Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • నామినీకే డబ్బంతా చెల్లుతుందా? Does the Entire Money Go to the Nominee? FEATURE NEWS
  • పెట్టుబడులు.. మీ భవిష్యత్తును నిర్మించే పునాదులు..!! Investments: The Foundation That Builds Your Future FEATURE NEWS
  • ఈపీఎఫ్‌వోలో మార్పులు.. త్వ‌ర‌లో ఆటో విత్‌డ్రా సదుపాయం!! Major Changes in EPFO Withdrawal System FEATURE NEWS
  • లాభాల బాటలో మార్కెట్లు.. Markets End in Green Amid Positive Global Signals FEATURE NEWS
  • సుంకం పెరిగితే బంగారం కొనుగోలు తగ్గుతాయా? Will Higher Import Duty Reduce Gold Demand? FEATURE NEWS
  • ఆర్‌బీఐ బంగారం కొంటోంది.. ప్రజలను మాత్రం తగ్గించమంటోంది! ఎందుక‌లా? RBI Buys Gold Aggressively.. Why Is the Government Asking People to Cut Purchases? FEATURE NEWS
  • భగ్గుమన్న నిత్యావసరాలు.. భారమైన జీవన వ్యయం.. ఏప్రిల్‌లో 3.48 శాతానికి రిటెయిల్‌ ద్రవ్యోల్బణం.. Essentials Burn a Hole in Pockets.. Cost of Living Turns Heavier as Retail Inflation Rises to 3.48% in April FEATURE NEWS
  • ఒక్క ఉద్యోగం కాదు.. బహుళ ఆదాయ ఆర్జ‌న దిశ‌గా యువత.. Beyond One Job: Gen Z Chasing Multiple Income Streams FEATURE NEWS
  • న‌ష్టాల నుంచి లాభాల బాట‌లోకి ప్రభుత్వ బ్యాంకులు.. Public Sector Banks Turn Profit Powerhouses FEATURE NEWS
  • డెట్‌ ఫండ్లా?.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లా? పెట్టుబ‌డుల‌కు ఏది మంచిది? Debt Funds or Fixed Deposits? Which Is Better for Investments? FEATURE NEWS

ఉద్యోగ అస్థిరతలో ఇల్లు కాపాడుకోవడం ఎలా? బ్యాంకుల అరాచ‌కం నుంచి బ‌య‌ట‌ప‌డ‌డం ఎలా? How to Protect Your Home Amid Job Uncertainty? How to Safeguard Yourself from Bank Actions?

Posted on 28/03/2026 By admin No Comments on ఉద్యోగ అస్థిరతలో ఇల్లు కాపాడుకోవడం ఎలా? బ్యాంకుల అరాచ‌కం నుంచి బ‌య‌ట‌ప‌డ‌డం ఎలా? How to Protect Your Home Amid Job Uncertainty? How to Safeguard Yourself from Bank Actions?

ప్రస్తుత కాలంలో ఉద్యోగ భద్రత అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు లేదా పెద్ద సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు స్థిరత్వం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పెద్ద ఐటీ కంపెనీల నుండి చిన్న స్టార్టప్‌ల వరకు ఎక్కడ చూసినా ఉద్యోగాల కోతలు, ఖర్చు తగ్గింపు చర్యలు, అనూహ్య నిర్ణయాలు సాధారణమైపోయాయి. ఈ పరిస్థితుల్లో మధ్యతరగతి కుటుంబాలపై పడుతున్న ప్రభావం మరింత తీవ్రమైంది. ముఖ్యంగా బ్యాంకు లోన్లతో ఇళ్లు కొనుగోలు చేసినవారికి ఇది పెద్ద సవాలుగా మారింది. సొంతింటి కల ప్రతి కుటుంబానికి ఒక భావోద్వేగ అంశం. సంవత్సరాల పాటు కష్టపడి సంపాదించిన డబ్బుతో, బ్యాంకు లోన్ తీసుకుని సొంతింటి కలను (How to Protect Your Home) నెరవేర్చుకుంటారు. కానీ ఒక్కసారిగా ఉద్యోగం కోల్పోతే ఆ కల క్షణాల్లోనే ఛిద్రమవుతోంది. ఇటీవల జరిగిన ఒక సంఘటన దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది.

ఒక కుటుంబం కలలు ఎలా చిద్రమయ్యాయి? How One Family Lost Their Dream Home?
బెంగళూరులో పని చేసే రాజేష్ అనే ఐటీ ఉద్యోగి కథ ఇది. ఎనిమిదేళ్ల పాటు కష్టపడి ప్రతి నెల ఈఎంఐలు క్రమం తప్పకుండా చెల్లిస్తూ తన ఇంటిని కాపాడుకున్నాడు. కానీ అక్టోబర్ 2025లో కంపెనీ తీసుకున్న లేఆఫ్ నిర్ణయం కారణంగా అతను ఉద్యోగం కోల్పోయాడు. ఆదాయం ఒక్కసారిగా ఆగిపోవడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడింది. ఈ పరిస్థితుల్లో మూడు నెలలు ఈఎంఐలు చెల్లించలేకపోయాడు. దీంతో బ్యాంక్ అతని లోన్‌ను ‘నాన్-పర్ఫార్మింగ్ అసెట్ (NPA)’గా గుర్తించి, సర్ఫేసి చట్టం ప్రకారం ఇంటిని వేలానికి పెట్టింది. మార్కెట్ విలువ ₹1.2 కోట్లు ఉన్న ఆ ఇంటిని బ్యాంక్ కేవలం ₹95 లక్షలకు అమ్మేసింది. బ్యాంక్‌కు రావాల్సిన ₹80 లక్షలు తీసుకుని మిగిలిన ₹15 లక్షలను రాజేష్‌కు ఇచ్చింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అతను చేసిన పెట్టుబడి, ఎనిమిదేళ్ల పాటు చెల్లించిన ఈఎంఐలు, ఇంటి ఇంటీరియర్ ఖర్చులన్నీ కలిపి చూసుకుంటే అతనికి భారీ నష్టం జరిగింది. అంతేకాదు, భావోద్వేగంగా కూడా కుటుంబం తీవ్రంగా దెబ్బతింది.

మూడు నెలలు ఈఎంఐ మిస్ అయితే ఇల్లు పోతుందా? Can Missing 3 EMIs Lead to Losing Your Home?
సాధారణంగా చాలామందికి ఉండే సందేహం ఇదే. కానీ బ్యాంకులు ఒక్కసారిగా ఇంటిని తీసుకోలేవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం ఒక స్పష్టమైన ప్రక్రియ ఉంటుంది. ఈఎంఐ డ్యూ డేట్ తర్వాత 30 రోజుల్లో చెల్లించకపోతే అది SMA-0గా మారుతుంది. 31 నుంచి 60 రోజులు అయితే SMA-1, 61 నుంచి 90 రోజులు అయితే SMA-2. 90 రోజులు పూర్తయిన తర్వాత మాత్రమే ఆ ఖాతాను NPAగా ప్రకటిస్తారు. అక్కడితో కథ ముగియదు. బ్యాంక్ నోటీసులు పంపుతుంది, కాల్స్ చేస్తుంది, రికవరీ ప్రక్రియ ప్రారంభిస్తుంది. తర్వాత సర్ఫేసి చట్టం ప్రకారం 60 రోజుల గడువు ఇస్తుంది. ఈ సమయంలో బకాయిలను చెల్లిస్తే ఇంటిని కాపాడుకోవచ్చు.

సర్ఫేసి చట్టం అంటే ఏమిటి? What is the SARFAESI Act?
2002లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం బ్యాంకులకు రుణాలను త్వరగా వసూలు చేసుకునే అధికారం ఇస్తుంది. కోర్టు జోక్యం లేకుండానే ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేయవచ్చు. అయితే ఇది అన్ని లోన్లకు వర్తించదు. కొన్ని ముఖ్యమైన షరతులు ఉన్నాయి. లోన్ సెక్యూర్డ్ అయి ఉండాలి. కనీసం 90 రోజులు డీఫాల్ట్ కావాలి. లోన్ మొత్తం ₹1 లక్షకు పైగా ఉండాలి. అలాగే అవుట్‌స్టాండింగ్ మొత్తం అసలు లోన్‌లో 20% కంటే ఎక్కువగా ఉండాలి.

బ్యాంకులు ఎలా వేలం వేస్తాయి? How Banks Auction Properties?
NPAగా గుర్తించిన తర్వాత బ్యాంక్ సెక్షన్ 13(2) కింద నోటీసు పంపుతుంది. 60 రోజుల్లో బకాయిలు చెల్లించకపోతే సెక్షన్ 13(4) ప్రకారం ఆస్తిని స్వాధీనం చేసుకుంటుంది. తర్వాత ఒక వాల్యువర్ ద్వారా ఆస్తి విలువను అంచనా వేస్తారు. దానిని రిజర్వ్ ప్రైస్ అంటారు. కనీసం 30 రోజుల ముందు వేలం తేదీ ప్రకటించి, బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా అమ్మకం జరుగుతుంది.

మధ్యతరగతి కుటుంబాలు చేసే పెద్ద తప్పులు.. Common Financial Mistakes by Middle-Class Families
ఈ ఘటనలో రాజేష్ చేసిన తప్పులు మనలో చాలామందికి వర్తిస్తాయి. ముఖ్యంగా బడ్జెటింగ్ లేకపోవడం ప్రధాన కారణం. ఆదాయం వచ్చినంతలో ఎంత సేవ్ చేయాలి, ఎంత ఖర్చు చేయాలి, ఎంత ఈఎంఐలకు వెళ్తుంది అన్నది ప్లాన్ చేయకపోవడం సమస్య. ఇంకా ఒక పెద్ద తప్పు ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడం. చాలామంది కేవలం రోజువారీ ఖర్చులకే ఫండ్ ఉంచుతారు. కానీ ఈఎంఐలను కూడా అందులో కలపాలి. కనీసం 6 నెలల నుండి 12 నెలల వరకు సరిపడా నిధి ఉండాలి.

ఎమర్జెన్సీ ఫండ్ ఎలా ఉండాలి? How to Build an Emergency Fund?
ఒకటి లేదా రెండు నెలల ఖర్చును సేవింగ్స్ అకౌంట్‌లో ఉంచాలి. మిగతా మొత్తాన్ని ఆర్బిట్రేజ్ ఫండ్స్ లేదా అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్‌లో పెట్టడం మంచిది. అవసరమైనప్పుడు మాత్రమే విత్‌డ్రా చేసేలా ఉండాలి.

ఈఎంఐలు ఎంతవరకు సేఫ్? What is a Safe EMI Limit?
మీ నెలవారీ ఆదాయంలో ఈఎంఐలు 40% లోపల ఉండటం ఉత్తమం. 50% దాటితే ప్రమాదం ఎక్కువ. బ్యాంకులు లోన్ ఇస్తాయి కానీ భారం మాత్రం మీమీదే పడుతుంది.

సంక్షోభ సమయంలో తీసుకోవాల్సిన చర్యలు.. Steps to Take During Financial Crisis
ఉద్యోగం కోల్పోయిన వెంటనే బ్యాంక్‌తో సంప్రదించాలి. లోన్ రీస్ట్రక్చరింగ్, మోరటోరియం వంటి అవకాశాలను పరిశీలించాలి. సమస్యను దాచిపెట్టకుండా ముందుగానే స్పందిస్తే పరిష్కారం దొరుకుతుంది. ఉద్యోగ అస్థిరత పెరుగుతున్న ఈ కాలంలో ఆర్థిక ప్రణాళిక అత్యంత అవసరం. ఒక చిన్న నిర్లక్ష్యం జీవితకాల కలను(How to Protect Your Home) కోల్పోయే పరిస్థితిని తెస్తుంది. కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం, సరైన ప్రణాళికతో ముందుకు సాగడం మాత్రమే మన కుటుంబాన్ని, మన సొంతింటిని కాపాడగలదు. ఇలాంటి అంశాలపై అవగాహన పెంచుకోవడం మాత్రమే కాకుండా, కుటుంబ సభ్యులతో కూడా పంచుకోవడం అవసరం. ఎందుకంటే సమస్య వచ్చిన తర్వాత స్పందించడం కన్నా, ముందుగానే సిద్ధంగా ఉండటం ఎంతో ముఖ్యమైనది.

165
FEATURE NEWS Tags:Can Missing 3 EMIs Lead to Losing Your Home?, Common Financial Mistakes by Middle-Class Families, How Banks Auction Properties?, How One Family Lost Their Dream Home?, How to Build an Emergency Fund?, Steps to Take During Financial Crisis, What is a Safe EMI Limit?, What is the SARFAESI Act?

Post navigation

Previous Post: ప్రీ-అప్రూవ్డ్ లోన్లు… లాభ‌మా? లేక నష్ట‌మా? Pre-Approved Loans: Benefit or Burden?
Next Post: ఇల్లు అమ్మకుండానే రూ.లక్షలు ఎలా పొందాలో తెలుసా? Get Lakhs Without Selling Your House… But Be Cautious!

Related Posts

  • జేబులో చిరిగిన నోటు ఉందా..? నో టెన్ష‌న్‌..దానిని ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం? Torn Currency Note in Your Pocket? No Tension.. Know How to Exchange It Easily! FEATURE NEWS
  • ట్రంప్ గుడ్‌న్యూస్ .. కుదిరిన ట్రేడ్ డీల్ .. Trump’s Good News: India–US Trade Deal Finalised FEATURE NEWS
  • కమొడిటీ ట్రేడింగ్ అంటే ఏమిటి? కమొడిటీలో ట్రేడింగ్ ఎలా చెయ్యాలి ? What is Commodity Trading FEATURE NEWS
  • మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వార్షిక వేతనం రూ.845.77 కోట్లకు పెంపు Microsoft CEO Satya Nadella’s Annual Salary Increased to ₹845.77 Crore FEATURE NEWS
  • యూపీఐ మోసాల నుంచి ర‌క్ష‌ణ పొందండిలా! How to Protect Yourself from UPI Frauds! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • నామినీకే డబ్బంతా చెల్లుతుందా? Does the Entire Money Go to the Nominee?
  • పెట్టుబడులు.. మీ భవిష్యత్తును నిర్మించే పునాదులు..!! Investments: The Foundation That Builds Your Future
  • ఈపీఎఫ్‌వోలో మార్పులు.. త్వ‌ర‌లో ఆటో విత్‌డ్రా సదుపాయం!! Major Changes in EPFO Withdrawal System
  • లాభాల బాటలో మార్కెట్లు.. Markets End in Green Amid Positive Global Signals
  • సుంకం పెరిగితే బంగారం కొనుగోలు తగ్గుతాయా? Will Higher Import Duty Reduce Gold Demand?
  • ఆర్‌బీఐ బంగారం కొంటోంది.. ప్రజలను మాత్రం తగ్గించమంటోంది! ఎందుక‌లా? RBI Buys Gold Aggressively.. Why Is the Government Asking People to Cut Purchases?
  • భగ్గుమన్న నిత్యావసరాలు.. భారమైన జీవన వ్యయం.. ఏప్రిల్‌లో 3.48 శాతానికి రిటెయిల్‌ ద్రవ్యోల్బణం.. Essentials Burn a Hole in Pockets.. Cost of Living Turns Heavier as Retail Inflation Rises to 3.48% in April
  • ఒక్క ఉద్యోగం కాదు.. బహుళ ఆదాయ ఆర్జ‌న దిశ‌గా యువత.. Beyond One Job: Gen Z Chasing Multiple Income Streams
  • న‌ష్టాల నుంచి లాభాల బాట‌లోకి ప్రభుత్వ బ్యాంకులు.. Public Sector Banks Turn Profit Powerhouses
  • డెట్‌ ఫండ్లా?.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లా? పెట్టుబ‌డుల‌కు ఏది మంచిది? Debt Funds or Fixed Deposits? Which Is Better for Investments?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Financial Discipline Is the Key Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • డిసెంబర్‌లో EMIల భారం త‌గ్గనుందా? ప్రజల్లో కొత్త ఆశలు! Will EMI Burdens Ease This December? New Hopes Among People! FEATURE NEWS
  • మ్యూచువ‌ల్ ఫండ్ల సంఖ్య త‌గ్గించండి MUTUAL FUNDS
  • క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్నారా? అయితే ఈ చార్జీల గురించి తెలుసుకోండి! Are You Using a Credit Card? Then Be Aware of These Hidden Charges! FEATURE NEWS
  • మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో సిప్ చేస్తున్నారా what is sip in mutual funds MUTUAL FUNDS
  • సెటిల్‌మెంట్‌ vs సంపూర్ణ చెల్లింపు..! రుణం తీర్చడంలో ఏది బెస్ట్‌! సెటిల్‌మెంట్‌ vs సంపూర్ణ చెల్లింపు..! రుణం తీర్చడంలో ఏది బెస్ట్‌! Loan Repayment Dilemma: Settlement vs Full Payment FEATURE NEWS
  • కార్పొరేట్ ఎఫ్ డీ లాభమేనా..? corporate FDs are profitable or not FINICAL PLANNING
  • మ్యూచువ‌ల్ ఫండ్స్ v/s ఈటీఎఫ్‌ mutual funds and ETF MUTUAL FUNDS
  • అసెట్ అలకేషన్ మంత్రం.. ఇన్వెస్ట్‌మెంట్‌లో స్మార్ట్ మార్గం.. Asset Allocation Strategy.. The Smart Way to Invest FINICAL PLANNING
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme