Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • మ్యూచువల్ ఫండ్స్ క‌న్నా ETF లో అధిక‌ లాభాలా is ETFs are profitable than mutual funds FEATURE NEWS
  • Daily stock marketలో trading analysis ఎలా చేస్తారు How to do trading analysis in daily stock market FEATURE NEWS
  • ఈ కామ‌ర్స్ డెలివరీల‌పై ఫిర్యాదు చేయండి FEATURE NEWS
  • ఎడ్యుకేషన్ లోన్ ఎలా how to get education loan FEATURE NEWS
  • రైల్వే స్టాక్స్ దూకుడు..13% ఎగబాకిన RVNL షేర్లు.. పెట్టుబడిదారుల్లో ఉత్సాహం! Railway Stocks Surge: RVNL Shares Jump 13%, Investor Optimism Rises! FEATURE NEWS
  • గుడ్ న్యూస్ చెప్పిన హెచ్‌డీఎఫ్‌సీ.. భారీగా వ‌డ్డీరేట్లు త‌గ్గింపు.. Good News from HDFC: Massive Reduction in Interest Rates FEATURE NEWS
  • 2024 సంవత్సరంలో Health insuranceలో మార్పులు తెలుసుకుందాం Let’s know the changes in health insurance in the year 2024 FEATURE NEWS
  • ఐపీవోకు ఎల్ఐసీ lic launches indias largest ipo FEATURE NEWS
  • మన్మోహ‌న్‌ దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేశారు How did Manmohan affect the country’s economy FEATURE NEWS
  • ఆ స‌మాచార‌మంతా పాన్ కార్డులోనే what is the use of pan card FEATURE NEWS

మ్యూల్‌ ఖాతాల వలలో సామాన్యులు! అప్రమత్తంగా లేకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వు! Ordinary People Caught in Mule Account Traps! Trouble Is Inevitable If You’re Not Careful!

Posted on 21/12/202521/12/2025 By admin No Comments on మ్యూల్‌ ఖాతాల వలలో సామాన్యులు! అప్రమత్తంగా లేకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వు! Ordinary People Caught in Mule Account Traps! Trouble Is Inevitable If You’re Not Careful!

ఇటీవల దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆన్‌లైన్‌ మోసాలు జరిగిన ప్రతిసారి పోలీసుల దర్యాప్తులో ముందుగా బయటపడుతున్నవి ‘మ్యూల్‌’ బ్యాంక్‌ ఖాతాలే. నేరస్తులు నేరుగా తమ ఖాతాలు వాడకుండా, ఇతరుల ఖాతాలను అద్దెకు తీసుకుని అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల తెలియకుండానే సాధారణ ప్రజలు నేరాల వలలో చిక్కుకుంటున్నారు.

మ్యూల్‌ ఖాతా అంటే ఏమిటి? What Is a Mule Account?
మ‌న‌ బ్యాంక్‌ ఖాతా వివరాలు, డెబిట్‌ కార్డు, ఓటీపీలు ఇతరులకు ఇచ్చే ఖాతాలను ‘మ్యూల్‌’ ఖాతాలుగా పిలుస్తారు. కొంతమందికి ‘సులభంగా డబ్బు సంపాదించవచ్చు’, ‘పార్ట్‌టైం పని’ అంటూ మోసగాళ్లు వల వేస్తున్నారు. ఖాతా వాడకానికి ప్రతిఫలంగా కొంత మొత్తం చెల్లిస్తామని చెప్పి ఆకర్షిస్తున్నారు. మొత్తంగా ఒకరి పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాను.. ఇంకొకరు నేరాల కోసం వినియోగిస్తే దాన్నే ‘మ్యూల్‌ ఖాతా’గా పిలుస్తారు. ఖాతా తమదే అయినా, దానిని వాడేది నేరగాళ్లే. ఫలితం మాత్రం ఖాతాదారుడికి తీవ్ర ఇబ్బందులే.

ఎవరు ఎక్కువగా టార్గెట్‌ అవుతున్నారు? Who Are Being Targeted the Most?
విద్యార్థులు, నిరుద్యోగ యువత, తక్కువ ఆదాయ వర్గాలు ఈ మోసాలకు ఎక్కువగా బలవుతున్నారు. సోషల్‌ మీడియా, వాట్సాప్‌ గ్రూపుల ద్వారా వచ్చే లింకులు, ఫోన్‌ కాల్స్‌ ద్వారా ఖాతా వివరాలు సేకరిస్తున్నారు.

మ్యూల్‌ ఖాతాల్లో రెండు రకాలు..Two Types of Mule Accounts
– మొదటి రకం.. సైబర్‌ నేరగాళ్లు సాధారణ ప్రజలను కమీషన్‌కు ఆశపెట్టి వారి బ్యాంకు ఖాతాలు, డెబిట్‌ కార్డులు, ఓటీపీలను తీసుకుని అక్రమ లావాదేవీలు చేయడం. ‘ఒక్కసారి వాడతాం’, ‘ఏ సమస్య రాదు’ అంటూ నమ్మబలికి ఖాతాలు దక్కించుకుంటారు.
– రెండో రకం మరింత ప్రమాదకరం. ఖాతాదారుడికి తెలియకుండానే వారి ఆధార్‌, పాన్‌ వంటి గుర్తింపు పత్రాలను దుర్వినియోగం చేసి కొత్త ఖాతాలు తెరవడం. ఆ ఖాతాల ద్వారా భారీగా డబ్బు చలామణి జరుగుతుంది. విషయం బయటపడే సరికి ఖాతాదారుడికి తెలియకుండానే తన పేరుతో నేరాలు జరిగినట్టు తెలుస్తుంది.

నేరం జరిగితే బాధ్యత ఎవరిది? Who Is Responsible If a Crime Occurs?
-మ్యూల్‌ ఖాతా ద్వారా అక్రమ లావాదేవీ జరిగితే, చట్టపరంగా మొదట బాధ్యత ఖాతాదారుదే. ‘నాకు తెలియదు’ అని చెప్పినా విచారణ నుంచి తప్పించుకోవడం కష్టం. ఖాతాలు ఫ్రీజ్‌ కావడం, పోలీస్‌ నోటీసులు, కేసుల వరకూ వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే మీ బ్యాంక్‌ ఖాతా వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు. ఓటీపీలు, డెబిట్‌ కార్డులు, పిన్‌ నంబర్లు ఇవ్వకూడదు. సులభంగా డబ్బు వస్తుందని చెప్పే ఆఫర్లపై నమ్మకం పెట్టుకోకూడదు. అనుమానాస్పద కాల్స్‌ లేదా లింకులు వచ్చిన వెంటనే బ్యాంక్‌, పోలీసులకు సమాచారం ఇవ్వాలి. మీ ఖాతా మీ బాధ్యత. కొద్దిపాటి లాభం కోసం ఖాతా వాడకానికి ఇచ్చితే జీవితాంతం సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే ప్రతి ఒక్కరూ అవగాహనతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మీ ఖాతా ఎవరు వాడుతున్నారో తెలుసుకోండి.. అప్రమత్తంగా ఉండండి!

-కమీషన్లకు ఆశపడి కొందరు.. తెలిసిన వ్యక్తులు అడిగారని ఇంకొందరు తమ బ్యాంకు ఖాతాలను అడ్డగోలుగా ఇచ్చేస్తున్నారు. ‘ఏమీ కాదులే’, ‘ఒక్కసారి వాడతారంతే’ అన్న నిర్లక్ష్యమే చివరకు పెద్ద సమస్యగా మారుతోంది. సైబర్‌ నేరం బయటప డినప్పుడు పోలీసులకు మొదట చిక్కేది ఈ ఖాతాల యజమానులే. అప్పుడు మొదలవుతుంది లబోదిబోమంటూ పరుగులు. కొన్నిసార్లు ఇతర రాష్ట్రాల పోలీస్‌ స్టేషన్లకు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ‘నాకు తెలియదు’ అన్న మాటలు పెద్దగా పనికిరావు. చట్టపరంగా బాధ్యత ఖాతాదారుడిపైనే పడుతుంది. ఒక్కసారి మ్యూల్‌గా గుర్తిస్తే భవిష్యత్తులో లోన్లు, క్రెడిట్‌ కార్డులు, కొత్త ఖాతాల తెరవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక జీవితం మొత్తం ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది.

భయపెట్టే గణాంకాలు..Shocking Statistics
సీబీఐ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 700 బ్యాంకు శాఖల్లోనే 8.5 లక్షల మ్యూల్‌ ఖాతాలు తెరిచినట్లు గుర్తించారు. ఆర్‌బీఐ ప్రారంభించిన ‘మ్యూల్‌ హంటర్‌’ టూల్‌ ప్రతినెలా సగటున 20 వేల అనుమానాస్పద ఖాతాలను గుర్తిస్తోంది. అయితే వాస్తవానికి ఇది కనిపిస్తున్న సంఖ్య మాత్రమేనని.. ఇంకా కొన్ని లక్షల్లో మ్యూల్‌ అకౌంట్లు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మ్యూల్‌ ఖాతాలు అంటే నేరస్తులేనా? Are Mule Accounts Used Only by Criminals?
ఇది కేవలం కమీషన్లకు ఆశపడేవారికే లేదా సైబర్‌ నేరగాళ్లకు మాత్రమే సంబంధించిన వ్యవహారమని అనుకోవడానికి వీల్లేదు. తెలిసో.. తెలియకో బ్యాంకు ఖాతాలున్న చాలామంది ఈ మ్యూల్‌ వలలో పడిపోతున్నారు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ, ఆన్‌లైన్‌ పనుల పేరుతో, లేదా ‘ఒక్కసారి ఖాతా వాడనివ్వు’ అని నమ్మబలికి ఖాతాలు తీసుకుంటున్నారు.

నేరగాళ్ల పన్నాగం.. మ్యూల్‌ ఖాతాలు! Criminals’ Mastermind Plot — Mule Accounts!

సైబర్‌ మోసాలకు పాల్పడే నేరగాళ్లు ప్రజల నుంచి కొట్టేసిన డబ్బుతో లావాదేవీలు చేయాలంటే నేరుగా తమ పేర్లపై ఉన్న బ్యాంకు ఖాతాలు వాడరు. బ్యాంకు ఖాతా వివరాలు, లావాదేవీల ఆధారంగానే పోలీసులు నేరస్తుల ఉనికిని గుర్తించి అరెస్టు చేస్తారని వారికి బాగా తెలుసు. అందుకే తమ ఆనవాళ్లు దాచుకునేందుకు.. ఇతరుల బ్యాంకు ఖాతాలను అడ్డంగా ఉపయోగిస్తుంటారు. ఇదే సైబర్‌ నేరగాళ్లు పన్నే పెద్ద పన్నాగం. మ్యూల్‌ ఖాతాలు సైబర్‌ నేరాలకు ఆయుధంగా మారుతున్నాయి. నేరగాళ్ల పన్నాగాన్ని గుర్తించి.. జాగ్రత్తగా వ్యవహరించడమే ప్రతి పౌరుడి బాధ్యత. మీ ఖాతా మీ పేరు.. దాని దుర్వినియోగానికి అవకాశం ఇవ్వకండి.

పెరుగుతున్న సైబర్‌ నేరాలు…Rising Cyber Crimes
గత మూడేళ్లుగా సైబర్‌ నేరాలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. నేరాలు జరుగుతున్నా మోసగాళ్లు పట్టుబడకపోవడానికి ప్రధాన కారణం ‘మ్యూల్‌ అకౌంట్లు’ అనే విషయం స్పష్టమైంది. తమ పేర్లపై ఉన్న ఖాతాలు వాడకుండా.. ఇతరుల ఖాతాల ద్వారా డబ్బు చలామణి చేస్తుండటమే నేరగాళ్లకు రక్షణగా మారుతోంది.

ఖాతాల‌పై నిఘా పెట్టినా.. Despite Surveillance on Bank Accounts…
బ్యాంకు ఖాతాలు తెరిచిన వెంటనే హఠాత్తుగా భారీ మొత్తంలో నగదు జమ, విత్‌డ్రా అవుతున్న లావాదేవీలపై బ్యాంకులు నిఘా పెంచాయి. అకస్మాత్తుగా డబ్బు జమైతే వాటిని అనుమానాస్పద ఖాతాలుగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇస్తున్నాయి. దీంతో ఈ ఖాతాలపై నిఘా కట్టుదిట్టమైంది.దీంతో సైబర్‌ నేరగాళ్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. గతంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన మ్యూల్‌ ఖాతాలను ఇప్పుడు వ్యవస్థీకృతంగా దేశవ్యాప్తంగా విస్తరించారు. చిన్న మొత్తాల్లో జరిగే మోసాల కోసం సేవింగ్స్‌ ఖాతాలు, భారీ మొత్తాల్లో జరిగే మోసాల కోసం కరెంటు ఖాతాలు వాడుతున్నారు. టెలిగ్రామ్‌ వంటి యాప్‌ల ద్వారా దేశవ్యాప్తంగా నిరుద్యోగులు, గృహిణులు, వివిధ వర్గాలను సంప్రదిస్తూ వల వేస్తున్నారు.

బ్యాంకు సిబ్బందిని ప్ర‌లోభ‌పెట్టి.. By Bribing Bank Staff…
చిన్నచితకా పనులు చేసుకునేవారి వివరాలతో కరెంటు ఖాతాలు తెరవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. నిజానికి కరెంటు ఖాతా తెరవాలంటే వ్యాపార సంస్థ ఉండాలి. నిర్ణీత స్థాయిలో వ్యాపారం జరిగినట్లు ఆధారాలు, జీఎస్టీ నంబరు వంటి పత్రాలు తప్పనిసరి. కానీ ఇవేవీ లేకుండానే మధ్యవర్తులు, కమీషన్‌ ఏజెంట్ల ద్వారా బ్యాంకు సిబ్బందిని ప్రలోభపెట్టి ఖాతాలు తెరిపిస్తున్నారు. ఖాతాలు తెరవగానే వాటిని యధేచ్ఛగా వాడుతున్నారు. సేవింగ్స్‌ ఖాతాల కోసం చిరుద్యోగులు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఒక్కసారి ఖాతా తెరిచాక కోట్లలో లావాదేవీలు సాగుతున్నాయి. తెలంగాణలోని ఒక బ్యాంకు శాఖలో ఆరు కరెంటు ఖాతాల్లో నెలల వ్యవధిలోనే రూ.175 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ ఖాతాల పేర్లు ఇద్దరు ఆటోడ్రైవర్లవని తేలడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కమీషన్‌ ఆశచూపి కొందరు ఈ ఖాతాలు తెరిపించారని.. తాము ఖాతాలు వాడలేదని వారు పోలీసులకు తెలిపారు. అయితే లోతుగా దర్యాప్తు చేయగా బ్యాంకు మేనేజర్‌ పాత్ర కూడా బయటపడింది. దీంతో ఆయన్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

తెలియని ఖాతాల నుంచి డబ్బు జమైతే.. ! If Money Is Credited from an Unknown Account…!

స్నేహితులు, పరిచయస్తులు లేదా ఇతర వ్యక్తులు లావాదేవీల కోసం బ్యాంకు ఖాతా వివరాలు అడిగితే చాలామంది నిర్లక్ష్యంగా ఇస్తుంటారు. కానీ ఇలాంటి సందర్భాల్లో అవతలి వ్యక్తులు సైబర్‌ నేరాల ద్వారా కొట్టేసిన డబ్బును మీ ఖాతాలో జమ చేయించే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తించాలి. పరిచయం లేని, అసలు ఎలాంటి సంబంధం లేని వ్యక్తుల బ్యాంకు ఖాతాలు లేదా యూపీఐ యాప్‌ల (ఫోన్‌పే, జీపే తదితరాలు) నుంచి డబ్బు జమవుతుంటుంది. ఇలాంటి నగదు చాలా సందర్భాల్లో సైబర్‌ నేరగాళ్ల నుంచే వచ్చి ఉండే అవకాశముంది. కాబట్టి గుర్తుతెలియని ఖాతాల నుంచి డబ్బు జమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. అలాంటి లావాదేవీ కనిపించిన వెంటనే సంబంధిత బ్యాంకును సంప్రదించాలి. అవసరమైతే పోలీసులకు కూడా సమాచారం ఇవ్వాలి. తక్షణమే స్పందించకపోతే సైబర్‌ నేరంలో పాత్ర ఉందన్న అనుమానంతో బ్యాంకు ఖాతాను ‘ఫ్రీజ్‌’ చేసే అవకాశం ఉంటుంది. ఖాతా ఫ్రీజ్‌ అయితే అందులోని మీ సొంత సొమ్మును కూడా తీసుకునేందుకు వీలుండదు. రోజువారీ ఖర్చులకే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అప్రమత్తతే ఉత్తమ మార్గం.

తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు .. Precautions to Be Taken

రెండేళ్ల క్రితం వరకు ఖాతాలు ఇచ్చే మ్యూల్స్‌ను చూసీచూడనట్లు వదిలేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మ్యూల్‌ ఖాతాలకూ చట్టం చుట్టేస్తోంది. నేరానికి ప్రత్యక్షంగా పాల్పడకపోయినా, ఖాతా ఇచ్చిన వారినీ పోలీసులు చట్టం ముందు నిలబెడుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఖాతా ఎవరికి ఇవ్వరాదు..Never Share Your Bank Account with Anyone
తెలిసినవారైనా.. తెలియని వారైనా.. ఇతరుల అవసరాల కోసం మీ బ్యాంకు ఖాతాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. ‘డబ్బు జమ చేసి వెంటనే విత్‌డ్రా చేసుకుంటాం’ అని చెప్పినా నమ్మవద్దు. ఒక్కసారి ఖాతా వాడితే.. బాధ్యత మీపైనే పడుతుంది.

అనుమానాస్పద లావాదేవీలు గమనించండి..Monitor Suspicious Transactions
మీ ఖాతాలో సంబంధం లేకున్నా ఆకస్మికంగా డబ్బు జమ కావడం, వెంటనే విత్‌డ్రా అవ్వడం జరిగితే వెంటనే అప్రమత్తం కావాలి. సంబంధిత బ్యాంకును సంప్రదించి సమాచారం ఇవ్వాలి. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చాలి. ఇంకా అనుమానం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

మీ పేరుతో ఎన్ని ఖాతాలున్నాయో తెలుసుకోండి..Check How Many Accounts Are in Your Name
మీ పేరుతో ఎన్ని బ్యాంకు ఖాతాలున్నాయో తెలుసుకునే అవకాశం ఉంది. ఫోన్‌ నంబరు, పాన్‌, ఓటర్‌ ఐడీ, ఆధార్‌ వంటి గుర్తింపు పత్రాలతో బ్యాంకును సంప్రదిస్తే తనిఖీ చేసి ఖాతాల వివరాలు తెలియజేస్తారు. అలాగే కనీసం ఆరు నెలలకోసారి క్రెడిట్‌ బ్యూరోల నుంచి క్రెడిట్‌ నివేదిక తీసుకోవడం మంచిది.

మొబైల్‌ నంబర్లపైనా నిఘా..Keep a Watch on Mobile Numbers Too
సంచార్‌ సాథీ పోర్టల్‌లోకి వెళ్లి మీ పేరుతో ఎన్ని మొబైల్‌ నంబర్లు ఉన్నాయో చూసుకోవాలి. మీకు సంబంధం లేని నంబర్లు ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలి. లేదంటే అవే సైబర్‌ నేరాలకు ఉపయోగపడే ప్రమాదం ఉంది.

ఉద్యోగాల మాయలో పడొద్దు..Don’t Fall for Fake Job Offers
ఇటీవల‌ కాలంలో యువతను ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారు. ఉద్యోగం ఇస్తామంటూ బ్యాంకు ఖాతా వివరాలు, ఇతర రహస్య సమాచారం సేకరించి వాటితో లావాదేవీలు చేస్తున్నారు. సోషల్‌ మీడియా, వాట్సాప్‌, టెలిగ్రామ్‌ ద్వారా వచ్చే ఆన్‌లైన్‌ ఉద్యోగ ప్రకటనలను నమ్మవద్దు.

 

117
FEATURE NEWS Tags:Are Mule Accounts Used Only by Criminals?, By Bribing Bank Staff…, Check How Many Accounts Are in Your Name, Criminals’ Mastermind Plot — Mule Accounts!, Despite Surveillance on Bank Accounts…, Don't Fall for Fake Job Offers, If Money Is Credited from an Unknown Account…!, Keep a Watch on Mobile Numbers Too, Monitor Suspicious Transactions, Never Share Your Bank Account with Anyone, Ordinary People Trapped in the Mule Account Web!, Precautions to Be Taken, Rising Cyber Crimes, Shocking Statistics, Two Types of Mule Accounts, What Is a Mule Account?, Who Are Being Targeted the Most?, Who Is Responsible If a Crime Occurs?

Post navigation

Previous Post: బహుళ రుణాలను ఎలా ఎదుర్కోవాలి? How to Manage Multiple Loans?
Next Post: ఏఐ సూచ‌న‌ .. జీతానికి ర‌క్ష‌! AI Guidance… A Shield for Your Salary!

Related Posts

  • Daily stock marketలో trading analysis ఎలా చేస్తారు How to do trading analysis in daily stock market FEATURE NEWS
  • 5 నెలల కనిష్ఠానికి వాణిజ్య లోటు..60% తగ్గిన పసిడి దిగుమతులు! Trade Deficit Hits 5-Month Low… Gold Imports Drop 60%! FEATURE NEWS
  • కొత్త సంప‌న్నుల కోసం వెల్త్ సైకాలజిస్టులు Wealth Psychologists for New Affluents FEATURE NEWS
  • బ్యాంకు ఖాతా అవసరం లేకుండానే ఎఫ్‌డీ చేయొచ్చు..! Fixed Deposit Without a Bank Account Is Now Possible! FEATURE NEWS
  • పీఎస్‌బీలు నాలుగే ఉంటాయా? బ్యాంకులను ప్ర‌భుత్వం విలీనం చేస్తుందా? Will PSBs Shrink to Just Four? Is the Government Planning Another Big Bank Merger? FEATURE NEWS
  • ఏదీ స‌రైన పెట్టుబ‌డి..? FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • How to make happy money book summery telugu హౌ టు మేక్ హ్యాపీ మ‌నీ బుక్ స‌మ‌రీ తెలుగు

Recent Posts

  • కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్‌.. కార్పొరేట్ రంగం విలవిల.. IT కంపెనీలకు బిగ్ సవాల్
  • ఇరాన్‌తో ట్రేడ్‌.. ట్రంప్ టారిఫ్‌లు..! భారత్‌పై ప్రభావం ఎంత? Iran Trade, Trump Tariffs! How Much Will India Be Impacted?
  • అపోహలు వీడండి.. అవ‌గాహ‌న‌తో పెట్టుబడులు పెట్టండి Break the Myths, Invest with Awareness
  • బడ్జెట్ ఎలా తయారవుతుందో తెలుసా? Behind the Scenes of Union Budget
  • PPF కేవైసీ కొత్త రూల్స్ తెలుసా! లేకుంటే మీ అకౌంట్ క్లోజ్ ! Do You Know the New PPF KYC Rules? Or Your Account Could Be Closed!
  • బ్యాంకు ఖాతా అవసరం లేకుండానే ఎఫ్‌డీ చేయొచ్చు..! Fixed Deposit Without a Bank Account Is Now Possible!
  • భారీ నష్టాల్లో సూచీలు.. ఒక్కరోజులోనే ₹8 లక్షల కోట్లు ఆవిరి..! Markets in Freefall: ₹8 Lakh Crore Wiped Out in a Single Day
  • వెల్త్ బిల్డింగ్ మంత్రం | లోన్లు–ఆస్తులు ఎలా ప్లాన్ చేసుకోవాలి? How to Build Wealth | Smart Loans & Asset Planning
  • వెండి ఆభరణాలపై కొత్త రూల్: కొనుగోలు చేసే ముందు ఇవి గమనించండి! New Rules on Silver Jewellery: What to Know Before Buying
  • ఎల్ఐసీ కొత్త పాల‌సీ.. ఒకసారి కడితే జీవితాంతం ఆదాయం LIC New Policy: Pay Once, Get Lifetime Income
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Caution is Essential Compared to Other Countries… Convenience Current Situation difference between Rich mindset And Poor mindset Direct Equity Drawbacks Expert Advice Geopolitical Tensions how To get financial freedom How to improve CIBIL Score Interest Rate Investor Enthusiasm Key Highlights Key Recommendations Market Expansion Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Recommendations for Investors Right Decisions Are the Key Security square off Stock Market Systematic Investment Plans (SIP) Tips for Investors what are the best financial rules What Are the Interest Rates? What is Personal loan and how to get personal loan what is scuttlebutt investing in stock market WHAT SHOULD AN NRI DO WITH HIS EPF ACCOUNT which is the best stock broking agency Which Option Suits Whom? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

January 2026
S M T W T F S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
« Dec    
  • ఇదీ భార‌త నారీ శ‌క్తి succesfull indian women in corporate world NEWS
  • గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు! Good News for Gold Buyers: Gold Prices Drop Sharply! FEATURE NEWS
  • difference between Rich mindset And Poor mindset ధ‌నికుల‌కు పేద‌ల‌కు ఆలోచ‌న‌ల్లో ఉండే తేడా ఏమిటి FEATURE NEWS
  • రానున్న 2 నెలల్లో రూ.40 వేల కోట్ల ఐపీఓలు.. ₹40,000 Crore IPOs Lined Up in the Next Two Months FEATURE NEWS
  • మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిని ఎంత‌కాలం కొన‌సాగిస్తే లాభాదాయకం How long does it take to maintain a mutual fund investment to be profitable FINICAL PLANNING
  • కొత్త ఐటీఆర్‌ ఫారాలు.. జ‌న‌వ‌రి నుంచి అమ‌లు! New ITR Forms to Be Implemented from January! FEATURE NEWS
  • ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే నో ఇన్సూరెన్స్ what will happen if you violate traffic NEWS
  • Invest in new stocks కొత్త స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుండాలి.. MARKET

Copyright © 2026 .

Powered by PressBook News Dark theme