Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఖ‌ర్చుల‌కు ఏ మాత్రం త‌గ్గేదేలే..! భవిష్యత్తుపై భారతీయుల్లో అధిక విశ్వాసం No Let-Up in Spending..! Indians Show Strong Confidence in the Future FEATURE NEWS
  • what are the problems with small Loan Apps  లోన్ యాప్స్‌తో  సమస్యలు ఏమిటి FEATURE NEWS
  • గృహ రుణం ఎప్పుడు మార్చుకోవాలి When to change home loan FEATURE NEWS
  • రాకేష్ ఝున్ ఝున్ వాలాకు లాభాలిచ్చిన స్టాక్స్ ఇవే.. FEATURE NEWS
  • 2025లో రూ.30 లక్షల కోట్లకు పెరిగిన మదుపర్ల సంపద..Investor Wealth Rises to ₹30 Lakh Crores in 2025 FEATURE NEWS
  • ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్‌.. India Becomes the Fourth Largest Economy in the World FEATURE NEWS
  • గ్యారంటీడ్ ఇన్కం ప్లాన్స్ ఎంచుకోండి.. FEATURE NEWS
  • ఆన్‌లైన్‌లో డ‌బ్బులు సంపాదించుకునే మార్గాలేమిటి What are the ways to make money online FEATURE NEWS
  • ఇక ‘సర్‌ప్రైజ్ బిల్లులు’ ఉండవ్‌..! ఆ ధరలను ప్రైవేట్ ఆసుపత్రులు ముందుగానే వెల్లడించాలి! No More “Surprise Bills”! Private Hospitals Must Disclose Treatment Costs in Advance FEATURE NEWS
  • లోన్ వద్దనుకుంటున్నారా.. అయితే రద్దు చేసుకోండి ! ‘కూలింగ్-ఆఫ్’ నిబంధనతో సేఫ్ ఎగ్జిట్! Don’t Want the Loan? Cancel It! Safe Exit with ‘Cooling-Off’ Rule! FEATURE NEWS

కొత్త కార్మిక చట్టాలు VS ఖర్చులు…! 2026లో ఇలా ప్లాన్ చేసుకోకపోతే నష్టపోతారు! New Labour Laws vs Rising Costs..! Fail to Plan This Way in 2026 — and You’ll Pay the Price!

Posted on 05/01/2026 By admin No Comments on కొత్త కార్మిక చట్టాలు VS ఖర్చులు…! 2026లో ఇలా ప్లాన్ చేసుకోకపోతే నష్టపోతారు! New Labour Laws vs Rising Costs..! Fail to Plan This Way in 2026 — and You’ll Pay the Price!

2026 నుంచి దేశవ్యాప్తంగా కొత్త కార్మిక చట్టాలు (New Labour Laws) పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశాలు స్పష్టమవుతున్నాయి. పేరుకే ఇవి కార్మికుల సంక్షేమం కోసం అయినా, యజమానులు – ఉద్యోగులు ఇద్దరికీ ఖర్చుల భారం తప్పదన్నది వాస్తవం. ముందస్తు ప్రణాళిక లేకపోతే చిన్న సంస్థల నుంచి మధ్యతరగతి ఉద్యోగుల వరకు అందరికీ ఆర్థిక షాక్ తప్పదు.

అసలు మార్పు ఎక్కడుంది? Where the Real Change Is Happening
కొత్త కార్మిక చట్టాలు (New Labour Laws)నాలుగు కోడ్‌లుగా అమలవుతాయి. వీటిలో ముఖ్యమైనది వేతన నిర్మాణం (Salary Structure) మార్పు.
దీని ప్ర‌కారం ఇకపై బేసిక్ జీతం కనీసం 50% ఉండాలి. PF, గ్రాట్యుటీ లెక్కలు పెరుగుతాయి. దీంతో చేతికి వచ్చే జీతం తగ్గే ప్రమాదం ఉంది. ఇది వినడానికి సింపుల్‌గా ఉన్నా, ఖర్చుల లెక్కలు పూర్తిగా తలకిందులు అవుతాయి. ఉదాహరణకు ఇప్పటివరకు రూ.50,000 జీతం తీసుకునే ఉద్యోగికి, బేసిక్ పెరిగితే PF కట్ పెరుగుతుంది . నెలకు రూ.2,000–3,000 తక్కువ వస్తుంది. వార్షికంగా చూసుకుంటే అదే ఉద్యోగికి రూ.25,000–40,000 వరకు క్యాష్ ఫ్లో తగ్గుతుంది. అయితే ఖర్చులు మాత్రం తగ్గవు . EMIలు, స్కూల్ ఫీజులు, అద్దెలు అలాగే ఉంటాయి. జీతం తగ్గితే అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్ప‌డొచ్చు.

