ఒకవైపు వేల కోట్ల రూపాయల రుణాలు.. మరోవైపు వాటికి కేవలం కొన్ని కోట్లతో పరిష్కారం! అందులోనూ రుణం ఇచ్చిన సంస్థలతోపాటు, రుణగ్రహీతకు అత్యంత సన్నిహితంగా ఉన్న కంపెనీలు కూడా రుణదాతలుగా మారి.. అదే రుణగ్రహీత ప్రతిపాదనకు అనుకూలంగా ఓటేస్తే? సహజంగానే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రస్తుతం ఎస్సెల్ గ్రూపు వ్యవస్థాపకుడు సుభాష్‌చంద్ర వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియలో చోటుచేసుకున్న ఓటింగ్ వ్యవహారం (Subhash Chandra’s Personal Insolvency Resolution Proposal) ఇలాంటి సందేహాలనే రేకెత్తిస్తోంది. సుభాష్‌చంద్రపై మొత్తం రూ.22,006.57 కోట్ల మేర క్లెయిమ్‌లు ఉన్నట్లు ఈ వ్యవహారంలో పేర్కొంటున్నారు. అయితే తన వ్యక్తిగత దివాలా పరిష్కారంలో భాగంగా కేవలం రూ.6.5 కోట్ల మేర తన నికర ఆస్తుల విలువను చెల్లించేం దుకు సిద్ధమని ఆయన ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు రుణదాతల కమిటీలో 80 శాతానికి పైగా ఓట్లు అనుకూలంగా వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఈ ఓట్లలో 61.78 శాతం వరకు సుభాష్‌చంద్ర కుటుంబసభ్యులకు లేదా ఎస్సెల్ గ్రూప్‌తో సన్నిహిత సంబంధాలున్న సంస్థలకు సంబంధించినవేనని వ్యతిరేకిస్తున్న బ్యాంకులు ఆరోపిస్తున్నాయి. దివాలా చట్టంలోని నిబంధనల ప్రకారం సంబంధిత వ్యక్తులు రుణదాతల కమిటీ ఓటింగ్‌లో పాల్గొనడానికి వీల్లేదని బ్యాంకులు వాదిస్తున్నాయి. ఈ కారణంగానే ఎన్సీఎల్టీ నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు అవి సిద్ధమవుతున్నాయి.
అసలు వివాదం ఏమిటి? What Is the Dispute About?
ఈ వ్యవహారాన్ని(Subhash Chandra’s Personal Insolvency Resolution Proposal) సులభంగా అర్థం చేసుకోవాలంటే.. ఒక ఉదాహరణ తీసుకుందాం. ‘ రామారావు’ అనే పారిశ్రామికవేత్తకు చెందిన కొన్ని కంపెనీలు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్నాయని అనుకుందాం. ఆ రుణాలకు సుబ్బారావు వ్యక్తిగతంగా పూచీకత్తు ఇచ్చారు. అదే సమయంలో ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులకు చెందిన కొన్ని కంపెనీలు కూడా తమ షేర్లను బ్యాంకుల వద్ద తనఖా పెట్టి ఆ రుణాలకు భరోసాగా నిలిచాయి. తమ ఆస్తులు, షేర్లను సుబ్బారావు కంపెనీల రుణాలకు భద్రతగా పెట్టినందుకు ప్రతిగా.. భవిష్యత్తులో తమకు ఏదైనా నష్టం వాటిల్లితే తానే భరిస్తానంటూ రామారావు ఆయా సంస్థలకు లెటర్ ఆఫ్ ఇండెమ్నిటీలు ఇచ్చారని అనుకుందాం. అంటే.. తన కారణంగా ఆ సంస్థలకు నష్టం జరిగితే, ఆ నష్టాన్ని తాను భర్తీ చేస్తానన్న హామీ అన్నమాట. కొంతకాలానికి రామారావు కంపెనీలు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేకపోయాయి. దీంతో బ్యాంకులు తమ వద్ద ఉన్న షేర్లను విక్రయించాయి. అయితే మార్కెట్ పరిస్థితుల కారణంగా వాటి విలువ గణనీయంగా పడిపోయింది. షేర్లను విక్రయించినా బ్యాంకులకు రావాల్సిన మొత్తం పూర్తిగా రాలేదు. దీంతో రామారావు ఇచ్చిన వ్యక్తిగత హామీ ఆధారంగా బ్యాంకులు ఆయనపై చర్యలకు దిగాయి. ఇదే సమయంలో ఆయన కుటుంబసభ్యులకు చెందిన కంపెనీలు కూడా.. తమ షేర్ల విలువ పడిపోవడంతో తమకు నష్టం జరిగిందని, గతంలో ఇచ్చిన ఇండెమ్నిటీ హామీల ప్రకారం ఆ నష్టాన్ని సుబ్బారావే భరించాలంటూ దివాలా ప్రక్రియలో క్లెయిమ్ చేశాయి. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. బ్యాంకుల నుంచి రుణం తీసుకోని ఆ కంపెనీలు కూడా ఎలా రుణదాతలుగా మారాయి? వాటి క్లెయిమ్ నిజమైన రుణమా? లేక గతంలో ఇచ్చిన హామీల ఆధారంగా ఏర్పడిన బాధ్యతా? అన్నదే వివాదానికి కేంద్రబిందువుగా మారింది.
రూ.22 వేల కోట్లలో రూ.13,595 కోట్ల క్లెయిమ్.. ₹13,595 Crore Claim in the Total ₹22,000 Crore
ఈ వ్యవహారంలో(Subhash Chandra’s Personal Insolvency Resolution Proposal) మొత్తం క్లెయిమ్‌లు రూ.22,006.57 కోట్లుగా పేర్కొంటున్నారు. అందులో సుభాష్‌చంద్ర కుటుంబసభ్యులకు చెందినట్లు, ఎస్సెల్ గ్రూప్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదు కంపెనీల క్లెయిమ్ సుమారు రూ.13,595.67 కోట్లుగా ఉందని బ్యాంకులు చెబుతున్నాయి. అంటే మొత్తం క్లెయిమ్‌లో దాదాపు 61.78 శాతం ఈ ఐదు కంపెనీలదే. ఇదే ఇప్పుడు ప్రధాన వివాదాంశంగా మారింది. బ్యాంకులు మాత్రం ఈ మొత్తాన్ని సాధారణ రుణంగా చూడకూడదని వాదిస్తున్నాయి. సుభాష్‌చంద్ర ఆ కంపెనీల నుంచి నేరుగా వేల కోట్ల రూపాయల రుణం తీసుకోలేదని.. గతంలో ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇండెమ్నిటీ ఆధారంగా ఆ సంస్థలు తమకు నష్టం జరిగిందని క్లెయిమ్ చేశాయని పేర్కొంటున్నాయి. ఈ క్లెయిమ్‌లను అంగీకరిస్తే.. మొత్తం బకాయిల్లో పెద్ద భాగం కుటుంబసభ్యులు, సన్నిహిత సంస్థలవైపే వెళ్లిపోతుందని బ్యాంకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
ఐదు కంపెనీలపై ఎందుకంత చర్చ? Why Are Five Companies Under Scrutiny?
సుభాష్‌చంద్ర (Subhash Chandra’s Personal Insolvency Resolution Proposal) ప్రతిపాదనకు అనుకూలంగా ఓటేసిన ఐదు కంపెనీలే ఇప్పుడు ఈ వివాదంలో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు. వీణా ఇన్వెస్ట్మెంట్స్, డైరెక్ట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ వెంచర్స్, వరల్డ్ క్రెస్ట్ అడ్వైజర్స్, లెమనేడ్ క్యాపిటల్ అడ్వైజర్స్, కార్ప్‌కాల్ క్యాపిటల్ అడ్వైజర్స్ పేర్లు ఈ వ్యవహారంలో ప్రస్తావనకు వచ్చాయి. వీణా ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ సుభాష్‌చంద్ర సోదరుడు జవహర్ గోయల్ భార్య సుశీలాదేవికి సంబంధించిందని చెబుతున్నారు. వరల్డ్ క్రెస్ట్ అడ్వైజర్స్‌లో వాటాదారుగా ఉన్న వసంత్ శర్మ గతంలో వీణా ఇన్వెస్ట్మెంట్స్, ఎస్సెల్ గ్రూప్ సంస్థల్లో డైరెక్టర్‌గా పనిచేసినట్లు సమాచారం. లెమనేడ్ క్యాపిటల్ అడ్వైజర్స్‌కు చెందిన రవీంద్ర పాష్తే, నరేశ్ ఇంగాలేలకు ఎస్సెల్ గ్రూప్ నెట్‌వర్క్‌తో సంబంధాలున్నాయని ఆరోపణలు ఉన్నాయి. కార్ప్‌కాల్ క్యాపిటల్ అడ్వైజర్స్‌కు చెందిన డైరెక్టర్లు కూడా గతంలో ఎస్సెల్ గ్రూప్‌లో కీలక బాధ్యతలు నిర్వహించినట్లు బ్యాంకులు ప్రస్తావిస్తున్నాయి. ఇక డైరెక్ట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ వెంచర్స్‌లో 99.99 శాతం వాటాలు ఎస్సెల్ గ్రూప్‌నకు చెందిన ఎస్సెల్ కార్పొరేట్ రీసోర్సెస్ ఆధీనంలో ఉన్నాయని పేర్కొంటున్నారు. అందువల్ల ఈ ఐదు సంస్థలు స్వతంత్ర రుణదాతలేనా? లేక సుభాష్‌చంద్రకు సంబంధం ఉన్న సంస్థలా? అన్న ప్రశ్న ఇప్పుడు న్యాయపరమైన చర్చకు దారితీసింది.
రూ.6.5 కోట్లకే పరిష్కారం? Settlement Offer of Just ₹6.5 Crore?
సుభాష్‌చంద్ర (Subhash Chandra’s Personal Insolvency Resolution Proposal) వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రతిపాదనలో మరో అంశం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. బ్యాంకులకు సంబంధించిన అసలు బకాయిలు సుమారు రూ.3,992 కోట్ల మేర మాత్రమే ఉన్నాయని ఆయన తరఫు వాదనగా చెబుతున్నారు. ఇప్పటికే రుణాలు తీసుకున్న కంపెనీల ఆస్తులు, తనఖాలో ఉన్న షేర్ల విక్రయం ద్వారా సుమారు రూ.620 కోట్లు సెటిల్ అయ్యాయని కూడా పేర్కొంటున్నారు. మిగిలిన మొత్తాన్ని సంబంధిత కంపెనీల ద్వారా బ్యాంకులకు చెల్లించేలా చర్యలు తీసుకుంటానని ఆయన ప్రతిపాదించినట్లు సమాచారం. తాను వ్యక్తిగతంగా పూచీకత్తుదారుగా ఉన్నందున.. తన మొత్తం ఆస్తుల నికర విలువ రూ.6.5 కోట్ల మేర మాత్రమే ఉందని, దానిని చెల్లించేందుకు సిద్ధమని సుభాష్‌చంద్ర ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనను రుణదాతల కమిటీ ముందుంచగా.. దానికి 80.81 శాతం ఓట్లు అనుకూలంగా వచ్చినట్లు వివాదంలో పేర్కొంటున్నారు. మొత్తం ఎనిమిది సంస్థలు దీనికి మద్దతు ఇచ్చినట్లు చెబుతున్నారు. వాటిలో ఐదు సంస్థలకే సుభాష్‌చంద్ర కుటుంబం లేదా ఎస్సెల్ గ్రూప్‌తో సంబంధాలున్నాయని బ్యాంకులు ఆరోపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు న్యాయపరమైన పోరాటానికి కారణమవుతోంది.
బ్యాంకుల అభ్యంతరం ఇదే.. Banks Strongly Oppose the Resolution
నిజంగా రుణాలు ఇచ్చిన బ్యాంకులు (Subhash Chandra’s Personal Insolvency Resolution Proposal) మాత్రం ఈ పరిష్కారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రుణగ్రహీతకు సంబంధించిన వ్యక్తులు లేదా సంస్థలకు ఓటింగ్ హక్కులు కల్పిస్తే.. రుణదాతల కమిటీ నిర్ణయం స్వతంత్రంగా ఉండదని వాటి వాదన. మొత్తం ఓట్లలో 61.78 శాతం వరకు వివాదాస్పదంగా ఉన్న సంస్థల నుంచే వచ్చినట్లయితే.. మిగిలిన రుణదాతల అభిప్రాయానికి ఎంత ప్రాధాన్యం దక్కుతుందన్నది మరో ప్రశ్న. అయితే ఎన్సీఎల్టీ మాత్రం అందుబాటులో ఉన్న రికార్డులు, నిబంధనలు, సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని పరిష్కార ప్రతిపాదనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో వివాదం ముగిసిపోలేదు. వ్యతిరేకిస్తున్న బ్యాంకులు ఎన్సీఎల్టీ తీర్పును అప్పిలేట్ ట్రైబ్యునల్‌లో సవాల్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అక్కడ సంబంధిత కంపెనీలకు ఓటింగ్ హక్కు ఉందా? వాటి క్లెయిమ్‌లు ఎలా పరిగణించాలి? అనే అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
‘అంబానీ మీడియా నాపై దుష్ప్రచారం చేస్తోంది’.. Subhash Chandra Hits Out at Ambani
ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంపై (Subhash Chandra’s Personal Insolvency Resolution Proposal) సుభాష్‌చంద్ర తీవ్రంగా స్పందించారు. తనపై, తన గ్రూప్‌పై ముకేశ్ అంబానీకి చెందిన మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ముకేశ్ అంబానీని ఉద్దేశించి.. తనపై తప్పుడు ప్రచారం ఆపాలని కోరారు. ధీరూభాయ్ అంబానీ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని.. అయితే ఆయన కుమారుడు ముకేశ్ ఆయన నుంచి ఏమీ నేర్చుకోలేదనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్సీఎల్టీ తీర్పు అమల్లోకి వచ్చిన తర్వాత తన వద్ద ఏమీ మిగలలేదని, ఇప్పటికే తాను పూర్తిగా నష్టపోయానని ఆయన పేర్కొన్నారు. ఇక కోల్పోవడానికి తన వద్ద ఏమీ లేదని.. తనతో పోరాటం చేయడం వల్ల అవతలి వ్యక్తికే నష్టం జరుగుతుందని హెచ్చరించారు. తనపై జరుగుతున్న ప్రచారం వెనుక పెద్ద శక్తులున్నాయన్న ఆరోపణలు కూడా చేశారు. అయితే ఇవన్నీ నిరాధార ఆరోపణలేనని రిలయన్స్ మీడియా కొట్టిపారేసింది.
‘సుభాష్‌చంద్రపై గౌరవం ఉంది’.. Reliance Rejects the Allegations
సుభాష్‌చంద్ర (Subhash Chandra’s Personal Insolvency Resolution Proposal) చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని రిలయన్స్ మీడియా స్పష్టం చేసినట్లు సమాచారం. ఒక వ్యాపారవేత్తగా, పారిశ్రామికవేత్తగా సుభాష్‌చంద్రపై తమకు గౌరవం ఉందని.. ఆయనకు మేలు జరగాలని తాము కోరుకుంటున్నామని పేర్కొంది. దీంతో ఒకవైపు దివాలా పరిష్కార ప్రక్రియపై న్యాయపరమైన వివాదం కొనసాగుతుండగా.. మరోవైపు సుభాష్‌చంద్ర, రిలయన్స్ వర్గాల మధ్య మాటల యుద్ధం కూడా తెరపైకి వచ్చింది.
విజయ్‌మాల్యా ఎద్దేవా.. Vijay Mallya Takes a Dig
ఈ వ్యవహారంపై(Subhash Chandra’s Personal Insolvency Resolution Proposal) పరారీలో ఉన్న పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా కూడా సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు. తన విషయంలో బ్యాంకులు, ప్రభుత్వం రూ.6,023 కోట్ల బకాయిలకు సంబంధించి రూ.14,100 కోట్ల మేర రికవరీ చేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే పెద్ద రుణగ్రహీతలు మాత్రం చాలా తక్కువ మొత్తానికే రుణాలను పరిష్కరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. భారతదేశంలో రుణాల పరిష్కార వ్యవస్థ ఇదేనా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. తన విషయంలో తీవ్రంగా స్పందించిన మీడియా.. ఇలాంటి వ్యవహారాలపై ఎందుకు ప్రశ్నలు లేవనెత్తడం లేదని కూడా ఆయన నిలదీశారు. అయితే విజయ్‌మాల్యా వ్యాఖ్యలు కూడా ఆయన వ్యక్తిగత కేసు, అనుభవాల నేపథ్యంలో చేసిన రాజకీయ–వ్యాపార వ్యాఖ్యలుగానే చూడాల్సి ఉంటుంది.
తుది తీర్పు ఎక్కడ? The Final Battle Moves to the Appellate Tribunal
మొత్తం వ్యవహారంలో ఇప్పుడు కీలకంగా మారిన అంశం ఒక్కటే. సుభాష్‌చంద్రకు (Subhash Chandra’s Personal Insolvency Resolution Proposal) సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలకు రుణదాతల కమిటీలో ఓటింగ్ హక్కు ఉందా? వాటి క్లెయిమ్‌లను అసలు రుణంగా పరిగణించవచ్చా? అన్నదే. ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పును బ్యాంకులు అప్పిలేట్ ట్రైబ్యునల్‌లో సవాల్ చేయనున్న నేపథ్యంలో.. అక్కడ వెలువడే నిర్ణయం ఈ వివాదానికి మరింత స్పష్టత ఇవ్వనుంది. వేల కోట్ల రూపాయల రుణాలు, వ్యక్తిగత పూచీకత్తులు, షేర్ల తనఖాలు, ఇండెమ్నిటీ హామీలు, కుటుంబసభ్యులకు చెందిన సంస్థల క్లెయిమ్‌లు.. ఇలా అనేక అంశాలు ముడిపడి ఉన్న ఈ కేసు కేవలం సుభాష్‌చంద్ర వ్యక్తిగత దివాలా పరిష్కారానికే పరిమితం కాదు. రుణగ్రహీతకు సన్నిహితంగా ఉన్న సంస్థలను రుణదాతలుగా పరిగణించే విషయంలో భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానంపైనా ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే.. రూ.22 వేల కోట్ల క్లెయిమ్‌ల మధ్య రూ.6.5 కోట్ల పరిష్కార ప్రతిపాదన ఎలా ఆమోదం పొందింది? ఆ ఓట్లలో సంబంధిత సంస్థల పాత్ర ఎంత? నిజమైన రుణదాతల హక్కులు ఎలా రక్షించబడాలి? అన్న ప్రశ్నలకు అప్పిలేట్ ట్రైబ్యునల్‌లో వచ్చే తీర్పే కీలకం కానుంది.
