Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • హోటల్ ప్రియులకు భారీ షాక్.. ఏపీలో పెరగనున్న తినుబండారాల ధరలు FEATURE NEWS
  • పశ్చిమాసియా సంక్షోభం.. భారత ఆర్థిక వ్యవస్థకు గడ్డు కాలం FEATURE NEWS
  • పన్ను ఆదా కోసం ముందస్తు ప్రణాళిక – ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ప్లాన్ చేసుకోండి.. Plan Early for Tax Savings – Start at the Beginning of the Financial Year FEATURE NEWS
  • చైనా ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు – భారత్‌లో పెట్టుబడుల కొత్త దిశ..  Relaxation in Chinese FDI Rules – A New Direction for Investments in India FEATURE NEWS
  • మార్కెట్‌ అనిశ్చితిలో.. ఇండెక్స్‌ ఈటీఎఫ్‌లు ఎంత‌వ‌ర‌కు లాభం? In Market Uncertainty, How Profitable Are Index ETFs? FEATURE NEWS
  • విదేశీ మదుపర్ల భారీ ఉపసంహరణ – మార్కెట్‌పై ఒత్తిడి పెంచుతున్న ఎఫ్‌పీఐ విక్రయాలు.. Massive Foreign Investor Outflows – FPI Selling Pressure Weighs on Markets FEATURE NEWS
  • రాబడి మాత్రమే కాదు.. లిక్విడిటీ కూడా ముఖ్యం..! Returns Alone Aren’t Enough.. Liquidity Matters Too FEATURE NEWS
  • పిల్ల‌ల‌కు డబ్బు విలువ నేర్పిద్దాం.. అర్థిక అక్ష‌రాస్య‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పిద్దాం..! Teach Children the Value of Money.. Build Awareness on Financial Literacy FEATURE NEWS
  • ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్ల రికార్డు .. రూ.2.43 లక్షల కోట్లుగా న‌మోదు..! గ‌తేడాదితో పోలిస్తే 8.7 శాతం పెరుగుదల! Record GST Collections in April Reach ₹2.43 Lakh Crore; Up 8.7% Compared to Last Year FEATURE NEWS
  • అధిక‌ క్రెడిట్ కార్డులతో అధిక‌ రివార్డులు పొందొచ్చా? క‌ఠినంగా మారిన‌ ష‌ర‌తులు! Can More Credit Cards Bring More Rewards? Conditions Are Getting Tougher! FEATURE NEWS

రిటైర్‌మెంట్‌నాటికి మీ చేతిలో రూ.10 కోట్లు ఉండాలా? అయితే ఇలా చేయండి..

Posted on 03/05/202603/05/2026 By admin No Comments on రిటైర్‌మెంట్‌నాటికి మీ చేతిలో రూ.10 కోట్లు ఉండాలా? అయితే ఇలా చేయండి..

న్యూఢిల్లీః డబ్బు సంపాదించడం ఒక కళ అయితే, ఆ సంపాదించిన సొమ్మును తెలివిగా రెట్టింపు చేయడం ఒక అద్భుతం. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి కల.. రిటైర్మెంట్ నాటికి చేతిలో కోట్లు ఉండాలి, ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడకూడదు అని. కానీ, ఆ ఆర్థిక ల‌క్ష్యాలు (retirement Goals) చేరుకోవడానికి ఎంత పొదుపు చేయాలి? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? అనే విషయంలో చాలామందికి అవగాహన ఉండదు. దీనిపై తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అందించిన విశ్లేషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం ఐదేండ్లు మీరు చేసే ఆలస్యం మీ కోటి రూపాయల కలపై ఎంతటి ప్రభావం చూపుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ప‌వ‌ర్ ఆఫ్ కాంపౌండింగ్ (Power of Compounding)
పెట్టుబడి ప్రపంచంలో ప‌వ‌ర్ ఆఫ్ కాంపౌండింగ్ (Power of Compounding) అనేది ఎనిమిదో వింత అని పిలుస్తారు. మీరు పెట్టే పెట్టుబడి కంటే, మీరు ఆ పెట్టుబడికి ఇచ్చే ‘సమయం’ ఇక్కడ అత్యంత కీలకం. రూ. 10 కోట్ల భారీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ వయసును బట్టి ఎంత మంత్లీ సిప్ (retirement Goals) చేయాలో ఈ క్రింది ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి.

* 20 ఏళ్ల వయసులో మొదలుపెడితే
సునీల్ అనే ఒక యువకుడిని ఉదాహరణగా తీసుకుంటే, అతను తన 20వ ఏటనే కెరీర్ ప్రారంభించి పెట్టుబడి వైపు అడుగులు వేశాడనుకుందాం. అతనికి రిటైర్మెంట్ (60 ఏళ్లు) వరకు సుమారు 40 ఏళ్ల సుదీర్ఘ సమయం ఉంది. నెలకు కేవలం రూ. 5,000 నుంచి రూ. 6,000 పెట్టుబడి పెడుతూ, వార్షికంగా 12 శాతం ఆదాయం అంచనా వేస్తే.. అతను తన 60వ ఏట సునాయాసంగా రూ. 10 కోట్ల కార్ప‌స్ (Corpus) అందుకుంటాడు. ఇక్కడ సునీల్ పెట్టిన అసలు కంటే (retirement Goals) అతనికి లభించిన వడ్డీయే కొండంతగా మారుతుంది.

* 25 ఏళ్ల వయసులో ప్రారంభించినా.. తప్పని భారం
దీప‌క్‌ అనే వ్యక్తి కేవలం ఐదేళ్లు ఆలస్యంగా, అంటే 25 ఏళ్ల వయసులో ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించాడనుకుందాం. ఇక్కడ చేతిలో ఉండే సమయం 35 ఏళ్లకు తగ్గిపోతుంది. దీనివల్ల అతను నెలకు చేయాల్సిన సిప్ అమౌంట్ భారీగా పెరుగుతుంది. అంటే నెలకు రూ. 10,000 నుంచి రూ. 12,000 వరకు ఇన్వెస్ట్ చేస్తే తప్ప అతను రూ. 10 కోట్ల లక్ష్యాన్ని చేరుకోలేడు. కేవలం ఐదేళ్ల ఆలస్యం వల్ల నెలవారీ భారం రెట్టింపు అయ్యిందని ఇక్కడ గమనించాలి.

* 30 ఏళ్ల వయసు దాటితే పరిస్థితి ఏమిటి?
రాజు అనే వ్యక్తి 30 ఏళ్ల వయసులో తన ఆర్థిక ప్రయాణాన్ని మొదలుపెడితే, అతని చేతిలో 30 ఏళ్ల సమయం మాత్రమే ఉంటుంది. ఇక్కడ తన లక్ష్యాన్ని సాధించడానికి అతను నెలకు రూ. 20,000 నుంచి రూ. 25,000 వరకు కేటాయించాల్సి ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ సంపాదించే శక్తి పెరిగినా, ఇంట్లో బాధ్యతలు కూడా పెరుగుతాయి కాబట్టి ఈ స్థాయి పెట్టుబడి మధ్యతరగతి వారికి కాస్త కష్టంగానే ఉంటుంది.

* 40 ఏళ్లలో మేల్కొంటే.. రూ. 10 కోట్లు కష్టమేనా?
చాలామంది 40 ఏళ్లు వచ్చిన తర్వాత గానీ రిటైర్మెంట్ గురించి ఆలోచించరు. అవినాశ్‌ అనే వ్యక్తి 40 ఏళ్లలో ఈ ప్లానింగ్ మొదలుపెడితే, అతనికి కేవలం 20 ఏళ్ల సమయం మాత్రమే మిగిలి ఉంటుంది. రూ. 10 కోట్ల మ్యాజిక్ ఫిగర్ అందుకోవాలంటే అతను నెలకు సుమారు లక్ష రూపాయల వరకు పొదుపు చేయాలి. ఇది సగటు ఉద్యోగికి ఆకాశాన్ని అందుకోవడమే అవుతుంది. అందుకే ముంద‌స్తు మ‌దుపు అనేది ఎంత ముఖ్యమో ఇక్కడ మనకు అర్థమవుతుంది.

నిపుణుల సలహా ఇదే..

* ‘రైట్ టైమ్’ కోసం వెతకకండి! Don’t look for the ‘right time’!
స్టాక్ మార్కెట్ విశ్లేషకులు ఒక ముఖ్యమైన మాట చెబుతుంటారు: “మార్కెట్‌ను టైమ్ చేయడం కంటే (Market Timing), మార్కెట్‌లో ఎంత కాలం గడిపాము అనేదే ముఖ్యం.” అంటే మార్కెట్ పడిపోయినప్పుడు చూద్దాం అని ఎదురుచూడటం కంటే, క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడమే ఉత్తమం.

* అగ్రెసివ్ ఇన్వెస్ట్‌మెంట్‌: 20-30 ఏళ్ల మధ్య ఉన్నవారు ఈక్విటీ మ్యూచ్‌ఫ‌ల్ ఫండ్స్ (retirement Goals) లో అగ్రెసివ్ గా ఇన్వెస్ట్ చేయడం వల్ల దీర్ఘకాలంలో భారీ రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది.

* స్టెప్ అప్‌ సిప్‌: ప్రతి ఏటా మీ జీతం పెరిగిన కొద్దీ, మీ సిప్ (SIP) మొత్తాన్ని కూడా 5% నుంచి 10% పెంచుకుంటూ వెళ్తే (Step-up SIP), మీరు లక్ష్యం కంటే ముందే మీ ఆర్థిక గమ్యాన్ని చేరుకోవచ్చు.

చివ‌ర‌గా ఒక మాట‌..

పెట్టుబడి అనేది ఒక చిన్న మొక్కను నాటడం వంటిది. మీరు ఎంత త్వరగా మొక్క నాటితే, అది వృక్షంగా మారి అంత త్వరగా నీడను, ఫలాలను అందిస్తుంది. ఆలస్యంగా నాటితే, మీరు ఎంత ఎక్కువ ఎరువులు (పెట్టుబడి) వేసినా ఆ మొక్క పెరిగి పెద్దది కావడానికి పట్టే సమయం (retirement Goals) మాత్రం మారదు. కాబట్టి, ఈరోజే మీ సంప‌ద సృష్టి జర్నీని ప్రారంభించండి!

52
FEATURE NEWS, FINICAL PLANNING, INVESTMENTS Tags:retirement Goals

Post navigation

Previous Post: హోటల్ ప్రియులకు భారీ షాక్.. ఏపీలో పెరగనున్న తినుబండారాల ధరలు

Related Posts

  • ట్రంప్ గుడ్‌న్యూస్ .. కుదిరిన ట్రేడ్ డీల్ .. Trump’s Good News: India–US Trade Deal Finalised FEATURE NEWS
  • రూ.25 వేల జీతమా? పూచీకత్తు లేకుండానే రూ.1.25 లక్షల రుణం Loan up to ₹1.25 lakh without collateral for low-income earners FEATURE NEWS
  • రిఫండ్లపై భయం అక్కర్లేదు… కొత్త పన్ను చట్టంలో స్పష్టత ఇచ్చిన సీబీడీటీ.. No Worries on Refunds… CBDT Clarifies Amid New Tax Law Transition FEATURE NEWS
  • రక్షణ రంగంలో పెట్టుబడులు.. లాభమా? FEATURE NEWS
  • సిబిల్‌ స్కోరుపై క్రెడిట్‌ కార్డుల ప్రభావం ఎంత ? జాగ్రత్తగా వాడితే లాభం, లేకపోతే నష్టమే! Credit Cards & CIBIL Score: A Boon if Used Wisely, a Risk if Misused FEATURE NEWS
  • పదవీ విరమణ ప్రణాళికలో మారుతున్న దృక్పథం.. FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • రిటైర్‌మెంట్‌నాటికి మీ చేతిలో రూ.10 కోట్లు ఉండాలా? అయితే ఇలా చేయండి..
  • హోటల్ ప్రియులకు భారీ షాక్.. ఏపీలో పెరగనున్న తినుబండారాల ధరలు
  • పశ్చిమాసియా సంక్షోభం.. భారత ఆర్థిక వ్యవస్థకు గడ్డు కాలం
  • పన్ను ఆదా కోసం ముందస్తు ప్రణాళిక – ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ప్లాన్ చేసుకోండి.. Plan Early for Tax Savings – Start at the Beginning of the Financial Year
  • చైనా ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు – భారత్‌లో పెట్టుబడుల కొత్త దిశ..  Relaxation in Chinese FDI Rules – A New Direction for Investments in India
  • మార్కెట్‌ అనిశ్చితిలో.. ఇండెక్స్‌ ఈటీఎఫ్‌లు ఎంత‌వ‌ర‌కు లాభం? In Market Uncertainty, How Profitable Are Index ETFs?
  • విదేశీ మదుపర్ల భారీ ఉపసంహరణ – మార్కెట్‌పై ఒత్తిడి పెంచుతున్న ఎఫ్‌పీఐ విక్రయాలు.. Massive Foreign Investor Outflows – FPI Selling Pressure Weighs on Markets
  • రాబడి మాత్రమే కాదు.. లిక్విడిటీ కూడా ముఖ్యం..! Returns Alone Aren’t Enough.. Liquidity Matters Too
  • పిల్ల‌ల‌కు డబ్బు విలువ నేర్పిద్దాం.. అర్థిక అక్ష‌రాస్య‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పిద్దాం..! Teach Children the Value of Money.. Build Awareness on Financial Literacy
  • ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్ల రికార్డు .. రూ.2.43 లక్షల కోట్లుగా న‌మోదు..! గ‌తేడాదితో పోలిస్తే 8.7 శాతం పెరుగుదల! Record GST Collections in April Reach ₹2.43 Lakh Crore; Up 8.7% Compared to Last Year
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్నారా? అయితే ఈ చార్జీల గురించి తెలుసుకోండి! Are You Using a Credit Card? Then Be Aware of These Hidden Charges! FEATURE NEWS
  • 600 బిలియన్‌ డాలర్ల అధిపతిగా ఎలాన్‌ మస్క్ .. Elon Musk Becomes a $600 Billion Tycoon NEWS
  • 2024 సంవత్సరంలో Health insuranceలో మార్పులు తెలుసుకుందాం Let’s know the changes in health insurance in the year 2024 FEATURE NEWS
  • మొబైల్ , ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవ‌లు తెలుసుకుందామా! Mobile vs Internet Banking: Know the Key Services FEATURE NEWS
  • అమ్మాయికి ఇద్దాం ఆర్థిక భరోసా… చిన్న వయసులోనే పెద్ద భవిష్యత్తు నిర్మాణం .. Securing a Girl Child’s Financial Future – Smart Planning for Big Dreams FEATURE NEWS
  • ఐపీవోకు ఎల్ఐసీ lic launches indias largest ipo FEATURE NEWS
  • కొత్త పన్ను విధానంలో ఏటా మార్పులివే..! Year-wise Changes in the New Tax Regime FEATURE NEWS
  • మ్యూచువ‌ల్ ఫండ్స్ అంటే.. MUTUAL FUNDS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme