Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఈపీఎఫ్‌వోలో మార్పులు.. త్వ‌ర‌లో ఆటో విత్‌డ్రా సదుపాయం!! Major Changes in EPFO Withdrawal System FEATURE NEWS
  • లాభాల బాటలో మార్కెట్లు.. Markets End in Green Amid Positive Global Signals FEATURE NEWS
  • సుంకం పెరిగితే బంగారం కొనుగోలు తగ్గుతాయా? Will Higher Import Duty Reduce Gold Demand? FEATURE NEWS
  • ఆర్‌బీఐ బంగారం కొంటోంది.. ప్రజలను మాత్రం తగ్గించమంటోంది! ఎందుక‌లా? RBI Buys Gold Aggressively.. Why Is the Government Asking People to Cut Purchases? FEATURE NEWS
  • భగ్గుమన్న నిత్యావసరాలు.. భారమైన జీవన వ్యయం.. ఏప్రిల్‌లో 3.48 శాతానికి రిటెయిల్‌ ద్రవ్యోల్బణం.. Essentials Burn a Hole in Pockets.. Cost of Living Turns Heavier as Retail Inflation Rises to 3.48% in April FEATURE NEWS
  • ఒక్క ఉద్యోగం కాదు.. బహుళ ఆదాయ ఆర్జ‌న దిశ‌గా యువత.. Beyond One Job: Gen Z Chasing Multiple Income Streams FEATURE NEWS
  • న‌ష్టాల నుంచి లాభాల బాట‌లోకి ప్రభుత్వ బ్యాంకులు.. Public Sector Banks Turn Profit Powerhouses FEATURE NEWS
  • డెట్‌ ఫండ్లా?.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లా? పెట్టుబ‌డుల‌కు ఏది మంచిది? Debt Funds or Fixed Deposits? Which Is Better for Investments? FEATURE NEWS
  • 15 శాతానికి కస్టమ్స్ డ్యూటీ పెంపు.. బంగారం, వెండి ధ‌ర‌లు మ‌రింత ప్రియం.. Customs Duty Hiked to 15%.. Gold and Silver Set to Become Costlier FEATURE NEWS
  • న‌ష్టాల బాట‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. గ‌త‌ నాలుగు రోజుల్లో రూ.17 లక్షల కోట్లు ఆవిరి.. Domestic Markets in Deep Red.. ₹17 Lakh Crore Wiped Out in Four Days FEATURE NEWS

అవసరానికి అండగా ‘ఓవర్‌డ్రాఫ్ట్‌’… కానీ జాగ్రత్తలే రక్షణ! Overdraft as a Financial Cushion… But Caution is Crucial!

Posted on 28/03/2026 By admin No Comments on అవసరానికి అండగా ‘ఓవర్‌డ్రాఫ్ట్‌’… కానీ జాగ్రత్తలే రక్షణ! Overdraft as a Financial Cushion… But Caution is Crucial!

ఆర్థిక వ్యవహారాల్లో అనూహ్య పరిస్థితులు ఎప్పుడైనా తలెత్తుతాయి. జీతం వచ్చేలోపు ఖర్చులు పెరగడం, అత్యవసర అవసరాలు ఏర్పడడం, చిన్న వ్యాపారాల్లో రోజువారీ నగదు కొరత—ఇలాంటి సందర్భాల్లో వెంటనే డబ్బు అందుబాటులో ఉండటం చాలా ముఖ్యం. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు అందిస్తున్న ఒక సౌకర్యమే ‘ఓవర్‌డ్రాఫ్ట్‌’ (OD). ఇటీవలి కాలంలో చాలా బ్యాంకులు ఖాతాదారులకు సందేశాలు పంపిస్తూ “ఓడీ అందుబాటులో ఉంది” అంటూ ప్రోత్సహిస్తున్నాయి. అయితే ఇది ఎంత సౌకర్యవంతమైనదో… అంతే జాగ్రత్తగా ఉపయోగించాల్సిన ఆర్థిక సాధనం కూడా. సరైన అవగాహన లేకుండా వాడితే, భవిష్యత్తులో ఆర్థిక భారంగా మారే ప్రమాదం ఉంది.

ఓవర్‌డ్రాఫ్ట్‌ అంటే ఏమిటి? What Exactly is an Overdraft?
ఓవర్‌డ్రాఫ్ట్ (Overdraft ) అనేది మీ బ్యాంకు ఖాతాకు అనుసంధానమై ఉండే ముందస్తు ఆమోదిత రుణం. సాధారణంగా ఖాతాలో డబ్బు లేకపోయినా… బ్యాంకు మీకు ఒక నిర్దిష్ట పరిమితి వరకు డబ్బు తీసుకునే అవకాశం ఇస్తుంది. ఇది ఒక రకంగా అత్యవసర సమయంలో ఉపయోగపడే ‘సేఫ్టీ నెట్‌’లా పనిచేస్తుంది. మీ ఖాతాలో నిల్వ లేకున్నా, మీకు మంజూరైన పరిమితి మేరకు నగదు తీసుకుని అవసరాలను తీర్చుకోవచ్చు.

ఎలా పనిచేస్తుంది ఈ సదుపాయం? How Does This Facility Work?
ఓడీ (Overdraft ) సౌకర్యంలో మీరు వాడుకున్న మొత్తానికే వడ్డీ చెల్లించాలి. అది కూడా రోజువారీ నిల్వ ఆధారంగా లెక్కించబడుతుంది. అంటే, మీరు ఎంత తీసుకున్నారో… ఎంతకాలం వాడుకున్నారో దాని మీదే వడ్డీ ఉంటుంది. ఇది వ్యక్తిగత రుణాల కంటే కొంత భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే, వ్యక్తిగత రుణంలో మొత్తం తీసుకున్న డబ్బుపై వడ్డీ పడుతుంది. కానీ ఓడీలో మీరు వాడినంత మొత్తానికే వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది.

వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి? Interest Rates: What Should You Expect?
ఓవర్‌డ్రాఫ్ట్‌పై (Overdraft ) వడ్డీ రేట్లు, అది ఎలా మంజూరైందన్న దానిపై ఆధారపడి ఉంటాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (FD)పై తీసుకునే ఓడీకి తక్కువ వడ్డీ ఉంటుంది. సాధారణంగా మీ FD వడ్డీపై 1 నుంచి 2 శాతం అదనంగా మాత్రమే ఉంటుంది. అయితే పూచీకత్తు లేకుండా ఇచ్చే ఓడీకి వడ్డీ రేట్లు గణనీయంగా ఎక్కువగా ఉంటాయి. ఇవి 10 శాతం నుంచి 24 శాతం వరకు ఉండవచ్చు. అంతేకాకుండా సకాలంలో వడ్డీ చెల్లించకపోతే 2 నుంచి 3 శాతం వరకు అదనపు జరిమానా కూడా విధించబడుతుంది.

ఎప్పుడు ఉపయోగించాలి? When is it Useful?
ఓడీ(Overdraft ) సదుపాయం ప్రధానంగా తాత్కాలిక అవసరాల కోసం ఉపయోగించాలి. జీతం వచ్చేలోపు ఖర్చులు నిర్వహించడం, పిల్లల ఫీజులు చెల్లించడం, చిన్న వ్యాపారాల రోజువారీ లావాదేవీలకు నగదు సమకూర్చుకోవడం వంటి సందర్భాల్లో ఇది ఎంతో ఉపయోగకరం. ఈ సౌకర్యం వల్ల ఖాతాలో డబ్బు లేకపోయినా ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోవు. కాబట్టి తక్షణ అవసరాలను తీర్చుకునేందుకు ఇది మంచి ఎంపికగా చెప్పవచ్చు.

వ్యక్తిగత రుణంతో తేడా ఏమిటి? How is it Different from a Personal Loan?
ఓడీ(Overdraft ) , వ్యక్తిగత రుణం మధ్య ప్రధాన తేడా వాడకం విధానంలో ఉంటుంది. వ్యక్తిగత రుణం తీసుకుంటే, మొత్తం మొత్తాన్ని ఒకేసారి పొందుతారు. దానిపై వడ్డీ లెక్కించి నెలవారీ వాయిదాల రూపంలో చెల్లించాలి. అయితే ఓడీలో మీకు అవసరమైనంత మాత్రమే తీసుకుని వాడుకోవచ్చు. వడ్డీ కూడా అదే మొత్తానికి మాత్రమే ఉంటుంది. పైగా నెలవారీ EMIలు చెల్లించాల్సిన బాధ్యత ఉండదు. ఇది తాత్కాలిక నగదు నిర్వహణకు అనువైన సాధనం కాగా… వ్యక్తిగత రుణం దీర్ఘకాలిక అవసరాలకు సరిపోతుంది.

ఎప్పుడు దూరంగా ఉండాలి? When Should You Avoid It?
ఓడీ(Overdraft ) సౌకర్యాన్ని పెద్ద మొత్తాల ఖర్చులకు ఉపయోగించడం మంచిది కాదు. ఇల్లు కొనడం, పెద్ద పెట్టుబడులు పెట్టడం, దీర్ఘకాలిక అవసరాలకు డబ్బు కావాలంటే వ్యక్తిగత రుణం లేదా ఇతర రుణాలే సరైన ఎంపిక. ఎందుకంటే ఓడీపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా స్పష్టమైన చెల్లింపు ప్రణాళిక లేకపోతే అప్పు భారంగా మారుతుంది.

ప్రమాదకర అలవాట్లు… దూరంగా ఉండాలి .. Risky Habits to Avoid
చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే… అసలు మొత్తం చెల్లించకుండా ప్రతి నెలా వడ్డీ మాత్రమే చెల్లిస్తూ ఉండటం. ఇది అప్పును మరింత పొడిగించి ఆర్థికంగా ఇబ్బందులకు దారి తీస్తుంది. మరో ముఖ్యమైన విషయం—ఓడీ (Overdraft ) పరిమితిని ఆదాయంగా భావించడం. ఇది పూర్తిగా తప్పు. ఇది కేవలం రుణ సౌకర్యం మాత్రమే. దాన్ని జాగ్రత్తగా, అవసరమైనప్పుడు మాత్రమే వాడాలి.

జాగ్రత్తగా వాడాలి… లేకపోతే భారమే.. A Friend When Used Wisely… A Burden When Misused
ఓవర్‌డ్రాఫ్ట్‌ (Overdraft ) ఒక అత్యవసర ఆర్థిక సాధనం. సరైన సమయంలో ఉపయోగిస్తే అది మీకు సహాయకారి అవుతుంది. కానీ నిర్లక్ష్యంగా వాడితే, అధిక వడ్డీతో కూడిన అప్పుగా మారి మీ ఆర్థిక స్థితిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. కాబట్టి ఓడీ సదుపాయాన్ని ఉపయోగించే ముందు మీ అవసరాన్ని, చెల్లించే సామర్థ్యాన్ని స్పష్టంగా అంచనా వేయాలి. ఆర్థిక ప్రపంచంలో ప్రతి సౌకర్యానికి ఒక పరిమితి ఉంటుంది. ఓవర్‌డ్రాఫ్ట్‌ (Overdraft ) కూడా అందుకు మినహాయింపు కాదు. అత్యవసర సమయంలో ఇది మీకు అండగా నిలుస్తుంది. కానీ క్రమశిక్షణ లేకుండా వాడితే అదే మీకు భారంగా మారుతుంది. అందుకే—అవసరానికి మాత్రమే వాడండి… సమయానికి చెల్లించండి… అప్పుడే ఓడీ నిజమైన ఆర్థిక మిత్రుడిగా నిలుస్తుంద‌ని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

122
FEATURE NEWS Tags:A Friend When Used Wisely… A Burden When Misused, How Does This Facility Work?, How is it Different from a Personal Loan?, Interest Rates: What Should You Expect?, Risky Habits to Avoid, What Exactly is an Overdraft?, When is it Useful?, When Should You Avoid It?

Post navigation

Previous Post: అన్‌క్లెయిమ్డ్ విలువ‌ రూ.73,000 కోట్లు .. మ‌రిచిపోయిన ఆ సొమ్మును తిరిగి ఎలా పొందాలోతెలుసా? Unclaimed Amount ₹73,000 Crore… Do You Know How to Recover Your Forgotten Money?
Next Post: రిఫండ్లపై భయం అక్కర్లేదు… కొత్త పన్ను చట్టంలో స్పష్టత ఇచ్చిన సీబీడీటీ.. No Worries on Refunds… CBDT Clarifies Amid New Tax Law Transition

Related Posts

  • ఇళ్లలో, ఆలయాల్లో మూలుగుతున్న పసిడి… ఆర్థిక వ్యవస్థకు ఉపయోగం ఎంత? Idle Gold in Homes and Temples… What It Means for the Economy FEATURE NEWS
  • what are the mistakes of middle class మిడిల్ క్లాస్ ప్ర‌జ‌లు చేసే ప్ర‌ధాన‌ త‌ప్పులేంటి FEATURE NEWS
  • సుర‌క్షితంగా మ‌నీ ట్రాన్స‌ఫ‌ర్ చేయండి how to transfer money securely FEATURE NEWS
  • ఆస్తి బదిలీకి ఏది స‌రైంది? గిఫ్ట్ డీడ్ లేక వీలునామా? Which Is Better for Property Transfer: Gift Deed or Will? FEATURE NEWS
  • భారీ మార్పులు.. సెప్టెంబర్ 15 వ‌ర‌కు ఐటీఆర్ ఫైలింగ్ Changes in ITR Filing 2025-26 FEATURE NEWS
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • ఈపీఎఫ్‌వోలో మార్పులు.. త్వ‌ర‌లో ఆటో విత్‌డ్రా సదుపాయం!! Major Changes in EPFO Withdrawal System
  • లాభాల బాటలో మార్కెట్లు.. Markets End in Green Amid Positive Global Signals
  • సుంకం పెరిగితే బంగారం కొనుగోలు తగ్గుతాయా? Will Higher Import Duty Reduce Gold Demand?
  • ఆర్‌బీఐ బంగారం కొంటోంది.. ప్రజలను మాత్రం తగ్గించమంటోంది! ఎందుక‌లా? RBI Buys Gold Aggressively.. Why Is the Government Asking People to Cut Purchases?
  • భగ్గుమన్న నిత్యావసరాలు.. భారమైన జీవన వ్యయం.. ఏప్రిల్‌లో 3.48 శాతానికి రిటెయిల్‌ ద్రవ్యోల్బణం.. Essentials Burn a Hole in Pockets.. Cost of Living Turns Heavier as Retail Inflation Rises to 3.48% in April
  • ఒక్క ఉద్యోగం కాదు.. బహుళ ఆదాయ ఆర్జ‌న దిశ‌గా యువత.. Beyond One Job: Gen Z Chasing Multiple Income Streams
  • న‌ష్టాల నుంచి లాభాల బాట‌లోకి ప్రభుత్వ బ్యాంకులు.. Public Sector Banks Turn Profit Powerhouses
  • డెట్‌ ఫండ్లా?.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లా? పెట్టుబ‌డుల‌కు ఏది మంచిది? Debt Funds or Fixed Deposits? Which Is Better for Investments?
  • 15 శాతానికి కస్టమ్స్ డ్యూటీ పెంపు.. బంగారం, వెండి ధ‌ర‌లు మ‌రింత ప్రియం.. Customs Duty Hiked to 15%.. Gold and Silver Set to Become Costlier
  • న‌ష్టాల బాట‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. గ‌త‌ నాలుగు రోజుల్లో రూ.17 లక్షల కోట్లు ఆవిరి.. Domestic Markets in Deep Red.. ₹17 Lakh Crore Wiped Out in Four Days
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Financial Discipline Is the Key Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • ఒమన్‌తో ఒప్పందం… ఎగుమతులకు ఊతం New Agreement with Oman Boost for Exports! FEATURE NEWS
  • సైజు త‌గ్గ‌బోతున్న ఎల్‌ఐసీ ఐపీవో what is the size of LIC ipo NEWS
  • WHAT IS UPI CIRCLE  యూపీఐ సర్కిల్ గురించి తెలుసా FEATURE NEWS
  • ఐడీబీఐ ఇక ప్రైవేటుకే idbi privatisation MARKET
  • లాభాలొచ్చాయ‌ని తొంద‌ర ప‌డొద్దు Don’t be in a hurry to make a profit MARKET
  • ఈ మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో హై రిట‌ర్న్స్ which mutual funds generate good returns MUTUAL FUNDS
  • దూసుకెళ్తున్న బీఎఫ్‌ఎస్‌ఐ(BFSI)! భారీగా పెరిగిన మార్కెట్ విలువ‌ Soaring BFSI Sector! Market Value Surges Massively FEATURE NEWS
  • గత బడ్జెట్ నుంచి ఇప్పటివరకు 363% పెరిగిన మల్టీబ్యాగర్ స్టాక్ Multi-Bagger Stock Surges 363% Since Last Budget FEATURE NEWS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme