Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

1947 నుండి 2025 వరకు రూపాయి కథ.. Rupee’s Journey: From 1947 to 2025

Posted on 08/12/2025 By admin No Comments on 1947 నుండి 2025 వరకు రూపాయి కథ.. Rupee’s Journey: From 1947 to 2025

అంతర్జాతీయ మార్కెట్లలో రూపాయి మరోసారి బలహీనపడింది. డాలర్‌తో పోలిస్తే వరుసగా కొత్త లోతులకు జారిపోతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. నిపుణుల విశ్లేషణ ప్రకారం ప్రస్తుతం రూపాయి పతనానికి అనేక అంతర్గత–బాహ్య కారణాలు కలిసి పనిచేస్తున్నాయి. ప్ర‌స్తుతం రూపాయి విలువ వ‌న్ డాల‌ర్‌తో చూస్తే ₹90.4 గా ఉంది . చారిత్రాత్మక లోతైన స్థాయికి చేరుకున్న‌ట్లు నిపుణులు చెబుతున్నారు.

ఈ పతనానికి ముఖ్య కారణాలు..Key Reasons Behind the Fall

– రూపాయి విలువ ప‌త‌నానికి అనేక గ్లోబల్ & దేశీయ ఫ్యాక్టర్లు కలిసాయి. దేశం అవసరమైన చమురు, ద్రవ్యం, ఇతర వస్తువులను విదేశీ డాలర్లుగా కొనుగోలు చేస్తూనే, విదేశాలకు సరఫరా చేసే వస్తువులు తక్కువ‌గా ఉండటం వ‌ల్ల‌ ఇది డాలర్ డిమాండ్ పెంచి రూపాయిపై ఒత్తిడినిస్తుంది.

– విదేశీ పెట్టుబడిదారులు (FPI/FII) భారత షేర్లను, బాండ్లను అమ్మడం వల్ల దేశంలో డాలర్ ప్రవాహం తగ్గింది. ఇది రూపాయి విలువకు అవకాశం ఇవ్వదు.
– చమురు, ఇత‌ర‌ సరుకుల దిగుమతుల విలువ‌ పెరగడంతో దేశానికి ఎక్కువ డాలర్లు కావాలి. ఇది రూపాయిపై ఒత్తిడిని పెంచుతుంది.
– అమెరికాలో డాలర్ బలపడటంతో, పెట్టుబడిదారులు డాలర్‌ను ప్రాధాన్యంగా చూస్తున్నారు. దాని ఫలితంగా ఇన్వెస్ట్‌మెంట్ ప్రవాహం తగ్గింది. దీంతో రూపాయి ప‌త‌న‌మ‌వుతోంది.
-ఎగుమతులు తగ్గడం, విదేశంలో పని చేసే భారతీయుల రిమిటెన్స్ ప్రవాహంలో స్పష్టమైన పెరుగుదల లేన‌ప్పుడు రూపాయిపై ఒత్తిడి పడుతుంది.

జీవన స్థాయిపై ప్ర‌భావం..Impact on Standard of Living

ఇంపోర్ట్ ఖర్చులు పెరగడంతో విదేశీ వస్తువులు, చమురు, ఎలక్ట్రానిక్స్, యుటిలిటీస్ వంటి ధరలు పెరుగుతాయి . విదేశాల్లో చదువు, ప్రయాణం, హాలిడేలు చేసేవారికి వ్యయం భారీగా పెరుగుతుంది.పాలనా ఖర్చులు, ఇన్‌ఫ్లేషన్, వడ్డీ రేట్లు భార‌మ‌వుతాయి. వాణిజ్య విధానాలు, దిగుమతి, ఎగుమతుల సమతుల్యత, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ పై కేంద్ర ప్ర‌భుత్వం దృష్టి సారిస్తే రూపాయి విలువ మ‌ళ్లీ పుంజుకునే అవ‌కాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

దేశ ఆర్థిక మార్పులకు అద్దం పట్టే 78 ఏళ్ల రూపాయి పతనం.. 78 Years of Rupee Decline Reflecting India’s Economic Shifts

దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్న ఎత్తుపల్లాలు.. ప్రపంచ వాణిజ్య గమనాలు.. ప్రభుత్వ ఆర్థిక విధానాల్లో జరిగిన మార్పులన్నింటికీ అద్దం పట్టేలా భారతీయ రూపాయి ప్రయాణం సాగింది. 1947లో డాలర్‌–రూపాయి విలువ దాదాపు సమానంగా ఉండగా, 2025 నాటికి రూపాయి విలువ 80 దాటిన స్థాయికి చేరింది. దేశ ఆర్థిక స్వభావాన్ని అర్థం చేసుకోవాలంటే రూపాయి పరిణామ క్రమాన్నే చదవాలన్నట్లుగా గత 78 ఏళ్ల కథ చెబుతోంది.

1947లో మొదటి అడుగు ..The First Step in 1947

స్వాతంత్య్రం సాధించిన తొలి సంవత్సరాల్లో రూపాయి బలంగా నిలిచింది. విదేశీ రుణాలు తక్కువగా ఉండటం, దిగుమతులు పరిమితంగా ఉండటం కారణంగా రూపాయి విలువ గణనీయంగా నిలిచిపోయింది. అభివృద్ధి పథంలో ప్రయాణం ప్రారంభమవుతున్న దేశానికి అది ఒక బలమైన ఆర్థిక సంకేతం. ఈ స‌మ‌యంలో రూపాయి విలువ $1 = ₹3.3 (3 రూపాయల 30 పైస‌లు)గా ఉండేది. 1950లో రూపాయి విలువ $1 = ₹4.76గా న‌మోదైంది.

1966లో మొదటి పెద్ద దెబ్బ..The First Major Blow in 1966

1965 యుద్ధం, దేశీయ ఆర్థిక ఒత్తిడులు, విదేశీ రుణాల పెరుగుదల కారణంగా ప్రభుత్వం రూపాయిని భారీగా డివాల్యూ చేసింది.అప్పట్లో రూపాయి విలువ 1 డాలర్ = 7.50 రూపాయలుగా న‌మోదైంది. ఈ దశ దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్ద ముద్ర వేసింది.

1980–1990లో రుణాల భారం పెరగడంతో… Rising Debt Burden During 1980–1990…

70ల చివరి దశ నుండి 80లలోకి అడుగుపెట్టేకల్లా చమురు దిగుమతుల ఖర్చులు పెరిగాయి. విదేశీ రుణాలపై ఆధారపడటం, అభివృద్ధి కార్యకలాపాలకు ఖర్చులు పెర‌గ‌డంతో రూపాయి విలువ క్రమంగా దిగజారిది. 1990 నాటికి రూపాయి విలువ డాలర్ తో చూస్తే సుమారు 17–18 రూపాయలుగా న‌మోదైంది.

1991 లో లిబరలైజేషన్ మొదలు..The Beginning of Liberalization in 1991

దేశం విదేశీ నిల్వలు కేవలం 15 రోజులు మాత్రమే దిగుమతులు చేయగలిగేస్థాయికి దిగజారడంతో ప్రభుత్వం పెద్ద ఆర్థిక సంస్కరణలు చేపట్టింది. దీంతో రూపాయి మరింత డివాల్యూ అయ్యి 26 రూపాయల స్థాయికి చేరింది. అయితే లిబరలైజేషన్‌తో విదేశీ పెట్టుబడులు పెరిగి, సేవారంగం బలపడగా రూపాయి పతనం వేగం కొంత నెమ్మదించింది. 1991లో రూపాయి విలువ $1 = ₹22గా ఉండేది.

2000ల్లో గ్లోబల్ వాణిజ్యం.. Global Trade in the 2000s

ఐటీ రంగం విస్తరణ, సేవారంగం పెరుగుదల, విదేశీ పెట్టుబడుల వరద కారణంగా 2007–08 ప్రాంతంలో రూపాయి ఒక దశలో 39 రూపాయల వరకు బలపడింది. కానీ ప్రపంచ ఆర్థిక మాంద్యం రూపాయిని మరోసారి కుదించింది. ఈ స‌మ‌యంలో రూపాయి విలువ $1 = ₹45.2గా ఉండేది.

