Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS

భారతీయుల ఆస్తుల్లో షేర్ల వాటా కేవలం 4.7% మాత్రమే! Indians Hold Only 4.7% of Their Wealth in Stocks!

Posted on 05/11/202506/11/2025 By admin No Comments on భారతీయుల ఆస్తుల్లో షేర్ల వాటా కేవలం 4.7% మాత్రమే! Indians Hold Only 4.7% of Their Wealth in Stocks!

భారతదేశంలో కుటుంబాల మొత్తం ఆస్తుల్లో కేవలం 4.7 శాతం మాత్రమే ఈక్విటీలలో (షేర్లలో) ఉందని తాజా నివేదిక వెల్లడించింది. అంటే దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతున్నా, సాధారణ కుటుంబాల పెట్టుబడులు ఇంకా భూమి, బంగారం, స్థిర ఆస్తులు వైపే ఎక్కువగా మళ్లుతున్నాయని నివేదిక‌లు సూచిస్తున్నాయి. అయితే వృద్ధి సాధించాలంటే, పెట్టుబడి పంథాను మార్చాలి. చిన్న మొత్తాలతో అయినా మ్యూచువల్‌ ఫండ్స్‌, SIPల రూపంలో ఈక్విటీల్లో పెట్టుబడి పెడితే దేశ ఆర్థిక వ్యవస్థకూ, వ్యక్తిగత సంపదకూ మేలు జరుగుతుంది. సంపదను నిల్వ చేయడం కాదు, పెంచుకోవడమే తెలివి. పెట్టుబడిదారుల నినాదంగా మారాలి.

ఇల్లు, బంగారం మీదే మోజు.. Preference for Homes and Gold

భారతీయులు సంప్రదాయంగా భద్రతకే ప్రాధాన్యత ఇస్తారు. బంగారం, ఇల్లు, రియల్‌ ఎస్టేట్‌, బ్యాంకు డిపాజిట్లపై నమ్మకం ఎక్కువ. ఫలితంగా షేర్ల వంటి రిస్క్‌ ఉన్న పెట్టుబడుల్లోకి చాలా తక్కువమంది మాత్రమే అడుగుపెడుతున్నారు. చాలామంది చివరి నిమిషంలోనే టాక్స్‌ సేవింగ్‌ కోసం ఇన్వెస్ట్‌ చేస్తారు. ఇది సరైన వ్యూహం కాదు. ఆర్థిక సంవత్సరం మొదట్లోనే 80C, ELSS, NPS లాంటి టాక్స్‌ సేవింగ్‌ ఆప్షన్స్‌ ప్లాన్‌ చేసుకోవాలి.

అవగాహన లోపం ..Lack of Awareness

స్టాక్‌ మార్కెట్‌పై అవగాహన తక్కువగా ఉండడం, లాభనష్టాల భయం, గత అనుభవాలు.. ఇవి చాలామందిని ఈక్విటీ పెట్టుబడుల నుంచి దూరం చేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే, షేర్లంటే ‘మోసపోవడమే’ అన్న భ్రమ ఇంకా ఉంది. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా సేవింగ్స్‌పై ఫోకస్‌ చేస్తారు. కానీ పెట్టుబడులపై అవగాహన తక్కువ. దీర్ఘకాలం క్రమంగా పెట్టిన చిన్న మొత్తాలు కూడా పెద్ద సంపదగా మారుతాయి. అని నిపుణులు సూచిస్తున్నారు.

ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ ఉన్నా… Despite Financial Inclusion…

యూపీఐ, డిజిటల్‌ బ్యాంకింగ్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ విస్తరించినా, పెట్టుబడి సంస్కృతి మాత్రం పూర్తిగా మారలేదని నిపుణులు చెబుతున్నారు. ఈక్విటీలు దీర్ఘకాలంలో అధిక రాబడులు ఇచ్చే పెట్టుబడులు అయినప్పటికీ, తక్షణ లాభాల మోజు ప్రజల్లో ఎక్కువగా ఉందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. సురక్షిత పెట్టుబడుల వైపు అత్య‌ధికులు మొగ్గుచూపుతున్నారు. కానీ ఆర్థిక స్థిరత్వానికి, దీర్ఘకాల లాభాలకు ఈక్విటీలు కీలకం. చిన్న మొత్తాలతో ప్రారంభించడమే సరైన మార్గం.

