Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN FEATURE NEWS
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters! FEATURE NEWS
  • చిన్న పెట్టుబడి… పెద్ద ఫలితం ! రూ.22 ల‌క్షల పెట్టుబ‌డికి రూ.49 లక్ష‌ల వ‌డ్డీ! సుకన్య సమృద్ధి పథకంలో సాధ్యమేనా? Small Investment… Big Gains! ₹22 Lakh Investment Yields ₹49 Lakh Interest – Is It Possible with Sukanya Samriddhi Scheme? FEATURE NEWS

త్వరలో ఏకంగా 42 శాతం వరకు లాభం! 5 బెస్ట్ హోసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ ఇవే.. ! Up to 42% Returns Ahead! Here Are the 5 Best Housing Finance Stocks

Posted on 27/11/2025 By admin No Comments on త్వరలో ఏకంగా 42 శాతం వరకు లాభం! 5 బెస్ట్ హోసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ ఇవే.. ! Up to 42% Returns Ahead! Here Are the 5 Best Housing Finance Stocks

దేశంలో గృహ నిర్మాణ రంగం మళ్లీ పుంజుకుంటోంది. వడ్డీ రేట్లు స్థిరంగా ఉండటం… రియల్ ఎస్టేట్ అమ్మకాలు రికార్డు స్థాయిలో నడవటం… హోమ్ లోన్ డిమాండ్ విపరీతంగా పెరగడంతో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు వేగంగా పుంజుకునే అవకాశం ఉన్నదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కొన్ని బ్రోకరేజ్ సంస్థలు విడుదల చేసిన తాజా రిపోర్టుల ప్రకారం.. రాబోయే 12–15 నెలల్లో 5 హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ 22% నుంచి 42% వరకు లాభాల అవకాశాన్ని చూపిస్తున్నాయి. 2026 నాటికి హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ రాబడులు ఇతర ఫైనాన్షియల్ రంగాల కంటే ఎక్కువగా ఉండొచ్చు. ముఖ్యంగా అఫోర్డబుల్ హౌసింగ్, మిడిల్ ఇన్‌కమ్ సెగ్మెంట్లు వేగంగా పెరుగుతున్నాయి. నిపుణుల సలహా తీసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేస్తే రాబోయే ఏడాదిలో మంచి లాభాలు అందుకునే అవకాశం ఉంది.

1) హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ (HDFC Ltd)

హౌసింగ్ ఫైనాన్స్ రంగానికి పితామహుడిలాంటి సంస్థ ఇదే. లిక్విడిటీ బాగుంది. NPAలు చాలా తక్కువ. రిటైల్ లోన్లు, ప్రీమియం సెగ్మెంట్‌లో బలమైన పట్టు. బ్యాంకింగ్ విలీనానంతరం కూడా హౌసింగ్ ఫైనాన్స్ బిజినెస్ స్థిరంగా నడుస్తోంది. భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉండటంతో HDFCకు భారీ డిమాండ్ వచ్చే అవకాశముంది. దీని అంచనా రిటర్న్స్ 28% – 35% వ‌ర‌కూ ఉంది.

2) ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ (LIC Housing Finance)

ఎల్ఐసీ బ్రాండ్ పవర్ వేరే లెవెల్లో ఉంటుంది. రిటైల్ హోమ్ లోన్లలో కంపెనీ మార్కెట్ షేర్ పెరుగుతోంది. కొత్తగా మిడిల్–ఇంకమ్ , అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్లలో దూకుడుగా విస్తరిస్తోంది. బ్రోకరేజ్ రిపోర్టులు వచ్చే ఏడాదిలో మంచి లాభాలు కన్ఫర్మ్‌గా కనిపిస్తున్నాయని అంటున్నాయి. దీని అంచనా రిటర్న్స్ 25% – 38% వ‌ర‌కూ ఉంది.

3) ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (Indiabulls Housing)

కొన్ని సంవత్సరాలు ఒత్తిడితో కొట్టుమిట్టాడిన కంపెనీ… ఇప్పుడు పూర్తిగా రీస్ట్రక్చర్ అయ్యింది. హై రిస్క్ సెక్టర్ల నుంచి వైదొలిగి రిటైల్–హోమ్ లోన్లపైనే దృష్టి పెట్టింది. రిస్క్ ఎక్కువగానే ఉన్నా… రివార్డ్స్ కూడా అంతే పెద్దగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. డిమాండ్‌ను బట్టి వచ్చే ఏడాది ఈ స్టాక్ మంచి రన్ ఇవ్వొచ్చు. దీని అంచనా రిటర్న్స్ 30% – 42% వ‌ర‌కూ ఉండొచ్చు.

4) ఏయూఎం ఫిన్ హౌస్ / పిరమల్ హౌసింగ్ సెగ్మెంట్ (Piramal Enterprises – Housing Finance)

పిరమల్ రీస్ట్రక్చరింగ్ తరువాత హౌసింగ్ లోన్ డివిజన్ బాగా స్టబిలైజ్ అయింది. అఫోర్డబుల్ హౌసింగ్, టైర్డ్-2 సిటీస్ సెగ్మెంట్లలో బలంగా విస్తరిస్తోంది. బ్యాంకులు కంటే త్వరగా లోన్ ప్రాసెసింగ్ చేయడం, ప్రాపర్టీ–లింక్డ్ ఉత్పత్తులు ఇవ్వడం కంపెనీకి అదనపు బలం. దీని అంచనా రిటర్న్స్ 22% – 32% వ‌ర‌కూ ఉండొచ్చు.

5) కెనరా హెచ్‌ఎఫ్‌సీ / ఎల్ఎండ్‌టీ హౌసింగ్ ఫైనాన్స్ (Canara HFC / L&T Housing Finance)

ప్రభుత్వ బ్యాంకింగ్‌తో నడిచే కెనరా హౌసింగ్ ఫైనాన్స్, ఎల్ఎండ్‌టీ ఫైనాన్స్ హౌసింగ్ డివిజన్ .. ఈ రెండు కూడా ఈ మధ్య పెద్ద సంఖ్యలో రిటైల్ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. లోన్ డిస్బర్స్‌మెంట్లు పెరిగాయి. NPAలు తగ్గాయి. వడ్డీ రేట్లు తగ్గితే ఈ రెండు సంస్థలకు భారీ డిమాండ్ వచ్చే ఛాన్స్. దీని అంచనా రిటర్న్స్ 24% – 33% వ‌ర‌కూ ఉండొచ్చు.

హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ ఎందుకు బాగున్నాయంటే? Why Are Housing Finance Stocks Performing Well?

-రియల్ ఎస్టేట్ బూమ్: దేశవ్యాప్తంగా అపార్ట్‌మెంట్, ఇండిపెండెంట్ హౌస్ కొనుగోలులో పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది.

– వడ్డీ రేట్లు తగ్గే సంకేతాలు: RBI వచ్చే ఏడాది 1–2 సార్లు రేట్లు తగ్గించే అవకాశం ఉందని నిపుణుల అంచనా.

– NPAలు భారీగా తగ్గడం

– హోమ్ లోన్లు ఇతర లోన్ల కంటే సేఫ్ . రికవరీ రేట్లు ఎక్కువ.

– ప్రభుత్వ ప్రోత్సాహం (PMAY, అఫోర్డబుల్ హౌసింగ్)

– సబ్సిడీ పథకాలు, స్టాంప్ డ్యూటీ రాయితీలు ఈ రంగానికి బలమైన పుష్ ఇస్తున్నాయి.

పెట్టుబడిదారులు తీసుకోవాల్సిన‌ జాగ్రత్తలు Precautions Investors Should Take

ఐపీఓల మాదిరిగా హైప్ చూసి కొనొద్దు

ప్రతి స్టాక్‌కి రిస్క్ ప్రొఫైల్ వేరేలా ఉంటుంది

కంపెనీ NPAలు, డెట్, వడ్డీ మార్పులు తప్పకుండా చెక్ చేయాలి

దీర్ఘకాల పెట్టుబడిగా చూస్తేనే మంచి రాబడులు

హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ ఎంతవరకు సురక్షితం? How Safe Are Housing Finance Stocks?

హౌసింగ్ ఫైనాన్స్ లాంగ్‌టర్మ్ గ్రోత్ థీమ్. కానీ బ్యాలెన్స్‌షీట్‌ను అర్థం చేసుకోకుండా పెట్టుబడి చేస్తే ప్రమాదం ఖాయం.” “NPA తగ్గుతున్న కంపెనీల్లో మాత్రమే పెట్టుబడి చేయాలి.” “రేట్లు తగ్గే సైకిల్ వస్తే ఈ స్టాక్స్ పుంజుతాయి… రేట్లు పెరిగితే వేగంగా పడిపోతాయి.”

గృహ రుణ రంగంలో వెలుగు.. Bright Prospects in the Home Loan Sector

దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ దిశగా ముందుకు సాగుతుండగా, మదుపరుల దృష్టి గృహరుణ మార్కెట్‌పై మళ్లీ కేంద్రీకృతమైంది. ముఖ్యంగా చిన్న పట్టణాలు, మున్సిపాలిటీలు, అర్బన్-స్లమ్‌ ప్రాంతాల్లోనూ తక్కువ ఖరీదైన ఇళ్లకు భారీ డిమాండ్ నెలకొంది. దీనితో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (HFCs) రుణాలను వేగంగా విస్తరిస్తున్నాయి. రాబోయే 3–5 సంవత్సరాల పాటు ఈ రంగం డబుల్ డిజిట్ గ్రోత్ నమోదు చేసే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో… మార్కెట్లో నిలకడగా ప్రదర్శన ఇస్తూ, వృద్ధి సాధించే అవకాశాలు ఉన్న మరికొన్ని టాప్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ మదుపరుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

అప్టస్ వ్యాల్యూ హోసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ .. Aptus Value Housing Finance Limited

అప్టస్ వ్యాల్యూ హోసింగ్ కంపెనీ ప్రధానంగా సెల్ఫ్-ఎంప్లాయిడ్, లోయర్–మిడిల్ సెగ్మెంట్ కస్టమర్లను టార్గెట్ చేస్తోంది. వీరి ఆదాయం స్థిరంగా లేకపోయినా, గృహ రుణాల రీపేమెంట్‌లో డిఫాల్ట్ రేటు తక్కువగా ఉండడం కంపెనీకి అనుకూలం. దక్షిణ భారతంపై బలమైన పట్టు ఉంది. నాన్-డిపాజిట్ NBFC – కాబట్టి రిస్క్ కంట్రోల్ ఎక్కువ. హైలీ ప్రాఫిటబుల్, అధిక మార్జిన్స్.
NPA స్థాయి చాలా తక్కువ. అప్టస్ రుణ విస్తరణను గ్రామీణ & టియర్–3 నగరాల్లో పెంచనుంది. లక్షల కుటుంబాల మొదటి ఇల్లు స్వప్నాన్ని నెరవేర్చడంలో వీరి పాత్ర పెరుగుతుంది. స్టాక్ ఇప్పటికే మంచి రాబడులు ఇచ్చినా… ఇంకా 12–18% రాబడి అవకాశముందని విశ్లేషకుల అభిప్రాయం.

పీఎన్బీ హోసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్.. PNB Housing Finance Limited

