూరెన్స్ లు.. ఇవన్నీ కట్ అయిపోగా ఇంకా మీ పాకెట్ ఏదైనా మిగిలితే అది ప్రాఫిట్ అవుతుంది. అంటే అప్పుడు అది మీకు అసెట్ అవుతుంది. అలాకాకుండా ప్రతి నెలా మీ జీతంలో నుంచి హోం లోన్‌కు ఈఎంఐ కడితే అది మీకు లయబిలిటీ అవుతుంది. అంటే అది మీకు భారం అవుతుంది తప్ప ఆస్తి అవ్వదు.
ఇన్వెస్ట్మెంట్ అంటే ట్రేడింగ్ కాదు.. Investment is not trading
మనీ విషయంలో ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా మంది ట్రేడింగ్ అనుకుంటారు. అయితే దయచేసి ట్రేడింగ్ జోలికి మాత్రం వెళ్ళవద్దు. ట్రేడింగ్ వేరు ఇన్వెస్ట్మెంట్ వేరు. ట్రేడింగ్ అంటే గ్యాంబ్లింగ్ లాంటిది. ఇన్వెస్ట్మెంట్ అంటే మనం బాగా అనాలసిస్ చేసి లాంగ్ టర్మ్ లో మనీని అలా పెట్టుబడిగా పెట్టి ఉంచేస్తాం. కొన్నేళ్ల తర్వా త పెద్దమొత్తంలో రిటర్న్స్ వస్తాయి. జాబ్ చేసే వాళ్లు కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ట్రేడింగ్ లో పెట్టి రిస్క్ చేయడం మంచిది కాదు.
హోం లోన్ లో ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి
If you have to take a home loan
ఒకవేళ తప్పనిసరిగా హోం లోన్ తీసుకోవాల్సి వస్తే మాత్రం ఈ కింది విషయాలను కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.
* లోన్ టెన్యూర్ తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే తక్కువ కాల వ్యవధిని మాత్రమే ఎంచుకోవాలి. ఇక్కడ అప్పడు త్వరగా తీరిపోతుంది. ఇలా అయితే వడ్డీ అనేది కూడా తగ్గుతుంది.
* లోన్ అమౌంట్ తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే మీరు డౌన్ పేమెంట్ ఎక్కువగా కట్టగలగాలి. అప్పుడు మీకు వడ్డీ తగ్గుతుంది.
* బ్యాంకు వాళ్ళు సైన్ చేపించుకునే డాక్యుమెంట్స్, లోన్ అగ్రిమెంట్స్‌లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకటికి రెండు సార్లు చదువుకొని దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో చాలా హిడెన్ థింగ్స్ ఉంటాయి. మనకి తెలియనివి భవిష్యత్‌లో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. .
* ఎప్పుడైనా కొంత డబ్బులు మనకు సమకూరితే లోన్ ని త్వరగా ప్రీ పే చేయడానికి ట్రై చేయాలి. ఇలా అయితే ముందుగానే లోన్‌ను తీర్చేయవచ్చు.