
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని`
పథకంతో సువర్ణవకాశం
Golden opportunity with Central Govt.’Udyogini’ scheme
మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా! లేదా ఉన్న వ్యాపారాన్ని మరింత పెంచాలనుకుంటున్నారా? అయితే మరెందుకు ఆలస్యం. వెంటనే బ్యాంకుకు వెళ్లండి. అక్షరాలా రూ.3 లక్షల వరకూ లోన్ పొందండి. అయితే ఈ పథకం కుటుంబంలో మహిళలకేనండోయ్. అసలు ఈ లోన్ ఎలా పొందాలి. అర్హతలు ఏమిటి.. తదితర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగిని స్కీం పేరిట సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది కేవలం కుటుంబంలో ఉన్న మహిళలకే వర్తిస్తుంది. 2020లోనే కేంద్ర సర్కార్ ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే చాలామందికి దీనిపై అవగాహన లేక వినియోగించుకోలేకపోతున్నారు. వాస్తవంగా మహిళలకు ఇదొక సువర్ణావకాశం. ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నామో కచ్చితమైన ఆలోచన ఉంటే చాలు..సమీపంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో మధ్యవర్తుల ప్రమేయం అవసరంలేదు. ఎలాంటి రికమండేషన్లు అక్కర్లేదు. నేరుగా బ్యాంకుకు వెళ్లి మన వ్యాపార ఆలోచనలను చెప్పి లోన్‌కు దరఖాస్తుకు చేసుకోవచ్చు. మొత్తం 88 రకాల వ్యాపారాలకు అప్లై చేసుకోవచ్చు.
ఇలా చేయాలి..
ఎవరైతే కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నారో లేదా ఉన్న వ్యాపారాన్ని ఇంకా పెంచాలనుకుంటున్న మహిళలు నేరుగా బ్యాంకుకు వెళ్లి ఉద్యోగిని స్కీమ్ కి అప్లై చేద్దామనుకుంటున్నామని చెప్పాలి. ఎటువంటి వ్యాపారం, ఎక్కడ చేస్తాం, పెట్టబుడి, మిషనరీ తదితర వివరాలను బ్యాంకు అధికారులకు చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత బ్యాంకు సిబ్బంది మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. దానిని మనం నింపాల్సి ఉంటుంది.
షరతులివీ…
what are the conditions for udyogini scheme
* కచ్చితంగా మనకంటూ వ్యాపార ఆలోచన ఉండాలి. లోన్ డబ్బు తీసుకుని తప్పకుండా వ్యాపారాన్ని స్టార్ట్ చెయ్యాలి.
* ఏ వ్యాపారాన్ని మొదలుపెట్టాలనుకుంటున్నామో బ్యాంకు మేనేజర్ కు ముందుగా సవివరంగా చెప్పాలి.
* మనం చెప్పే వ్యాపారం భవిష్యత్‌లో బాగా నడుస్తుంది అని చెప్పాలి. లాభాలు, ఆదాయ, వ్యయాలు , ఆస్తి తదితర వివరాలు తెలియజేయాలి.
* మనం ఇంతకముందే వ్యాపారం,లేదా బిజినెస్ నడుపుతుంటే ఆ విషయం కుడా బ్యాంకు సిబ్బందికి చెప్పాలి. బిజినెస్ విస్తరణ, లాభాలు, ఆధారాలు చూపించాలి. వాటిని పరిశీలించిన తర్వాత అంతా బాగుందని బ్యాంకర్లు భావిస్తే.. అప్పుడు మనకు లోన్‌కు అవకాశం కల్పిస్తారు.
* లోన్ ఇస్తే బిజినెస్ సంబంధించిన వస్తువులను కొంటామని బ్యాంకు అధికారులకు చూపించాలి. అప్పుడు వాళ్ళు మనకి లోన్ ని ఇవ్వడానికి ఒప్పుకుంటారు.
లోన్ ఎంత ఇస్తారంటే
How much is the loan in udyogini scheme
ఉద్యోగిని పథకం కింద మాగ్జిమమ్ లోన్ రూ.3లక్షలు వరకు ఇస్తారు. మన రిక్వైర్ మెంట్ కూడా3లక్షలు కంటే తక్కువ ఉండాలి. పెద్ద కంపెనీ స్టార్ట్ చేస్తున్నామని, పెద్ద మొత్తంలో లోన్ కావాలని అడిగినా బ్యాంకర్లు ఇవ్వరు. మనకి ఎంత లోన్ కావాలంటే అంత ఇవ్వరు. రిక్వైర్ మెంట్ 3లక్షలు కంటే తక్కువగానే ఉండాలి.
వడ్డీ ఎంతంటే..
ఉద్యోగిని పథకం కింద లోన్ పొందాలనుకునే మహిళలకు వివిధ రకాలుగా వడ్డీ నిర్ణయిస్తారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీలకు, దివ్యాంగులకు వడ్డీరేటు సున్నా శాతంగా నిర్ణయించారు. బీసీలు మిగిలిన వారికి వడ్డీ రేటు 10 శాతం నుంచి 15 శాతం వరకూ ఉంటుంది.
ఉద్యోగిని పథకంలో సబ్సిడీ ఎంత
How much is the subsidy in the udyogini scheme
ఉద్యోగిని పథకం కింద లోన్ తీసుకున్న వారికి సబ్సీడీ ఉంటుంది.
– వితంతువులు, వికలాంగులకు 30 శాతం వరకూ సబ్సిడీ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, గిరిజనులు ఈ లోన్ తీసుకుంటే 50 శాతం వరకూ సబ్సిడీ ఉంటుంది.
ఉదాహరణకు
-మనం రూ. 3లక్షలు లోన్ తీసుకుంటే 30 శాతం సబ్సిడీ అంటే రూ.90,000 ఉంటుంది. అయితే ఈ రూ. 90,000 మనం కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆ మొత్తం చేతికి ఇవ్వరు. లోన్‌లోనే మినహాయించుకుంటారు.
-అవుట్ స్టాండింగ్ అమోంట్ రూ.లక్ష ఉంటే దానిలో రూ.90,000 ప్రభుత్వం కడుతుంది. రూ.10,000 మనం కట్టుకుంటే చాలు. అది కూడా మనచేతికి ఇవ్వరు. మనం చెల్లించాల్సిన దాంట్లోనే తగ్గుతుంది.
-50 శాతం సబ్సిడీ ఇచ్చిన వారికి ప్రభుత్వం లక్ష యాబై వేలు కడుతుంది. కాని దానికి ఒక కండీషన్ ఉంది. అదేమిటంటే వ్యాపారం చేయాలనుంటున్న లేదా బిజినెస్ పెంచాలనుకుంటున్న వారి మహిళల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2లక్షలు కంటే తక్కువ ఉండాలి. అప్పుడు 50 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. లేకపోతే వర్తించదు.
హామీలు అక్కర్లే..
కేంద్రం ప్రవేశపెట్టిన ఈ ఉద్యోగిని పథకం కింద లోన్ పొందాలనుకునే వారు బ్యాంకుల వద్ద ఎటువంటి హామీలు పెట్టవలసిన అవసరం లేదు. అదేవిధంగా ఆస్తి పత్రాలు ఇవ్వక్కర్లేదు. కేవలం మన బిజినెస్ ఆలోచన చెబితే చాలు. ఎటువంటి హామీ లేకుండానే రూ. 3లక్షలు లోన్ పొందొచ్చు.
లోన్ కాలపరిమితి
ఉద్యోగిని పథకం మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. వాళ్ల వయసు 25 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఉండాలి. లోన్ కాలపరిమితి ఆరు సంవత్సరాలు ఉంటుంది. అదేవిధంగా సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉండాలి. ఇంతకముందు ఏదైనా లోన్ తీసుకుంటే అది కంటిన్యూస్ గా కట్టినట్లయితే ఈ లోన్ కూడా ఇస్తారు. మనకు లోన్ కట్టే స్థోమతు కచ్చితంగా ఉండాలి.
ట్రైనింగ్ తప్పనిసరి
ఉద్యోగిని పథకం కింద లోన్ పొందాలనుకునే మహిళలు కచ్చితంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిష్ డెవలప్‌మెంట్ ప్రోగాం ట్రైనింగ్ ని తీసుకోవాలి. ఆ తర్వాత స్కీమ్ కి అప్లై చేసుకుంటేనే బ్యాంకు అధికారులే మనకు ఫోన్ చేస్తారు. ఆ ట్రైనింగ్ తీసుకుంటే మాత్రమే లోన్ అప్లికేషన్ ని అంగీకరిస్తారు. లేకపోతే లోన్ రాదు.
బ్యాంకుకు సమర్పించాల్సిన పత్రాలు
* పాస్‌పోర్టు సైజ్ ఫోటోస్ 2
* ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్, ఇన్ కమ్ సర్టిఫికేట్.
* ఎన్ని విధాలుగా ఆదాయం వస్తుందో చూపించాలి.
* బ్యాంకు పాస్ బుక్ కూడా చూపించాలి.