పర్సనల్ లోన్ అడిగితే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు మొదటగా చూసేది శాలరీ స్లిప్. స్థిరమైన ఉద్యోగం, నెలనెలా జీతం వస్తోందని శాలరీ స్లిప్ నిరూపిస్తుంది. కాబట్టి ‘గ్యారంటీ లేకుండా’ బ్యాంకులు రుణం ఇస్తాయి. కానీ బిజినెస్ చేసేవారికి, స్వయం ఉపాధిగల వారికి, అద్దె ఆదాయం ఉన్నవారికి శాలరీ స్లిప్ ఉండదు. అందుకే రుణం దొరకదని చాలామంది భావిస్తారు. అయితే తాజా పరిస్థితుల్లో శాలరీ స్లిప్ లేకుండానే పర్సనల్ లోన్ పొందే అవకాశం సులభమవుతోంది. బ్యాంకులు ఇప్పుడు ప్రత్యామ్నాయ ఆదాయ పత్రాలను ఆధారంగా తీసుకుంటున్నాయి. కస్టమర్ ఆదాయం నిరూపించగలిగితే శాలరీ స్లిప్ అవసరం లేదు. బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఐటీఆర్‌లు, జీఎస్టీ రిటర్న్స్ చూస్తే రెగ్యులర్ ఇన్‌కమ్ అర్థమవుతుంది. దీని బట్టి బ్యాంకులు పర్సనల్ లోన్ మంజూరు చేస్తాయి. స్థిరమైన ఆదాయాన్ని నిరూపించగల పత్రాలు, మంచి క్రెడిట్ స్కోర్, తక్కువ అప్పులు ఉంటే శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్ పొందడం పూర్తిగా సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు.
బ్యాంకులకు కావాల్సింది …What Banks Require
– శాలరీ స్లిప్ లేకపోతే ఇన్‌కమ్ ప్రూఫ్ కోసం బ్యాంకులు ప్రత్యామ్నాయాలను అడుగుతాయి.
– బ్యాంక్ స్టేట్‌మెంట్ (6–12 నెలలు)
– IT రిటర్నులు (ITR)
– జీఎస్టీ రిటర్నులు – (వ్యాపారస్తులకు)
– ప్రొఫెషనల్ రిసీట్లు, బిల్లులు. ఇవన్నీ ఆదాయం నిర్ధారించేందుకు కీలక పత్రాలుగా పరిగణిస్తారు.
సెక్యూరిటీ / కో-ఆప్లికెంట్ ఉంటే సులువు..Easier With Security or a Co-Applicant
శాలరీ స్లిప్ లేకుండా లోన్ కోరేవారికి అమాంతం రుణం ఇవ్వడానికి బ్యాంకులు ఆసక్తి చూపవు.
అయితే కో-ఆప్లికెంట్ (తల్లిదండ్రులు/భార్య/భర్త), FD, భూమి, బంగారం వంటివి ఉంటే రుణం మంజూరు సులభం అవుతుందని బ్యాంకర్లు చెబుతున్నారు.
సిబిల్ స్కోర్..CIBIL Score
తాజా నియమాల ప్రకారం సిబిల్ స్కోర్ 750 పైగా ఉంటే శాలరీ స్లిప్ లేకున్నా లోన్ ఆమోదించే అవకాశాలు ఎక్కువ. ఆన్‌టైమ్ క్రెడిట్ కార్డ్, రుణ చెల్లింపులు మీ స్కోర్‌ను మెరుగుపరుస్తాయి.
ఫిన్‌టెక్ యాప్స్..Fintech Apps
డిజిటల్ రుణ వేదికలు పేటీఎం, క్రెడిట్‌బీ, నిజీ ఫిన్‌టెక్ లోన్స్, ఎల్ఐసీ హౌసింగ్, ఫుల్‌ర్టన్ ఇండియా
వంటి సంస్థలు తక్కువ పత్రాలతోనే రుణాలు ఇస్తున్నాయి. బ్యాంక్ స్టేట్‌మెంట్, ఆధార్, పాన్ మాత్రమే అడిగి తక్షణ లోన్ మంజూరు చేస్తున్నాయి. అయితే వడ్డీ రేట్లు కొద్దిగా ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
స్వయం ఉపాధిగల వారికి ప్రత్యేక మార్గాలు..Special Avenues for the Self-Employed
సొంత వ్యాపారం లేదా ఫ్రీలాన్స్ చేసే వారు ఈ పత్రాలు చూపితే రుణం సులభమవుతుంది. ప్రధానంగా వ్యాపార లైసెన్స్, రెంటల్ అగ్రిమెంట్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్స్ , ఇన్‌కమ్ రిపోర్టులు, UPI/బ్యాంక్ లావాదేవీల ఆధారంగా వచ్చే ఆదాయ వివరాలు చూపాలి.
అత్యవసరమైతేనే పర్సనల్ లోన్ తీసుకోవాలి.. Opt for a Personal Loan Only When Truly Necessary
ఫైనాన్స్ నిపుణుల సూచనల ప్రకారం.. “శాలరీ స్లిప్ లేకపోవడంతో లోన్ తీసుకునేటప్పుడు వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తప్పనిసరి అవసరమైతేనే పర్సనల్ లోన్ తీసుకోవాలి. లేకుంటే అధిక వడ్డీ భారం పడుతుంది. శాలరీ స్లిప్ లేని వారికి సాధారణంగా వడ్డీ రేట్లు 2–4% వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రాసెసింగ్ ఫీజులు, ముందస్తు చెల్లింపు ఛార్జీలు కూడా ఎక్కువగా ఉంటాయని బ్యాంకర్లు చెబుతున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి.. Precautions Are a Must
ఆన్‌లైన్‌లో తెలియని యాప్‌లకు డాక్యుమెంట్లు అప్లోడ్ చేయకూడదు. ఒకేసారి చాలా చోట్ల లోన్ అప్లై చేయడం సిబిల్ స్కోర్ తగ్గిస్తుంది. రుణ సామర్థ్యాన్ని దాటి లోన్ తీసుకోకూడదు. EMI కాలాన్ని జాగ్రత్తగా నిర్ణయించాలి. లోన్ తీసుకోవడం సులభం అనిపించినా, చెల్లించడం మాత్రం భారమవుతుంది. వడ్డీ, ఫీజులు మొత్తం కలిపి చివరికి ఖర్చు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.
పర్సనల్ లోన్లలో ప్రధాన 5 రిస్కులు…The Top 5 Risks in Personal Loans
– వడ్డీ రేట్లు చాలా ఎక్కువ
– EMI మిస్ అయితే సిబిల్ స్కోర్ పడిపోతుంది
– ప్రీ-క్లోజర్ ఛార్జీలు అధికం
– సులభంగా దొరకడంతో ఎక్కువగా అప్పుల్లో పడిపోవచ్చు
– EMIలు మిస్ అయితే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు
ఏ పత్రాలు ఇస్తే లోన్ సులభం? Documents That Make Loan Approval Easy
శాలరీ స్లిప్ లేని వారు ఈ డాక్యుమెంట్లు సమర్పిస్తే బ్యాంకులు పరిశీలిస్తాయి:
✔ 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్లు. ప్రతి నెలా రెగ్యులర్ క్రెడిట్స్ ఉండాలి. ఖాతాలో మంచి బ్యాలెన్స్ ఉంటే మరింత మంచిది
✔ గత 2 ఏళ్ల ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR). ఆదాయం నిర్ధారించడానికి ఇది అత్యంత నమ్మదగిన పత్రం. ITR ఫైల్ చేసేవారికి లోన్ త్వరగా దొరుకుతుంది.
✔ ఫార్మ్–16 (ఉంటే) కాంట్రాక్ట్ ఉద్యోగులకూ ఇది ఉపయోగపడుతుంది
✔ జీఎస్టీ రిటర్న్స్ – ఇది వ్యాపారులకు అవసరం. బిజినెస్ టర్నోవర్, లాభాలు, స్థిరమైన ఆదాయం తెలుస్తుంది
✔ రెంటల్ ఇన్‌కమ్ / ఇన్వెస్ట్‌మెంట్ ఇన్‌కమ్ ప్రూఫ్స్ . ప్రాపర్టీ లేదా FD వంటి ఆదాయ వనరులు చూపితే బ్యాంకులు విశ్వసిస్తాయి.
క్రెడిట్ ప్రొఫైల్ బలంగా ఉండాలి..our Credit Profile Must Be Strong
“క్రెడిట్ స్కోర్ 750 పైగా ఉంటే స్లిప్ లేకపోయినా లోన్ ఆమోదం సులభం. అప్పులు తక్కువగా ఉంటే బ్యాంకులు రిస్క్‌గా భావించవు” . బ్యాంకులు ముఖ్యంగా చూస్తేవి క్రెడిట్ స్కోర్ 750+. డెట్–టూ–ఇన్‌కమ్ రేషియో తక్కువగా ఉండాలి. పాత లోన్ల EMIలు ఎప్పుడూ మిస్ కాకూడదు. స్కోర్ తక్కువగా ఉంటే కో–అప్లికెంట్‌గా భార్య/భర్త లేదా తల్లిదండ్రులను చేర్చవచ్చు.
ఎక్కడ అప్లై చేస్తే మంచిది? Where Should You Apply?
బ్యాంకులతో పోలిస్తే డిజిటల్ లోన్ కంపెనీలు, NBFCలు, ప్రైవేట్ బ్యాంకులు మరింత ఫ్లెక్సిబుల్‌గా ఉంటున్నాయి. వీరు ఎక్కువగా చూసేది బ్యాంక్ స్టేట్‌మెంట్లు, క్రెడిట్ స్కోర్, క్యాష్ ఫ్లో. అయితే మీరు పర్సనల్ లోన్ తీసుకునే ముందు వడ్డీ రేట్లు, EMI, టెన్యూర్ తప్పనిసరిగా పోల్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
సేలరీ స్లిప్ లేకుంటే పర్సనల్ లోన్ పరిమితి ఎంత? Personal Loan Limit Without a Salary Slip
సేలరీ స్లిప్ లేకపోయినా, స్థిరమైన ఆదాయం, బలమైన క్రెడిట్ స్కోర్, సరైన డాక్యుమెంట్స్ ఉంటే 2–3 లక్షల వరకు సులభంగా లోన్ పొందవచ్చు. పెద్ద మొత్తాలకు కో-ఆప్లికెంట్ లేదా కలెటరల్ అవసరం. EMI, వడ్డీ రేట్లు జాగ్రత్తగా ప్లాన్ చేయడం తప్పనిసరి.
తిరిగి చెల్లింపు కాల పరిమితి (Loan Tenure)
సాధారణంగా పర్సనల్ లోన్ తిరిగి చెల్లింపు కాలం 12 నెలల నుంచి 60 నెలల వరకు ఉంటుంది. చిన్న మొత్తాల లోన్లు (1–2 లక్షలు) 12–24 నెలల్లో చెల్లించడం సౌకర్యవంతం. పెద్ద మొత్తాలు (5–10 లక్షల వరకు) ఎక్కువ కాలం అవసరమవుతుంది, సాధారణంగా 36–60 నెలల వరకు. వడ్డీ రేటు, EMI, కస్టమర్ ఆదాయం ఆధారంగా బ్యాంకులు టైమింగ్ నిర్ణయిస్తాయి.
వడ్డీ రేటు (Interest Rate)
వడ్డీ రేటు వ్యక్తి ఆదాయం, క్రెడిట్ స్కోరు, డెట్–టూ–ఇన్‌కమ్ రేషియో, లోన్ మొత్తం ఆధారంగా మారుతుంది. ప్రైవేట్ బ్యాంకులు 10%–15% చొప్పున వడ్డీరేటును నిర్ణయిస్తాయి. NBFCలు / డిజిటల్ లోన్స్ 12%–20% వరకు (తక్షణ, తక్కువ పత్రాల లోన్) వడ్డీని వసూలు చేస్తాయి. ఫిక్స్‌డ్ / ఫ్లోటింగ్ రేట్లు ఉంటాయి. ఫ్లోటింగ్ రేట్లు RBI రిపో రేట్ మార్పుతో ప్రభావితం అవుతాయి.
ఈఎంఐ – EMI (Equated Monthly Installment)
EMI = లోన్ మొత్తం + వడ్డీ / నెలలు. ఉదాహరణకు ₹2,00,000 లోన్ కు 12% వార్షిక వడ్డీ ఉంటుంది. 24 నెలల కాలపరిమితి తో EMI సుమారుగా ₹9,400–9,500 వరకూ ఉంటుంది. ఎక్కువ కాలపరిమితి ఉంటే EMI తక్కువగా ఉంటుంది. మొత్తం వడ్డీ ఎక్కువగా ఉంటుంది. తక్కువ కాలపరిమితి అయితే EMI ఎక్కువ, మొత్తం వడ్డీ తక్కువగా ఉంటుంది.
ప్లానింగ్ సలహాలు.. Planning Tips
EMI ప్రతీ నెల జాగ్రత్తగా చెల్లించాలి. మిస్ అయితే క్రెడిట్ స్కోరు పడిపోతుంది. ముందస్తు చెల్లింపు (Pre-closure) చేసేటప్పుడు పెనాల్టీ ఫీజులు ఉంటాయి. బ్యాంక్ ద్వారా ముందే తెలుసుకోవాలి. వడ్డీ రేట్లు, కాలపరిమితి, EMI మొత్తం ముందే పోల్చుకోవడం అవసరం.