2010–2020: గ్లోబల్ ఒత్తిళ్లు … దేశీయ మార్పులు.. 2010–2020: Global Pressures and Domestic Changes

2010–2020 దశలో క్రూడ్ ఆయిల్ ధరల్లో పెరుగుదల, డాలర్ బలపాటు, దేశీయ ద్రవ్యోల్బణం, విదేశీ పెట్టుబడుల ప్రవాహంలో హెచ్చుతగ్గుల ప్రభావంతో రూపాయి విలువ 50–70 రూపాయల మధ్య గణనీయంగా మారిపోయింది. 2020 తర్వాత కోవిడ్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో రూపాయి వరుసగా బలహీనపడింది. అమెరికా వడ్డీ రేట్ల పెంపు.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం.. చమురు దిగుమతుల ఒత్తిడి … ఇవన్నీ రూపాయి విలువను మరింత వెన‌క్కి నెట్టేసాయి.

ఇది కొత్త అధ్యాయం..A New Chapter

ప్రస్తుతం రూపాయి విలువ 90 రూపాయల చుట్టూ తిరుగుతూ అస్థిరతను ఎదుర్కొంటోంది. డాలర్ బలపడటం ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దేశీయ స్థాయిలో సాఫ్ట్‌వేర్ ఎగుమతులు, రిమిటెన్సులు, సేవారంగం విస్తృతి రూపాయి పతనాన్ని కొంత మేర నిలువరించినా, అంతర్జాతీయ మార్కెట్ల ఒత్తిడులెక్కువగానే ఉన్నాయి.

రూపాయి పతనమేనా… లేక సహజ ప్రక్రియనా? Is the Rupee Falling… or Is It a Natural Process?

నిపుణుల విశ్లేషణ ప్రకారం .. రూపాయి పతనం కాదిది. ఎదుగుతున్న దేశ ఆర్థిక వ్యవస్థల్లో సహజమైన పరిణామం. అభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో దిగుమతులు, మూలధన వ్యయం పెరగడం వంటి అంశాలు ఈ ప్రయాణాన్ని ప్రభావితం చేస్తాయన్నారు.

ఇది ఒక కీల‌క మ‌లుపు ..This Is a Crucial Turning Point

78 ఏళ్ల రూపాయి కథ దేశ ఆర్థిక పరిస్థితుల ప్రతిబింబంలా కనిపిస్తుంది. విధానాలు, వనరులు, ప్రపంచ మార్పులు .. ఇవన్నీ కలిసి రూపాయి విలువను నిర్ణయించాయి. స్వాతంత్య్రం అనంతరం బలంగా ప్రారంభమైన ఈ ప్రయాణం ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ల దృష్టిలో ఒక కీలక మలుపు వద్ద నిలిచి ఉంది.

భ‌విష్య‌త్‌లో రూపాయి మ‌ళ్లీ బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉందా? Can the Rupee Strengthen Again in the Future?

భారత షేర్లు, బాండ్లు తిరిగి విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించగ‌లిగితే రూపాయి మీద ఒత్తిడి తగ్గుతుంది. సాఫ్ట్‌వేర్, ఫార్మా, ఆటోమొబైల్, సేవారంగం విస్తరణ తో విదేశీ కరెన్సీ ప్రవాహం పెరుగుతుంది. అప్ప‌డు మ‌ళ్ళీ రూపాయి బలపడుతుంది. అమెరికా వడ్డీ రేట్ల నియంత్రణ, డాలర్ స్థిరంగా ఉంటే రూపాయి పునరుద్ధరణకు సహాయపడుతుంది. విదేశీ మారక నిల్వలు పెంచడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం రూపాయి విలువను మళ్లీ స్థిరం చేయవచ్చు. చమురు ధరలు, ప్రపంచ ఆర్థిక స్థిరత్వం , దిగుమతుల ఖర్చు తగ్గితే రూపాయి బ‌ల‌ప‌డ‌నుంది.

263
FEATURE NEWS Tags:2010–2020: Global Pressures and Domestic Changes, 78 Years of Rupee Decline Reflecting India’s Economic Shifts, A New Chapter, Can the Rupee Strengthen Again in the Future?, Global Trade in the 2000s, Impact on Standard of Living, Is the Rupee Falling… or Is It a Natural Process?, Key Reasons Behind the Fall, Rising Debt Burden During 1980–1990…, The Beginning of Liberalization in 1991, The First Major Blow in 1966, The First Step in 1947, This Is a Crucial Turning Point

Post navigation

Previous Post: ఇంట్లో ఖాళీగా ఉన్న పసిడికి కొత్త దారి! అద్దెకు ఇవ్వండి.. ఆదాయం పొంద‌డి! A New Way to Use Idle Gold at Home: Lease It, Earn Income!
Next Post: లోన్ అనేది బతకడానికి కాదు.. ఎదగడానికి! Loans: Not for Surviving… But for Growing!

Related Posts

  • క్రెడిట్‌ నివేదికలో లోపాలను స‌రిచేసుకోండి..! లేకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వ్‌! Fix Errors in Your Credit Report… Or Face Trouble! FEATURE NEWS
  • WHAT SHOULD AN NRI DO WITH HIS EPF ACCOUNT ఒక ఎన్ఆర్ఐ తన ఈపీఎఫ్‌ ఖాతాను ఏం చేయాలి FEATURE NEWS
  • కారు కొనేముందు ఇవి ఆలోచించండి Consider these before buying a car FEATURE NEWS
  • భారతీయులు స్టాక్ మార్కెట్లో ఎందుకు పెట్టుబడి పెట్టడం లేదు? Why Indians Are Not Investing in the Stock Market FEATURE NEWS
  • ఎయిరిండియా పేరు ఇలా what is the story behind the name of  air india FEATURE NEWS
  • పోస్టాఫీస్ డెలివరీ సేవలలో కీలక మార్పులు.. ఇక నెక్ట్స్ డే డెలివరీ ! Key Changes in Post Office Delivery Services: Next-Day Delivery Now! FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • ఇక నేరుగా అమెరికా స్టాక్ మార్కెట్‌లోనూ పెట్టుబ‌డులు పెట్టొచ్చు..! Direct Access to US Stocks from India MARKET
  • రోజుకు రూ.500 పొదుపు.. 20 ఏళ్లలో రూ.1.48 కోట్ల నిధి! Save ₹500 a Day, Build ₹1.48 Crore in 20 Years! FEATURE NEWS
  • ట్రంప్‌ వ్యాఖ్యలతో మార్కెట్లలో కలకలం… లాభాల జోరు ఒక్క రోజుకే పరిమితం.. Trump Remarks Rattle Markets… Rally Short-Lived FEATURE NEWS
  • కొత్త కారు.. కొత్త బాధ్యత.. New Car, New Responsibility FINICAL PLANNING
  • Is power sector stocks are good..? ప‌వ‌ర్ సెక్టార్ స్టాక్స్‌లో పెట్టుబ‌డులు లాభ‌మేనా..? MARKET
  • Why Rbi increases interest rate వ‌డ్డీ రేట్లు ఎందుకు పెరిగాయి FEATURE NEWS
  • అన్‌క్లెయిమ్డ్ విలువ‌ రూ.73,000 కోట్లు .. మ‌రిచిపోయిన ఆ సొమ్మును తిరిగి ఎలా పొందాలోతెలుసా? Unclaimed Amount ₹73,000 Crore… Do You Know How to Recover Your Forgotten Money? FEATURE NEWS
  • ఇంటి రుణం పూర్తిస్థాయిలో ఎలా పొందాలో తెలియ‌డం లేదా? అయితే ఈ సూచ‌న‌లు పాటించండి Don’t Know How to Get a Full Home Loan? Follow These Tips FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme