Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • క్రెడిట్ కార్డును స‌ద్వినియోగం చేసుకోండి how to get profits from credit card FEATURE NEWS
  • టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. ఈ విష‌యాలు తెలుసుకోండి Taking Term Insurance? Know These Important Things.. FEATURE NEWS
  • పసిడి ప‌థ‌కాల‌పై పెట్టుబడులు investment in gold funds are profitable or not FEATURE NEWS
  • పిల్లల భవిష్యత్తు కోసం బెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్స్ ఇవే.. ! చిల్డ్రన్స్ డే స్పెషల్ Best Investment Options for Your Child’s Future FEATURE NEWS
  • సీబీడీసీ అంటే ఏమిటి what is cbdc FEATURE NEWS
  • షేర్ల బైబ్యాక్ లాభ‌మా what is share buyback FEATURE NEWS
  • సిబిల్ స్కోరుపై ఆర్‌బీఐ కొత్త ప్ర‌తిపాద‌న ..RBI’s New Proposal on CIBIL Score FEATURE NEWS
  • సుర‌క్షితంగా మ‌నీ ట్రాన్స‌ఫ‌ర్ చేయండి how to transfer money securely FEATURE NEWS
  • ఇన్కమ్ టాక్స్‌ రీఫండ్ ఎందుకు ఆలస్యమవుతుంది..? స్టేటస్ తెలుసుకోవ‌డం ఎలా..? Why Is the Income Tax Refund Getting Delayed? How to Check Your Refund Status? FEATURE NEWS
  • స్టాక్ మార్కెట్లో అధిక లాభాలు సాధ్య‌మే.. FEATURE NEWS

ఖ‌ర్చుల‌కు ఏ మాత్రం త‌గ్గేదేలే..! భవిష్యత్తుపై భారతీయుల్లో అధిక విశ్వాసం No Let-Up in Spending..! Indians Show Strong Confidence in the Future

Posted on 16/12/2025 By admin No Comments on ఖ‌ర్చుల‌కు ఏ మాత్రం త‌గ్గేదేలే..! భవిష్యత్తుపై భారతీయుల్లో అధిక విశ్వాసం No Let-Up in Spending..! Indians Show Strong Confidence in the Future

భవిష్యత్తు తమదేన‌న్న ధీమాతో నేటిత‌రం ముందుకు సాగుతుంది. ఆదాయం పెరుగుతుందన్న నమ్మకం, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయన్న ఆశ, జీవన ప్రమాణాలు మరింత ఎత్తుకు చేరుతాయన్న విశ్వాసం… ఇవన్నీ వారి ఖర్చు(Spending) నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల భావజాలంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌ (బీసీజీ) తాజాగా విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. మొత్తంగా చూస్తే… ప్రపంచం మొత్తం ఆర్థిక ఒత్తిడులతో ఇబ్బంది పడుతున్న వేళ, భారతీయ వినియోగదారుల విశ్వాసమే దేశ ఆర్థిక వ్యవస్థకు బలంగా మారుతోందని బీసీజీ నివేదిక స్పష్టం చేస్తోంది.

భవిష్యత్తుపై గట్టి నమ్మకం..Strong Confidence in the Future

భవిష్యత్తుపై నమ్మకం ఉంటే ఖర్చు(Spending) కూడా పెరుగుతుంది. అదే ఇప్పుడు భారతీయులలో స్పష్టంగా కనిపిస్తోంది. చైనా తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఆశావహ వినియోగదారులుగా భారతీయులు నిలవడం… రానున్న రోజుల్లో దేశ ఆర్థిక వృద్ధికి ఇది కీలక శక్తిగా మారనుంది. బీసీజీ నివేదిక ప్రకారం భవిష్యత్తుపై అధిక విశ్వాసం వ్యక్తం చేస్తున్న దేశాల జాబితాలో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో వినియోగదారులు ఖర్చుల (Spending)విషయంలో వెనుకంజ వేస్తున్నా… భారతీయులు మాత్రం ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు.

ఖర్చుకు వెనుకాడని మనస్తత్వం..Unhesitant Spending Mindset

కార్లు, ద్విచక్ర వాహనాలు, మొబైల్‌ ఫోన్లు, గృహోపకరణాలు, ఇళ్లు… ఇలా పెద్ద మొత్తంలో ఖర్చయ్యే(Spending) వస్తువుల కొనుగోలుపై కూడా భారతీయులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా యువతలో ఈ ధోరణి మరింత బలంగా ఉందని బీసీజీ పేర్కొంది. “ఈరోజు ఖర్చు(Spending) చేసినా రేపు సంపాదించగలం” అన్న భావన స్పష్టంగా కనిపిస్తోందని నివేదిక విశ్లేషించింది.

ఆదాయం పెరుగుతుందన్న ఆశ..Hope of Rising Income

డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ విస్తరణ, స్టార్టప్‌ సంస్కృతి, సేవారంగం వృద్ధి, ప్రభుత్వ మౌలిక సదుపాయాల పెట్టుబడులు… ఇవన్నీ భవిష్యత్తులో ఆదాయాలు పెరుగుతాయన్న నమ్మకాన్ని భారతీయుల్లో బలపరుస్తున్నాయి. అదే సమయంలో పొదుపు కూడా కొనసాగుతూనే ఖర్చు (Spending)పెరుగుతుండటం భారత్‌కు ప్రత్యేకతగా బీసీజీ గుర్తించింది.

ఇతర దేశాలతో పోలిస్తే…Compared to Other Countries…
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఆర్థిక అనిశ్చితి, అధిక ధరలు వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఖర్చు(Spending) చేయాలంటేనే వెనకడుగు వేస్తున్న పరిస్థితి నెలకొంది. కానీ భారత్‌లో మాత్రం దృశ్యం భిన్నంగా కనిపిస్తోంది. ఇక్కడి వినియోగదారులు కొనుగోళ్ల విషయంలో ధైర్యంగా ముందుకొస్తున్నారు. అమెరికా, యూరప్‌ వంటి ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి కారణంగా వినియోగదారులు ఖర్చును కుదించుకుంటున్నారు. కానీ భారత్‌లో మాత్రం ఈ ప్రభావం అంతగా కనిపించడం లేదు. అవసరాలతో పాటు సౌకర్యాలకూ ప్రాధాన్యం ఇస్తూ ఖర్చు చేసే ధోరణి కొనసాగుతోంది.

మార్కెట్లకు శుభవార్త..Good News for Markets

మనదేశంలో దాదాపు 60 శాతం కుటుంబాలు భవిష్యత్తుపై ఆశాభావంతో ఉన్నాయి. ఆదాయం పెరుగుతుందన్న నమ్మకంతో ఖర్చు(Spending) చేయడానికి వెనకాడటం లేదని పేర్కొంది. అవసరమైన వస్తువుల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. భారతీయుల ఈ విశ్వాసమే ఆటోమొబైల్‌, రియల్‌ ఎస్టేట్‌, ఎలక్ట్రానిక్స్‌, రిటైల్‌ రంగాలకు శుభవార్తగా మారింది. దేశీయ మార్కెట్‌పై కంపెనీలు మరింత ఆశలు పెట్టుకోవడానికి ఈ నివేదిక బలం చేకూరుస్తోంది. ముఖ్యంగా వచ్చే ఆరు నెలల్లో కార్లు, మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఇళ్ల కొనుగోళ్లకు వినియోగదారులు సిద్ధంగా ఉన్నారని బీసీజీ నివేదిక తెలిపింది. ఈ ధోరణి కొనసాగితే దేశంలో వినియోగం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. దీని ప్రభావంతో వినియోగ వస్తువుల అమ్మకాలు అన్ని రంగాల్లో పెరుగుతాయని బీసీజీ అంచనా వేసింది. అందుకే ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌, రియల్‌ ఎస్టేట్‌, రిటైల్‌ రంగాల్లోని వ్యాపార సంస్థలు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా తమ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది.

ఏఐ ఆధారిత నిర్ణయాలు.. AI-Driven Decisions

– కొనుగోళ్ల విషయంలో భారతీయ వినియోగదారుల ఆలోచన విధానం వేగంగా మారుతోంది. వస్తువు కొనాలంటే దుకాణం చుట్టూ తిరగడమే కాదు… ముందుగా ఏఐ (కృత్రిమ మేధ) టూల్స్‌ను ఆశ్రయించి తుది నిర్ణయం తీసుకుంటున్నారు. తాజా బీసీజీ నివేదిక ఇదే విషయాన్ని వెల్లడించింది.
– ఈ ఏడాది నవంబరు నాటికి దాదాపు 62 శాతం మంది భారతీయులు జెన్‌ ఏఐ టూల్స్‌ను వినియోగించినట్లు బీసీజీ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఇది 48 శాతం మేర పెరుగుదల కావడం విశేషం. అంటే కొద్ది నెలల్లోనే ఏఐ వినియోగం గణనీయంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది.
– బ్రాండ్‌ ఎంపిక, వస్తువుల డిజైన్‌, రూపురేఖలు, పనితీరు, ధరల పోలికలు వంటి అంశాలను వినియోగదారులు ఏఐ టూల్స్‌ ద్వారా ముందుగానే అధ్యయనం చేస్తున్నారు. ఏది తమ అవసరాలకు సరిపోతుందో, ఏది ఉత్తమమో తెలుసుకున్న తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకుంటున్నారు.
– చాలామంది పూర్తిస్థాయి డిజిటల్‌ వినియోగదార్లుగా మారుతున్నారు. టెక్నాలజీపై అవగాహన పెరగడం, స్మార్ట్‌ఫోన్ల విస్తృత వినియోగం, ఇంటర్నెట్‌ అందుబాటు.. ఈ మార్పున‌కు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు.
– జెన్‌ ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ కొనుగోళ్లలోనూ స్పష్టత, జాగ్రత్త పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఏఐ ఆధారిత నిర్ణయాలే మార్కెట్‌ ధోరణిని మరింతగా ప్రభావితం చేయనున్నాయన్న సంకేతాలు ఈ నివేదిక ఇస్తోంది.

ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటే.. Economy on a Growth Path

– ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ పరిస్థితులు మారుతున్నా… వాటి ప్రభావంతో మనదేశంలో ఆర్థికాభివృద్ధి మందగిస్తుందని భావిస్తున్న వారు తక్కువగానే ఉన్నారు. బీసీజీ తాజా నివేదిక ప్రకారం భారత్‌లో కేవలం 17 శాతం మంది మాత్రమే ఆర్థిక వృద్ధి మందగిస్తుందన్న అభిప్రాయంతో ఉన్నారు. ఇదే సమయంలో యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు 60 శాతం మంది ప్రజలు ఆర్థిక మాంద్యం తప్పదని నమ్మడం గమనార్హం.
– మనదేశంలో మాత్రం భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. సుమారు 61 శాతం మంది ప్రజలు “మంచి రోజులు రాబోతున్నాయి” అన్న నమ్మకంతో ఉన్నారని నివేదిక తెలిపింది. అయితే మరోవైపు 34 శాతం మంది మాత్రం నిరుద్యోగం, ఆర్థిక మందగమనం వంటి అంశాలు ఇబ్బంది పెట్టొచ్చన్న ఆందోళన వ్యక్తం చేశారు.
– వచ్చే ఆరు నెలల్లో తమ కుటుంబాల ఖర్చులు పెరుగుతాయని 61 శాతం మంది భావిస్తున్నారని బీసీజీ పేర్కొంది. దీనివల్ల వినియోగం మరింత ఊపందుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. వినియోగదారుల ఖర్చు (Spending)ధోరణి ఆర్థిక వ్యవస్థకు కీలక బలంగా మారనుందని విశ్లేషించింది.
– కొత్త బ్రాండ్లను ప్రయత్నించేందుకు 57 శాతం మంది సుముఖంగా ఉన్నప్పటికీ, 84 శాతం మంది మాత్రం తమకు ఇప్పటికే తెలిసిన, గతంలో వినియోగించిన బ్రాండ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని నివేదిక తెలిపింది. అంటే కొత్తదనానికి అవకాశమున్నా… నమ్మకమే ఇప్పటికీ ప్రధాన ప్రమాణంగా ఉందన్న మాట.
– తరం వారీగా చూస్తే జెన్‌-జడ్‌ (Gen Z)తో పోలిస్తే ‘మిలేనియల్స్‌’, జెన్‌-ఎక్స్‌ తమ ఆర్థిక స్థితిగతులపై ఎక్కువ ధీమాతో ఉన్నారని బీసీజీ వెల్లడించింది. అనుభవం ఎక్కువగా ఉండటం, ఆస్తులు కలిగి ఉండటం, బ్యాంకు బ్యాలెన్స్‌ మెరుగ్గా ఉండటం ఇందుకు కారణాలుగా పేర్కొంది.
– మొత్తంగా చూస్తే… ప్రపంచంలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ, భారతీయుల విశ్వాసమే ఆర్థిక వ్యవస్థను వృద్ధి బాటలో ముందుకు నడిపిస్తున్న శక్తిగా మారుతోందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

108
FEATURE NEWS Tags:AI-Driven Decisions, Compared to Other Countries…, Economy on a Growth Path, Good News for Markets, Hope of Rising Income, Strong Confidence in the Future, Unhesitant Spending Mindset

Post navigation

Previous Post: స్టెప్‌-అప్ సిప్‌తో ప్ర‌యోజ‌నాలెన్నో..! Multiple Benefits of Step-Up SIP!
Next Post: 5 నెలల కనిష్ఠానికి వాణిజ్య లోటు..60% తగ్గిన పసిడి దిగుమతులు! Trade Deficit Hits 5-Month Low… Gold Imports Drop 60%!

Related Posts

  • 2026లో బ్యాంకింగ్‌ రంగంలో కీలక మార్పులు..! Big Changes in Banking Rules 2026 FEATURE NEWS
  • మీ ఆలోచ‌నే మీ ఆస్తి Your thoughts are your property FEATURE NEWS
  • ఎన్ఆర్ఐలూ ఇండియాకు వ‌చ్చేట‌ప్పుడు ఇలా చేయండి.. లక్షల్లో జరిమానాలు తప్పించుకోండి! Avoid Paying Lakhs of Fines | Telugu NRI’s Fix this in your next Visit FEATURE NEWS
  • క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవ‌డ ఎలా? How to Increase Your Credit Card Limit FEATURE NEWS
  • రూపాయి క్షీణత .. ‘టీవీ – మొబైల్‌’ భారం.. ! Rupee Depreciation: ‘TV–Mobile’ Burden Mounts! FEATURE NEWS
  • స్టాక్ మార్కెట్ లాభాల‌పై ట్యాక్స్ ఉంటుందా..? FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • How to make happy money book summery telugu హౌ టు మేక్ హ్యాపీ మ‌నీ బుక్ స‌మ‌రీ తెలుగు

Recent Posts

  • కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్‌.. కార్పొరేట్ రంగం విలవిల.. IT కంపెనీలకు బిగ్ సవాల్
  • ఇరాన్‌తో ట్రేడ్‌.. ట్రంప్ టారిఫ్‌లు..! భారత్‌పై ప్రభావం ఎంత? Iran Trade, Trump Tariffs! How Much Will India Be Impacted?
  • అపోహలు వీడండి.. అవ‌గాహ‌న‌తో పెట్టుబడులు పెట్టండి Break the Myths, Invest with Awareness
  • బడ్జెట్ ఎలా తయారవుతుందో తెలుసా? Behind the Scenes of Union Budget
  • PPF కేవైసీ కొత్త రూల్స్ తెలుసా! లేకుంటే మీ అకౌంట్ క్లోజ్ ! Do You Know the New PPF KYC Rules? Or Your Account Could Be Closed!
  • బ్యాంకు ఖాతా అవసరం లేకుండానే ఎఫ్‌డీ చేయొచ్చు..! Fixed Deposit Without a Bank Account Is Now Possible!
  • భారీ నష్టాల్లో సూచీలు.. ఒక్కరోజులోనే ₹8 లక్షల కోట్లు ఆవిరి..! Markets in Freefall: ₹8 Lakh Crore Wiped Out in a Single Day
  • వెల్త్ బిల్డింగ్ మంత్రం | లోన్లు–ఆస్తులు ఎలా ప్లాన్ చేసుకోవాలి? How to Build Wealth | Smart Loans & Asset Planning
  • వెండి ఆభరణాలపై కొత్త రూల్: కొనుగోలు చేసే ముందు ఇవి గమనించండి! New Rules on Silver Jewellery: What to Know Before Buying
  • ఎల్ఐసీ కొత్త పాల‌సీ.. ఒకసారి కడితే జీవితాంతం ఆదాయం LIC New Policy: Pay Once, Get Lifetime Income
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Caution is Essential Compared to Other Countries… Convenience Current Situation difference between Rich mindset And Poor mindset Direct Equity Drawbacks Expert Advice Geopolitical Tensions how To get financial freedom How to improve CIBIL Score Interest Rate Investor Enthusiasm Key Highlights Key Recommendations Market Expansion Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Recommendations for Investors Right Decisions Are the Key Security square off Stock Market Systematic Investment Plans (SIP) Tips for Investors what are the best financial rules What Are the Interest Rates? What is Personal loan and how to get personal loan what is scuttlebutt investing in stock market WHAT SHOULD AN NRI DO WITH HIS EPF ACCOUNT which is the best stock broking agency Which Option Suits Whom? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

January 2026
S M T W T F S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
« Dec    
  • ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్స్ అంటే చేదా..? What are equity mutual funds? MUTUAL FUNDS
  • ఎన్‌ఆర్‌ఐలు భారత్‌లో ఎలా పెట్టుబడులు పెట్టాలి? నెలవారీ ఆదాయం ఎలా సంపాదించాలి? How NRIs Can Invest in India & Build Monthly Income FINICAL PLANNING
  • P/E RATIO ప‌నేంటి..? MARKET
  • ల‌వ్ విత్ మ‌నీ love with money FINICAL PLANNING
  • కొత్త సంవ‌త్స‌రంలో ఆర్థిక భారం తగ్గించుకోండి… ఆర్థికారోగ్యంపై దృష్టి పెట్టండి Reduce Financial Burden in the New Year… Focus on Financial Health FINICAL PLANNING
  • ఏటీఎం కార్డు లేకుండా డ‌బ్బులు విత్‌డ్రా ఎలా how to withdraw money without ATM card NEWS
  • This is how to check for losses in the stock market స్టాక్ మార్కెట్‌లో న‌ష్టాల‌కు ఇలా చెక్ పెట్టండి FINICAL PLANNING
  • Say No to bank deposits బ్యాంకు డిపాజిట్లు వ‌ద్దు FINICAL PLANNING

Copyright © 2026 .

Powered by PressBook News Dark theme