Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS

మీకు స‌రిపోయే ఇన్సూరెన్స్ ఇదే which type of insurance suits you

Posted on 15/05/202205/01/2025 By admin No Comments on మీకు స‌రిపోయే ఇన్సూరెన్స్ ఇదే which type of insurance suits you

ఇన్సూరెన్స్ అవ‌స‌రం కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అంద‌రికీ ప్ర‌తి ఒక్క విష‌యంలోనూ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. మ‌న స్థాయి పెరిగే కొద్దీ బీమా అవ‌స‌రం కూడా పెరుగుతోంది. బీమాలో చాలా ర‌కాలు ఉంటాయి. ఏ అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టుగా, దేనికి దానికి వేరువేరుగా ఇన్సూరెన్స్‌లు ఉంటాయి. అన్నింటిలో మ‌న‌కు న‌ప్పేది, అవ‌స‌ర‌మైన‌ది ఏదో తెలుసుకుని స‌రైన పాల‌సీని ఎంచుకోవాలి. ఈ ఇన్సూరెన్స్‌ల‌లో ప్ర‌ధాన‌మైన‌ది లైఫ్ ఇన్సూరెన్స్. ఆ త‌ర్వాత ఆరోగ్య బీమా. అంటే హెల్త్ ఇన్సూరెన్స్‌. ఇందులోనూ చాలా ర‌కాలు ఉన్నాయి. ఆ త‌ర్వాత వెహిక‌ల్ ఇన్సూరెన్స్‌. ఈ మూడు మ‌న‌కు నిత్య జీవితంలో అత్యంత అవ‌స‌ర‌మైన‌వి. అంద‌రికీ ఉండేవి. ఈ మూడింటిలో కూడా స‌దుపాయాలు, ప్రీమియంను బ‌ట్టి ర‌క‌ర‌కాల వ‌ర్గీక‌ర‌ణ‌లు ఉంటాయి. ఆ త‌ర్వాత ప‌రిశీలిస్తే మ‌రికొన్ని కొత్త ర‌కాల ఇన్సూరెన్స్ లు ఇప్ప‌డు వ‌స్తున్నాయి. మ‌నం వాడే ప్ర‌తి వ‌స్తువుకూ బీమా చేయించుకోవ‌డం అనే సంస్కృతి ఇప్పుడు ప్ర‌జ‌ల్లో పెరుగుతోంది. ఫోన్‌కు, సాంకేతిక ప‌రిక‌రాల‌కు, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డుల‌కు, ఇంటికి, ఆఫీసు లేదా మ‌నం చేసుకునే వ్యాపారానికి.. ఇలా ప్ర‌తి దానికీ ఇన్సురెన్స్ తీసుకుంటున్నారు. దీని వ‌ల్ల వ‌స్తువుకు భ‌ద్ర‌త పెరుగుతుంది. ఏం జ‌రిగినా ఇన్సూరెన్స్ కంపెనీ చూసుకుంటుందిలే అనే ధీమా ఇక్క‌డ ఉంటోంది. ఫైర్ ఇన్సూరెన్స్‌, మెరైన్ ఇన్సూరెన్స్‌, కార్మికుల బీమా, షాప్ ఓన‌ర్ ఇన్సూరెన్స్‌, ప్ర‌యాణ బీమా, ట్రావెల్ ఇన్సూరెన్స్‌.. ఇలా ర‌క‌ర‌కాలు ఇప్ప‌డు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిలో మ‌న‌కు ఏది అవ‌స‌ర‌మో చూసుకుని ర‌క్ష‌ణ క‌ల్పించుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి.

WHAT IS LIFE INSURANCE
లైఫ్ ఇన్సురెన్స్
మ‌న జీవితానికి అంటే మ‌న ప్రాణానికి చేసుకునేదే లైఫ్ ఇన్సూరెన్స్. మ‌న‌కు ఏదైనా అనుకోనిది జ‌రిగి ప్రాణాలు కోల్పోతే అప్ప‌డు మ‌న కుటుంబానికి క‌వ‌రేజీ కింద అధిక‌మొత్తంలో అమౌంట్ ల‌భిస్తుంది.
టర్మ్ ఇన్సురెన్స్ అనగా జీవిత బీమా పాలసీల ప్రాథమిక రకాలలో ఇది ఒకటి. టర్మ్ ప్లాన్ లో, పాలసీదారుడు నిర్ణీత కాల వ్యవధికి జీవిత బీమా పొందుతారు. పాలసీదారుడు అకాల మరణం సంభవించినట్లయితే, పాలసీదారుని కుటుంబం హామీ ఇవ్వబడిన మొత్తాన్ని అందుకుంటుంది. పాలసీదారుడు టర్మ్ ఇన్సురెన్స్ వ్యవధిలో జీవించి ఉంటే, పాలసీ నుంచి ఎలాంటి లాభాలు పొందలేరు. అంటే ఇక్క‌డ ఏదైనా జ‌రిగితేనే డ‌బ్బులు వ‌స్తాయి. లేదంటే చెల్లించిన మొత్తం నుంచి ఏమీ వెన‌క్కు రాదు.

ఉదాహ‌ర‌ణ‌కు.. 25 ఏళ్ల ర‌జ‌నీష్ 70 ఏళ్లకు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడ‌నుకుందాం. దీనికి అత‌ను ఎంచుకున్న క‌వ‌రేజీ కోటి రూపాయ‌లు. అంటే అత‌నికి 70 ఏళ్లు వ‌చ్చే లోగా ఎప్పుడైనా మృతి చెందితే అత‌ని కుటుంబానికి కోటి రూపాయ‌లు వ‌స్తాయి. దీనికి అత‌ను ఎంచుకున్న చెల్లింపు కాలం 10 ఏళ్లు అనుకుందాం. అంటే ప‌ది సంవ‌త్స‌రాల పాటు అత‌ను ప్రీమియం చెల్లిస్తే 70 ఏళ్ల వ‌ర‌కూ క‌వ‌రేజీ ఉంటుంది. అంటే 35 ఏళ్ల వ‌ర‌కూ అత‌ను ప్రీమియం క‌డితే చాలు. ఇక్క‌డ చెల్లింపు కాలం పెరిగితే ప్రీమియం త‌గ్గుతుంది. ఒక వేళ 70 సంవ్స‌రాల వ‌ర‌కూ ఏమీ కాక‌పోతే ర‌జ‌నీష్‌కు ఎటువంటి క‌వ‌రేజీ కానీ, ప్రీమియం అమౌంట్ కానీ వెన‌క్కు రాదు.
* ఇటీవ‌ల కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియం వెన‌క్కు ఇచ్చే పాల‌సీల‌ను కూడా ఆఫ‌ర్ చేస్తున్నాయి. అంటే పాల‌సీ ట‌ర్మ్ ముగిసాక ర‌జ‌నీష్‌కు 70 ఏళ్లు నిండిన త‌రువాత క‌ట్టిన ప్ర‌మీయం మొత్తం వెన‌క్కు ఇస్తాయి. అయితే ఈ ప్ర‌త్యేక పాల‌సీల‌ను మ‌నం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

హెల్త్ ఇన్సురెన్స్
హెల్త్ ఇన్సురెన్స్ అనేది మ‌రో ప్ర‌ధాన‌మైన, అత్యంత అవ‌స‌ర‌మైన బీమా. ఇది వివిధ వైద్య, శస్త్రచికిత్స ఖర్చులకు మనకి పరిహారం ఇస్తుంది. పెరుగుతున్న వైద్య ఖ‌ర్చులను భ‌రించాలంటే సాధార‌ణ‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి సాధ్య‌మ‌య్యేది కాదు. ఏ చిన్న చికిత్స కోసం మ‌నం ఆసుప‌త్రికి వెళ్లినా బిల్లులు అధికంగా విధిస్తున్నారు. పొర‌పాటున ఆసుప‌త్రిలో అడ్మిట్ కావ‌ల‌సి వ‌స్తే అందుక‌య్యే ఖ‌ర్చుకు ఆస్తుల‌మ్ముకోవాల్సిందే. ఆస్తులున్న‌వాళ్ల‌యితే ప‌ర్వాలేదు.. మ‌రి ఏ ఆధారం లేని వారు అప్పులు చేసుకోవాలి. ట్రీట్‌మెంట్ ఖ‌ర్చు, రూం చార్జిలు, క‌న్స‌ల్టేష‌న్ ఫీజు, మందులు, ర‌వాణా చార్జీలు, శస్ర‌చికిత్స కు.. ఇలా అనేక ర‌కాల ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప‌రిస్థితికి ఉన్న ఒకే ఒక్క ప‌రిష్కారం ఆరోగ్య బీమా. అందుకే ప్ర‌తి సంవ‌త్స‌రం కొంత ప్రీమియం చెల్లించి అత్య‌ధిక క‌వ‌రేజీ పొందే ప్లాన్ ను ఎంచుకోవ‌డం చాలా అవ‌స‌రం.

హెల్త్ ఇన్సురెన్స్ రెండు రకాలు
There are two types of health insurance
1. వ్యక్తిగత బీమా పాలసీ 2. కుటుంబ బీమా పాలసీ
కేవ‌లం మ‌న ఒక్క‌రికే ఇన్సూరెన్స్ చేయించుకుంటే అది వ్య‌క్తిగ‌త బీమా. మ‌న‌తో పాటు కుటుంబ స‌భ్యులంద‌రికీ బీమా చేయించుకుంటే అది కుటుంబ బీమా పాల‌సీ అవుతుంది.
* మన క్లెయిమ్ రెండు రకాలు 1.క్యాష్ లెస్ 2. రీయంబర్స్ మెంట్.
క్యాష్ లెస్ అంటే మనకి నచ్చిన హాస్పిటల్ కి వెళితే మన వైద్యానికి అయ్యే ఖర్చు మనం పే చేయనవసరం లేదు. ఆ సంస్థ వాళ్ళు హాస్పిటల్ కి పే చేస్తారు.
రియంబర్స్ మెంట్ అంటే మనం హాస్పిటల్ కి అయ్యే ఖర్చు మనమే పే చేసిన తర్వాత ఆ బిల్స్ ని హెల్త్ ఇన్సురెన్స్ కంపెనీ వాళ్ళకి సబ్మిట్ చేస్తే ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారు.

types of motor insurance
మోటారు ఇన్సురెన్స్
కార్లు, టూ-వీలర్లు వాహనాలను కవర్ చేసేదే మోట‌ర్ ఇన్సూరెన్ పాలసీ. మన వాహనానికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ నష్టాల నుంచి ఈ పాలసీ ఆర్థికంగా మనల్ని రక్షిస్తుంది.

ఈ పాలసీలో కూడా రెండు రకాలు పాలసీలు ఉన్నాయి.
1. కాంప్రిహెన్సివ్ మోటార్ ఇన్సురెన్స్ 2. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్
కాంప్రిహెన్సివ్ ఇన్సురెన్స్ అంటే ఇరువైపులా వాహనాలకి, ఒక వేళ వ్యక్తికి ప్రమాదం సంభవిస్తే రెండింటికీ ఇన్సురెన్స్ వర్తిస్తుంది. దీనినే కాంప్రిహెన్సివ్ ఇన్సురెన్స్ అంటారు.
థర్డ్ పార్టీ అంటే మనకి ఉపయోగాలు ఉండవు. అవతల వాహ‌నానికి ఏదైనా డ్యామేజ్ అయితే వాటికి ఇన్సురెన్స్ వర్తిస్తుంది. కొంతమంది సెలబ్రెటీస్ వాళ్ళ శరీర భాగాలకు కూడా ఇన్సురెన్స్ చేసుకుంటున్నారు.

ఆస్తి బీమా
ఆస్తి బీమా అంటే మన ఇళ్ల‌కు కూడా ఇన్సురెన్స్ చేసుకోవచ్చు. ఏ కారణంగానైనా మన ఇళ్ళు డ్యామేజ్ అయినా లేదా మన ఇంట్లో వస్తువులు పోయినా ఈ ఇన్సురెన్స్ లభిస్తుంది. ఇంకా ఫ్యాక్టరీలు తీసుకుంటే పెద్ద,పెద్ద ఫ్యాక్టరీలలో పెద్ద,పెద్ద మిషనరీస్ ఉంటాయి. వాటికి కూడా ఇన్సురెన్స్ చేసుకోవచ్చు.
* మ‌నం బ్యాంకు లోన్ తీసుకుని ఇళ్లు నిర్మించుకున్నామ‌నుకుందాం. అదే టైంలో మ‌నం ఇన్సూరెన్స్ కూడా తీసుకుని ఉంటే రుణం తిరిగి తీర్చుతున్న క్ర‌మంలో మ‌న‌కేదైనా జ‌రిగి చ‌నిపోతే అక్క‌డి నుంచి ఆ రుణాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించుకుంటుంది.

352
FEATURE NEWS, INSURANCE Tags:Comprehensive Motor Insurance, Third Party Insurance, types of motor insurance, what are the types of motor insurance, WHAT IS LIFE INSURANCE

Post navigation

Previous Post: టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే how to start term insurance
Next Post: మ్యూచువల్ ఫండ్స్ లో ఈ త‌ప్ప‌లు చేయొద్దు never make mistakes with mutual funds

Related Posts

  • ఎంత సంపాదించినా ఈ దేశాల్లో పన్ను లేదు..! అవేమిటో తెలుసా? No Matter How Much You Earn, There’s No Tax in These Countries — Do You Know Which Ones? FEATURE NEWS
  • స్టాక్స్ స్ప్లిట్ వ‌ల్ల లాభ‌మేనా what are the benefits of stock split FEATURE NEWS
  • విద్యార్థి ద‌శ నుంచే క్రెడిట్‌ స్కోరు .. ఆర్థిక విశ్వసనీయతకు ప్రతిబింబం .. Credit Score from Student Life… A Reflection of Financial Credibility FEATURE NEWS
  • ఏ పన్ను విధానం మంచిది..? పాతదా.. కొత్తదా..? ఉద్యోగులు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు! Old vs New Tax Regime – Which One is Better for You? FEATURE NEWS
  • గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు! Good News for Gold Buyers: Gold Prices Drop Sharply! FEATURE NEWS
  • పీఎఫ్‌ ఖాతా నుంచి LIC ప్రీమియం చెల్లించొచ్చు! LIC Premium from PF Account – A Financial Safety Option INSURANCE

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan!
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic!
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • `డి-మ‌ర్ట్` అధినేత ద‌మానీ పోర్ట్ ఫోలియో ఇదే.. MARKET
  • మీ సంపదను కాపాడేందుకు సిప్ ఒక్క‌డే స‌రిపోదు..! ‘మినిమాక్స్’ సూత్రం కూడా కీలకమే! SIP Alone Isn’t Enough to Protect Your Wealth..! The ‘Minimax’ Principle Matters Too! INVESTMENTS
  • అపర కుబేరులు.. దాతృత్వంలోనూ గొప్పోళ్లు! రోజుకీ రూ.7.4 కోట్ల విరాళం Modern Tycoons Shine in Charity Too: ₹7.4 Crore Donations Every Day! FEATURE NEWS
  • దుబాయ్‌లో బంగారంపై భారీ రాయితీలు..! Gold Discounts in Dubai Amid Transport Disruptions FEATURE NEWS
  • ఎంత సంపాదిస్తున్నా.. డబ్బులు మిగ‌ల‌ట్లేదా..? అయితే ఈ తప్పులే కారణం! Earning More but Saving Nothing? Here’s What You’re Doing Wrong! FINICAL PLANNING
  • పెరుగుతున్న రిటైల్ వాటా how much percentage of retial investors india NEWS
  • పసిడి రుణాలకు కొత్త శాఖలు.. ! నూత‌న దశలోకి గోల్డ్ లోన్ మార్కెట్ ! ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఊతం New Branches for Gold Loans… The Gold Loan Market Enters a New Phase! A Boost to the Economy FEATURE NEWS
  • బంగారం, వెండి, షేర్ మార్కెట్‌.. ఎందులో పెట్టుబడి పెట్టాలి? Gold, Silver, or Stock Market – Where Should You Invest? FINICAL PLANNING

Copyright © 2026.

Powered by PressBook News Dark theme