ప్రపంచ దేశాలతో పోలిస్తే ..Compared to Other Countries…

అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాల్లో కుటుంబ ఆస్తుల్లో 30% నుంచి 40% వరకు ఈక్విటీల్లో పెట్టుబడులు ఉంటాయి. ఆ దేశాల్లో పెట్టుబడిదారులు రిస్క్‌ను అర్థం చేసుకొని దీర్ఘకాల రాబడులను ప్రాధాన్యతనిస్తారు. భారత్‌లో మాత్రం స్థిర ఆస్తులే సురక్షితమనే అభిప్రాయం బలంగా ఉంది.

ఈక్విటీలే సంపద సృష్టి కేంద్రం.. Equities: The Hub of Wealth Creation

గత దశాబ్దంలో షేర్‌ మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ విపరీతమైన వృద్ధి సాధించాయి. చిన్న మొత్తాల పెట్టుబడులు కూడా SIPల ద్వారా కోట్లకు పెరిగిన ఉదాహరణలు ఉన్నాయి. అయినప్పటికీ, భారతీయ కుటుంబాల మొత్తం ఆస్తుల్లో ఈక్విటీల వాటా కేవలం 4.7% మాత్రమే. ఆర్థిక విద్య లోపం, పెట్టుబడి ప్రణాళికలపై అవగాహన లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి ఇప్పటికీ “స్టాక్‌ మార్కెట్‌ అంటే జూదం” అన్న భ్రమ ఉంది. ₹500తో SIP మొదలుపెట్టినా, 15–20 ఏళ్లలో అది లక్షల్లోకి పెరుగుతుంది. కానీ దీని కోసం ఆర్థిక‌ క్రమశిక్షణ, దీర్ఘకాల దృష్టి అవ‌స‌రం.

లాభాలు ఇలా.. Here’s How the Profits Look…

స్టాక్‌ మార్కెట్‌ లాభాలు సాధారణ సేవింగ్‌ల కంటే 2–3 రెట్లు అధికం.

మ్యూచువల్‌ ఫండ్స్‌, ETFs‌ ద్వారా రిస్క్‌ తగ్గించుకోవచ్చు.

రియల్‌ ఎస్టేట్‌ కంటే లిక్విడిటీ ఎక్కువ.

భారతీయ ఈక్విటీ మార్కెట్ ..Indian Equity Market

ప్రపంచ ఆర్థిక వాతావరణంలో అనిశ్చితి నెలకొన్నా… భారతీయ ఈక్విటీ మార్కెట్‌ మాత్రం బలంగా దూసుకుపోతోంది. పెట్టుబడిదారులకు కొత్త అవకాశాలు, ఆర్థిక వృద్ధికి కొత్త దారులు తెరిచిన మార్కెట్‌గా భారత్‌ అవతరించింది. గత రెండేళ్లలోనే రిటైల్‌ ఇన్వెస్టర్ల సంఖ్య కోట్లలో పెరగడం, మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రికార్డులు బద్దలవ్వడం దీనికి నిదర్శనం.

ఇన్వెస్టర్ల ఉత్సాహం .. Investor Enthusiasm

నిఫ్టీ, సెన్సెక్స్‌ ఎప్పటికప్పుడు కొత్త గరిష్ఠాలు నమోదు చేస్తున్నాయి. దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌, SIPల ద్వారా రాబడుల ప్రవాహం కొనసాగుతోంది. నెలకు ₹20,000 కోట్లకు పైగా SIP ఇన్వెస్ట్‌మెంట్లు రావడం చిన్న పెట్టుబడిదారుల చైతన్యానికి నిదర్శనం.

బలమైన ఆర్థిక వ్యవస్థ ..Strong Economy

దేశంలో స్థిరమైన పాలన, వేగవంతమైన GDP వృద్ధి, కార్పొరేట్‌ లాభాలు, డిజిటల్‌ మార్పులు ఇవన్నీ కలసి మార్కెట్‌కి ఊతమిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఐటీ, ఇన్‌ఫ్రా, ఫార్మా రంగాలు పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి.

ETFs‌, SIPల వైపు యువత.. Youth Turning Toward ETFs and SIPs

పాత తరాల వారు బంగారం, స్థిరాస్తులపై ఆసక్తి చూపగా, నేటి త‌రం యువ‌త‌ స్టాక్స్‌, ETFs‌, SIPల వైపు మళ్లుతున్నారు.
డిజిటల్‌ యాప్స్‌, ఆన్‌లైన్‌ బ్రోకింగ్‌ ప్లాట్‌ఫార్మ్స్‌ వల్ల పెట్టుబడి సులభమవడంతో, విద్యార్థులు, ఉద్యోగస్తులు కూడా మార్కెట్‌లో అడుగుపెడుతున్నారు.

విదేశీ ఫండ్స్‌ కన్ను భారత్‌పై.. Foreign Funds Eye India…

అమెరికా, యూరప్‌ మార్కెట్ల క్షీణతతో గ్లోబల్‌ ఇన్వెస్టర్లు ఇప్పుడు భారతదేశం వైపే చూస్తున్నారు. FPIలు (Foreign Portfolio Investors) తిరిగి భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. “ఇండియా – the next big growth story!” అని అంతర్జాతీయ సంస్థలు అభివర్ణిస్తున్నాయి.

మార్కెట్‌లో వృద్ధి సూచనలు.. Growth Indicators in the Market

మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ₹450 లక్షల కోట్లు దాటింది. రోజువారీ ట్రేడింగ్‌ ఖాతాలు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి.

మ్యూచువల్‌ ఫండ్‌ ఫోలియోలు 20 కోట్లకు పైగా చేరాయి. SIP ఇన్వెస్టర్లలో 60% మంది యువత ఉన్నారు.

అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం.. Caution is Essential

మార్కెట్‌ పెరుగుతున్నదని పెట్టుబడులు కూడా జాగ్రత్తగా పెట్టాలి. నిపుణుల సలహా తీసుకోవడం, దీర్ఘకాల దృష్టితో ఇన్వెస్ట్‌ చేయడం అవసరం. మార్కెట్‌ రైడ్‌ ఉత్సాహభరితం, కానీ స్ట్రాటజీ తప్పితే లాభాలు కోల్పోవ‌డం ఖాయం. భారత మార్కెట్‌ కేవలం స్టాక్స్‌ ట్రేడింగ్‌ స్థలం కాదు . ఇది మధ్యతరగతి కుటుంబాల సంపద సృష్టికి ప్రారంభం.

రిస్క్‌ అర్థం చేసుకుని..Understand the Risks…

2020 తర్వాతి కాలంలో మ్యూచువల్‌ ఫండ్‌ SIPలు విపరీతంగా పెరిగాయి. నెలకు ₹500–₹1000తో పెట్టుబడి ప్రారంభించవచ్చన్న అవగాహన పెరిగింది. నిపుణులు చెబుతున్నట్లు.. దీర్ఘకాలంలో ఈ పెట్టుబడులు సంపద సృష్టికి బలమైన మార్గం. మధ్యతరగతి కూడా సంపదను నిల్వ చేయడం కంటే పెంచుకోవడం మంచిది. రిటైర్మెంట్‌ ప్లానింగ్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌, SIPలు, డైవర్సిఫైడ్‌ పోర్ట్‌ఫోలియోలు వంటి అంశాలు కూడా పెట్టుబడి ప్రాధాన్యాల్లో ఉన్నాయి. మార్కెట్‌లో అడుగు వేయడమే కాకుండా, సరైన గమ్యస్థానం ఎంచుకోవడమే కీలకం. రిస్క్‌ అర్థం చేసుకుని పెట్టుబడి చేస్తే మధ్యతరగతి కూడా కోటీశ్వరుల దిశగా నడవవచ్చు. అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

