దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వ్యాపారం ₹100 లక్షల కోట్లకు చేరింది. గత సంవత్సరంలో ఇదే సమయానికి ఎస్బీఐ వ్యాపారం ₹92 లక్షల కోట్లుగా ఉండగా .. ఈ ఏడాదిలో 8–9% వృద్ధి సాధించింది. బ్యాంకు డిపాజిట్లు ₹60 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. కొత్త SME, MSME రుణ పథకాలు, హౌసింగ్ లోన్స్ లో SBI ప్రత్యేక శ్రద్ధ చూపింది. మోబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ ద్వారా అకౌంట్ యాక్టివేషన్, రుణ, ఇన్వెస్ట్మెంట్ సదుపాయాలు వేగంగా విస్తరించాయి. దీంతో ఎస్బీఐ సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఆస్తుల పరంగా ప్రపంచంలోనే 43వ అతిపెద్ద బ్యాంకుగా ఎస్బీఐ నిలిచింది. కాగా 2025–26లో SBI వ్యాపార పరిమాణం ₹110–115 లక్షల కోట్ల దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే స్టేట్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెప్టెంబరు త్రైమాసికంలో ₹20,160 కోట్లు నికర లాభం సాధించింది. ఇది గత త్రైమాసికాల సరిపోల్చితే అద్భుతమైన వృద్ధి, దేశీయ బ్యాంకింగ్ రంగంలో SBI స్థిరత్వాన్ని నిరూపిస్తోంది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో ₹16,800 కోట్లు నికర లాభం సాధించింది. దేశీయంగా 23,050 శాఖలతో SBI దేశంలోని ప్రతి ప్రాంతంలో ఆర్థిక సేవలను అందిస్తోంది. ఇంకా, మార్చిలోపు మరో 500 శాఖలను ప్రారంభించనున్నట్లు బ్యాంక్ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ప్రతి కొత్త శాఖ దేశంలోని వందల కోట్ల ప్రజలకు ఆర్థిక చైతన్యం. అని SBI చైర్మన్ వ్యాఖ్యానించారు. SBI వ్యాపారం ₹100 లక్షల కోట్ల దాటడంతో ఇది కేవలం దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా అత్యంత ప్రభావశీలమైన బ్యాంక్‌గా నిలిచిందని ఆయన వెల్లడించారు.
