డిసెంబర్ 31 లోపు ఈ 5 పనులు పూర్తి చేయకపోతే భారీ పెనాల్టీలు తప్పవు.. Miss These 5 Tasks Before December 31? Be Ready for Hefty Penalties!

Posted by

2025 ఏడాది ముగియడానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా డిసెంబర్‌ 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని కీలక పనులు ఉన్నాయి. ఇవి నిర్లక్ష్యం చేస్తే పెనాల్టీలు(Penalties), అదనపు వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే చివరి నిమిషంలో గందరగోళం కాకుండా ముందే పూర్తి చేయడం మంచిది. క్యాలెండర్‌ మారిపోవడానికి ముందు పూర్తి చేయాల్సిన కీలక ఆర్థిక పనులు ఇంకా పెండింగ్‌లో ఉంటే ఇబ్బందులు తప్పవు. డిసెంబర్‌ 31 తర్వాత ‘తరువాత చూద్దాం’ అనుకుంటే ఖర్చు మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది. ముఖ్యంగా పాన్‌–ఆధార్‌ లింకింగ్‌, ఐటీఆర్‌ ఫైలింగ్‌ వంటి అంశాలను నిర్లక్ష్యం చేస్తే భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు, పాన్‌ కార్డు పనిచేయకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడే మీ పత్రాలు చెక్‌ చేసుకుని, అవసరమైన పనులు పూర్తి చేస్తే ఆర్థిక భారం తప్పుతుంది. ఆలస్యం చేయకుండా బాధ్యతలను పూర్తి చేయడం శ్రేయస్కరం. ఏడాది ముగింపు సంతోషంగా ఉండాలంటే ఆర్థిక పనుల్లో జాగ్రత్త తప్పనిసరి.

1) అడ్వాన్స్‌ ట్యాక్స్‌ (Advance Tax) చెల్లింపు..Advance Tax Payment
స్వయం ఉపాధి, ఫ్రీలాన్సర్లు, అధిక ఆదాయం ఉన్నవారు ఈనెలాఖ‌రు లోపు అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లించాలి. ఆలస్యం చేస్తే వడ్డీ రూపంలో అదనపు భారం(Penalties) పడుతుంది. డిసెంబర్‌ చివరికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

2) ఐటీఆర్‌ సవరణ (Revised ITR) ..Revised ITR Filing
(Penalties)ఇప్పటికే ఐటీ రిటర్న్‌ దాఖలు చేసి తప్పులు జరిగాయని గుర్తిస్తే, డిసెంబర్‌ 31 లోపు సవరించిన రిటర్న్‌ ఫైల్‌ చేయాలి. లేదంటే తప్పులకే పెనాల్టీలు, నోటీసులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే వారు ఐటీఆర్‌ దాఖలు చేయడం తప్పనిసరి. గడువు దాటితే లేట్‌ ఫీజులు, వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నోటీసులు వచ్చే అవకాశమూ ఉంది. భవిష్యత్తులో లోన్లు, వీసాలు, ఇతర ఆర్థిక అవసరాలకు ఇది అడ్డంకిగా మారుతుంది. వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారు అడ్వాన్స్‌ ట్యాక్స్‌, పెండింగ్‌ పన్ను బకాయిలు క్లియర్‌ చేయాలి. ఆలస్యం అయితే అదనపు వడ్డీ భారం తప్పదు.

3) పాన్‌–ఆధార్‌ సంబంధిత అప్‌డేట్స్‌..PAN–Aadhaar Linking Updates
పాన్‌–ఆధార్‌ లింకింగ్‌ ఇక ఐచ్చికం కాదు… తప్పనిసరి. ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల పెద్ద ఆర్థిక నష్టం ఎదురవకుండా ఉండాలంటే ఇప్పుడే అప్రమత్తమై ఈ పని పూర్తి చేసుకోవాల్సిందే. పాన్‌–ఆధార్‌ లింకింగ్‌పై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇచ్చింది. అక్టోబర్‌ 1, 2024 లోపు ఆధార్‌ పొందినప్పటికీ ఇప్పటివరకు పాన్‌తో లింక్‌ చేయని వారు డిసెంబర్‌ 31లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సిందే. ఇది నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబ‌ట్టి పాన్‌–ఆధార్‌ వివరాల్లో పొరపాట్లు ఉంటే వెంటనే సరిచేసుకోవాలి. డిసెంబర్‌ 31 లోపు పాన్‌–ఆధార్‌ లింకింగ్‌ పూర్తి చేయకపోతే మీ పాన్‌ కార్డు బ్లాక్ అవుతుంది.. అలా జరిగితే బ్యాంక్‌ లావాదేవీలు, పెట్టుబడులు, రుణాలు, ఐటీ రిటర్న్‌ దాఖలు వంటి కీలక పనులు నిలిచిపోతాయి. రోజువారీ ఆర్థిక వ్యవహారాలకే బ్రేక్‌ పడే పరిస్థితి వస్తుంది. మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు, షేర్ల లావాదేవీలు చేయలేరు. ఇప్పటికే చేసిన పెట్టుబడులపై లాభాలు పొందడంలోనూ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అంతేకాదు, పన్ను రీఫండ్‌లు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది. చివరి రోజుల్లో సర్వర్‌ సమస్యలు, సాంకేతిక ఇబ్బందులు వచ్చే అవకాశముంది. కాబట్టి డిసెంబర్‌ 31 వరకు వేచి చూడకుండా ఇప్పుడే పాన్‌–ఆధార్‌ లింకింగ్‌ పూర్తి చేసుకోవడం శ్రేయస్కరం.

4) బ్యాంక్‌ / డీమ్యాట్‌ KYC పూర్తి..Bank / Demat KYC Completion
బ్యాంక్‌ ఖాతాలు, డీమ్యాట్‌ అకౌంట్లకు KYC అప్‌డేట్‌ చేయకపోతే ఖాతాలు ఫ్రీజ్‌ అయ్యే అవకాశం ఉంది. డిసెంబర్‌ 31 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని బ్యాంకులు ఇప్పటికే హెచ్చరిస్తున్నాయి. KYC పూర్తి చేయని ఖాతాలపై బ్యాంకులు, బ్రోకరేజ్‌ సంస్థలు పరిమితులు విధిస్తున్నాయి. గడువు మిస్సైతే ఖాతాలు ఫ్రీజ్‌ అయ్యే పరిస్థితి ఎదురవుతుంది.

5) జీఎస్టీ రిటర్న్స్‌, బకాయిలు..GST Returns & Pending Dues
(Penalties)వ్యాపారులు, చిన్న పరిశ్రమల యజమానులు జీఎస్టీ రిటర్న్స్‌ దాఖలు చేయడంలో ఆలస్యం చేస్తే భారీ లేట్‌ ఫీజులు, వడ్డీలు పడతాయి. పెండింగ్‌లో ఉన్న రిటర్న్స్‌ను డిసెంబర్‌ లోపే క్లియర్‌ చేయడం ఉత్తమం.

ట్యాక్స్‌ ఆడిట్‌ కేసులకు డెడ్‌లైన్ ముగిస్తే.. Missing the Deadline for Tax Audit Cases…

ట్యాక్స్‌ ఆడిట్‌ పరిధిలోకి వచ్చే పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఊరటనిచ్చింది. సాధారణంగా అక్టోబర్‌ 31 వరకు ఉండే ట్యాక్స్‌ ఆడిట్‌ కేసుల ఐటీఆర్‌ గడువును ఈ ఏడాది డిసెంబర్‌ 10, 2025 వరకు పొడిగించింది. అదనపు ఆర్థిక వివరాలు, ఆడిట్‌ రిపోర్టులు సిద్ధం చేసుకోవాల్సిన వారికి ఇది ఎంతో ఉపయోగపడింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ట్యాక్స్‌ ఆడిట్‌ కేసుల సాధారణ గడువు ఇప్పటికే ముగిసిపోయింది. ఈ లోగా ట్యాక్స్‌ ఆడిట్‌ రిపోర్ట్‌ సమర్పించి, ఐటీఆర్‌ ఫైల్‌ చేయని వారు ఇక ఆలస్యం చేయడానికి అవకాశం లేదు. డిసెంబర్‌ 10లోపు ఫైల్‌ చేయలేని వారు ‘బిలేటెడ్‌ ఐటీఆర్‌’ దాఖలు చేయాల్సి ఉంటుంది. దీనికి చివరి గడువు డిసెంబర్‌ 31 మాత్రమే. ఈ తేదీ దాటితే ఆ ఏడాదికి సంబంధించి ఐటీఆర్‌ దాఖలు చేసే అవకాశం పూర్తిగా కోల్పోతారు. బిలేటెడ్‌ ఐటీఆర్‌ దాఖలు చేస్తే ఆదాయంపై ఆధారపడి జరిమానా (Penalties)చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు, కొన్ని మినహాయింపులు, నష్టాల క్యారీ ఫార్వర్డ్‌ హక్కులు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ట్యాక్స్‌ ఆడిట్‌ కేసుల గడువు ముగిసినా ఇంకా ఒక అవకాశం మాత్రం ఉంది. అది కూడా డిసెంబర్‌ 31 వరకు మాత్రమే. చివరి నిమిషంలో టెన్షన్‌ పడకుండా వెంటనే మీ చార్టెడ్‌ అకౌంటెంట్‌ను సంప్రదించి బిలేటెడ్‌ ఐటీఆర్‌ దాఖలు చేయడం శ్రేయస్కరం. లేకపోతే జరిమానాలు, ఆర్థిక ఇబ్బందులు తప్పవు.

బిలేటెడ్‌ ఐటీఆర్‌ ఎవరు దాఖలు చేయాలి? Who Should File a Belated ITR?
గడువు లోపు ఐటీఆర్‌ ఫైల్‌ చేయలేని వారు డిసెంబర్‌ 31 లోపు ‘బిలేటెడ్‌ రిటర్న్‌’దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ఇందుకు గరిష్ఠంగా రూ.5,000 వరకు ఆలస్య రుసుము(Penalties) చెల్లించాలి. అయితే ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్నవారికి ఈ జరిమానా రూ.1,000కే పరిమితం . ఇప్పటికే ఐటీఆర్‌ ఫైల్‌ చేసి, అందులో పొరపాట్లు ఉన్నాయని గుర్తిస్తే వాటిని సరిదిద్దుకునేందుకు (రివైజ్డ్‌ ఐటీఆర్‌) కూడా డిసెంబర్‌ 31నే చివరి గడువు. ఈ తేదీ దాటితే సాధారణ సవరణకు అవకాశం ఉండదు. జనవరి 1 నుంచి ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలంటే ‘అప్‌డేటెడ్‌ రిటర్న్‌’ (ITR-U) మాత్రమే దాఖలు చేయాలి. ఇందులో పన్ను బకాయిపై అదనంగా 25 శాతం నుంచి 50 శాతం వరకు పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. దీంతో ఆర్థిక భారం గణనీయంగా పెరుగుతుంది. డిసెంబర్‌ 31 వరకు ఇంకా అవకాశం ఉంది. బిలేటెడ్‌ అయినా, రివైజ్డ్‌ అయినా ఇప్పుడే ఐటీఆర్‌ ఫైల్‌ చేస్తే అదనపు నష్టాలు తగ్గుతాయి. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే ఈ బాధ్యతను పూర్తి చేసుకోవడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు.

గ‌డువు దాటింద‌ని నిర్ల‌క్ష్యం చేస్తే.. If the Deadline Is Missed…

ఆర్థిక సంవత్సరం 2025–26కి సంబంధించి అడ్వాన్స్‌ ట్యాక్స్‌ మూడో విడత చెల్లింపు గడువు డిసెంబర్‌ 15తో ముగిసింది. ఈ విడతలో మొత్తం అంచనా పన్నులో 75 శాతం వరకు (Penalties)చెల్లించాల్సి ఉంటుంది. అయితే గడువు దాటిందని నిర్లక్ష్యం చేయడం ప్రమాదమేనని పన్ను నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిసెంబర్‌ 15 తర్వాత చెల్లించినా అడ్వాన్స్‌ ట్యాక్స్‌ను పూర్తిగా విస్మరించకపోతే పెనాల్టీ వడ్డీ భారాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఆలస్యం ఎంత ఎక్కువైతే వడ్డీ అంత ఎక్కువగా పడుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా చెల్లించడం ఉత్తమం. వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారు, ఫ్రీలాన్సర్లు, అధిక ఆదాయం ఉన్న ఉద్యోగులు అడ్వాన్స్‌ ట్యాక్స్‌ పరిధిలోకి వస్తారు. వీరు సకాలంలో పన్ను చెల్లించకపోతే ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారం వడ్డీ విధిస్తారు. చివర్లో ఒకేసారి పెద్ద మొత్తంలో పన్ను చెల్లించాల్సి రావడంతో పాటు, అదనపు వడ్డీ భారం కూడా ఎదురవుతుంది. ఇది ఆర్థిక ప్రణాళికను దెబ్బతీసే అవకాశం ఉంది. ఏదేమైనా అడ్వాన్స్‌ ట్యాక్స్‌ మూడో విడత గడువు ముగిసినా ఇంకా ఆలస్యం చేయడానికి అవ‌కాశం లేదు. ఇప్పుడే పన్ను చెల్లిస్తే వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. ఏడాది చివర్లో అనవసర టెన్షన్లు తప్పించుకోవాలంటే వెంటనే చర్యలు తీసుకోవాల్సిందే.

జీఎస్టీ, బ్యాంక్‌ లాకర్‌ వినియోగదారులకు అలర్ట్‌… Alert for GST and Bank Locker Users…

జీఎస్టీ రిటర్న్స్‌ నుంచి బ్యాంక్‌ లాకర్‌ ఒప్పందాల వరకూ డిసెంబర్‌ 31 గడువు చాలా ముఖ్యమైనది. వ్యాపారస్తులు, కంపెనీలు 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక జీఎస్టీ రిటర్న్స్‌ను డిసెంబర్‌ 31లోపు దాఖలు చేయాలి. టర్నోవర్‌ పరిమితిని బట్టి ఈ రిటర్న్స్‌ ఫైలింగ్‌ తప్పనిసరి. గడువు దాటితే ప్రతి రోజుకు జరిమానా (Penalties)విధించబడుతుంది. ఇది వ్యాపారంపై అదనపు భారం పెడుతుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ నిబంధనల ప్రకారం బ్యాంక్‌ లాకర్‌ వినియోగదారులు కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసి బ్యాంకులకు సమర్పించాలి. చాలా బ్యాంకులు దీనికి ఈ నెలాఖరునే గడువుగా నిర్ణయించాయి. ఆలస్యం చేస్తే లాకర్‌ సేవలపై పరిమితులు విధించే అవకాశం ఉంది. బ్యాంక్‌ ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఇన్సూరెన్స్‌ పాలసీలకు నామినీల పేర్లు అప్‌డేట్‌ చేయడం చాలా ముఖ్యం. అనుకోని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఇది అవసరం. చివరి రోజుల్లో సర్వర్‌ సమస్యలు, సాంకేతిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు గడువు దాటే ప్రమాదం ఉంటుంది. అందుకే అన్ని పనులను ఇప్పుడే పూర్తి చేసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. జీఎస్టీ రిటర్న్స్‌, బ్యాంక్‌ లాకర్‌ ఒప్పందాలు, నామినీ అప్‌డేట్స్‌ వంటి పనులు ఆలస్యం కాకుండా పూర్తి చేస్తే కొత్త ఏడాదిని నిశ్చింతగా ప్రారంభించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *