దేశీయ కరెన్సీ రూపాయి (Rupee) డాలర్‌తో పోలిస్తే.. తొలిసారి గా 91 మార్క్‌ను దాటింది. అంతర్జాతీయ మారకచరిత్ర, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ విధానాలు, పెరుగుతున్న ఇంధన, వస్తు ధరల ప్రభావం రూపాయి విలువను రోజురోజుకూ తగ్గిస్తున్నాయి. రూపాయి ఇలా బలహీనపడడం వల్ల దిగుమతిదారులకు అదనపు ఖర్చును పెంచుతుంది. కానీ ఎగుమతిదారులకు కొంత లాభం ఇవ్వవచ్చు. విధాన నిర్ణయాలు రూపాయి స్థిరత్వానికి కీలకమని మార్కెట్ విశ్లేషకులు,సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే… రూపాయి విలువ 91 మార్క్ దాటడం, ఆర్థిక పరిస్థితులను సూచిస్తూ, పెట్టుబడిదారులకు, వ్యాపారులకు కొత్త ఆవిష్కరణలను కోరుకుంటోంది.
ఆర్థిక రంగంలో కొత్త ఒత్తిడి..New Pressure in the Financial Sector
– భారత్-అమెరికా డీల్‌పై ఉన్న అనిశ్చితులు, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం వంటి కారణాలతో రూపాయి మారకం విలువ (Dollar-Rupee Value) దారుణంగా పడిపోతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో దేశీయ కరెన్సీ రూపాయి విలువ క్షీణిస్తోంది. నేటి ట్రేడింగ్ సెషన్‌లో రూపాయి తొలిసారి 91 మార్క్‌ను దాటి సరికొత్త కనిష్ఠ స్థాయిని తాకింది. రూపాయి (Rupee)విలువ 91 మార్క్ దాటడం ఆర్థిక రంగంలో కొత్త ఒత్తిడి సృష్టిస్తోంది.
– రూపాయి (Rupee)మరింత బలహీనమై.. ఆల్‌టైం కనిష్ఠానికి పడిపోయింది. క్రితం సెషన్‌లో డాలరుతో పోలిస్తే 90.78 వద్ద ముగిసిన రూపాయి, మంగళవారం మరింత పతనమైంది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో 36 పైసలు తగ్గి 91.14 వద్ద ఆల్‌టైం కనిష్ఠానికి చేరింది.
– గత 10 ట్రేడింగ్ సెషన్లలో రూపాయి(Rupee) 90 నుంచి 91 మార్క్‌కి రావడం గమనార్హం. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడం, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినడం కారణంగా రూపాయిపై ప్రతికూల ప్రభావం పడుతున్నట్టు అనలిస్టులు చెబుతున్నారు. అంతే కాకుండా, మార్కెట్ ఒడుదొడుకులు, డాలర్‌కు పెరుగుతున్న డిమాండ్ కూడా రూపాయి విలువ తగ్గడానికి ప్రధాన కారణాలుగా పేర్కొన్నాయి.
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..Stock Markets in Heavy Losses
– Rupee Value Declines దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం భారీ నష్టాల్లో కొనసాగాయి. సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లు పతనమవ్వగా, నిఫ్టీ 25,900 మార్క్‌ను కోల్పోయింది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి సెన్సెక్స్ 499 పాయింట్లు దిగజారి 84,714 వద్ద, నిఫ్టీ 154 పాయింట్ల నష్టంతో 25,873 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, మదుపర్ల అప్రమత్తత కారణంగా సూచీలు ఒత్తిడికి గురయ్యాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు.మొత్తంగా చెప్పాలంటే… దేశీయ స్టాక్ మార్కెట్లు మదుపర్ల అప్రమత్తత, అంతర్జాతీయ ప్రభావాల కారణంగా మంగళవారం భారీ నష్టాల్లో ముగిసాయి.

