Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!! FEATURE NEWS
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక! FEATURE NEWS
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS

సూక్ష్మ రుణాలు తగ్గుముఖం..!16.8 శాతం క్షీణత‌! Micro Loans Decline…! A Sharp 16.8% Drop

Posted on 30/11/2025 By admin No Comments on సూక్ష్మ రుణాలు తగ్గుముఖం..!16.8 శాతం క్షీణత‌! Micro Loans Decline…! A Sharp 16.8% Drop

దేశవ్యాప్తంగా సూక్ష్మ రుణాల రంగం మరోసారి కుదింపు దిశలో అడుగులు వేస్తోంది. గ్రామీణ పేదలు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి దిశగా అడుగులు వేసే వర్గాలు ఆధారపడే ఈ రంగం గత రెండేళ్లుగా వృద్ధి సంకేతాలు చూపించడం లేదు. తాజాగా వచ్చిన గణాంకాలు ఆ దిశలో స్పష్టమైన మార్పును సూచిస్తున్నాయి. ముఖ్యంగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో తొలి అర్ధభాగంలో సూక్ష్మ రుణాల జారీ 16.8% మేర తగ్గిందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. నిధుల లభ్యత తగ్గడం, వడ్డీరేట్లు పెరగడం, ఎన్‌పీఏలు ఎగబాకడం వంటి అంశాలు ఈ రంగాన్ని మళ్లీ ఒత్తిడిలోకి నెట్టాయని నిపుణులు చెబుతున్నారు.

జారీ చేసిన సూక్ష్మరుణాల మొత్తం..Total Microloans Disbursed

ఈ ఏడాది సెప్టెంబరు నెలాఖరు నాటికి 36 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 718 జిల్లాల్లో బ్యాంకులు, మైక్రోఫైనాన్స్ సంస్థలు, ఎన్బీఎఫ్‌సీలు కలిపి జారీ చేసిన సూక్ష్మరుణాల మొత్తం రూ.3,39,510 కోట్లు మాత్రమే. గ‌తేడాది ఇదే కాలంలో ఈ మొత్తం రూ.4,08,049 కోట్లు ఉండటంతో… సూక్ష్మ రుణాల రంగం మొత్తం 16.8 శాతం మేర క్షీణించినట్లు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.

నిధుల లభ్యతే పెద్ద సవాల్‌.. Access to Funds Is the Biggest Challenge

సూక్ష్మ రుణాల రంగంలో పనిచేసే మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు (ఎంఎఫ్ఐలు), చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిధుల కొరత. బ్యాంకులు మైక్రో ఫైనాన్స్ సంస్థలకు రుణాల మంజూరులో జాగ్రత్త ధోరణి అవలంబిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో వడ్డీరేట్లు పెరగడంతో విదేశీ నిధుల ప్రవాహం మందగించింది. బాండ్ మార్కెట్లో చిన్న సంస్థలకు పెట్టుబడులు దొరకడం కష్టంగా మారింది. ఈ నేపధ్యంలో పెద్ద సంస్థలు కూడా జారీని తగ్గించగా… చిన్న, మధ్యస్థ ఎంఎఫ్ఐలు అయితే కొత్త రుణాల జారీని దాదాపు నిలిపివేశాయి.

సూక్ష్మ రుణాల ప్రధాన లబ్ధిదారులు .. The Primary Beneficiaries of Micro Loans

చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు, చిన్న హోటల్ నిర్వాహకులు, కళాకారులు, హస్తకళల కార్మికులు , మహిళల స్వయం సహాయక సమూహాలు సూక్ష్మ రుణాల ప్రధాన లబ్ధిదారులుగా చెప్పొచ్చు. రుణాలు తగ్గడంతో వీరి రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిధులు సమకూర్చుకోలేక కొత్తగా ఎవ‌రూ వ్యాపారంప్రారంభించ‌డం లేదు. పాత వ్యాపారంలో అయితే విస్తరణ ప్రణాళికలు నిలిపివేయాల్సి వస్తోంది. “ఓ చిన్న వ్యాపారి రోజుకు రూ.50–100 లాభం చూసినా అది అతడి కుటుంబానికి పెద్ద ఆదరణ. ఇప్పుడు రుణాలు అందకపోవడంతో వారి జీవనాధారం క‌ష్ట‌మ‌వుతోంది” అని ఆర్థిక రంగ‌ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎన్‌పీఏల పెరుగుదల ..Increase in NPAs

సూక్ష్మ రుణాల విభాగంలో ఎన్‌పీఏలు 9–11% మధ్య ఉండటం సంస్థలకు మరో తలనొప్పిగా మారింది. క‌రోనా కాలంలో ఉద్యోగాలు కోల్పోవడం, ఆదాయాలు తగ్గిపోవడంతో అప్పుదారులు repay చేయడంలో ఇబ్బంది పడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో వెల్ఫేర్ పథకాలు, రుణమాఫీ మాటలు కూడా తిరిగి చెల్లింపులను తగ్గించాయి. రుణాలు కట్టకపోవడంతో సంస్థలు కొత్త రుణాల జారీపై కట్టడి పెట్టాయి. ఎంఎఫ్ఐలు తెలిపిన వివరాల ప్రకారం… రుణగ్రహీతల్లో 15–20% మంది ఇప్పటికీ పాత రుణాలను సక్రమంగా చెల్లించలేకపోతున్నారు.

వడ్డీరేట్లు పెరగడం.. Rising Interest Rates

ఆర్థిక మార్కెట్లలో వడ్డీరేట్లు పెరగడంతో సంస్థల కోసం నిధులు సమకూర్చుకోవడం క‌ష్ట‌మైంది. RBI రేట్ల పెరుగుదల, బాండ్ మార్కెట్లలో యీల్డ్‌లు పెరగడం, బ్యాంకులు రిఫైనాన్స్ ఖర్చును పెంచడం వ‌ల్ల‌ సూక్ష్మ రుణాలపై వడ్డీ భారం కూడా పెరుగుతోంది. సగటు సూక్ష్మ రుణ వడ్డీ రేటు 20–24% వరకూ చేరినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

718 జిల్లాల్లో ప్రభావం..Impact Across 718 Districts

– తాజా డేటా ప్రకారం 36 రాష్ట్రాలు–కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 718 జిల్లాల్లో సూక్ష్మ రుణాల జారీ గణనీయంగా తగ్గింది. ఇందులో ముఖ్యంగా ఉత్తర రాష్ట్రాలు, తూర్పు భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలు, దక్షిణంలోని కొన్ని జిల్లాలు అత్యంత ప్రభావితమయ్యాయి. మహిళల స్వయం సహాయక సంఘాలు ఎక్కువగా క్రెడిట్‌పై ఆధారపడే రాష్ట్రాల్లో ఈ క్షీణత మరింత తీవ్రంగా ఉంది.

– సూక్ష్మ రుణాల మార్కెట్లో ఎన్‌బీఎఫ్‌సీ-ఎంఎఫ్ఐలు దాదాపు 39.2% వాటాతో అగ్రస్థానంలో నిలుస్తుండగా, బ్యాంకుల వాటా 31.4%, మిగతా వాటా ఎన్బీఎఫ్‌సీలదే. రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే బిహార్‌ రుణాల జారీలో దేశంలోనే ముందంజలో ఉంది. ఆ త‌ర్వాత త‌మిళ‌నాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. సూక్ష్మరుణాల మొత్తం వరుసగా ఆరో త్రైమాసికం నుంచి పడిపోతుండటం పరిశ్రమలో ఆందోళన కలిగిస్తోంది.

ఫైనాన్స్ రంగానికి ఇది హెచ్చరిక‌..A Warning for the Finance Sector

సూక్ష్మ రుణాలు తగ్గడం అంటే గ్రామీణ , చిన్న పట్టణాల ఆర్థిక వ్యవస్థలో క్షీణతకు సంకేతం అని నిపుణులు చెబుతున్నారు. చిన్న వ్యాపారాలు నిలిచిపోతే ఉద్యోగాలు తగ్గుతాయి. గ్రామీణ వినియోగం పడిపోతుంది. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) అమ్మకాలు తగ్గే అవకాశముంది. వ్యవసాయ సంబంధిత ఉప తయారీ రంగాలు కూడా నష్టంలో పడవచ్చు. ఒక రుణం నిలిచిపోతే దాని ప్రభావం 8–10 కుటుంబాలపై పడుతుందని ఎంఎఫ్ఐ అసోసియేషన్లు చెబుతున్నాయి.

ప్ర‌భుత్వ మ‌ద్ద‌తు అవసరం..Government Support Needed

ఫైనాన్స్ రంగంలోని సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని, RBIని పలు సూచనలు చేస్తున్నాయి. “రిఫైనాన్స్‌ ఫండ్‌లను పెంచాలి. సూక్ష్మ రుణాల కోసం ప్రత్యేక క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ప్రవేశపెట్టాలి. బ్యాంకుల రుణాలపై వడ్డీ రాయితీలు ఇవ్వాలి. ఎంఎఫ్ఐలకు బాండ్ మార్కెట్లో సులభ సేకరణకు మార్గాలు వేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీ మాటలతో మార్కెట్లను చెడగొట్టకూడదు. ” అని కోరుతున్నాయి.

SHG గ్రూపులు కూడా సవాళ్లలోనే.. SHG Groups Also Facing Challenges

ప్రభుత్వ ప్రోత్సాహంతో బలపడిన మహిళా సంఘాలు (SHGs) సాధారణంగా సూక్ష్మ రుణాల నుండి నిధులు పొందడంలో ముందుండేవి. అయితే చెల్లింపులలో జాప్యం, కొత్త రుణాల మంజూరులో ఆలస్యం, బ్యాంకుల ‘రిస్క్ ఫ్ల్యాగ్‌లు’ వంటి అంశాలు ఈ విభాగాన్ని కూడా బ్రేక్‌ వేయిస్తున్నాయి. SHG మహిళలు వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనను నిలిపి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నియంత్రణలో మార్పు అవసరమా? Is Regulatory Change Needed?

RBI నియంత్రణలను పునర్విమర్శించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. రిస్క్ వెయిటేజీల తగ్గింపు, చిన్న బ్యాంకులకు ప్రత్యేక నిధులు, సూక్ష్మ రుణాలపై గరిష్ట వడ్డీరేట్ల పరిమితుల పునర్నిర్మాణం వంటి చర్యలు పరిశ్రమకు ఊపిరి పోసే అవకాశముంది. అదేవిధంగా, డిజిటల్ క్రెడిట్ మోడళ్లకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా చిన్న రుణాల మంజూరును వేగవంతం చేయవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు.

వ‌చ్చే ఏడాది పరిస్థితి మెరుగవుతుందా? Will the Situation Improve Next Year?

ప్రస్తుతం ఉన్న పరిస్థితిని పరిశీలిస్తే.. వినియోగం తగ్గిపోవడం, నిధుల అందుబాటులో అనిశ్చితి, సంస్థల నష్టాలను చూస్తే సూక్ష్మ రుణాల రంగం త్వరగా కోలుకోవడం కష్టమని కనిపిస్తోంది. అయితే మానిటరీ పాలసీ సడలిస్తే.. నిధుల ప్రవాహం పెరిగితే 2025 రెండో అర్ధభాగం నుండి పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక.. Backbone of the Economy

సూక్ష్మ రుణాల రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. గ్రామీణ జీవనాధారం, స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాల వృద్ధి రుణాలపైనే ఆధారపడుతుంది. ఇప్పుడు 16.8% క్షీణత స్పష్టంగా గ్రామీణ ఆర్థిక ఆరోగ్యం మందగించిందని తెలిపారు పరిశ్రమ వర్గాలు. సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం, RBI వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే చిన్న వ్యాపారాలపై ఆధారపడే కోట్ల కుటుంబాలు మరింత ఇబ్బందుల్లో చిక్కుకునే అవకాశముంది.

 

265
FEATURE NEWS Tags:A Warning for the Finance Sector, Access to Funds Is the Biggest Challenge, Backbone of the Economy, Government Support Needed, Impact Across 718 Districts, Increase in NPAs, Is Regulatory Change Needed?, Rising Interest Rates, SHG Groups Also Facing Challenges, The Primary Beneficiaries of Micro Loans, Total Microloans Disbursed, Will the Situation Improve Next Year?

Post navigation

Previous Post: బంగారం ధరలు నిర్ణయించే స్థాయికి భారత్ చేరుకుంటుందా? Is India Rising to Become a Gold Price Maker?
Next Post: పాల‌సీదారుల్లో విశ్వాసం పెంచండి.. ! బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏఐ స్పష్టమైన ఆదేశాలు! Boost Policyholder Confidence: IRDAI Issues Clear Directives to Insurance Companies

Related Posts

  • కారు కొనేముందు ఇవి ఆలోచించండి Consider these before buying a car FEATURE NEWS
  • టోల్ ప్లాజా దాటుతున్నారా? ఈ పత్రాలు లేకపోతే క‌ష్ట‌మే! No Valid Documents? Digital System Issues eChallan Instantly FEATURE NEWS
  • బ్యాంకు సేవింగ్ అకౌంట్లో డ‌బ్బులు ఉంచుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి Are you keeping money in a bank savings account FEATURE NEWS
  • క్రెడిట్ స్కోర్ పెరిగేదెలా how to improve credit score FEATURE NEWS
  • రానున్న 2 నెలల్లో రూ.40 వేల కోట్ల ఐపీఓలు.. ₹40,000 Crore IPOs Lined Up in the Next Two Months FEATURE NEWS
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit? FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!!
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక!
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • 2026లో బ్యాంకింగ్‌ రంగంలో కీలక మార్పులు..! Big Changes in Banking Rules 2026 FEATURE NEWS
  • ఏ పన్ను విధానం మంచిది..? పాతదా.. కొత్తదా..? ఉద్యోగులు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు! Old vs New Tax Regime – Which One is Better for You? FEATURE NEWS
  • ప్ర‌భుత్వ రంగ జీవిత బీమా సంస్థ‌ చరిత్రాత్మక నిర్ణయం.. బోన‌స్ షేర్ల జారీకి ఆమోదం..! Historic Decision by State-Owned Life Insurance Giant… Bonus Share Issue Approved! FEATURE NEWS
  • పన్ను కోతలతో త‌గ్గిన ఆదాయ వృద్ధి .. Income Growth Slows Due to Tax Cuts FEATURE NEWS
  • బ్యాంక్ ఖాతాలో డబ్బులు పోయాయా?.. అయితే ఇలా చేయండి..! బ్యాంకే పరిహారం చెల్లిస్తుంది! Money Lost from Your Bank Account?.. Follow This Process and the Bank May Compensate You FEATURE NEWS
  • జాబ్ చేయాలా? బిజినెస్ స్టార్ట్‌ చేయాలా? ఇవి తెలుసుకొని డిసైడ్‌ అవ్వండి! Job or Business – How to Choose the Right Career Path? FEATURE NEWS
  • ‘33x’ రూల్‌తో ఆర్థిక స్వేఛ్చ పొందండి..! Achieve Financial Freedom with the ‘33x’ Rule..! MONEY TIPS
  • ఆస్తులు సంపాదించడం కాదు… కాపాడుకోవడమే అసలు విజయం.. Wealth Creation is Not Enough… Preservation is the Real Success FEATURE NEWS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme