
యురోపియన్ మార్కెట్స్ మన మార్కెట్ టైం లో ఓపెన్ అవుతాయి. అంటే మధ్యాహ్నం 2 గంటల తర్వాతే ఓపెన్ అవుతాయి. మెయిన్ మార్కెట్స్ అన్నీ మన మార్కెట్‌ను impact చేసేది ఆ సమయంలోనే. అయితే మార్కెట్ కు ముందు మనం వాటి కోసం ప్రిపేర్ అవ్వాల్సిన పనిలేదు. అవి positiveగా ఉంటే మన మార్కెట్లు పాజిటివ్‌గానే రియాక్ట్ అవుతాయి. ఒకవేళ అక్కడ negativeగా ఉంటే మన మార్కెట్లు నెగిటివ్‌గానే react అవుతాయి. కానీ Main theme అంతా US market పైనే ఉంటుంది. మన మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు gift nifty ఎక్కడ ఉందో చూస్తాం. అది పాజిటివ్ గా ఉంటే ముందు రోజు యూఎస్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూడాలి. అవి కూడా పాజిటివ్‌గా ఉంటే గిఫ్ట్ నిఫ్టీ రూపంలో reflect అవుతుంది.
యూఎస్ మార్కెట్స్ బాగున్నప్పుడు ఇండియన్ మార్కెట్ బాగుండడం సహజం. అక్కడ sadగా మార్కెట్స్ ఓపెన్ అయితే ఇండియాలో కూడా sadగానే ఉంటుంది. దీనికి opposite గా మార్కెట్ ఓపెన్ అయితే మనం కొంచెం లాజిక్‌గా ఆలోచించాలి. అక్కడ అలా మార్కెట్ ఉంటే మన దగ్గర ఎందుకిలా differentగా ఓపెన్ అయ్యిందని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే అంశాలను simplifiedగా ఆలోచించడం మొదలుపెడితే మార్కెట్ ఎందుకిలా ఉందో అర్థం అవుతుంది.
FIIS DATA
FIIS DATA అనేది INDEX కి సంబందించినది. ఉదాహరణకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మొదలైన వాటిని ఎక్కువగా సేల్ చేశారనుకోండి. ఎందుకు అలా చేసి ఉంటారని మనం ఆలోచించాలి. already negitive opinion ఉన్నప్పుడు వచ్చే ఇంకో negitive పెద్ద impact చూపిస్తుందా? అనేది తెలుసుకోవాలి. మార్కెట్ పెరిగిన తర్వాత పడిపోతుందని అందరూ అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. చిన్న చిన్నnegativesను పట్టించుకోకూడదు. important reason ఉంటే తప్ప మార్కెట్ పడిపోదని తెలుసుకోవాలి.
BOND YIELDS
ఇది biggest point. మనం బాండ్ ఈల్డ్స్ ను ట్రాక్ చేస్తూ రావాలి. బాండ్ ఈల్డ్స్ పెరిగితే మార్కెట్ కి మంచిది కాదు. ఒకవేళ పెరిగితే continuesగా పెరగాలి. ఈ రోజు పెరిగిన దాని బట్టి మార్కెట్ react అవ్వదు. అంతకు ముందున్న రోజుల్లో BOND YIELDS పెరుగుదల ఎలా ఉందో చూసుకోవాలి. బాండ్ ఈల్డ్స్ graphను గమనిస్తూ ఉండాలి. పెరుగుతూ ఉందా పడిపోతూ ఉందా అని చూసుకోవాలి. బాండ్ ఈల్డ్స్ పెరగడానికి స్కోప్ లేకపోతే పడిపోవడానికి వీలుంటుంది. ఉదాహరణకు ఒక 8 బేసిస్ పాయింట్లు లేదా 10, 20 బేసిస్ పాయింట్లు పెరిగితే ఆ రోజు మార్కెట్ పడిపోతుందని కాదు. ఒకవేళ 5 బేసిస్ పాయింట్లు పడితే మార్కెట్ పెరుగుతుందని analysis చేయడం correct కాదు. నిన్న పెరిగిందా.. అంతకుముందు బేసిస్ పాయింట్లు పెరిగాయా ? అన్నది తెలుసుకోవడం ముఖ్యం. ముందు నుంచి ఉన్న trendతో ఈరోజు ఎలా BOND YIELDS పెరుగుతున్నాయన్నదే మార్కెట్‌కు important. 100 బేసిస్ పాయింట్లు BOND YIELDS పెరిగి 3 బేసిస్ పాయింట్లు పడితే దానిని మార్కెట్ positiveగా తీసుకోదు. 100 బేసిస్ పాయింట్లు పడి 3 బేసిస్ పాయింట్లు పడితే అప్పుడు మార్కెట్ positiveగా తీసుకుంటుంది. ఒకవేళ 100 బేసిస్ పాయింట్లు పడి 20 బేసిస్ పాయింట్లు పెరిగిందనుకోండి దానిని మార్కెట్ negativeగా తీసుకోదు. ఎందుకంటే అంతకుముందున్న పరిస్థితులను మార్కెట్ చూస్తుంది. overall trend ఎలా ఉందన్నదే market చూస్తుంది.
