Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!! FEATURE NEWS
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక! FEATURE NEWS
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS

పాన్ నిబంధ‌న‌ల్లో మార్పులు.. ! నగదు లావాదేవీలపై కట్టడి .. ! ఏప్రిల్ 1 నుంచి అమ‌లులోకి.. Changes in PAN Rules..! Curbs on Cash Transactions..! Effective from April 1..!

Posted on 24/03/202624/03/2026 By admin No Comments on పాన్ నిబంధ‌న‌ల్లో మార్పులు.. ! నగదు లావాదేవీలపై కట్టడి .. ! ఏప్రిల్ 1 నుంచి అమ‌లులోకి.. Changes in PAN Rules..! Curbs on Cash Transactions..! Effective from April 1..!

ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. నిత్యజీవితంలో ప్రతి ఒక్కరూ ఉపయోగించే శాశ్వత గుర్తింపు సంఖ్య (PAN)కు సంబంధించి పలు మార్పులు తీసుకొచ్చింది. పెరుగుతున్న నగదు లావాదేవీలు, పెరుగుతున్న స్థిరాస్తి ధరలు, డిజిటల్ ఎకానమీ వైపు మళ్లించే లక్ష్యాలతో ఈ మార్పులు (Changes in PAN Rules) అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొత్త ఆదాయపు పన్ను చట్టం–2025 అమలులో భాగంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఆదాయపు పన్ను నిబంధనలు–2026ను నోటిఫై చేసింది. ఈ మార్పులు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా పెద్ద మొత్తాల లావాదేవీలలో PAN తప్పనిసరి చేసే దిశగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పులకు దారితీయనుంది.

₹10 లక్షలు దాటితే తప్పనిసరి.. PAN Mandatory for ₹10 Lakh Cash Transactions
ఇకపై ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఖాతాలో నగదు రూపంలో ₹10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జమ చేసినా, ఉపసంహరించుకున్నా PAN వివరాలు (Changes in PAN Rules)ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఒకేసారి చేసినా, విడతల వారీగా చేసినా వర్తిస్తుంది. ఇంతవరకు ఒక రోజులో ₹50 వేలకుపైగా నగదు లావాదేవీ జరిగితే మాత్రమే PAN అడిగేవారు. కానీ ఇప్పుడు ఈ పరిమితిని భారీగా పెంచి, మొత్తం సంవత్సరానికి వర్తింపజేశారు. ముఖ్యంగా ఒకే బ్యాంకులోనే కాదు, వేర్వేరు బ్యాంకుల్లో చేసిన లావాదేవీలను కూడా కలిపి పరిగణనలోకి తీసుకుంటారు. అంటే ఒక వ్యక్తి వివిధ ఖాతాల్లో డబ్బులు చలామణి చేసినా, మొత్తం ₹10 లక్షలు దాటితే PAN తప్పనిసరి అవుతుంది. ఈ నిర్ణయం ద్వారా పెద్ద మొత్తాల నగదు లావాదేవీలను పర్యవేక్షించడం సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు.

స్థిరాస్తి లావాదేవీలలో కొత్త పరిమితి.. Revised Limits for Property Transactions
ఇళ్లు, స్థలాల కొనుగోలు, అమ్మకం వంటి స్థిరాస్తి లావాదేవీలలో కూడా కీలక మార్పులు (Changes in PAN Rules)చోటుచేసుకున్నాయి. ఇకపై ₹20 లక్షలకు పైబడిన స్థిరాస్తి లావాదేవీలకు PAN తప్పనిసరి. ప్రస్తుతం ఈ పరిమితి ₹10 లక్షలుగా ఉంది. స్థిరాస్తి ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ పరిమితిని రెట్టింపు చేశారు. ఇది కేవలం కొనుగోలు, అమ్మకాలకు మాత్రమే కాదు. బహుమతిగా ఇచ్చినా, జాయింట్ డెవలప్‌మెంట్ ఒప్పందాలు చేసినా ఈ నిబంధన వర్తిస్తుంది. దీంతో రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత పెరుగుతుంది.

వాహనాల కొనుగోళ్లలో మార్పులు.. PAN Rule for Vehicle Purchases
మోటారు వాహనాల కొనుగోళ్లలో కూడా కొత్త నియమాలు (Changes in PAN Rules)అమల్లోకి రానున్నాయి. ఇకపై ద్విచక్ర వాహనం సహా ఏ వాహనమైనా ₹5 లక్షలు దాటితే PAN సమర్పించాలి. ఇంతకుముందు ద్విచక్ర వాహనాలకు ఈ నిబంధన ఉండేది కాదు. కార్లు, ఇతర వాహనాలకు మాత్రం ధరతో సంబంధం లేకుండా PAN ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు కొత్తగా ₹5 లక్షల పరిమితిని నిర్ణయించడం ద్వారా నిబంధనలను సులభతరం చేశారు.

హోటళ్లు, ఈవెంట్ల ఖర్చులపై నిబంధనలు.. PAN for High-Value Hospitality Expenses
హోటళ్లు, రెస్టారెంట్లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలకు చేసే చెల్లింపులపై కూడా కొత్త నిబంధనలు (Changes in PAN Rules)తీసుకొచ్చారు. ఇకపై ఒక బిల్లు ₹1 లక్ష దాటితే PAN ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పరిమితి ₹50 వేలుగా ఉంది. వివాహాలు, పెద్ద కార్యక్రమాలు, కన్వెన్షన్ హాల్స్ వంటి చోట్ల భారీగా నగదు లావాదేవీలు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బీమా పాలసీల్లో కఠిన నిబంధనలు.. Stricter Rules for Insurance Policies
బీమా రంగంలో కూడా PAN వినియోగాన్ని(Changes in PAN Rules) తప్పనిసరి చేశారు. ఇంతవరకు వార్షిక ప్రీమియం ₹50 వేలకుపైగా ఉంటే మాత్రమే PAN అడిగేవారు. కానీ ఇకపై ప్రతి పాలసీకి PAN సమర్పించాల్సి ఉంటుంది. ఇది చిన్న పాలసీ అయినా, పెద్ద పాలసీ అయినా వర్తిస్తుంది. దీంతో బీమా రంగంలో కూడా లావాదేవీలు ట్రాక్ చేయడం సులభమవుతుంది.

ఎందుకు ఈ మార్పులు? Why These Changes?
కేంద్ర ప్రభుత్వం ఈ మార్పులను (Changes in PAN Rules) తీసుకురావడానికి ప్రధాన కారణాలు ఏమిటంటే.. పెరుగుతున్న నగదు లావాదేవీల నియంత్రణ, పన్ను ఎగవేతను అరికట్టడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెంచడం కోస‌మే పాన్‌లో నిబంధ‌న‌ల‌ను మార్చింది. ప్రస్తుతం దేశంలో భారీగా జరిగే నగదు లావాదేవీలు అధికారులకు ట్రాక్ చేయడం కష్టంగా మారుతోంది. PAN తప్పనిసరి చేయడం ద్వారా ప్రతి పెద్ద లావాదేవీని పర్యవేక్షించవచ్చు.

సాధారణ ప్రజలపై ప్రభావం.. Impact on Common People
ఈ మార్పులు(Changes in PAN Rules) సాధారణ ప్రజల జీవితంపై కూడా ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా పెద్ద మొత్తంలో నగదు వినియోగం తగ్గుతుంది. బ్యాంకింగ్ లావాదేవీలు పెరుగుతాయి . పన్ను చెల్లింపులు పెరగవచ్చు. అయితే పారదర్శక ఆర్థిక వ్యవస్థకు ఇది అవసరమని నిపుణులు చెబుతున్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి.. Precautions to Be Taken
కొత్త నిబంధనలు (Changes in PAN Rules)అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ప్రజలు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేసే ముందు PAN వివరాలు సిద్ధంగా ఉంచాలి. బ్యాంక్ ఖాతాల్లో నగదు జమలు, ఉపసంహరణలను గమనించాలి. పన్ను రిటర్నులు సక్రమంగా ఫైల్ చేయాలి. ఇవి పాటించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త PAN నిబంధనలు కీలకంగా మారనున్నాయి. నగదు లావాదేవీలపై కట్టడి, పన్ను ఎగవేతపై నియంత్రణ, డిజిటల్ ఎకానమీకి ప్రోత్సాహం.. ఇవన్నీ ఈ మార్పుల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యాలు. ప్రజలు కూడా ఈ మార్పులకు అనుగుణంగా తమ ఆర్థిక అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. PAN వినియోగాన్ని తప్పనిసరిగా పాటించడం ద్వారా భవిష్యత్తులో సమస్యలను నివారించవచ్చు.

107
FEATURE NEWS Tags:Impact on Common People, PAN for High-Value Hospitality Expenses, PAN Mandatory for ₹10 Lakh Cash Transactions, PAN Rule for Vehicle Purchases, Precautions to Be Taken, Revised Limits for Property Transactions, Stricter Rules for Insurance Policies, Why These Changes?

Post navigation

Previous Post: 15:65:20 రూల్ పాటించండి.. సంప‌న్నుల‌వ్వండి! Follow the 15:65:20 Rule… Become Wealthy!
Next Post: సరైన మ్యూచువల్‌ ఫండ్‌ పథకం ఎంపికే … మీ విజయానికి తొలి అడుగు! Choosing the Right Mutual Fund is the First Step to Success

Related Posts

  • చమురు కలవరం.. ప్రపంచం ఉలికిపాటు! Oil Turmoil… The World on Edge FEATURE NEWS
  • యూపీఐ మోసాల నుంచి ర‌క్ష‌ణ పొందండిలా! How to Protect Yourself from UPI Frauds! FEATURE NEWS
  • ఏప్రిల్‌ 1 నుంచి ఏటీఎం రూల్స్‌లో మార్పులు… బ్యాంకు ఖాతాదారుల‌పై అదనపు భారం? ATM Rule Changes from April 1… Extra Burden on Customers? FEATURE NEWS
  • బ్యాంకు రుణాల మాఫీ | బ్యాంకులు వేల కోట్ల రుణాలను ఎందుకు రద్దు చేస్తాయి? Bank Loan Write-Offs | Why Banks Cancel Thousands of Crores? FEATURE NEWS
  • ఏడాదికి రూ. 399తో ప‌ది ల‌క్ష‌ల బీమా Rs 399 per year with ten lakh insurance FEATURE NEWS
  • రూపాయి క్షీణత .. ‘టీవీ – మొబైల్‌’ భారం.. ! Rupee Depreciation: ‘TV–Mobile’ Burden Mounts! FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!!
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక!
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • త్వరగా రిటైర్మెంట్ అవ్వాల‌నుకుంటున్నారా? అయితే 25x బడ్జెట్ సూత్రం మీకోసమే..! Want to Retire Early? The 25x Budget Rule Is for You! FINICAL PLANNING
  • HDFC కస్టమర్లకు గుడ్ న్యూస్..! తగ్గిన MCLRతో EMIలకు ఊరట … లోన్ తీసుకున్న వారికి పండగే! Good News for HDFC Customers..! EMI Relief as MCLR Rates Fall – A Treat for Borrowers! FEATURE NEWS
  • ఐపీవోకు ఎల్ఐసీ lic launches indias largest ipo FEATURE NEWS
  • మ్యూచువ‌ల్ ఫండ్స్ అంటే.. MUTUAL FUNDS
  • కొత్త కార్మిక చట్టాలు VS ఖర్చులు…! 2026లో ఇలా ప్లాన్ చేసుకోకపోతే నష్టపోతారు! New Labour Laws vs Rising Costs..! Fail to Plan This Way in 2026 — and You’ll Pay the Price! FINICAL PLANNING
  • జాతీయ పెన్షన్ పథకంలో మార్పులు  national pension system changes FEATURE NEWS
  • డిస్కౌంట్ లోనే స్టాక్స్ కొనండి MARKET
  • ప‌న్ను వ‌సూళ్ల రికార్డ్‌ NEWS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme