Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఈ కంపెనీల్లో భారీగా డివిడెంట్లు ! FEATURE NEWS
  • ఎన్ఆర్ఐలు ఆస్తులు కొన‌చ్చా NRIs can buy properties in india FEATURE NEWS
  • NSE కో – లొకేషన్ స్కామ్ FEATURE NEWS
  • స్వయంకృషితో ఎదిగారు.. పారిశ్రామికవేత్తల్లో అగ్రస్థానంలో నిలిచారు Self-Made Industrialists Reach the Top FEATURE NEWS
  • బంగారం ధరలపై ఆర్‌బీఐ ఆందోళన..! గోల్డ్ లోన్ల‌పై జాగ్రత్తగా ఉండాలని బ్యాంకులకు సూచన..! RBI Concern Over Gold Prices..! Banks Advised to Be Cautious on Gold Loans..! FEATURE NEWS
  • భార్యకు భారీగా న‌గదు గిఫ్ట్‌గా ఇస్తున్నారా? అయితే ఐటీఆర్ ఫైలింగ్‌లో ఈ నిబంధనలు తప్పనిసరి! Are You Gifting a Large Amount of Cash to Your Wife? These ITR Filing Rules Are Mandatory! FEATURE NEWS
  • EPFO 3.0: ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్‌డ్రా.. ఈ ఏడాది లేనట్టేనా EPFO 3.0: PF Withdrawal Through ATMs — Not Happening This Year FEATURE NEWS
  • పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజిట్ అంటే ఏమిటి What is Post Office Recurring Deposit FEATURE NEWS
  • ఈ వెబ్‌సైట్లను మిస్ అవ్వొద్దు what are the important websites for stock market news FEATURE NEWS
  • మ్యూచువల్‌ ఫండ్ సంస్థ‌లు వ‌సూలు చేసే రుసుములకు క‌ళ్లెం.. A Check on the Fees Charged by Mutual Fund Companies FEATURE NEWS

మార్కెట్ల‌ను కుదిపేస్తున్న రూపాయి ప‌త‌నం..! రూ.3.38 లక్షల కోట్లు ఆవిరి! Rupee Slide Shakes Markets! ₹3.38 Lakh Crore Wealth Wiped Out

Posted on 17/12/2025 By admin No Comments on మార్కెట్ల‌ను కుదిపేస్తున్న రూపాయి ప‌త‌నం..! రూ.3.38 లక్షల కోట్లు ఆవిరి! Rupee Slide Shakes Markets! ₹3.38 Lakh Crore Wealth Wiped Out

విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు దేశీయ స్టాక్‌ మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీశాయి. మ‌రోవైపు రూపాయి బలహీనతతో పాటు గ్లోబల్‌ ఆందోళనలు కలిసి మార్కెట్లను కుదిపేశాయి. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద రూ.3.38 లక్షల కోట్ల మేర ఆవిరైంది. సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఐటీ, మెటల్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపించింది. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే మరింత పడిపోవడం కూడా మార్కెట్‌ భావోద్వేగాలను దెబ్బతీసింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కూడా ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేశాయి. బ్రెంట్‌ ముడి చమురు ధర 1.44 శాతం తగ్గి బ్యారెల్‌కు 59.69 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు..Foreign Investors’ Sell-Off

మార్కెట్‌ పతనానికి ప్రధాన కారణంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (FIIలు) అమ్మకాలు నిలిచాయి. వారు ఒక్కరోజే రూ.2,381.92 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అమెరికా వడ్డీ రేట్లపై అనిశ్చితి, గ్లోబల్‌ ఆర్థిక మందగమనం భయాలు ఇందుకు కారణంగా నిపుణులు చెబుతున్నారు.

డీఐఐలు కొంత మద్దతు..DIIs Offer Some Support

మరోవైపు దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DIIలు) మార్కెట్‌కు కొంత మద్దతుగా నిలిచారు. వారు రూ.1,077.48 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అయితే ఈ కొనుగోళ్లు ఎఫ్‌ఐఐల భారీ అమ్మకాల ప్రభావాన్ని పూర్తిగా తట్టుకోలేకపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని మార్కెట్‌ నిపుణులు సూచిస్తున్నారు. గ్లోబల్‌ పరిణామాలు, రూపాయి కదలికలు, వడ్డీ రేట్ల నిర్ణయాలపై దృష్టి పెట్టాలని అంటున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు నాణ్యమైన షేర్లపైనే దృష్టి పెట్టడం మంచిదని సూచిస్తున్నారు.

రూపాయి ప‌త‌నం.. మార్కెట్‌పై ఒత్తిడి..Rupee Fall Puts Pressure on Markets

– అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువలో క్షీణత కొనసాగుతోంది. రూపాయి మరో కొత్త జీవనకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. వాణిజ్య లోటు పెరగడం, భారత్‌–అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన తాజా పరిణామాలే రూపాయి పతనానికి కారణాలని ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించడం ఇందుకు నేపథ్యంగా మారింది. గత 10 ట్రేడింగ్‌ సెషన్లలోనే రూపాయి విలువ డాలరుకు రూ.90 నుంచి రూ.91కు దిగివచ్చింది. అలాగే గత ఐదు ట్రేడింగ్‌ సెషన్లలోనే సుమారు 1 శాతం మేర క్షీణించడం గమనార్హం. రూపాయి బలహీనత దిగుమతుల వ్యయం పెంచుతుందన్న ఆందోళనలతో మార్కెట్లు అప్రమత్తంగా ఉన్నాయి.

– డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 23 పైసలు తగ్గి రూ.91.01 వద్ద ముగిసింది. ఇది రూపాయి తాజా జీవనకాల కనిష్ఠ స్థాయిగా నమోదైంది. రూపాయి పతనం దిగుమతుల వ్యయం పెరుగుతుందన్న ఆందోళనను పెంచి మార్కెట్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది.
ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో ముగియగా, ఐరోపా మార్కెట్లు కూడా ప్రతికూల ధోరణితోనే ప్రారంభమయ్యాయి. గ్లోబల్‌ ఆర్థిక మందగమనం భయాలు, వడ్డీ రేట్లపై అనిశ్చితి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

– దేశీయ స్టాక్‌ మార్కెట్‌ మరోసారి నష్టాలతోనే ఆరంభమైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ క్రితం ముగింపు స్థాయి 85,213.36తో పోలిస్తే 188 పాయింట్ల నష్టంతో 85,025.61 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ప్రారంభం నుంచి అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో సూచీ క్రమంగా దిగివచ్చింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 84,620.61 పాయింట్ల వరకు పడిపోయింది. చివరకు 533.50 పాయింట్ల నష్టంతో 84,679.86 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా నష్టాల బాట పట్టింది. నిఫ్టీ 167.20 పాయింట్లు కోల్పోయి 25,860.10 పాయింట్ల వద్ద స్థిరపడింది. రోజువారీ ట్రేడింగ్‌లో నిఫ్టీ 25,834.35 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని, 25,980.75 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది.

సెన్సెక్స్‌ షేర్లలో అమ్మకాల జోరు…Selling Pressure in Sensex Stocks

– బీఎస్‌ఈ సెన్సెక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో కేవలం 8 మాత్రమే లాభాల్లో నిలవగా, మిగిలినవన్నీ నష్టాల్లోనే ముగిశాయి. మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉందో దీనితో స్పష్టమైంది. నష్టపోయిన షేర్లలో యాక్సిస్‌ బ్యాంక్‌ ముందంజలో నిలిచింది. ఈ షేరు అత్యధికంగా 5.03 శాతం డీలాపడింది. ఎటెర్నల్‌ 4.69 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 1.9 శాతం, టాటా స్టీల్‌ 1.74 శాతం తగ్గాయి. అలాగే బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.65 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 1.65 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.41 శాతం చొప్పున నష్టపోయాయి.

– మరోవైపు కొద్ది షేర్లు మాత్రమే లాభాల్లో నిలిచాయి. టైటాన్‌ 1.6 శాతం పెరగగా, భారతీ ఎయిర్‌టెల్‌ 1.44 శాతం లాభపడింది. మహీంద్రా అండ్‌ మహీంద్రా 0.42 శాతం, ఏషియన్‌ పెయింట్స్‌ 0.4 శాతం పెరిగాయి. టెక్‌ మహీంద్రా 0.13 శాతం, ట్రెంట్‌ 0.11 శాతం చొప్పున స్వల్ప లాభాలు సాధించాయి.

మార్కెట్‌ క్విక్‌ అప్‌డేట్స్‌..Market Quick Updates

– గుజరాత్‌ కిడ్నీ అండ్‌ సూపర్‌ స్పెషాలిటీ లిమిటెడ్ త‌మ ఐపీఓ ధరల శ్రేణిని రూ.108 నుంచి రూ.114గా నిర్ణయించారు. ఈ ఐపీఓ ఈ నెల 22న ప్రారంభమై 24న ముగియనుంది. మదుపర్ల నుంచి మంచి స్పందన వచ్చే అవకాశముందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.
– ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ ఐపీఓకు చివరి రోజు ముగిసే నాటికి 39.17 రెట్ల స్పందన లభించింది. అన్ని కేటగిరీల నుంచి భారీగా దరఖాస్తులు రావడంతో ఈ ఐపీఓపై మదుపర్ల ఆసక్తి స్పష్టంగా కనిపించింది.
– ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ)లో 3 శాతం వరకు వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో ప్రభుత్వం నేటి నుంచి విక్రయించనుంది. ఈ వాటా విక్రయంతో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.2,100 కోట్లు సమకూరే అవకాశం ఉందని అంచనా.
– ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లో తన వాటాను 9.5 శాతం వరకు పెంచుకునేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరుపై మార్కెట్‌లో దృష్టి పెరిగే అవకాశం ఉంది.
– టాటా పవర్‌ వచ్చే ఏడాది జనవరి నాటికి రూ.6,500 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న 10 గిగావాట్ల వేఫర్‌, ఇన్‌గాట్‌ ప్రాజెక్టును ఖరారు చేయాలని భావిస్తోంది.

మదుపర్ల సంపదకు భారీ దెబ్బ…Heavy Selling Pressure in Sensex Stocks

స్టాక్‌ మార్కెట్‌లో కొనసాగుతున్న నష్టాల ప్రభావం మదుపర్ల సంపదపై తీవ్రంగా పడింది. మదుపర్ల సంపదకు సూచికగా భావించే బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ ఒక్కరోజులోనే రూ.3.38 లక్షల కోట్ల మేర తగ్గింది. దీంతో బీఎస్‌ఈలోని మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.467.65 లక్షల కోట్లకు పరిమితమైంది. డాలర్లలో చూస్తే ఇది సుమారు 5.14 లక్షల కోట్ల డాలర్లుగా నమోదైంది. మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరగడం, విదేశీ పెట్టుబడిదారుల విక్రయాలు కొనసాగడం ఇందుకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. విదేశీ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, రూపాయి బలహీనత, గ్లోబల్‌ అనిశ్చితులు కలిసి మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తూ అమ్మకాల బాట పట్టారు.

84
MARKET Tags:DIIs Offer Some Support, Foreign Investors’ Sell-Off, Heavy Selling Pressure in Sensex Stocks, Market Quick Updates, Rupee Fall Puts Pressure on Markets, Selling Pressure in Sensex Stocks

Post navigation

Previous Post: మ‌రింత ప‌త‌న‌మైన రూపాయి విలువ ..Rupee Value Declines Further
Next Post: ఏటీఎం, యూపీఐ ద్వారా PF విత్‌ డ్రాకు కొత్త డెడ్‌లైన్‌..New Deadline for PF Withdrawal via ATM and UPI

Related Posts

  • ట్రైలింగ్ స్టాప్ లాస్ తో లాభాలే… MARKET
  • SGX NIFTY అంటే ఏమిటి ? MARKET
  • కొత్త ట్రేడర్స్‌ ఇవి తెలుసుకోవాలి what should we know before entering stock market MARKET
  • మార్కెట్‌కి కొత్తా.. అయితే ఓ లుక్కేయండి are you beginner in stock market MARKET
  • షేర్ల బైబ్యాక్ లాభ‌మా what is share buyback FEATURE NEWS
  • అమ్మో.. ఒక షేర్ కొంటే ఇన్ని చార్జీలా..? FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • How to make happy money book summery telugu హౌ టు మేక్ హ్యాపీ మ‌నీ బుక్ స‌మ‌రీ తెలుగు

Recent Posts

  • కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్‌.. కార్పొరేట్ రంగం విలవిల.. IT కంపెనీలకు బిగ్ సవాల్
  • ఇరాన్‌తో ట్రేడ్‌.. ట్రంప్ టారిఫ్‌లు..! భారత్‌పై ప్రభావం ఎంత? Iran Trade, Trump Tariffs! How Much Will India Be Impacted?
  • అపోహలు వీడండి.. అవ‌గాహ‌న‌తో పెట్టుబడులు పెట్టండి Break the Myths, Invest with Awareness
  • బడ్జెట్ ఎలా తయారవుతుందో తెలుసా? Behind the Scenes of Union Budget
  • PPF కేవైసీ కొత్త రూల్స్ తెలుసా! లేకుంటే మీ అకౌంట్ క్లోజ్ ! Do You Know the New PPF KYC Rules? Or Your Account Could Be Closed!
  • బ్యాంకు ఖాతా అవసరం లేకుండానే ఎఫ్‌డీ చేయొచ్చు..! Fixed Deposit Without a Bank Account Is Now Possible!
  • భారీ నష్టాల్లో సూచీలు.. ఒక్కరోజులోనే ₹8 లక్షల కోట్లు ఆవిరి..! Markets in Freefall: ₹8 Lakh Crore Wiped Out in a Single Day
  • వెల్త్ బిల్డింగ్ మంత్రం | లోన్లు–ఆస్తులు ఎలా ప్లాన్ చేసుకోవాలి? How to Build Wealth | Smart Loans & Asset Planning
  • వెండి ఆభరణాలపై కొత్త రూల్: కొనుగోలు చేసే ముందు ఇవి గమనించండి! New Rules on Silver Jewellery: What to Know Before Buying
  • ఎల్ఐసీ కొత్త పాల‌సీ.. ఒకసారి కడితే జీవితాంతం ఆదాయం LIC New Policy: Pay Once, Get Lifetime Income
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Caution is Essential Compared to Other Countries… Convenience Current Situation difference between Rich mindset And Poor mindset Direct Equity Drawbacks Expert Advice Geopolitical Tensions how To get financial freedom How to improve CIBIL Score Interest Rate Investor Enthusiasm Key Highlights Key Recommendations Market Expansion Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Recommendations for Investors Right Decisions Are the Key Security square off Stock Market Systematic Investment Plans (SIP) Tips for Investors what are the best financial rules What Are the Interest Rates? What is Personal loan and how to get personal loan what is scuttlebutt investing in stock market WHAT SHOULD AN NRI DO WITH HIS EPF ACCOUNT which is the best stock broking agency Which Option Suits Whom? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

January 2026
S M T W T F S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
« Dec    
  • సేవింగ్స్ కి ఇన్సూరెన్స్ కి తేడా ఏమిటి What is the difference between savings and insurance FINICAL PLANNING
  • ఇన్వెస్టర్‌కి ఇవి త‌ప్ప‌నిస‌రి: వారెన్ బ‌ఫెట్‌ FINICAL PLANNING
  • ఐపీవోకు ఎల్ఐసీ lic launches indias largest ipo FEATURE NEWS
  • అమ్మో.. అన్ని బ్యాంకు అకౌంట్లా how many bank accounts can a person have FEATURE NEWS
  • ప‌న్ను వ‌సూళ్ల రికార్డ్‌ NEWS
  • క్రెడిట్‌కార్డుతో బంగారు ఆభరణాలు కొన‌చ్చా..? Can You Buy Gold Jewellery with a Credit Card? FEATURE NEWS
  • CAN NRIS INVEST IN PPF ఎన్ఆర్ఐలు పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయ‌వ‌చ్చా FEATURE NEWS
  • ఎల్‌ఐసీలో డెత్ క్లెయిం చేసుకోవ‌డం ఎలా how to apply for death claim in LIC FEATURE NEWS

Copyright © 2026 .

Powered by PressBook News Dark theme