దేశంలో బంగారం ధరలు రోజురోజుకూ అతి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. బంగారం ధరల్లో ఊగిసలాట బ్యాంకింగ్ రంగంపై ప్రభావం చూపే అవకాశముందని హెచ్చరించింది. ముఖ్యంగా బంగారు రుణాల (Gold Loans ) విషయంలో బ్యాంకులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. మొత్తంగా బంగారం ధరల ఊగిసలాట వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు అవసరమని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. బ్యాంకులు అప్రమత్తంగా ఉంటేనే ప్రమాదాలను తగ్గించుకోవచ్చని తెలిపింది. గోల్డ్ లోన్లపై పర్యవేక్షణను మరింత పెంచాలని ఆర్‌బీఐ సూచించింది. రుణాల మంజూరులో జాగ్రత్తలు పాటించడం, రిస్క్ మేనేజ్‌మెంట్‌ను బలోపేతం చేయడం అవసరమని స్పష్టం చేసింది.
ధర పడిపోతే.. If Prices Fall…
బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోతే, గోల్డ్ లోన్ల (Gold Loans )పై రిస్క్ పెరిగే అవకాశం ఉందని ఆర్‌బీఐ పేర్కొంది. దీంతో పాటు రుణాలు మంజూరు చేసే సమయంలో రుణ విలువను సరిగా అంచనా వేయాలని, లోన్ టు వ్యాల్యూ (ఎల్‌టీవీ) నిష్పత్తిని కట్టుదిట్టంగా పాటించాలని సూచించింది. అదేవిధంగా గోల్డ్ లోన్ల పెరుగుదలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, రుణగ్రహీతల చెల్లింపుల సామర్థ్యాన్ని కూడా గమనించాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అవసరమైతే అంతర్గత నియంత్రణలను బలోపేతం చేయాలని బ్యాంకులకు సూచనలు చేసింది.
గోల్డ్ లోన్లపై బ్యాంకుల బ్రేక్..Banks Apply Brakes on Gold Loans
– ఆర్‌బీఐ హెచ్చరికలు.. బంగారం ధరలు నింగినంటుతున్న నేపథ్యంలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు గోల్డ్ లోన్ల (Gold Loans ) విషయంలో అప్రమత్తమయ్యాయి. ధరల్లో ఒక్కసారిగా మార్పులు వచ్చే ప్రమాదం ఉండటంతో రిస్క్ తగ్గించుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ముందస్తు జాగ్రత్తలతో గోల్డ్ లోన్లపై నియంత్రణలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సూచనలను అనుసరించి, బంగారంపై ఇచ్చే రుణాల శాతాన్ని తగ్గించాయి. ఇప్పటి వరకు బంగారం విలువలో ఎక్కువ శాతం వరకు లోన్లు ఇచ్చిన బ్యాంకులు, ఇప్పుడు లోన్ టు వ్యాల్యూ (ఎల్‌టీవీ) నిష్పత్తిని కట్టుదిట్టం చేస్తున్నాయి. దీంతో గోల్డ్ లోన్ తీసుకునే వారికి వచ్చే మొత్తంలో తగ్గుదల కనిపిస్తోంది.
– మరోవైపు యువత ఎక్కువగా గోల్డ్ లోన్ల వైపు మొగ్గు చూపుతోంది. అయితే ఈ డబ్బును వ్యాపారం లేదా ఆదాయం వచ్చే పనులకు కాకుండా, వ్యక్తిగత ఖర్చులకే వినియోగిస్తున్నారని బ్యాంకులు గమనించాయి. దీంతో రుణాలు తిరిగి చెల్లించే సామర్థ్యంపై అనుమానాలు పెరిగాయి.
గోల్డ్ లోన్లపై కఠిన నిబంధనలు..Stricter Norms on Gold Loans
దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఇప్పుడు బంగారు లోన్ల (Gold Loans )విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాయి.ఈ మేరకు నిబంధనలను కఠినం చేశాయి. గోల్డ్ లోన్ మంజూరు చేసే సమయంలో బంగారం నాణ్యత, విలువ అంచనాల్లో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. రుణగ్రహీతల చెల్లింపు సామర్థ్యం, గతంలో తీసుకున్న రుణాలు, క్రెడిట్‌స్కోరు తదితర అంశాలను పరిశీలిస్తున్నాయి. మొత్తంగా బంగారం రుణాల మంజూరులో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.
లోన్ శాతంలో కోత.. Cut in Loan Percentage
ఇంతకుముందు బంగారం విలువలో 70 నుంచి 72 శాతం వరకు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు గోల్డ్ లోన్లు (Gold Loans ) మంజూరు చేసేవి. అయితే తాజా పరిస్థితుల్లో ఈ శాతాన్ని 60 నుంచి 65 శాతానికి తగ్గించాయి. బంగారం ధరల్లో భారీ పెరుగుదలే దీనికి కారణం. బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోతే, ఇచ్చిన లోన్ మొత్తం విలువ కంటే ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అప్పుడు రుణగ్రహీతలు అప్పును తిరిగి చెల్లించేందుకు వెనకడుగు వేసే అవకాశం ఉంటుందని బ్యాంకులు అంచనా వేస్తున్నాయి. ఈ పరిస్థితి బ్యాంకులకు నేరుగా నష్టాల ముప్పును తెచ్చిపెడుతుందని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. అందుకే ముందస్తు జాగ్రత్తగా గోల్డ్ లోన్లపై కట్టుదిట్టమైన నిబంధనలు అమలు చేస్తున్నాయి.
డాలర్–రూపాయి ప్రభావం ..Dollar–Rupee Impact
బంగారు ధరల్లో వచ్చే మార్పులతో పాటు డాలర్–రూపాయి మారక విలువలో జరుగుతున్న హెచ్చుతగ్గులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ అంశాలు గోల్డ్ లోన్ల (Gold Loans )పై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, రుణాల మంజూరును నెమ్మదిగా తగ్గించాలని ఆర్‌బీఐ సూచించింది. లోన్లు ఇవ్వడంలో రిస్క్‌ను జాగ్రత్తగా అంచనా వేయాలని, బంగారం విలువను తరచూ సమీక్షించాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది.
రికార్డు స్థాయిలో బంగారం ధర..Gold Prices at Record Levels
దేశంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.1.40 లక్షలకు చేరింది. గత కొన్ని నెలలుగా బంగారం ధరలు వరుసగా పెరుగుతుండడం మార్కెట్లలో చర్చనీయాంశంగా మారింది. గత మూడు నెలల కాలాన్ని పరిశీలిస్తే బంగారం ధరలు దాదాపు 20 శాతం పెరిగాయి. ఆరు నెలల వ్యవధిలో చూస్తే సుమారు 35 శాతం వరకు వృద్ధి నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి, డాలర్–రూపాయి మారక విలువలో మార్పులు, పెట్టుబడిదారుల భద్రతా ఆశ్రయంగా బంగారంపై పెరుగుతున్న ఆసక్తి ఇందుకు కారణాలుగా ఆర్థిక వర్గాలు పేర్కొంటున్నాయి. బంగారం ధరలు ఇంత వేగంగా పెరగడం వల్ల గోల్డ్ లోన్లు(Gold Loans ), ఆభరణాల కొనుగోళ్లపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరల ఊగిసలాట కొనసాగితే రానున్న రోజుల్లో మరింత జాగ్రత్త అవసరమని చెబుతున్నారు.
గోల్డ్ లోన్లకు భారీ డిమాండ్..Huge Demand for Gold Loans
– (Gold Loans )బంగారం ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో గోల్డ్ లోన్లు కూడా వేగంగా పెరుగుతున్నాయి. 2025 మార్చి నుంచి ఇప్పటివరకు బంగారంపై ఇచ్చిన రుణాలు ఏకంగా 100 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉండటమే దీనికి ప్రధాన కారణంగా మారింది.
– 2025 అక్టోబర్ నాటికి బ్యాంకుల వద్ద బంగారు రుణాల మొత్తం రూ.3.37 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది ఏప్రిల్‌లో ఈ మొత్తం కేవలం రూ.1.01 లక్షల కోట్లే ఉండటం గమనార్హం. అంటే ఏడాదిన్నర కాలంలోనే గోల్డ్ లోన్ల పరిమాణం భారీగా పెరిగినట్లు స్పష్టమవుతోంది.
– గత 18 నెలలుగా బంగారం ధరలు ప్రతి నెలా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చాలా మంది తమ వద్ద ఉన్న బంగారాన్ని తనఖా పెట్టి, ఇతర రుణాలతో పోలిస్తే తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్లు తీసుకుంటున్నారు. దీంతో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల వద్ద బంగారు రుణాల పోర్ట్‌ఫోలియో వేగంగా పెరుగుతోంది. అయితే ధరల్లో ఊగిసలాట పెరుగుతున్న నేపథ్యంలో గోల్డ్ లోన్లపై జాగ్రత్త అవసరమని ఆర్థిక వర్గాలు సూచిస్తున్నాయి. బ్యాంకులు కూడా రిస్క్ తగ్గించుకునే దిశగా నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి.
గోల్డ్ లోన్లలో యువత ఆధిక్యం..Youth Dominate Gold Loans
– ఇప్పుడు గోల్డ్ లోన్లు(Gold Loans ) తీసుకునేవారిలో యువతే ఎక్కువగా కనిపిస్తోంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల గణాంకాల ప్రకారం 31 నుంచి 40 ఏళ్ల వయసు గలవారు మొత్తం గోల్డ్ లోన్ ఖాతాదారుల్లో 40 నుంచి 45 శాతం వరకు ఉన్నారు. ఇది గోల్డ్ లోన్లలో యువత ఆధిక్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
– ఇక 21 నుంచి 30 ఏళ్ల వయసు గలవారి సంఖ్య గతంతో పోలిస్తే రెట్టింపు అయినట్లు తెలుస్తోంది. అవసరాలకు త్వరగా నగదు లభించడమే ఇందుకు కారణంగా ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. ఇతర రుణాలతో పోలిస్తే గోల్డ్ లోన్లపై వడ్డీ తక్కువగా ఉండటం కూడా యువతను ఆకర్షిస్తోంది.
– సగటుగా గోల్డ్ లోన్ మొత్తాలు రూ.80 వేల నుంచి రూ.1.5 లక్షల మధ్య ఉన్నాయి. చిన్న అవసరాలు, వ్యక్తిగత ఖర్చుల కోసం బంగారాన్ని తనఖా పెట్టి రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు రిస్క్ తగ్గించుకునేందుకు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
ఖర్చులకే గోల్డ్ లోన్లు.. Gold Loans Mostly for Expenses
– గోల్డ్ లోన్ (Gold Loans )ద్వారా తీసుకుంటున్న వారిలో అత్యధికులు ఆ డబ్బును ఖర్చులకే వినియోగిస్తున్నారనే అంశమే బ్యాంకులకు ప్రధాన ఆందోళనగా మారింది. ఈ రుణాలను ఆస్తులు కొనుగోలు చేయడానికి లేదా ఆదాయం తెచ్చే పనులకు కాకుండా, వ్యక్తిగత అవసరాలకే వాడుతున్నారని బ్యాంకులు గమనిస్తున్నాయి.
– గతంలో మైక్రోఫైనాన్స్, పర్సనల్ లోన్లలో ఎదురైన సమస్యలు మళ్లీ రాకూడదన్న ఉద్దేశంతోనే ఇప్పుడు బ్యాంకులు మరింత జాగ్రత్త పడుతున్నాయి. రుణాలు తిరిగి చెల్లించకపోయే ప్రమాదాన్ని ముందే తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
– దీని ఫలితంగా ప్రస్తుతం బంగారం పెట్టి లోన్ తీసుకుంటే, ఇంతకుముందుతో పోలిస్తే తక్కువ మొత్తమే అందుతోంది. లోన్ శాతాన్ని తగ్గించడం, నిబంధనలను కఠినతరం చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. మొత్తంగా బ్యాంకులు రిస్క్ తగ్గించుకుంటూ, సురక్షిత మార్గాన్నే ఎంచుకుంటున్నాయి.