సురక్షిత పెట్టుబడికి 5 కీలక సూచనలు.. 5 Key Tips for Safe Investing

ప్రతి నెలా కనీసం 20% ఆదాయం ఇన్వెస్ట్ చేయాలి.
SIPల ద్వారా ఈక్విటీ ఫండ్‌ల్లో దీర్ఘకాల పెట్టుబడి పెట్టాలి.
అత్యవసర నిధిగా 6 నెలల ఖర్చు నిల్వ ఉంచాలి.
జీవిత బీమా & ఆరోగ్య బీమా తప్పనిసరి
నిరంతరంగా పెట్టుబడి పోర్ట్‌ఫోలియో సమీక్షించాలి.

 

386
FEATURE NEWS Tags:5 Key Tips for Safe Investing, Caution is Essential, Compared to Other Countries…, Despite Financial Inclusion…, Equities: The Hub of Wealth Creation, Foreign Funds Eye India…, Growth Indicators in the Market, Here’s How the Profits Look…, Indian Equity Market, Investor Enthusiasm, Lack of Awareness, Preference for Homes and Gold, Strong Economy, Understand the Risks…, Youth Turning Toward ETFs and SIPs

Post navigation

Previous Post: భారత కుబేరుల ఆస్తులు 62% పెరుగుదల .. Indian Billionaires’ Wealth Rises by 62%
Next Post: రూ.100 లక్షల కోట్ల మైలురాయికి చేరిన ఎస్‌బీఐ .. SBI Reaches ₹100 Lakh Crore Milestone

Related Posts

  • ఆటో పే సౌకర్యం… సౌలభ్యమేనా? లేక అప్రమత్తత అవసరమా? Auto Pay Facility: Convenience or a Call for Caution? FEATURE NEWS
  • పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజిట్ అంటే ఏమిటి What is Post Office Recurring Deposit FEATURE NEWS
  • క్రెడిట్ కార్డు… వీళ్ల‌కి వ‌రం what are the benifits of credit cards FEATURE NEWS
  • డిజిట‌ల్ గోల్డ్ కొన‌వ‌చ్చా..? Can We Buy Digital Gold? FEATURE NEWS
  • ఏ పన్ను విధానం మంచిది..? పాతదా.. కొత్తదా..? ఉద్యోగులు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు! Old vs New Tax Regime – Which One is Better for You? FEATURE NEWS
  • ఇక‌పై బ్యాంకు ఖాతాకు న‌లుగురు నామినీలు! న‌వంబ‌ర్ 1 నుంచి అమ‌లులోకి.. Now Four Nominees Allowed per Bank Account! Effective from November 1 FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan!
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic!
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • పాన్–ఆధార్ లింక్ కావడం లేదా? PAN–Aadhaar Link Not Working? Here’s the Real Solution FEATURE NEWS
  • స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ని కెరియర్ గా ఎంచుకోవచ్చా Can stock market trading be chosen as a career FEATURE NEWS
  • తక్కువ వెయిటింగ్‌ పీరియడ్ తో బీమా పాలసీని ఎలా తీసుకోవాలంటే? How to Choose a Health Insurance Policy with a Low Waiting Period INSURANCE
  • సైకో సైబ‌ర్‌నేటిక్స్‌ పుస్త‌క స‌మ‌రీ psycho cybernetics book summery BOOKS
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters! FEATURE NEWS
  • క్రెడిట్‌కార్డుతో బంగారు ఆభరణాలు కొన‌చ్చా..? Can You Buy Gold Jewellery with a Credit Card? FEATURE NEWS
  • Invest in new stocks కొత్త స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుండాలి.. MARKET
  • కొత్త‌గా డీ మ్యాట్ ఓపెన్ చేశారా.. అయితే ఇలా చేయండి Have you opened a new demat MARKET

Copyright © 2026.

Powered by PressBook News Dark theme