రిస్ట్రక్చరింగ్ తర్వాత తిరిగి పుంజుకుంటోన్న సంస్థ ఇది. ఒకప్పుడు సమస్యల్లో చిక్కుకున్న పీఎన్బీ హౌసింగ్… గత రెండు సంవత్సరాలుగా భారీ మార్పులు చేసింది. రిస్క్ ఉన్న ల్యాప్ సెగ్మెంట్‌ను తగ్గించి, మళ్లీ కోర్ హౌసింగ్ లోన్స్పైనా దృష్టి పెట్టింది. పబ్లిక్ సెక్టార్ లెగసీ, బ్రాండ్ నమ్మకం కంపెనీ బ‌లాలుగా చెప్పొచ్చు. 250+ బ్రాంచులతో పాటు AUM స్థిరంగా పెరుగుతోంది. క్యాపిటల్ పాజిషన్ బలపడింది. NPAs తగ్గుతున్నా ఇంకా పోటీ ఎక్కువ. కానీ కంపెనీ ఓపరేషనల్ స్ట్రక్చర్ బలోపేతం కావడంతో 2025–28 మధ్య ఆగ్రెసివ్ గ్రోత్ సాధించే అవకాశం ఉంది. మదుపరులకు మధ్యకాలికంగా 20–25% రాబడి అవకాశమని బ్రోకరేజ్ అంచనాలు.

ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్..India Shelter Finance Corporation Limited

ఇండియా షెల్టర్ బలమైన టెక్నాలజీ డ్రైవన్ NBFC. హోమ్ లోన్స్ & SME ల్యాప్స్‌లో ప్రత్యేకంగా వేగంగా విస్తరిస్తోంది. దీని ప్రాసెసింగ్ స్పీడ్ చాలా వేగం. చిన్న పట్టణాల్లో ఆపరేషనల్ ఖర్చులు తక్కువ. రూరల్ & టియర్–2 మార్కెట్లో అధిక వృద్ధి. గత కొన్ని సంవత్సరాల్లో రెవెన్యూ 25–30% గా ఉంది. AI ఆధారిత డాక్యుమెంట్ వెరిఫికేషన్, రిస్క్ మోడల్స్ అమలు చేయడం వల్ల రుణాల నాణ్యత మెరుగుపడుతోంది. రిస్క్–రివార్డ్ పరంగా చూస్తే ఈ స్టాక్ హై గ్రోత్ NBFC కేటగిరీలో నిలుస్తుంది.

హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ ఇండియా లిమిటెడ్.. Home First Finance Company India Limited

హోమ్ ఫస్ట్ ప్రధానంగా సాలరీడ్ యువ ఉద్యోగులు, కొత్త కుటుంబాలు, మిడిల్ క్లాస్ వినియోగదారులు లక్ష్యంగా పనిచేస్తుంది. డిజిటల్ ప్రాసెసింగ్, వేగవంతమైన అప్లికేషన్ వ్యవస్థ వీరి ప్రత్యేకత. డిజిటల్ ప్రాసెసింగ్ – టాట్ చాలా తక్కువ‌. స్టాండర్డ్ అసెట్ క్వాలిటీ. మేనేజ్‌మెంట్ బలం గొప్పది. ప్రాఫిటబిలిటీ స్టడీగా ఉంది. పోటీ ఉన్నా, ఆపరేషనల్ ఎఫిషియెన్సీ ఎక్కువ. ఈ కంపెనీ 2025–2030 మధ్య హౌసింగ్ NBFCలలో టాప్ 5కి చేరే అవకాశం. స్టెబుల్ గ్రోత్ కోరుకునే మదుపరులకు అనువైన స్థిరమైన స్టాక్‌గా బ్రోకరేజ్ సంస్థల అభిప్రాయం.

బజాజ్ హోసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్.. Bajaj Housing Finance Limited

అత్యంత స్థిరమైన హౌసింగ్ NBFC ఇది. బజాజ్ ఫిన్‌సర్వ్ గ్రూప్‌లో భాగంగా ఉన్న ఈ కంపెనీకి మార్కెట్లో బలమైన విశ్వసనీయత ఉంది. బ్యాంకులకు సమానంగా లోన్ ప్రాసెసింగ్, కంప్లయెన్స్, రిస్క్ బ్యాలెన్స్ నిర్వహణలో వీరు ముందంజలో ఉంటారు. బజాజ్ బ్రాండ్ అనేది నమ్మకం. అద్భుతమైన రుణ నాణ్యత. హై–క్వాలిటీ కస్టమర్ బేస్ ఉంది. మార్జిన్స్ కొంచెం తక్కువైనా… లోన్ నాణ్యత చాలా బాగుంటుంది. పెద్ద పెట్టుబడిదారులు పొడుగుకాలం కోసం ప్రాధాన్యత ఇస్తున్నారు. త‌క్కువ రిస్క్‌తో స్థిరమైన రాబడి కోరుకునే వారికి బజాజ్ హౌసింగ్ మంచి ఎంపిక.

 

255
FEATURE NEWS Tags:(Canara HFC / L&T Housing Finance), (HDFC Ltd), (Indiabulls Housing), (LIC Housing Finance), (Piramal Enterprises – Housing Finance), Aptus Value Housing Finance Limited, Bajaj Housing Finance Limited, Bright Prospects in the Home Loan Sector, Home First Finance Company India Limited, How Safe Are Housing Finance Stocks?, India Shelter Finance Corporation Limited, PNB Housing Finance Limited, Precautions Investors Should Take, Why Are Housing Finance Stocks Performing Well?

Post navigation

Previous Post: ఇన్కమ్ టాక్స్‌ రీఫండ్ ఎందుకు ఆలస్యమవుతుంది..? స్టేటస్ తెలుసుకోవ‌డం ఎలా..? Why Is the Income Tax Refund Getting Delayed? How to Check Your Refund Status?
Next Post: మ్యూచువల్‌ ఫండ్ల యూనిట్లు ఇప్పుడే అమ్మాలా? Should You Sell Your Mutual Fund Units Now?

Related Posts

  • జీతం తక్కువైనా.. పెద్ద మొత్తంలో లోన్ పొంద‌డం సాధ్యమేనా? బ్యాంకులు ఏం చూస్తాయి? Can You Get a Big Loan Even with a Low Salary? What Banks Actually Check FEATURE NEWS
  • డిజిటల్ గోల్డ్ కొనొద్దు.. సెబీ హెచ్చరిక.. ! Don’t Buy Digital Gold… SEBI Issues Warning! FEATURE NEWS
  • కొత్త ఐటీఆర్‌ ఫారాలు.. జ‌న‌వ‌రి నుంచి అమ‌లు! New ITR Forms to Be Implemented from January! FEATURE NEWS
  • కారు కొనేముందు ఇవి ఆలోచించండి Consider these before buying a car FEATURE NEWS
  • టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే how to start term insurance FEATURE NEWS
  • ఒకరికి ఎన్ని సేవింగ్ అకౌంట్లు ఉండొచ్చు? How Many Savings Accounts Can One Person Have? FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ‘టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ జాగ్రత్త‌లు తీసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వ్‌! Things to Check Before Buying Term Insurance .. Or You May Face Trouble!
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters!
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • క‌మొడిటీస్‌పై ఓ లుక్కేయండి what are commodities in  stock market MARKET
  • టార్గెట్ 5 ట్రిలియ‌న్  target five trillion NEWS
  • ఒక్క‌సారిగా పెరిగిన ముడి చ‌మురు ధ‌ర‌లు ..భార‌త్‌పై భార‌మెంతో తెలుసా? How Much Will the Sudden Spike in Crude Oil Prices Cost India? FEATURE NEWS
  • వ్యక్తిగత రుణాలపై సాధారణ అపోహలు.. Common Myths About Personal Loans FEATURE NEWS
  • యుద్ధం ఉన్నా.. బంగారం, వెండి ధ‌ర‌లు ఎందుకు పడిపోతున్నాయి? Why Are Gold and Silver Prices Falling Despite the War? FEATURE NEWS
  • రూ.3,32,205 కోట్ల తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర బడ్జెట్ .. అభివృద్ధి–సంక్షేమాలకు సమ ప్రాధాన్యం! Andhra Pradesh Budget of ₹3,32,205 Crore: Equal Priority to Development and Welfare FEATURE NEWS
  • సిప్ తో పాటు ఇన్సూరెన్స్‌ how to get insurance with mutual funds MUTUAL FUNDS
  • పెన్నీ స్టాక్స్ అంటే ఏవి what is penny stock MARKET

Copyright © 2026.

Powered by PressBook News Dark theme