Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!! FEATURE NEWS
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక! FEATURE NEWS
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS

రానున్న మూడు నుంచి ఐదేళ్ల‌లో ఇన్వెస్టర్ల సంఖ్య‌ రెట్టింపు… సెబీ అంచనా! Number of Investors to Double in the Next Three to Five Years… SEBI Forecast!

Posted on 25/11/2025 By admin No Comments on రానున్న మూడు నుంచి ఐదేళ్ల‌లో ఇన్వెస్టర్ల సంఖ్య‌ రెట్టింపు… సెబీ అంచనా! Number of Investors to Double in the Next Three to Five Years… SEBI Forecast!

భారత మూలధన మార్కెట్లు వేగంగా మారుతున్నాయి. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నాయి. స్మార్ట్‌ఫోన్లు అందరికీ అందుబాటులోకి వ‌చ్చాయి. ఆర్థిక విద్యపై ప్రజల్లో అవగాహన కూడా పెరగ‌డంతో పెట్టుబడి సంస్కృతిలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే 3–5 సంవత్సరాలలో దేశంలో ఇన్వెస్టర్ల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని సెబీ (SEBI) అంచనా వేస్తోంది. ఇది కేవలం పెట్టుబడుల పెరుగుదలకే పరిమితం కాకుండా… దేశ ఆర్థిక దిశను మార్చే కీలక దశగా నిపుణులు భావిస్తున్నారు.

డిజిటల్ వేవ్ .. Digital Wave…

నగరాల్లో ఉన్న ఉద్యోగులు, బిజినెస్ వర్గాలే కొన్ని సంవత్సరాల క్రితం వ‌ర‌కు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. గత ఐదేళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఒక స్మార్ట్‌ఫోన్, ఆధార్ ఆధారిత KYC, UPI ఉంటే చాలు. 5–10 నిమిషాలలోనే డీమ్యాట్ ఖాతా ఓపెన్ చేస్తున్నారు. డిజిటల్ టెక్నాలజీ పెట్టుబడులను ప్రజల దగ్గరకు తీసుకురావడంలో గేమ్ చేంజర్‌గా మారింది. ప్ర‌ధానంగా బ్రోకరేజ్ యాప్‌లు పెట్టుబడులను సులభం చేశాయి. మొదటిసారి పెట్టుబడి పెట్టేవారికి వీడియో ట్యుటోరియల్స్ ఎంత‌గానో దోహ‌ప‌డుతున్నాయి. ఆర్థిక అవగాహన కార్యక్రమాలు, గ్రామాలు, చిన్న పట్టణాల్లో మొబైల్ నెట్‌వర్క్ విస్తరణ, బ్యాంకింగ్ సేవలు మొబైల్‌లో అందుబాటులోకి రావడంతో యువతలో పెట్టుబడులపై ఆసక్తి విపరీతంగా పెరిగింది.

SIP సంస్కృతి ..The SIP Culture

భారత పెట్టుబడి మార్కెట్ ఎదుగుదలకు పెద్ద బలం ఇచ్చింది SIP సంస్కృతి. గత కొన్ని సంవత్సరాల్లో మ్యూచువల్ ఫండ్ SIPలు రికార్డు స్థాయిలో చేరుతున్నాయి. కేవలం ఉద్యోగులు మాత్రమే కాదు.. విద్యార్థులు, స్వయం ఉపాధి వర్గం, చిన్న వ్యాపారులు కూడా SIPలు ప్రారంభిస్తున్నారు.

SIPల బూమ్ వెనుక కారణాలు …Reasons Behind the SIP Boom

నెలకు ₹500 నుంచే మొదలయ్యే సౌకర్యం ఉంది. ఇది దీర్ఘకాల పెట్టుబడులకు ఉత్తమ పద్ధతి. మార్కెట్ ఊగిసలాటలో రిస్క్ తగ్గిస్తుంది. క్రమంగా పెట్టుబడి చేసే అలవాటు పెంచుతుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో నెలవారీ SIP ఇన్‌ఫ్లో ₹20,000 కోట్లను దాటడం, రిటైల్ ఇన్వెస్టర్ల శక్తిని స్పష్టంగా చూపుతోంది.

సెబీ సంస్కరణలు ..SEBI Reforms

పెట్టుబడిదారుల రక్షణ, పారదర్శకత, సక్రమ నియంత్రణ అంశాలపై గత కొన్ని సంవత్సరాల్లో సెబీ భారీ మార్పులు చేసింది. సెబీ తీసుకున్న కీలక సంస్కరణలు ఏమిటంటే.. ఆన్‌లైన్ KYC ప్రక్రియను పూర్తిగా సరళీకరణ చేసింది. మిడ్‌క్యాప్–స్మాల్‌క్యాప్ ఫండ్‌లలో పారదర్శకత నియమాలు అమ‌లులోకి తెచ్చింది. IPO అలొకేషన్‌లో ఆల్గోరిథమిక్ న్యాయబద్ధత తీసుకొచ్చింది. పాంప్ అండ్ డంప్ గ్యాంగ్‌లపై కఠిన చర్యల‌కు ఉప‌క్ర‌మించింది. ఫైనాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్లపై నియంత్రణలు తీసుకొచ్చింది. పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమాల మరింత విస్త‌రించింది. ఈ చర్యలతో పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరగడంతో పెట్టుబడి సంస్కృతి విస్తృతంగా పెరిగింది.

గ్రామీణ పెట్టుబడిదారుల పెరుగుదల .. Rise in Rural Investors

పెట్టుబడులు నగరాలకే పరిమితమని అనుకునే రోజులు పోయాయి. జనధన్ యోజన, డిజిటల్ పేమెంట్స్ విస్తరణ, మొబైల్ నెట్‌వర్క్ పెరుగుదల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెట్టుబడులపై ఆసక్తి పెరుగుతోంది. గ్రామీణ పెట్టుబడిదారుల పెరుగుదలకు ప్ర‌ధాన కార‌ణం జనధన్ ఖాతాల విస్తరణ అని చెప్పొచ్చు. అదేవిధంగా స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థిక విద్య, బ్యాంకుల మ్యూచువల్ ఫండ్ అవగాహన కార్యక్రమాలు, UPI–డిజిటల్ లావాదేవీల పెరుగుదల వంటివి రాబోయే 3–5 సంవత్సరాల్లో ఇన్వెస్టర్ సంఖ్య రెట్టింపున‌కు దోహ‌ద‌ప‌డ‌నున్నాయి.

IPO బూమ్‌..IPO Boom…

భారత IPO మార్కెట్ గత ఎన్నడూ లేనంత ఉత్సాహాన్ని చూస్తోంది. స్టార్టప్‌లు, కొత్త ఏజ్ కంపెనీలు మార్కెట్‌లోకి రావడంతో SME IPOలకు భారీ సబ్‌స్క్రిప్షన్ ఏర్ప‌డుతోంది.డిజిటల్ IPO అప్లికేషన్ సౌలభ్యం, తొలి రోజే లాభాలు వస్తాయన్న నమ్మకం, అనేక IPOలు లిస్టింగ్ రోజునే 40–50% ప్రీమియం ఇస్తున్నాయి. దీంతో కొత్త పెట్టుబడిదారులను వాటివైపు ఆకర్షితుల‌వుతున్నారు.

టెక్నాలజీతో పెట్టుబడులు ..Investing with Technology
పెట్టుబడుల ప్రపంచంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. ఆటోమేటెడ్ పరిశీలన, AI ఆధారిత స్టాక్ విశ్లేషణ ఇవి పెట్టుబడులను మరింత సులభం చేశాయి. ఆటో SIP సెట్టింగులు, రిస్క్ ఆధారిత రోబో అడ్వైజరీ, AI మార్కెట్ స్కానర్లు, రియల్ టైమ్ డేటా, సెకన్లలో ట్రేడింగ్.. ఇలా టెక్నాలజీ వల్ల కొత్త ఇన్వెస్టర్లు కూడా మార్కెట్‌ను సులభంగా అర్థం చేసుకుంటున్నారు.

మార్కెట్ విస్తరణ ..Market Expansion
భారత స్టాక్ మార్కెట్ పరిమాణం ప్రపంచంలోనే వేగంగా పెరుగుతున్న మార్కెట్లలో ఒకటిగా మారింది. దేశ GDP వృద్ధి, స్టార్టప్ బూం, అంతర్గత డిమాండ్ ఇవి మార్కెట్‌కు బలం ఇస్తున్నాయి. 2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ $7–8 ట్రిలియన్ దాటే అవకాశం ఉంద‌ని నిపుణులు భావిస్తున్నారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ , రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం మరింత పెరుగుతుంది. ఇది దేశ ఆర్థిక పురోగతికి ఇది పెద్ద సంకేతం.

రిస్క్‌లు కూడా ఉన్నాయి.. There Are Risks Too…

పెట్టుబడిదారుల సంఖ్య పెరుగుతుండటం మంచి విషయమే కానీ అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టడం ప్రమాదకరం. కొత్త పెట్టుబడిదారులు సోషల్ మీడియా సూచనలపై ఆధారపడ‌కూడ‌దు. హై రిస్క్ స్టాకులపై అతి విశ్వాసం చూప‌కూడ‌దు. పుకార్ల ఆధారంగా కొనుగోలు చేయ‌రాదు.

సెబీ ఏం చెబుతుందంటే.. What SEBI Says Is…
జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి. తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీస్తాయ‌ని సెబీ చెబుతోంది. ఏదేమైనా రిటైల్ పెట్టుబడులకు ఇది స్వర్ణయుగం. కానీ శాస్త్రీయ పెట్టుబడులు అవసరం. భారత పెట్టుబడి ప్రపంచం పెద్ద మార్పు దశలో ఉంది. ఇదే స‌మ‌యంలో ఇన్వెస్టర్ల సంఖ్య పెరగడం మంచి విషయం. కానీ పెట్టుబడి చేసే ముందు సరైన అవగాహన తప్పనిసరి. పెట్టుబడిదారులు SIPలు, డైవర్సిఫికేషన్‌పై దృష్టి పెట్టాలి. దీర్ఘకాల దృష్టితో పెట్టుబడి చేయాలి. ఫండమెంటల్స్ బలమైన స్టాకులను ఎంచుకోవాలి.

రాబోయే 5 ఏళ్లలో అత్యధిక లాభాల అవకాశమున్న రంగాలు..Sectors with the Highest Profit Potential in the Next 5 Years

– టెక్నాలజీ & డిజిటల్ ఇన్నోవేషన్: AI, క్లౌడ్, డేటా మేనేజ్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ రంగాలు రాబోయే కాలంలో భారీ వృద్ధి సాధించనున్నాయి. టెక్‌ కంపెనీలు మార్కెట్ క్యాపిటలైజేషన్‌ పరంగా 12–15% వృద్ధి సాధించే అవకాశం ఉంది.

– గ్రీన్ ఎనర్జీ: సోలార్, విండ్, గ్రీన్ హైడ్రజన్ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్నాయి.
ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీకి భారీగా ప్రోత్సాహం ఇస్తోంది. సెబీ అంచనా ప్ర‌కారం.. గ్రీన్ ఎనర్జీ రంగం సంవత్సరానికి 20–25% వృద్ధి సాధించవచ్చు

– ఫార్మా & హెల్త్‌టెక్ : ఎప్పటికీ డిమాండ్ తగ్గని రంగం ఇది. ప్రపంచ జనాభా పెరుగుతున్న కొద్దీ మందుల అవసరం కూడా పెరుగుతోంది.
భారతదేశం ఇప్పటికే “ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్”. ఫార్మా రంగంలో 10–12% స్థిర వృద్ధి కొనసాగుతుంది.

– ఆటోమొబైల్ & ఎలక్ట్రిక్ వాహనాలు : ఇప్పటికే EV మార్కెట్ వేగంగా ఎదుగుతోంది. బైకులు, కార్లు, ఆటో భాగాలు, బ్యాటరీలు ఇవన్నీ భారీ మార్పులు చూస్తున్నాయి. EV రంగం రాబోయే 5 ఏళ్లలో 25–30% వృద్ధి సాధించే అవకాశం ఉంది.

– బ్యాంకింగ్ & ఫిన్‌టెక్‌ష: పెట్టుబడుల్లో ఎప్పటికీ ఇది హాట్ రంగం. భారత బ్యాంకింగ్ రంగం వేగంగా డిజిటల్ అవుతోంది. UPI, నెట్ బ్యాంకింగ్, స్మార్ట్ లెండింగ్ ఇవన్నీ పెరుగుతున్నాయి. ఈ రంగం సంవత్సరానికి 15% వరకు పెరుగుతుంది.

– ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ : దేశ వృద్ధికి ఇది మూలధారం. హైవేలు, కొత్త ఎయిర్‌పోర్టులు, రెల్వే కారిడార్లు, మెట్రో ప్రాజెక్టులు ఇవి భారీగా జరుగుతున్నాయి. ఇన్‌ఫ్రా రంగం రాబోయే ఐదేళ్లలో 12–18% వృద్ధిని అందిస్తుంది.

– FMCG : ఇది ఎప్పుడూ స్టేబుల్, ఎప్పుడూ లాభం. రోజూ వినియోగించే వస్తువులు కావడంతో ఈ రంగం ఎప్పుడూ డిమాండ్‌లోనే ఉంటుంది. FMCG రంగం 8–10% స్థిర వృద్ధిని కొనసాగిస్తుంది.

– డిఫెన్స్ & స్పేస్ మాన్యుఫాక్చరింగ్: భారత్ రక్షణ తయారీ రంగాన్ని దేశీయంగా అభివృద్ధి చేస్తోంది. డ్రోన్లు, మిస్సైల్ టెక్, స్పేస్ లాంచ్ సిస్టమ్‌లు .. ఇవన్నీ భారత కంపెనీలు తయారు చేస్తున్నాయి. డిఫెన్స్ & స్పేస్ రంగం 20% పైగా వృద్ధి సాధిస్తుంది.

260
FEATURE NEWS Tags:Digital Wave…, Investing with Technology, IPO Boom…, Market Expansion, Reasons Behind the SIP Boom, Rise in Rural Investors, SEBI Reforms, Sectors with the Highest Profit Potential in the Next 5 Years, The SIP Culture, There Are Risks Too…, What SEBI Says Is…

Post navigation

Previous Post: డిసెంబర్‌లో EMIల భారం త‌గ్గనుందా? ప్రజల్లో కొత్త ఆశలు! Will EMI Burdens Ease This December? New Hopes Among People!
Next Post: స్టార్టప్ ప్రయాణం ఎలా ప్రారంభించాలి? స్టార్టప్‌లు ఎందుకు విఫలమవుతాయి? అసలు కారణాలు ఇవే! How to Start a Successful Startup in India | Real Reasons Why Startups Fail

Related Posts

  • ‘ఐటీఆర్‌ హోల్డ్‌’ అంటే రిజెక్ష‌న్ కాదు..! స్పష్టత ఇచ్చిన ఐటీ విభాగం! ITR on Hold’ Is Not a Rejection..! IT Department Clarifies FEATURE NEWS
  • HDFC కస్టమర్లకు గుడ్ న్యూస్..! తగ్గిన MCLRతో EMIలకు ఊరట … లోన్ తీసుకున్న వారికి పండగే! Good News for HDFC Customers..! EMI Relief as MCLR Rates Fall – A Treat for Borrowers! FEATURE NEWS
  • టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. ఈ విష‌యాలు తెలుసుకోండి Taking Term Insurance? Know These Important Things.. FEATURE NEWS
  • 20 ఏళ్లకే ఆర్థిక స్థిరత్వం సాధ్యమేనా? యువత కోసం ఐదు బంగారు సూత్రాలు! Is Financial Stability Possible at 20? Five Golden Rules for Youth! FEATURE NEWS
  • పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజిట్ అంటే ఏమిటి What is Post Office Recurring Deposit FEATURE NEWS
  • సెటిల్‌మెంట్‌ vs సంపూర్ణ చెల్లింపు..! రుణం తీర్చడంలో ఏది బెస్ట్‌! సెటిల్‌మెంట్‌ vs సంపూర్ణ చెల్లింపు..! రుణం తీర్చడంలో ఏది బెస్ట్‌! Loan Repayment Dilemma: Settlement vs Full Payment FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!!
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక!
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • టర్మ్ పాలసీ రద్దయ్యిందా? అయితే వెంట‌నే పునరుద్ధరించుకోండి! Has Your Term Policy Lapsed? Revive It Immediately! INSURANCE
  • పశ్చిమాసియాలో మంట‌లు.. ప్రపంచమంతటా ప్రకంపనలు.. Blazing West Asia, Tremors Across the World FEATURE NEWS
  • రూ.3,32,205 కోట్ల తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర బడ్జెట్ .. అభివృద్ధి–సంక్షేమాలకు సమ ప్రాధాన్యం! Andhra Pradesh Budget of ₹3,32,205 Crore: Equal Priority to Development and Welfare FEATURE NEWS
  • సేఫ్టీ, వడ్డీ విషయంలో దీన్ని మించిన స్కీమ్ లేదు! వీపీఎఫ్ గురించి తెలుసుకుందామా! No Scheme Beats VPF in Safety and Returns – Let’s Understand VPF FEATURE NEWS
  • బంగారం ధరలు నిర్ణయించే స్థాయికి భారత్ చేరుకుంటుందా? Is India Rising to Become a Gold Price Maker? FEATURE NEWS
  • రక్షణ రంగంలో పెట్టుబడులు.. లాభమా? FEATURE NEWS
  • భారీ నష్టాలతో ముగిసిన సూచీలు .. కుప్ప‌కూలిన దేశీయ మార్కెట్లు Markets End with Heavy Losses as Domestic Indices Crash FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme