స్టాక్ మార్కెట్లో లాభం ఎంత ముఖ్యమో.. నష్టాన్ని నియంత్రించుకోవడమూ అంతే ముఖ్యం. షేర్ల ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు పడిపోతాయో కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. ఒక షేరును కొనుగోలు చేసిన తర్వాత అది మన అంచనాలకు భిన్నంగా కిందికి పడిపోతే.. నష్టం పెరుగుతూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నష్టాన్ని ఒక స్థాయికి పరిమితం చేసేందుకు ఉపయోగపడే సాధనమే ‘స్టాప్‌లాస్’ ( Stop-Loss) . ట్రేడింగ్‌లోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం.
ముందే నిర్ణయించుకోవాలి.. Decide Your Exit Before Entering
ఒక ట్రేడ్ ( Stop-Loss)తీసుకునే ముందు.. ఆ షేరు ఎంత ధరకు చేరితే ఇక నష్టాన్ని భరించకుండా బయటకు రావాలనేది ముందే నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు ఒక షేరును రూ.500కు కొనుగోలు చేశారనుకుందాం. మార్కెట్ కదలికను బట్టి రూ.480 కంటే దిగువకు వెళ్తే ఇక నష్టాన్ని పెంచుకోకూడదని నిర్ణయించుకుంటే.. రూ.480 వద్ద స్టాప్‌లాస్ పెట్టుకోవచ్చు. షేరు ధర ఆ స్థాయికి చేరుకున్నప్పుడు ముందుగా పెట్టుకున్న ఆర్డర్ అమలై, నష్టం మరింత పెరగకుండా అడ్డుకునే అవకాశం ఉంటుంది. స్టాప్‌లాస్ పెట్టుకోకుండా.. ‘మళ్లీ పెరుగుతుందిలే’ అనే ఆశతో షేరును అలాగే ఉంచుకుంటే నష్టం మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే ట్రేడ్ తీసుకునే సమయంలోనే లాభం ఎంత కావాలి, నష్టాన్ని ఎంత వరకు భరించగలమనే విషయాలపై స్పష్టత ఉండాలి.
నష్టానికి కళ్లెం.. Limiting Your Losses
స్టాప్‌లాస్ ( Stop-Loss) ప్రధాన ఉద్దేశం నష్టాలను నియంత్రించడమే. ఒక సెక్యూరిటీ ముందుగా నిర్ణయించిన ధరకు చేరుకున్నప్పుడు దానిని విక్రయించేందుకు ఈ విధానాన్ని ఉపయోగించవచ్చు. ముఖ్యంగా స్వల్పకాలిక ట్రేడింగ్‌లో ధరలు వేగంగా మారుతుంటాయి. కొన్ని సందర్భాల్లో మనం చూస్తుండగానే షేరు ధర ఒక్కసారిగా పడిపోవచ్చు. అలాంటి సమయంలో ప్రతి క్షణం మార్కెట్‌ను గమనించడం సాధ్యం కాకపోవచ్చు. ఇంట్రాడే ట్రేడర్లు మార్కెట్లోకి ప్రవేశించిన వెంటనే తమ ట్రేడ్‌కు తగిన స్టాప్‌లాస్ పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. స్టాప్‌లాస్ ఎంత దూరంలో పెట్టాలనేది మాత్రం ప్రతి షేరుకూ ఒకేలా ఉండదు. ఆ షేరు ధరలో ఉండే కదలిక, మార్కెట్ పరిస్థితులు, ట్రేడింగ్ విధానం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
ఎంత దూరంలో పెట్టాలి? How Far Should the Stop-Loss Be?
స్టాప్‌లాస్‌ను ( Stop-Loss) చాలా దగ్గరగా పెట్టినా సమస్యే. షేరు ధరలో సాధారణంగా జరిగే చిన్నపాటి హెచ్చుతగ్గులకే స్టాప్‌లాస్ అమలైపోవచ్చు. మరోవైపు చాలా దూరంలో పెడితే.. నష్టం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అందుకే సరైన స్థాయిని నిర్ణయించుకోవడం ముఖ్యం. మార్కెట్లో షేరు కదలికను అంచనా వేసేందుకు కొందరు ట్రేడర్లు ATR (Average True Range) వంటి సూచికలను ఉపయోగిస్తారు. ఒక షేరు సాధారణంగా ఎంత మేరకు కదులుతుందనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. షేరు కదలికను బట్టి స్టాప్‌లాస్ స్థాయిని నిర్ణయించుకోవడం వల్ల అనవసరంగా త్వరగా ట్రేడ్ నుంచి బయటకు వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఏ ఒక్క సూచికనూ గుడ్డిగా అనుసరించడం సరైన విధానం కాదు. ట్రేడర్ తన ట్రేడింగ్ వ్యూహం, రిస్క్ సామర్థ్యం, మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలి.