DOLLAR INDEX
అంతర్జాతీయ కరెన్సీల బాస్కెట్‌కు సంబంధించి US డాలర్ విలువ US డాలర్ ఇండెక్స్ (USDX) ద్వారా అంచనా వేయబడుతుంది. USDXలో చేర్చబడిన ఆరు కరెన్సీలు యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యెన్, కెనడియన్ డాలర్, బ్రిటిష్ పౌండ్, స్వీడిష్ క్రోనా.
DOLLAR INDEXను మనం తరచూ గూగుల్ లో చెక్ చేసుకోవాలి. DOLLAR INDEX పెరిగితే మన మార్కెట్ కి అది negative. DOLLAR INDEX పడుతూ ఉందనుకోండి.. దానికి ముందున్న రోజుల్లో పరిస్థితులను కనెక్ట్ చేసుకోవాలి. బాండ్ ఈల్డ్స్ చాలా కీరోల్ పోషిస్తాయి. మనం ఇంత నమ్మకంగా మార్కెట్ పరంగా ఈ ర్యాలీలో బిల్డ్ చేసుకోవడానికి, హోల్డ్ చేయడానికి ముఖ్యకారణం బాండ్ ఈల్డ్. బాండ్ ఈల్డ్ ని కంట్రోల్ చేయగలిగే ఈవెంట్ ఏమిటంటే ఈ బాండ్ ఈల్డ్ ఫెడ్ వాళ్ళు ఏం మాట్లాడుతారో దానిబట్టే మూవ్ అవుతాయి. అందువల్ల యూఎస్ ఫెడ్ స్టేట్‌మెంట్ మనకి చాలా ముఖ్యం.
బెస్ట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఏది Which is the best small cap mutual fund
* డాలర్ ఇండెక్స్‌ను చూడటం ద్వారా ఈ కరెన్సీల సమూహంతో డాలర్ బలాన్ని అంచనా వేయవచ్చు. USDX పెరుగుతుంటే, డాలర్ వాటన్నింటికీ వ్యతిరేకంగా బలం పుంజుకుంటోందని అర్థం.
– USDX బలపడటానికి US ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడంతో సంబంధం ఉంది. రేట్లు పెరిగినప్పుడు, బాండ్‌లు డంప్ చేయబడతాయి.. వాటి ధరలు తగ్గడంతో, ఈ బాండ్ల దిగుబడి పెరుగుతుంది. దిగుబడులు ఎక్కువగా ఉన్నప్పుడు, ఈక్విటీల వంటి రిస్క్ అసెట్స్‌లో పెట్టుబడి పెట్టడానికి తక్కువ ప్రోత్సాహకం ఉంటుంది అందువల్ల స్టాక్ ధరలు తగ్గుతాయి.
FED UPDATES
మార్కెట్ మొత్తాన్ని ఇండైరెక్ట్ గా మూవ్ చేసేది ఫెడ్. యూఎస్ ఫెడరేషన్ అనుకుంటే ఒక్కరోజులోనే 5శాతం వరకు ఫాల్ చేయగలరు. ఆర్థిక అస్థిరతలకు కారణమైన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఫెడ్ చేస్తున్న చర్యలు చాలా కీలకం.
* ఫెడ్ రిలేటెడ్ గా మనం అనుకోవలిసినవి ఏమిటంటే Fed meeting, Fed speech, Fed members opinion.
మనకి వెబ్ సైట్లో ఎప్పుడెప్పుడు ఫెడ్ మీటింగ్ జరుగుతుందో తెలియజేసే డేటా ఉంటుంది. ఫెడ్ మీటింగ్స్ మార్కెట్ క్లోజ్ అయ్యాక జరుగుతాయి. ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్న సమయాల్లో రాత్రిపూట మన పోజిషన్స్ ఉంటే జాగ్రత్త పెట్టుకోవాలి.
* ఫెడ్ మీటింగ్ లో ఏం జరుగుతుందంటే వడ్డీ రేట్లు పెంచాలా లేదా అలాగే ఉంచాలా? అనే నిర్ణయం తీసుకుంటారు.
*ఫెడ్ చేసిన స్టేట్ మెంట్ కి బాండ్ ఈల్డ్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయో చూసుకోవాలి. ఫెడ్ స్టేట్ మెంట్స్ కి బాండ్ ఈల్డ్స్ పెరగాలి. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతాం అంటే బాండ్ ఈల్డ్స్ పెరుగుతాయి. వడ్డీరేట్లు పెరగడం, బాండ్ ఈల్డ్స్ పెరగడం మార్కెట్ కి మంచిదికాదు. వడ్డీ రేట్లు కట్ చేయడం మార్కెట్ కి మంచిది.
* ఫెడ్ నెగిటివ్ గా మాట్లాడితే బాండ్ ఈల్డ్స్ పెరుగుతాయి. మార్కెట్స్ పడతాయి. ఎందుకంటే ఫెడ్ ఇంకా నెగిటివ్ గా మాట్లాడుతారనే అంచనాతో బాండ్ ఈల్డ్స్ పెరుగుతాయి. ఫెడ్ నెగిటివ్ గా మాట్లాడకపోతే బాండ్ ఈల్డ్స్ కూల్ అవుతాయి.
-స్టాక్ మార్కెట్ ను ఏ రోజుకు ఆ రోజు మాత్రమే చూడకూడదు. దానిముందు రోజు పొజిషన్ ఎలా ఉందో చూసుకోవాలి.
* ఫెడ్ మీటింగ్లో వడ్డీరేట్లు గురించి నిర్ణయం తీసుకుంటారు. ఎకానమీ గురించి మాట్లాడుతారు.
బాండ్ ఈల్డ్ పెరుగుతుందంటే గవర్నమెంట్ బాండ్ వాల్యూ తగ్గుతుంది. బాండ్ ఈల్డ్స్ పెరగడం మార్కెట్ కి నెగిటివ్. బాండ్ ఈల్డ్ పెరిగితే ఈక్విటీ మార్కెట్ కి మంచిది కాదు. ఇదంతా ఫెడ్ చైర్మెన్ చేతిలో ఉంటుంది.
FED SPEECH
ఫెడ్ స్పీచ్ అనేది ఇక్కడ చాలా కీలకం. ఏదైనా ఈవెంట్ ఉంటే కొన్ని గ్లోబల్ ఎకానమీ రిలేటెడ్ గా ,సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కలిపి మాట్లాడుకుంటాయి. దాని ఆధారంగా మార్కెట్ మూమెంట్ ఉంటుంది.
FED MEMBERS OPINION
*ఫెడ్ మెంబర్స్ లో ఉన్న వ్యక్తులు మీటింగ్ జరిగిన తర్వాత వారి అభిప్రాయాలు తెలియజేస్తే ఆ ప్రభావం మార్కెట్ పై పడుతుంది.
* ఫెడ్ మెంబర్స్ INFLATION CONTROL, ECONOMY STABILIZE పైనే యోచిస్తారు.
ECONOMY STABILIZE చేయాలనుకున్నప్పుడు ఇన్ ఫ్లేషన్ పెరిగినా పర్వాలేదు అనుకుంటే మార్కెట్ పెరుగుతుంది. ఒక్కోసారి ఎకానమీ ఇంపాక్ట్ అయినా పర్వాలేదు కానీ ఇన్ఫ్లేషన్ తగ్గించాలి అనుకుంటారు. అప్పుడు స్టాక్ మార్కెట్ నెగిటివ్ గా ఉంటుంది.
FED MINUTES
ఫెడ్ మీటింగ్ లో మాట్లాడినవి, ఫెడ్ స్పీచ్ మెంబర్ ఒపీనియన్స్ ఇవన్నీ ఇందులోకి వస్తాయి. ఫెడ్ మీటింగ్ లో ఏ అప్ డేట్స్ వస్తే దానికి తగ్గట్టుగా ఫెడ్ మినిట్స్ అప్ డేట్ వస్తే ఫర్వాలేదు.
-MONTHLY DATA
-CONSUMER PRICE INDEX
-MONTHLY JOBS & JOBLESS CLAIM
-GDP (GROSS DOMESTIC PRODUCT)
-ISM MANUFACTURING & ISM SERVICES
పైనవన్నీ యూఎస్ కి సంబంధించినవి.
scenarios should be taken in the market
NORMAL SCENARIO
యూఎస్ కి సంబంధించిన ఇన్ప్లేషన్ 2 శాతానికి దగ్గరగా ఉంటే దానిని మనం నార్మల్ సినారియో అంటాం. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ 2 శాతానికి దగ్గరగా ఉంటుందో మంత్లీ రిలీజైన CONSUMER PRICE INDEX డేటా పెరిగినా మార్కెట్ పట్టించుకోదు. జాబ్స్ డేటా పెరిగితే మార్కెట్ కి పోజిటివ్. GDP (GROSS DOMESTIC PRODUCT) ISM MANUFACTURING & ISM SERVICES పెరిగితే మార్కెట్ కి పాజిటివ్. జాబ్ లెస్ క్లెయిమ్ పడడం మార్కెట్ కి మంచిది.
SPECIAL SCENARIO
-ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ 2 శాతం కంటే ఎక్కువగా ఉంటుందో అది స్పెషల్ సినారియో కిందకి వస్తుంది.
-ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండి, ఎకానమీ నెగిటివ్ ఉండడమే మార్కెట్ కి మంచిది.
-మంత్లీ జాబ్స్ డేటా ఎక్కువగా యాడ్ అవ్వకపోతే ఎకానమీ ఇంపాక్ట్ అయ్యిందని అర్థం.
-GDP (GROSS DOMESTIC PRODUCT) ISM MANUFACTURING & ISM SERVICES ఇవి నెగిటివ్ గా ఇంపాక్ట్ అయితే మార్కెట్ పోజిటివ్ గా తీసుకుంటాయి.
-ఎకానమీ పరంగా పోజిటివ్ డేటా వస్తే అది మార్కెట్ కి నెగిటివ్. ఈ రెండు కాంబినేషన్ మార్కెట్ కి పాజిటివ్.
– ఇన్ఫ్లేషన్ పెరిగి, మార్కెట్ ఎకానమీ పెరిగితే కచ్చితంగా ఫెడ్ వడ్డీరేట్లను పెంచుతుంది. ఇందులో జాబ్ లెస్ క్లెయిమ్ డేటా ఈ సినారియోలో పెరగాలి.
RBI MEETING (ఆర్‌బీఐ సమావేశం)
ఆర్బీఐ వడ్డీరేట్లు పెంచినా మార్కెట్ పట్టించుకోదు. ఈ మీటింగ్ లో బ్యాంక్ రిలేటెడ్ గా నిర్ణయాలు తీసుకుంటారు. మాన్సూన్స్ మార్కెట్లో ఇంపాక్ట్ అయితే మొత్తం అందరి ఇన్ కమ్స్ ఇంపాక్ట్ అవుతాయి. మనం అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీలో ఉన్నాం. కాబట్టి దీని ఎఫెక్ట్ మార్కెట్లో టెంపరరీగా ఉంటుంది.