దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ (BFSI) రంగం మళ్లీ కొత్త గరిష్టాన్ని తాకింది. ఈ రంగం మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) తాజాగా రూ.91 లక్షల కోట్లు దాటింది. దీని ఫలితంగా నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు సరికొత్త రికార్డుల దిశగా పయనిస్తున్నాయి. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ఇన్సూరెన్స్ సంస్థలు అన్ని రంగాలూ సమానంగా ఊపందుకోవడంతో BFSI రంగం మొత్తం బలంగా నిలిచింది. ముఖ్యంగా ప్రైవేట్ రంగ బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకులు రెండింటిలోనూ డబుల్ డిజిట్ వృద్ధి నమోదవడం విశేషం. రుణ వృద్ధి, వడ్డీ ఆదాయం, ఆర్థిక స్తోమత all positive trends. వచ్చే త్రైమాసికంలో BFSI రంగం విలువ రూ.95–100 లక్షల కోట్లు చేరే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం మీద దేశ ఆర్థిక వృద్ధికి ఇంధనంగా నిలుస్తున్న BFSI రంగం ఇప్పుడు కొత్త ఉత్సాహంతో దూసుకెళ్తోంది.
20 ఏళ్ల లో గణనీయమైన వృద్ధి.. Significant Growth in 20 Years
2005లో బీఎఫ్‌ఎస్‌ఐ (Banking, Financial Services & Insurance) మొత్తం మార్కెట్ విలువ కేవలం రూ.9 లక్షల కోట్లు మాత్రమే . 2025 నాటికి అది దాదాపు రూ.91 లక్షల కోట్లు దాటింది. అంటే 20 ఏళ్లలో సగటున 22 శాతం వృద్ధిరేటు సాధించింది. భవిష్యత్‌తో ఇది మరింత గణనీయమైన వృద్ధి రేటును సాధించనున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
వృద్ధికి ప్రధాన కారణాలు..Key Drivers of Growth
రుణాల డిమాండ్ గణనీయంగా పెరగడం
రిటైల్, హౌసింగ్ లోన్లలో స్థిరమైన వృద్ధి
NPAల తగ్గుదలతో బ్యాంకింగ్ రంగంపై విశ్వాసం పెరగడం
ఇన్సూరెన్స్ పాలసీల అమ్మకాలు భారీగా పెరగడం
డిజిటల్ బ్యాంకింగ్, ఫిన్‌టెక్ సేవల విస్తరణ
స్టాక్ మార్కెట్ల పై ప్రభావం.. Impact on Stock Markets
బీఎఫ్‌ఎస్‌ఐ రంగం బలపడటంతో నిఫ్టీ బ్యాంక్ సూచీ కూడా 49,000 మార్క్ దాటింది. HDFC బ్యాంక్, ఐసీఐసీఐ, ఎస్బీఐ, ఆక్సిస్ బ్యాంక్, ఎల్ఐసీ వంటి దిగ్గజ కంపెనీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. పెట్టుబడిదారులు ఈ రంగంపై మరింత దృష్టి సారిస్తున్నారు.
బీఎఫ్‌ఎస్‌ఐలో బ్యాంకులే బలమైన పునాది! Banks — The Strong Foundation of the BFSI Sector!
దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా నిలిచే బీఎఫ్‌ఎస్‌ఐ (Banking, Financial Services & Insurance) లో బ్యాంకులే ప్రధాన పాత్రధారులు. మొత్తం విలువలో దాదాపు 70 శాతం పైగా బ్యాంకింగ్ రంగం వాటాగా ఉన్నట్లు తాజా మార్కెట్ విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం స్టాక్ మార్కెట్‌లో ఉన్న BFSI కంపెనీలలో ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకుల విలువలు కలిపి రూ.63 లక్షల కోట్లు దాటాయి. మిగిలిన రూ.28 లక్షల కోట్లు ఫైనాన్షియల్ సర్వీసులు, ఇన్సూరెన్స్ సంస్థలదే.
ప్రధాన బ్యాంకుల ప్రాధాన్యం.. The Importance of Major Banks
HDFC బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిపి దాదాపు 40% విలువను ఆక్రమిస్తున్నాయి.
ఆక్సిస్, కోటక్ మహీంద్రా, ఇండస్‌ఇండ్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లు కూడా గణనీయమైన మార్కెట్ క్యాప్ కలిగిన సంస్థలుగా నిలుస్తున్నాయి.
ప్రైవేట్ బ్యాంకులు పెరుగుతున్న లాభాలు, తక్కువ NPAలు, రుణాల విస్తరణతో పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఎందుకింత ఆధిక్యం? Why Such Dominance?
– బ్యాంకులు రుణాల రూపంలో ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్నాయి.
– కార్పొరేట్, రిటైల్ లోన్లు స్థిరంగా పెరగడం
– వడ్డీ ఆదాయం బలపడడం
– డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరగడం
– రిస్క్ మేనేజ్‌మెంట్ పటిష్టం కావడం…
– ఇవన్నీ బ్యాంకింగ్ రంగం ఆధిపత్యానికి ప్రధాన కారణాలు. బ్యాంకింగ్ రంగం ప్రగతి ఇదే వేగంతో కొనసాగితే, వచ్చే ఏడాది నాటికి BFSI మొత్తం విలువ రూ.1 లక్ష కోట్లు దాటే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఎన్‌బీఎఫ్‌సీల పాత్ర.. The Role of NBFCs
బ్యాంకుల తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది వేస్తున్న ఎన్‌బీఎఫ్‌సీలు (Non-Banking Financial Companies) ఇప్పుడు విపరీతమైన వేగంతో దూసుకెళ్తున్నాయి. గత రెండేళ్లుగా వీటి రుణాల పంపిణీ, లాభదాయకత, మార్కెట్ విలువ all steady rise! ఇటీవల విడుదలైన ఆర్థిక ఫలితాల ప్రకారం, ఎన్‌బీఎఫ్‌సీ రంగం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14 లక్షల కోట్లు దాటింది. ఇందులో బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, మహీంద్రా ఫైనాన్స్, మనప్పురం, ముత్తూట్ ఫైనాన్స్ వంటి దిగ్గజ సంస్థలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా ఆటో, గృహ, వ్యక్తిగత రుణాలపై పెరుగుతున్న డిమాండ్ వల్ల ఎన్‌బీఎఫ్‌సీల వ్యాపారం బాగా విస్తరింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇవి తమ చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి.
వృద్ధి ఇలా.. Growth at This Pace…
బజాజ్ ఫైనాన్స్ – రిటైల్ లోన్లలో 30% వృద్ధి
శ్రీరామ్ ఫైనాన్స్ – కమర్షియల్ వెహికిల్ లోన్లలో కొత్త రికార్డ్
ముత్తూట్, మనప్పురం – బంగారు రుణాల్లో బలమైన వృద్ధి
ఫిన్‌టెక్ తో జోడీగా…In Tandem with Fintech…
డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లతో కలిసి నడుస్తున్న ఎన్‌బీఎఫ్‌సీలు వినియోగదారుల చేరువలోకి మరింత దగ్గరయ్యాయి. యాప్‌ల ద్వారా రుణాలు, సర్వీసులు అందించడం వల్ల సౌలభ్యం , వేగం , విశ్వసనీయత అన్న మూడు దిశల్లో ముందుకెళ్తున్నాయి.
పెట్టుబడిదారుల దృష్టి Investor Focus
సుదీర్ఘకాల లాభాలు, అధిక రాబడుల ఆశతో పెట్టుబడిదారులు ఈ రంగంపై కన్నేశారు. చిన్న క్యాప్, మిడ్‌క్యాప్ ఎన్‌బీఎఫ్‌సీలు కూడా గత ఏడాదిలో 30–40% వరకు లాభాలు నమోదు చేశాయి. “బ్యాంకుల కంటే ఫ్లెక్సిబుల్‌గా పనిచేయడం, రిస్క్ మేనేజ్‌మెంట్‌లో మెరుగుదల, కొత్త టెక్ మోడళ్ల వినియోగం ఎన్‌బీఎఫ్‌సీలకు బలం. ఈ వృద్ధి ఇలాగే కొనసాగితే 2026 నాటికి రంగం విలువ రూ.20 లక్షల కోట్లను తాకే అవకాశం ఉంది” అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం మీద, బ్యాంకింగ్ రంగానికే సవాల్ విసురుతున్న ఎన్‌బీఎఫ్‌సీలు ఇప్పుడు కొత్త దిశలో పయనిస్తున్నాయి. వృద్ధి వేగం, మార్కెట్ ఉత్సాహం కలిసి రంగానికి ఉజ్వల భవిష్యత్తును సంకేతం చేస్తున్నాయి.
జీడీపీలో బీఎఫ్‌ఎస్‌ఐ కీలక పాత్ర! BFSI’s Crucial Role in India’s GDP!
దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రాణస్వరూపమైన బీఎఫ్‌ఎస్‌ఐ (Banking, Financial Services & Insurance) రంగం ఇప్పుడు భారత జీడీపీ (Gross Domestic Product)లో గణనీయమైన వాటా సాధించింది. తాజా అంచనాల ప్రకారం, దేశ జీడీపీలో సుమారు 28 శాతం వాటా ఈ రంగానిదే అని కేంద్ర ఆర్థిక శాఖ, మార్కెట్ విశ్లేషకులు వెల్లడించారు. దేశ ఆర్థిక వృద్ధిలో బ్యాంకింగ్ రంగం ముందుండగా, దానికి తోడుగా ఎన్‌బీఎఫ్‌సీలు, ఇన్సూరెన్స్ సంస్థలు బలంగా పునాదులు వేస్తున్నాయి. 2010లో దేశ జీడీపీలో బీఎఫ్‌ఎస్‌ఐ వాటా కేవలం 18% మాత్రమే ఉండగా, 2025 నాటికి అది దాదాపు 10 శాతం పెరిగింది. డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ, ఫిన్‌టెక్ విప్లవం ఈ వృద్ధికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. “బీఎఫ్‌ఎస్‌ఐ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంధనం. వచ్చే 5 ఏళ్లలో ఈ రంగం వాటా జీడీపీ మొత్తం లో 35% దాటే అవకాశం ఉంది,” అని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మొత్తం మీద, బీఎఫ్‌ఎస్‌ఐ రంగం కేవలం మార్కెట్‌లోనే కాదు, దేశ ఆర్థిక శక్తిని నిలబెట్టే ప్రధాన స్తంభంగా మారింది. రుణాల విస్తరణ నుండి పెట్టుబడి వృద్ధి వరకు ప్రతి అడుగులోనూ ఈ రంగం భారత వృద్ధి కథను మలుస్తోంది.