ఇంట్రాడేలో మరింత కీలకం.. Stop-Loss Is Crucial in Intraday Trading
ఇంట్రాడే ట్రేడింగ్‌లో ( Stop-Loss) ఒకే రోజులో షేరును కొనుగోలు చేసి విక్రయిస్తారు. ఈ సమయంలో మార్కెట్ కదలికలు వేగంగా ఉంటాయి. అందువల్ల ట్రేడ్ తీసుకున్న వెంటనే స్టాప్‌లాస్ పెట్టుకోవడం చాలా ముఖ్యం. ట్రేడ్ మనకు అనుకూలంగా వెళ్తే లాభాన్ని కొనసాగించవచ్చు. అంచనాకు విరుద్ధంగా వెళ్తే.. ముందే నిర్ణయించుకున్న స్థాయిలో నష్టాన్ని పరిమితం చేసుకుని బయటకు రావచ్చు. ట్రేడింగ్‌లో ప్రతి ట్రేడ్ లాభాన్నే ఇస్తుందని భావించడం ప్రమాదకరం. కొన్ని ట్రేడ్లు లాభం ఇవ్వొచ్చు.. మరికొన్ని నష్టాన్ని ఇవ్వొచ్చు. కానీ ఒక్క నష్టపోయిన ట్రేడ్ వల్ల మొత్తం మూలధనంపై పెద్ద ప్రభావం పడకుండా చూసుకోవడమే రిస్క్ మేనేజ్మెంట్లో కీలకం.
డెలివరీలో GTT ఉపయోగం.. GTT Orders for Delivery Trades
డెలివరీలో ( Stop-Loss)ట్రేడింగ్ చేసే వారు ఎప్పుడూ కంప్యూటర్ లేదా మొబైల్ ముందు ఉండకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో GTT (Good Till Triggered) వంటి ఆర్డర్ విధానాలు ఉపయోగపడతాయి. మనం ముందుగా ఒక ట్రిగ్గర్ ధరను నిర్ణయించి ఆర్డర్‌ను ఉంచవచ్చు. షేరు ఆ స్థాయికి చేరుకున్నప్పుడు ఆ ఆర్డర్ అమలయ్యేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక షేరు ధర పడిపోతే ఒక నిర్దిష్ట స్థాయిలో విక్రయించాలనుకుంటే.. అందుకు తగిన GTT ఆర్డర్‌ను ముందుగానే ఏర్పాటు చేసుకోవచ్చు. అదే విధంగా ఒక నిర్దిష్ట లాభం వచ్చినప్పుడు విక్రయించాలన్న లక్ష్యంతోనూ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మార్కెట్‌ను నిరంతరం గమనించాల్సిన అవసరం కొంతవరకు తగ్గుతుంది. GTT ఆర్డర్ విషయంలో మాత్రం ఉపయోగిస్తున్న బ్రోకర్ అందించే నిబంధనలు, ఆర్డర్ రకం, చెల్లుబాటు వంటి వివరాలను ముందుగా తెలుసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన వ్యవధి ఆయా ప్లాట్‌ఫామ్ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.
సూపర్ట్రెండ్తో ట్రెండ్ గమనింపు.. Using Supertrend to Track the Trend
ట్రేడర్లు ఉపయోగించే సూచికల్లో ( Stop-Loss)సూపర్ట్రెండ్ కూడా ఒకటి. షేరు ధర ఏ దిశలో కదులుతోంది? ప్రస్తుత ట్రెండ్‌లో మార్పు వస్తుందా? అనే విషయాలను అంచనా వేసేందుకు దీనిని కొందరు ఉపయోగిస్తారు. సూపర్ట్రెండ్ సిగ్నల్‌ను స్టాప్‌లాస్ నిర్ణయించడంలో లేదా ట్రేడ్ నుంచి బయటకు వచ్చే స్థాయిని గుర్తించడంలో ఒక సహాయక సాధనంగా చూడవచ్చు. అయితే ఒక ఇండికేటర్ ఇచ్చే సిగ్నల్ ఆధారంగానే మొత్తం నిర్ణయం తీసుకోవడం కంటే.. ధర కదలిక, ట్రెండ్, మార్కెట్ పరిస్థితులు వంటి ఇతర అంశాలను కూడా పరిశీలించడం మంచిది.
ట్రేడ్ కంటే ముందే రిస్క్ నిర్ణయం.. Define Risk Before the Trade
స్టాక్ మార్కెట్లో ( Stop-Loss)విజయవంతంగా కొనసాగాలంటే ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి అన్నదానితో పాటు.. ఎప్పుడు నష్టాన్ని అంగీకరించి బయటకు రావాలో కూడా తెలుసుకోవాలి. స్టాప్‌లాస్ పెట్టుకోవడం అంటే నష్టాన్ని పూర్తిగా నివారించడం కాదు. నష్టం ఒక నిర్దిష్ట స్థాయిని దాటకుండా నియంత్రించుకునే ప్రయత్నం. ట్రేడ్ తీసుకున్న తర్వాత షేరు ధర తగ్గుతుంటే నిర్ణయాన్ని మార్చుకుంటూ పోవడం వల్ల నష్టం అదుపు తప్పవచ్చు. అందుకే ట్రేడ్‌లోకి వెళ్లే ముందే ఎగ్జిట్ ప్లాన్ సిద్ధం చేసుకోవడం మంచిది. మనం ఎంత నష్టాన్ని భరించగలమో నిర్ణయించుకుని.. దానికి అనుగుణంగా స్టాప్‌లాస్ స్థాయిని ఏర్పాటు చేసుకోవాలి. స్టాక్ మార్కెట్లో లాభం కోసం చేసే ప్రతి ప్రయత్నంలో రిస్క్ కూడా ఉంటుంది. ఆ రిస్క్‌ను అర్థం చేసుకుని, ముందుగానే పరిమితులు పెట్టుకోవడం ద్వారా ట్రేడింగ్‌లో క్రమశిక్షణ పెరుగుతుంది. అందుకే ‘ముందు నష్టాన్ని నియంత్రించు.. ఆ తర్వాత లాభాన్ని చూడు’ అనే విధానం ట్రేడర్లకు ఉపయోగపడుతుంది.
