
మీరు కోటీశ్వరులు కావాలని కలలుగంటున్నారా? అయితే మీ కలలను నిజం చేస్తూ మిమ్మల్ని కోటీశ్వరులను చేసే గోల్డెన్ రూల్స్ ఎన్నో ఉన్నాయి. ఈ పర్సనల్ ఫైనాన్స్ రూల్స్ పాటించినట్లయితే కచ్చితంగా ధనవంతులు అవ్వొచ్చు. అయితే ధనవంతులు అవ్వాలనే ఆశ ఉంటే సరిపోదు. దానికి తగ్గ ఆలోచనలు ఉండాలి.
ప్రతి ఒక్కరూ వేగంగా డబ్బులు సంపాదించి ధనవంతులు కావాలనుకుంటారు. కానీ అది అంత ఈజీ కాదు. డబ్బును తక్కువ సమయంలో భారీగా పెంచుకోవడం అంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకు పర్సనల్ ఫైనాన్స్ పై పూర్తి అవగాహన ఉండాలి. డబ్బును ఎలా హ్యాండిల్ చేయాలి, ప్రతి నెలా బడ్జెట్ ను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, పొదుపు ఎలా చేసుకోవాలి, ఎందులో పెట్టుబడి పెట్టాలి అనే విషయాల గురించి పూర్తిగా తెలిసి ఉన్నప్పుడే మీరు మీ డబ్బును పెంచుకుని కోటీశ్వరులు కావచ్చు. దీని కోసం కొన్ని పర్సనల్ ఫైనాన్స్ రూల్స్ ఉన్నాయి. వాటిని పాటిస్తే అది అసాధ్యమేమీ కాదు. ప్రపంచంలో ఎక్కవ మంది 5 రకాల సోర్సస్ ద్వారా ధనవంతులు అవుతున్నారు. అందులో మొదటిది…
Business Ownership and Entrepreneurs
వ్యాపార యాజమాన్యం, వ్యవస్థాపకుడు
ప్రపంచంలో ధనవంతులుగా ఎదిగిన వారంతా బిజినెస్ లు చేసే సక్సెస్ అయినవారే. 66 శాతం మంది బిలీనియర్స్ నెట్ వర్త్ వాళ్ల ప్రైవేటు బిజినెస్ నుంచి వస్తుంది. ఎందుకంటే వాళ్ల entrepreneur మైండ్ సెట్ వారి సక్సెస్ కు కారణం. ఈ మైండ్ సెట్ ఉన్నవాళ్లు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఎప్పటికప్పుడు ఆ ఆలోచనలను మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. దీనిలో చాలా రిస్క్ ఉంటుంది. UBS, WEALTH X సర్వే ప్రకారం 55.8శాతం బిలీనియర్స్ నెట్ వర్త్ అంతా కూడా బిజినెస్ ఓనర్ షిప్ నుంచి వచ్చిందే.
Wealth creation.. సంపద సృష్టి
ఇదే రిపోర్ట్ లో బిలీనియర్ ఎంటర్ ప్రీనియర్ 3 రకాల ఇండస్ట్రీస్ లో ఎంత డబ్బు సంపాదించారో తెలుసుకుందాం.
– Technology ఇండస్ట్రీ లో బిలీనియర్స్ ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసుకున్నారు.
– Consumer & retail ఇండస్ట్రీ లో కూడా ఎక్కువ డబ్బును సంపాదించి ఎంతోమంది ధనవంతులు అయ్యారు.
– Real estate లోనూ ఇన్వెస్ట్ చేసి ఎక్కువమంది ధనవంతులు అయ్యారు.
ఎవరైతే రిస్క్ చేసి బిజినెస్ చేస్తారో, ఆ బిజినెస్ ని మంచి ఆలోచనలతో డెవలప్ చేసుకుంటారో వాళ్లు తప్పకుండా ధనవంతులు అవుతారు.
45 శాతం ధనవంతులు కూడా బిజినెస్ లు చేసి బిలీనియర్స్ అయ్యారు.
WFDSA (World Fedaration Of Direct selling Association) డేటా ప్రకారం 36 మిలియన్ పీపుల్ నెట్ వర్క్ మార్కెటింగ్ ద్వారా ధనవంతులు అవుతున్నారు.
చైనా, అమెరికా, సింగపూర్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో లీగల్ గా ఉండే కంపెనీలతో రీసెర్చ్ , బిజినెస్ చేస్తూ పదేళ్లలో 36 మిలియన్ పీపుల్ ధనవంతులయ్యారు. వీళ్లు కూడా కేవలం మిడిల్ క్లాస్ నుంచి వచ్చినవారే. సామాన్య, మధ్య తరగతి వర్గాలు తక్కువ సమయంలో ధనవంతులుగా మారేందుకు మార్కెటింగ్ మంచి ఆప్షన్. ఇందులో లీగల్, ఇల్లీగల్ తెలుసుకుని కంపెనీతో మనం ముందుకు వెళ్తే మంచి రిజల్ట్ చూడగలుగుతాం. కాగా కొంతమంది ఇన్వెస్ట్ మెంట్ చేసి ధనవంతులవుతారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
* అసలు సామాన్య ప్రజలకు ఎప్పటికీ అర్థం కాని ఒక విషయం ఏమిటంటే.. ధనవంతులు వారి సంపదను ఎలా రెట్టింపు చేసుకుంటారు అన్నదే. ఏళ్లు గడిచినా ఈ సంపద అంతరాయం పెరుగుతూనే ఉంది తప్ప తరగటం లేదు. 2023 వెల్త్ రిపోర్ట్ ప్రకారం అల్ట్రా హై నెట్ వర్త్ వ్యక్తులు తమ సంపదలో 50 శాతాన్ని ఇళ్లు, ఈక్విటీల కొనుగోలులో పెట్టుబడి పెడుతున్నట్లు వెల్లడైంది. ఈ వర్గంలో నికర విలువ మూడు కోట్ల డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఈ కేటగిరీకి చెందిన ధనికులు తమ మొత్తం సంపదలో దాదాపు 32 శాతం ఇళ్లను కొనుగోలు చేసేందుకు వెచ్చిస్తున్నారు. వీరు సగటున 3.7 ఇళ్లు కలిగి ఉన్నారు.
* అల్ట్రా రిచ్ కేటగిరీలోని వ్యక్తులు తమ మొత్తం సంపదలో 18 శాతాన్ని ఈక్విటీ షేర్లలో పెట్టుబడిగా పెట్టినట్లు నివేదిక పేర్కొంది. అలాగే తమ సంపదలో 14 శాతాన్ని సంపన్నులు కమర్షియల్ ప్రాపర్టీ కొనుగోలు కోసం వెచ్చిస్తున్నట్లు వెల్లడైంది. వీరికి ఆఫీసులు, పారిశ్రామిక రియల్ ఎస్టేట్‌లలో ప్రత్యక్ష యాజమాన్యం ఉంటుంది. అలాగే సంపదలో 12 శాతాన్ని బాండ్లలో పెట్టుబడి పెట్టగా.. 6 శాతం సంపదను ప్రైవేట్ ఈక్విటీలు లేదా వెంచర్ క్యాపిటల్ రూపంలో పెట్టుబడిగా పెట్టారు. అలాగే మొత్తం సంపదలో ఐదు శాతాన్ని కమర్షియల్ ప్రాపర్టీ ఫండ్‌లో పెట్టుబడులు కలిగి ఉన్నారు.
* మరో పక్క ధనవంతులు సేఫ్ హెవెన్ బంగారం, బిట్ కాయిన్ వంటి క్రిప్టో ఆస్తులతో పాటు యాంటిక్స్, పెయింటింక్స్ వంటి కళల్లో తమ సంపదను పెట్టుబడిగా పెడుతున్నారని నివేదిక పేర్కొంది. నవంబర్ 2022లో 500 మంది అసెట్ మేనేజర్ల మధ్య నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదిక తయారు చేయబడింది. ఈ అసెట్ మేనేజర్లు సంపన్నులకు చెందిన దాదాపు 205 ట్రిలియన్ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తున్నారు.
INVESTMENT.. పెట్టుబడి
భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక అవసరాల కోసం ఇప్పటి నుంచే పెట్టుబడి పెట్టాలని పెద్దలు సూచిస్తుంటారు. ఇందుకోసం చాలా మంది రిస్క్ లేని మార్గాలను ఎంచుకుంటారు. ఇన్వెస్ట్ మెంట్ అంటే రిటైర్మెంట్ కోసం లేదా పిల్లల చదువుల కోసం మనం ప్లాన్ చేసుకుంటాం. కాని కొంతమంది పాసివ్ రిటర్న్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు. అలాంటివాళ్లని ULTRA RICH INVESTOR అంటారు. ఇటువంటి వారు తమ దగ్గర ఉన్న అమౌంట్ ని ఓ చోట ఇన్వెస్ట్ చేస్తారు. దాని ద్వారా వచ్చే రిటర్న్స్ ను మళ్లీ వేరోచోట ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా మంత్లీ రిటర్న్స్ వచ్చేలా ఇన్వెస్ట్ చేస్తారు. ప్రపంచంలో 30 శాతం జనాలు ఈ విధంగా ఇన్వెస్ట్ చేసి ధనవంతులు అవుతున్నారు.
* 27 శాతం మంది EQUITY లో ఇన్వెస్ట్ చేసి ధనవంతులు అయ్యారు.
* 20 శాతం మంది CASH INVESTMENT లో ఇన్వెస్ట్ చేసి ధనవంతులు అయ్యారు.
* 18 శాతం మంది BONDS లో ఇన్వెస్ట్ చేసి ధనవంతులు అయ్యారు.
* 16 శాతం మంది REAL ESTATE లో ఇన్వెస్ట్ చేసి ధనవంతులు అయ్యారు.
PRIVATE EQUITY, FUNDS లో ఇన్వెస్ట్ చేస్తూ ప్రతినెలా పాసివ్ ఇన్ కమ్ వచ్చేలా ప్లాన్ చేసుకుని ధనవంతులవుతున్నారు.
WHAT ARE THE HIGH PAYING PROFESSIONS
చాలా మంది భారీ భారీ పెట్టుబడులతో సొంత వ్యాపారాలు లేకుండానే ధనవంతులవుతున్నారు.
సొంతంగా, వ్యక్తిగతంగా కొన్ని రకాల ప్రొఫిషినల్ సర్వీసులు, లేదా ఉన్నత ఉద్యోగం చేస్తూ అధికంగానే సంపాదిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. అధిక జీతం ఇచ్చే వృత్తులూ కొన్ని ఉన్నాయి. అయితే ఇలాంటి వృత్తులు ఏవీ? వాటిలో ఉన్న సంపాదన అకాశాలను ఓసారి చూద్దాం.
BUSINESS EXECUTIVES & MANAGERS
బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లు & మేనేజర్లు
ఈ PROFESSION ద్వారా ధనవంతులు అయ్యేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక సర్వే ప్రకారం Business Executives & Managers యావరేజ్ నెట్ వర్త్ 30 మిలియన్ డాలర్లు ఉంటుంది. వీళ్లు కంపెనీలో మేనేజర్ లేదా ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఉంటారు. ఆ కంపెనీ డెవలప్ మెంట్ కి వీళ్లు హెల్ఫ్ చేస్తారు. వీళ్లు ఆ కంపెనీలో శాలరీతో పాటు పర్సంటేజ్ తీసుకుంటారు.
LAWYERS.. న్యాయవాదులు
కార్పోరేట్ లాయర్ ప్రొఫెషన్ ద్వారా ధనవంతులు అయ్యేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కార్పొరేట్ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ఏటా దీని పరిధి విస్తృతమవుతోంది. కార్పొరేట్ కంపెనీలకు న్యాయపరంగా అనేక సవాళ్లు ఎదురవుతుంటాయి. వీటి పరిష్కారం కోసం కార్పొరేట్ లాయర్ల(Corporate Lawyers)కు డిమాండ్ పెరగడంతో పాటు పుష్కలమైన అవకాశాలు లభిస్తున్నాయి. అయితే ఈ రంగంలో నిలదొక్కుకోవాలంటే సెల్ఫ్ డెవలప్‌మెంట్, గ్రోత్‌పై దృష్టారించాల్సి ఉంటుంది.
కార్పొరేట్ రంగంలో రాణించాలంటే, దానికి సంబంధించిన చట్టాలపై లోతైన అవగాహన ఉండాలి. అకౌంటెన్సీ, బిజినెస్ రిస్క్ మేనేజ్‌మెంట్, బిజినెస్ స్ట్రాటజీ, బిజినెస్ డెవలప్‌మెంట్ వంటి వాటికి సంబంధించిన అంశాలపై మంచి పట్టు సాధించాలి. అప్పుడే క్లయింట్ల తరఫున కోర్టుల్లో మెరుగ్గా వాదించడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ వృత్తిలో ఉన్నవారు కూడా ధనవంతులయ్యారు.
INVESTMENT BANKERS
ఈ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్స్ ఏం చేస్తారంటే ఏదైనా స్టార్టప్ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ ఇస్తారు. అలాగే బ్యాంకులాగా మెంటైన్ చేస్తారు. ఇలా ఇన్వెస్ట్ చేసేవారు కూడా చాలా మంది ధనవంతులు అయ్యారు.
సాధారణ బ్యాంకింగ్ కు పూర్తి భిన్నంగా కేవలం పెట్టుబడుల కు సంబంధించి ఏర్పాటు చేసే ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటారు. ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ద్వారా కార్పొరేట్ కంపెనీలు, సంస్థలు, ప్రభుత్వాలకు మూలధనం, పెట్టుబడి సమకూర్చే పనులు చేసిపెడుతుంటారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు సంబంధించిన సెక్యూరిటీ ల విక్రయం, కొనుగోలు, వివిధ మార్గాల్లో నిధుల సమీకరణ, రుణాల మంజూరు మార్గాల అన్వేషణ, వాటి ఏర్పాటు వంటి విభిన్న అంశాలు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ పరిధి లోకి వస్తాయి.
How does INVESTMENT BANKS work?
ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థలు సబ్జెక్టు ఎక్స్పర్ట్ లతో కూడిన బృందాలను కలిగి ఉంటాయి. అవి ఒక కార్పొరేట్ కంపెనీ లేదా ప్రభుత్వానికి ఏదేని పెద్ద ఆర్థిక లావాదేవీ విషయంలో మధ్యవర్తి గా వ్యవహరిస్తాయి. సంబంధిత రంగంలో తమకున్న అపార అనుభవంతో తమ క్లయింట్ కు తగిన సలహాలు ఇస్తూ అవి కోరుకున్న ప్రాజెక్టు లేదా మరో కంపెనీ కొనుగోలు కు ఉన్న అవకాశాలు, అలాగే అవరోధాలను క్షుణ్ణంగా పరిశీలించి ఒక నివేదిక రూపంలో ఇస్తాయి. వీటి ఆధారంగానే కంపెనీల యజమానులు, ప్రభుత్వ అధినేతలు తగిన నిర్ణయాలను తీసుకుంటారు.
* ఇతర కంపెనీల విలీనాలు, కొనుగోళ్ల అంశంలో సలహాలు, సూచనలు ఇవ్వటం, కంపెనీ విలువ మదింపు చేయటం వంటి అంశాలు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తాయి. చాలా మట్టుకు సంప్రదాయ బ్యాంకులు ఈ పనులు చేయవు. కాబట్టి, వాటిలోనే ఒక విభాగాన్ని పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కోసం నియమించటం లేదా ఒక ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేసి, తద్వారా ఈ విభాగంలో సేవలు అందించటం చేస్తుంటాయి. తాము ఇచ్చిన సేవలకు తమ క్లయింట్ల వద్ద సేవా రుసుము తీసుకుంటాయి.
* సాంప్రదాయ బ్యాంకులవలే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు తమ కస్టమర్ల నుంచి ఎటువంటి డిపాజిట్ల ను సమీకరించవు. కేవలం తమ ఆర్థిక సలహా సేవలు అందించటం ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తాయి. ప్రైవేటు కంపెనీలు పబ్లిక్ ఆఫర్ల ద్వారా తమ వాటాలను విక్రయించి నిధులను సమీకరించేందుకు ఇవి తోడ్పడతాయి. భారీ ప్రోజెక్టుల కొనుగోలు, వాటి నిర్వహణ విషయంలో కూడా సలహాలు, సూచనలు అందిస్తాయి.
* ఒక ప్రైవేట్ కంపెనీ తన షేర్లను విక్రయించటం ద్వారా ప్రజల నుంచి నిధులను సమీకరించాలంటే ఇనీషియల్ పబ్లిక్ ఇష్యూ (ఐ పీ ఓ) కు వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం సెక్యూరిటీ ఎక్స్చేంజీ లతో పాటు మార్కెట్ నియంత్రణ సంస్థ అయినటువంటి సెబీ నుంచి అనేక అనుమతులను పొందాల్సి ఉంటుంది. షేర్ల విభజన, వాటి విలువ మదింపు, యాంకర్ ఇన్వెస్టర్ల అన్వేషణ తో పాటు చాలా సంక్లిష్టమైన డాక్యుమెంటేషన్ అవసరం అవుతుంది. కాబట్టి ప్రైవేట్ కంపెనీ లేదా… ఒక ప్రభుత్వ రంగ కంపెనీ ఈ ప్రక్రియ ను సమర్థంగా చేసిపెట్టే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థల సేవలను పొందుతాయి. ఒక కంపెనీ ఇతర మార్గాల్లో నిధుల సమీకరణ చేపట్టాలన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సేవలు అవసరం.
Management consultant
నిర్వహణా సలహాదారుడు
ఏదైనా వ్యాపారం బాగా నడవకపోతే అప్పుడు మేనేజ్ మెంట్ కన్సల్టంట్ ను కలిస్తే.. ఆ వ్యాపారం ఎక్కడ ఆగిపోతుందో దానిని ఏ విధంగా ముందుకు నడిపించాలో వాళ్లు చెప్తారు. అప్పుడు వ్యాపారం బాగా రన్ అయితే అందులో వీళ్ళకి కొంత పర్సంటేజ్ వస్తుంది. బిజినెస్ డెవలప్‌మెంట్‌లో మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్లు కీలకంగా వ్యవహిస్తారు. అనేక సంస్థలు తమ బిజినెస్ ప్రాబ్లమ్స్‌ను పరిష్కరించుకునేందుకు మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్లను ఆశ్రయిస్తున్నాయి. వేల్యూ క్రియేట్ చేయడం, ప్రాసెస్‌ను అభివృద్ధి చేయడం, బిజినెస్ డెవలప్‌మెంట్‌కి అవసరమైన సూచనలు, సలహాలు అందించడం మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ల బాధ్యత. నేటి బిజినెస్ ఎకోసిస్టమ్‌లో మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్లు కీలకంగా మారారు.
Entertainment field
ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ఎంటర్ టైన్ మెంట్ ద్వారా వచ్చే డబ్బులతో ధనవంతులయ్యారు. అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఎంటర్ టైన్ మెంట్ ద్వారా ధనవంతులయ్యారు. మనలోని ఉన్న టాలెంట్ లేదా స్కిల్ ను అమ్ముకుని గొప్పగా రాణించిన వారంతా చాలా ముందంజలో ఉన్నారు. నేటి సాంకేతిక యుగంలో ఎన్నో అకాశాలు విస్తృతంగా పెరి గాయి. ఎన్నో అవకాశాలు మన చుట్టూ ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుని కొంత వర్క్ చేస్తే అనుకున్న దానికంటే అధికంగా నే సంపాదించవచ్చు. ఇలా కొన్ని ప్రత్యేక మైన రంగాల్లో ఎదిగిన వారంతా మిగిలిన వారి కంటే అధిక మొత్తంలో డబ్బులు సంపాదించి కోట్లాధిపతులు అయ్యారు.