వచ్చే క్యాలెండర్ సంవత్సరానికి (2026) ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీలైన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ స్టాక్ మార్కెట్ (stock market) సెలవుల జాబితాను అధికారికంగా విడుదల చేశాయి. వారాంతాలు కాకుండా, పండగలు, ముఖ్య రోజులు కారణంగా మొత్తం 15 రోజులు మార్కెట్ మూతపడేలా ఉంది. ఆ రోజుల్లో ఈక్విటీ ట్రేడింగ్, డెరివేటివ్స్, ఇతర సెక్యూరిటీస్ కార్యకలాపాలు నిలిచిపోతాయి. స్టాక్ ఎక్స్ఛేంజీలు సూచిస్తున్నట్లు, ఈ తేదీలను ముందుగానే గమనించి, పెట్టుబడులు, ట్రేడింగ్ వ్యూహాలను సిద్ధం చేసుకోవడం మదుపర్లకు అత్యవసరం. స్టాక్ మార్కెట్లు కొన్ని ప్రత్యేక రోజుల్లో మూతబడే అవకాశం ఉంది. ముందుగానే ప్లాన్ చేసుకోగలిగితే, ట్రేడింగ్‌లో సమస్యలు తగ్గుతాయి.
2026లో ప్రధాన సెలవులు.. Major Holidays in 2026
జనవరి 26 (సోమవారం) – Republic Day
మార్చి 3 (మంగళవారం) – Holi
మార్చి 26 (గురువారం) – Sri Rama Navami
మార్చి 31 (మంగళవారం)- Mahavir Jayanti
ఏప్రిల్ 3 (శుక్రవారం) – Good Friday
ఏప్రిల్ 14(మంగళవారం) –Dr. B. R. Ambedkar Jayanti
మే 1 (శుక్రవారం)– Maharashtra Day
మే 28 (గురువారం) Bakrid (Eid al-Adha)
జూన్ 26 (శుక్రవారం) – Muharram
సెప్టెంబర్ 14 (సోమవారం) – Ganesh Chaturthi
అక్టోబర్ 2 (శుక్రవారం)– Mahatma Gandhi Jayanti
అక్టోబర్ 20(మంగళవారం) – Dussehra
నవంబర్ 10(మంగళవారం) – Diwali
నవంబర్ 24(మంగళవారం) – Guru Nanak Jayanti
డిసెంబర్ 25 (శుక్రవారం)– Christmas
ముఖ్య సూచనలు ..Key Points / Important Notes
స్టాక్ మార్కెట్లు (stock market)కొన్ని ప్రత్యేక రోజుల్లో మూతబడే అవకాశం ఉన్నందున ఆ రోజుల్లో ట్రేడింగ్ చేయడం సాధ్యం కాదు. కావున ముందుగానే ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవాలి. EMIs, SIPలు, ఆర్డర్లు సర్దుబాటు చేసుకోవాలి. కొన్ని సెలవులు తేదీ ఆధారంగా మారవచ్చు. కాబట్టి సరిగ్గా ధృవీకరించుకోవడం మంచిది.
మార్చిలో మూడు రోజుల పాటు స్టాక్ మార్కెట్ సెలవులు..Stock Market Holidays for Three Days in March
2026లో మార్చి నెలలో స్టాక్ మార్కెట్ (stock market)మూడు రోజులు మూతపడుతుంది. మార్చి 3 న హోలీ సందర్భంగా బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈ కార్యకలాపాలు నిలిచిపోతాయి. మార్చి 26 న శ్రీరామ నవమి కావున ఆరోజు మార్కెట్ మూతబడుతుంది. మార్చి 31 న మహవీర్ జయంతి సందర్భంగా ట్రేడింగ్ ఆగిపోతుంది. అంటే, మార్చి నెలలో మొత్తం మూడు ప్రత్యేక సెలవులు ఉన్నట్లే. మదుపర్లు ఈ తేదీలను ముందుగానే గమనించి ట్రేడింగ్ ప్లాన్, పెట్టుబడులు సిద్దం చేసుకోవడం మంచిది.
స్టాక్ మార్కెట్ ప్రత్యేక సూచనలు..Special Notes for the Stock Market
2026లో కొన్ని ముఖ్య పండగలు, వారాంతాల్లో రావడం వల్ల స్టాక్ మార్కెట్(stock market)లకు ప్రత్యేక పరిస్థితులు ఏర్పడతాయి. ఫిబ్రవరి 15 మహా శివరాత్రి, మార్చి 21న ఈద్-ఉల్-ఫితర్ , ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం , నవంబర్ 8 దీపావళి లక్ష్మీపూజ ఈ రోజుల్లో సాధారణంగా స్టాక్ మార్కెట్లు మూతపడతాయి. అయితే, దీపావళి లక్ష్మీపూజ ఆదివారం రావడంతో, ఆ రోజు మూరత్ ట్రేడింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ట్రేడింగ్ సమయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలు కొన్ని రోజుల ముందే అధికారికంగా ప్రకటిస్తాయి.

