ఈ రోజుల్లో అదనంగా డబ్బులు సంపాదించాలని అందరికీ ఉంటుంది. అవసరాలను బట్టి అదనపు డబ్బులు జనరేట్ చేసే వాటి కోసం ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను వెతుకుతూనే ఉంటారు. దీనికోసం ఆన్లైన్ లో వెతికితే.. మీకు కుప్పల తెప్పల ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కానీ హానెస్ట్ గా మాట్లాడుకుంటే వాటిలో సగానికి పైగా ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేయలేని ట్రాష్. మిగిలిన ఇన్కమ్ జనరేటింగ్ ఐడియాస్ లో కూడా చాలా వరకు ఇప్పుడున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో పనికి రాకుండా పోయాయి. ఇలా అదనపు ఆదాయం కోసం వెతుకుతూ చాలా మంది మోసగాళ్ల ఉచ్చులో సైతం ఇరుక్కుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం విజ్ఙతతో వ్యవహరించాల్సి ఉంటుంది. మరి 2025 లోని ప్రాక్టికల్లీ ఇంప్లిమెంట్ చేసి ఇన్కమ్ జనరేట్ చేసే ఐడియాస్‌ను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇలాంటివి చేయవద్దు..
* సబ్ టైటిలింగ్ అనేది ఆరు నెలల క్రితం వరకు మంచి జాబ్. ఎందుకంటే ఒక వీడియోను తెలుగు వాళ్ళు మాత్రమే కాకుండా కర్ణాటక , తమిళనాడు నుంచి నార్త్ నుంచి కూడా చాలా మంది చూస్తుంటారు. వాళ్ళు సబ్ టైటిల్స్ అడుగుతూ ఉంటారు. అయితే ఏఐ వచ్చిన తర్వాత ఈ జాబ్‌కు డిమాండ్ తగ్గింది. యూట్యూబ్ చానల్ స్వయంగా ఇప్పటికే ఏఐ సాయంతో సబ్ టైటిలింగ్ ఇచ్చేస్తోంది.
* లో లెవెల్ డేటా ఎంట్రీ జాబ్ ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కిల్ చేసేసింది.
* ఎఫిలియేట్ మార్కెటింగ్ తో అంత ఈజీగా డబ్బులు సంపాదించలేం. బాగా పాపులర్ అయిన కొంతమంది మాత్రమే ఇది చేయగలరు.
* స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ కూడా అంత సులువు కాదు. సోషల్ మీడియాలో చూపించినంత ఈజీగా ప్రతి ఒక్కరూ ట్రేడింగ్ ద్వారా డబ్బులు సంపాదించలేరు. ఇండియాలో 93% మంది ట్రేడింగ్ ద్వారా డబ్బులు కోల్పోతున్నట్లు రీసెంట్ గా సెబీ ప్రకటించింది. ఆ 93% డబ్బులు కోల్పోతున్న వాళ్ళలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళే నెంబర్ వన్ , నెంబర్ టూ స్థానాల్లో ఉన్నారు. అందుకే ట్రేడింగ్ కు దూరంగా ఉండడం మంచిది.
* మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో చాలా వరకు స్కామ్ లో జరుగుతాయి. వీటిలో కొన్ని నిజాయితీగా, అనుమతులు పొంది, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం చేస్తున్నప్పటికీ చాలా కంపెనీలు మోసాల బాటనే ఎంచుకుని, ప్రజలకు కుచ్చు టోపీ పెడుతున్నాయి. అయితే ఇందులో ఫస్ట్ ట్రాప్ అయిపోయేది స్టూడెంట్స్ అండ్ హౌస్ వైఫ్స్. కాబట్టి మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది బిగ్ ట్రాష్.

అదనపు ఆదాయానికి ఇవీ సరైనవి
These are perfect for extra income
* డ్రాప్ షిప్పింగ్ Drop shipping బిజినెస్ ద్వారా స్టూడెంట్స్ నుంచి హౌస్ వైఫ్స్ వరకు ప్రతి ఒక్కరూ ఇన్కమ్ సంపాదించగలుగుతారు. ఇక్కడ మనం ఏం చేయాలో అన్న విషయాన్ని ఓ సారి తెలుసుకుందాం. మన లోకల్ లో ఉండే చాలా స్టోర్స్ లో ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్ ని డిజిటల్లీ ఎలా సేల్ చేయాలో వాళ్ళకి అవగాహన ఉండదు. అక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ స్టోర్స్ దగ్గరికి వెళ్లి మీకు నచ్చిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని వీడియోస్ రికార్డ్ చేయాలి. ఒక ఒక వెబ్సైట్ ని బిల్డ్ చేసి.. అందులో ఈ ప్రొడక్ట్స్ ను సేల్‌కి పెట్టి, ఎవరైనా మన వీడియో చూసి ప్రొడెక్టు కొంటే ఎంతో కొంత ఆదాయం పొందొచ్చు. సోషల్ మీడియాలో ఆ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయగలిగినట్టయితే కొంచెం రెవెన్యూ జనరేట్ చేసుకునే వీలుంటుంది.
వీడియో ఎడిటింగ్
Video editing
వీడియో ఎడిటింగ్ కు రీసెంట్ టైంలో మంచి డిమాండ్ ఉంది. మీరు ఈ స్కిల్ ని అడాప్ట్ చేసుకొని మీ చుట్టుపక్కల ఉన్న బిజినెస్ లను బాగా ప్రమోట్ చేయగలిగితే మంచి ఆదాయం పొందుతారు. కాన్వా ప్రీమియర్, prox, ఫైనల్ కట్ లాంటి సాఫ్ట్వేర్స్ ద్వారా YouTube లో దొరికే కంటెంట్ తో ఉచితంగా వీడియో ఎడిటింగ్‌ను నేర్చుకోవచ్చు. ఇలా మీరు యూట్యూబ్ వీడియో ఎడిటర్స్ అయి మంచి ఆదాయం సంపాదించవచ్చు.
* ఆన్‌లైన్ ట్రైనింగ్ ద్వారా కూడా మీరు అదనపు ఆదాయం పొందొచ్చు. డైట్ ప్లాన్, యోగా సర్వీసెస్, వంటలు, ఫైనాన్సియల్ ప్లానింగ్‌తో ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. WhatsApp ద్వారా కూడా ఈ ట్రైనింగ్ సర్వీసెస్ ను ఆఫర్ చేయొచ్చు. మీ కోర్సులను బిల్డ్ చేసి డిజిటల్ మీడియాలో కూడా పోస్ట్ చేయొచ్చు.
కార్పొరేట్ మీల్
Corporate Meal
కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు అందించే ఆహార సేవా పథకం. ఇది ఒక రెగ్యులర్ బిజినెస్ ఐడియాగా కూడా అభివృద్ధి చెందుతోంది, ముఖ్యంగా పెద్ద నగరాల్లో కంపెనీలకు, ఆఫీసులకు, ఉద్యోగులకు నిత్యం భోజనాన్ని సరఫరా చేసి నెలకు రూ.లక్ష వరకు సంపాదించొచ్చు. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ హైజీన్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఇప్పడు క్లౌడ్ కిచెన్ల పేరిట కూడా కొన్ని వంటశాలలు వెలుస్తున్నాయి. ఇక్కడ చక్కగా వంట చేసి వచ్చని ఆర్డర్లకు సప్లయి చేయగలిగినట్టయితే మంచి ఆదాయం సంపాదించవచ్చు.
కంటెంట్ రైటింగ్
Content Writing
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కంటెంట్ క్రియేషన్‌కు చాలా డిమాండ్ పెరిగింది. ఇందులో కంటెంట్ రైటింగ్ చేసే వాళ్లు చాలా అవసరమవుతున్నారు. చాలా మంది క్రియేటర్లు వీడియోలను చాలా ఆసక్తి కరంగా, ఆకట్టుకునేలా తయారుచేస్తున్నారు. ఇప్పడు యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో ఉన్న వీడియోల్లో ఇంట్రో, మిడిల్ పార్ట్ ఎంత చక్కగా ఉందో, వీడియోను ఎలా ప్రెజెంట్ చేస్తున్నారో చూస్తే కంటెంట్ క్రియేషన్ గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఎండింగ్ ఎంత హై లో ఎండ్ చేస్తున్నారో చూడాలి. ఈ మూడింటిని కూడా పర్ఫెక్ట్ గా రాసి ఆ వ్యూవర్ ని ఆకట్టుకునేలా ఎంగేజ్ చేయగలిగితే కంటెంట్ రైటర్ గా ఇక తిరుగుండదు. ఇలా చేసినట్టయితే ప్రతినెలా సాలిడ్ ఇన్‌కమ్ వస్తుంది.
టాక్స్ అండ్ జీఎస్టీ కన్సల్టేషన్
Tax and GST Consultation
రీసెంట్ టైంలో జీఎస్ట మంత్లీ ఫైలింగ్ చేయడం అనేది చాలా అవసరం. కానీ ఇది ఎవరికి వారుచేసుకోలేరు. మనలో ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కొంతమంది మాత్రమే చేయగలుగుతారు. చేయలేని వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళలో చాలా మంది సీఏ ని అప్రోచ్ అవుతారు. కాకపోతే చిన్న ఊళ్లలో సీఏ ఉండకపోవచ్చు, అవైలబిలిటీ లేకపోవడం లేదా సీఏని ఎఫోర్డ్ చేసేంత డబ్బు లేకపోవచ్చు. అయితే ఇటువంటి కేసుల్లో Tax and GST Consultationకు డిమాండ్ పెరుగుతుంది. ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్లకి డీసెంట్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఫేక్ బిజినెస్ మోడల్స్ తో కస్టమర్ ని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే దాని వల్ల మీరు మాత్రమే కాదు మీ కస్టమర్ కూడా రిస్క్ లో పడతారు.
ఫైనాన్షియల్ అడ్వైజరీ
Financial Advisory
ఫైనాన్షియల్ అడ్వైజరీ (Financial Advisory) అంటే వ్యక్తిగతం, కుటుంబం లేదా వ్యాపారం కోసం సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో సాయం చేసే సేవలు. ఇవి ముఖ్యంగా నికర ఆదాయం పెంపు, పెట్టుబడులు, రుణ నిర్వహణ, పన్నుల ప్లానింగ్, రిటైర్మెంట్ ప్లానింగ్, బీమా మొదలైన రంగాల్లో సహాయపడతాయి. ఇది 2025లో అత్యంత అవసరమైన , ఆదాయదాయకమైన ఫీల్డ్ కూడా అవుతోంది. ఫైనాన్షియల్ అడ్వైజరీ ఒక మెరుగైన ఆదాయ మార్గమే కాదు, సమాజానికి సేవ చేసే గొప్ప అవకాశం కూడా. నెలకు ₹50,000 – ₹2,00,000 వరకూ ఆదాయం ఇచ్చే ఫీల్డ్.
స్టోరీ టెల్లింగ్ మార్కెటింగ్
Storytelling Marketing
స్టోరీ టెల్లింగ్ మార్కెటింగ్ (Storytelling Marketing) అనేది 2025లో అత్యంత ప్రభావవంతమైన మార్కెటింగ్ టెక్నిక్. ఇది కేవలం ఉత్పత్తి వివరాలు చెప్పడం కాదు, ఒక భావోద్వేగకతతో కూడిన కథ ద్వారా వినియోగదారుడి మనసును తాకడం. ఇది వ్యాపార బ్రాండ్, వ్యక్తిగత బ్రాండ్ లేదా ఆన్‌లైన్ అమ్మకాలు అయినా సరే, అత్యద్భుతంగా పని చేస్తోంది.
ఫ్రీలాన్సింగ్ & డిజిటల్ సర్వీసులు
Freelancing & Digital Services
గ్రాఫిక్ డిజైన్, వెబ్ డెవలప్మెంట్, కంటెంట్ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్, వాయిస్ ఓవర్.. వంటి సేవలతో గ్లోబల్‌గా పని చేయవచ్చు. మన నైపుణ్యాన్ని బట్టి నెలకు ₹1 లక్షపైగా సంపాదించవచ్చు. Fiverr, Upwork, Freelancer వంటి వెబ్‌సైట్లలో మన సేవలను పొందుపరిచి అక్కడ నుంచి మనం క్లయింట్లతో అనుసంధానం అవ్వవచ్చు. అలా మన సేవలను అందించి ఆదాయం పొందొచ్చు.
ఆన్‌లైన్ కోర్సులు లేదా ట్యూషన్స్
Online courses or tuitions
మీ నైపుణ్యం ఆధారంగా కోర్సులు రూపొందించి Udemy, Unacademy, YouTube లో పెట్టడం ద్వారా నెలకు ₹1 లక్ష ఆదాయం పొందొచ్చు. అది కూడా ఎక్కువగా ప్రేక్షకులు చూస్తేనే. మనకు బాగా వచ్చిన సబ్జెక్టుని ఆసక్తికరంగా మలిచి వీడియో రూపంలో చెప్పగలిగితే ఇక్కడ మంచి ఆదరణ లభిస్తుంది. ఇలా Competitive Exams, Programming, Spoken English, Maths, Accountsకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేసి డబ్బులు పొందొచ్చు.