చిన్న ప‌రిశ్ర‌మ‌ల‌కు దెబ్బ‌…Blow to Small Businesses
కొత్త కార్మిక చట్టాల(New Labour Laws) కార‌ణంగా చిన్న పరిశ్రమలు దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది. నేరుగా వాటి లాభాలపై ప్ర‌భావం ప‌డుతుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగిపై నెలకు రూ.3,000 అదనపు PF/గ్రాట్యుటీ అంటే, 50 మంది ఉంటే నెలకు రూ.1.5 లక్షల భారం ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలో చిన్న ప‌రిశ్ర‌మ‌లు ఇకపై ఇష్టమొచ్చినట్లు కాంట్రాక్ట్ నియామకాలు కష్టమే. ఉద్యోగుల సంఖ్య కూడా తగ్గించుకునే అవ‌కాశం ఉంది.

ప్లాన్ చేసుకోకపోతే క‌ష్ట‌మే.. Fail to Plan — and Survival Gets Tough
– కొత్త కార్మిక చట్టాల (New Labour Laws)వ‌ల్ల‌ ఉద్యోగుల జీతాలు త‌గ్గే అవ‌కాశం ఉంది. ఈనేప‌థ్యంలో వారు ముంద‌స్తుగా ప్లాన్ చేసుకోవాలి. లేకుంటే సేవింగ్స్ తగ్గుతాయి. అప్పులు పెరుగుతాయి. వాటి నుంచి బ‌య‌టప‌డాలంటే ఉద్యోగులు ఇప్పుడే బడ్జెట్ రీ-డిజైన్ చేయాలి
– లాభాలు త‌గ్గే అవ‌కాశం ఉన్నందున ప‌రిశ్ర‌మ‌ల య‌జమానులకు కూడా త‌గిన ప్లానింగ్ చేసుకోవాలి. లేకుంటే వారి ఖర్చులు పెరుగుతాయి. దీంతో నియామకాలు తగ్గుతాయి. ఈ క్ర‌మంలో యజమానులు త‌క్ష‌ణ‌మే వేతన నిర్మాణాన్ని రివ్యూ చేయాలి.

కొత్త కార్మిక చట్టాలు.. భద్రతా లేదా భార‌మా? New Labour Laws: Security or Burden?
కేంద్ర ప్ర‌భుత్వం (New Labour Laws) నాలుగు కార్మిక కోడ్‌లును తీసుకొస్తుంది. అవి ఏమిటంటే.. వేతన కోడ్, సామాజిక భద్రత కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, వృత్తి భద్రత కోడ్. పేరుకి ఇవి ఉద్యోగ భద్రతే లక్ష్యమైనా, ఉద్యోగుల‌ చేతికి వచ్చే డబ్బు తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. బేసిక్ జీతం కనీసం 50% ఉండాలన్న నిబంధనతో ఈ కోడ్‌లు అమ‌లు చేస్తుండ‌గా.. ప్ర‌స్తుతం ఉద్యోగి జీతంలో PF అధికంగా కట్ అవుతుంది. గ్రాట్యుటీ భారం పెరుగుతుంది. దీర్ఘకాలంలో సేవింగ్స్ పెరిగినా, తక్షణ జీవితంలో మాత్రం ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది.

ప్రైవేట్ ఉద్యోగుల‌కు క‌ష్ట‌మే! Tough Times Ahead for Private Sector Employees!
ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల తర్వాత ప్రైవేట్ రంగం భద్రతగా కనిపించింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కాంట్రాక్ట్ ఉద్యోగాలు పెరిగాయి ఆటోమేషన్ వల్ల పనులు తగ్గుతున్నాయి. పనితీరు లేని ఉద్యోగులకు స్థానం లేదు. ఉదాహరణకు ఐటీ, మీడియా, స్టార్టప్ రంగాల్లో ఒక్కసారిగా ఉద్యోగాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అదేవిధంగా 40 సంవ‌త్స‌రాల‌ వ‌య‌సు దాటిన తర్వాత కొత్త ఉద్యోగం దొరకడం మరింత కష్టంగా మారుతోంది. మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు ఏం చేయాలంటే.. ఒకే ఆదాయంపై ఆధారపడకూడ‌దు. సైడ్ ఇన్కమ్ చూసుకోవాలి. లేకపోతే మీ ఆర్థిక‌ వ్యవస్థ కూలిపోతుంది. నెల చివర చేతిలో డబ్బు మిగలకపోతే ఇక ఉద్యోగం చేసి ఏ ప్రయోజనం .ఆర్థిక ప్రణాళిక, బడ్జెట్ క్రమశిక్షణ, అదనపు ఆదాయ మార్గాలు లేకపోతే మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక‌ స్థిరత్వం క‌ష్ట‌మే.

50% వేజ్ రూల్..50% Wage Rule
కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న కొత్త కార్మిక చట్టాల్లో (New Labour Laws)కీలకమైనది 50% వేజ్ రూల్. ఈ నిబంధన ప్రకారం ఉద్యోగి మొత్తం జీతంలో బేసిక్ పే కనీసం 50 శాతం ఉండాలి. వినడానికి ఇది చిన్న మార్పులా కనిపించినా, ఉద్యోగుల‌పై పడే ప్రభావం మాత్రం పెద్దదే. ఈ మార్పుతో పీఎఫ్ (PF), గ్రాట్యుటీ లెక్కలు పెరుగుతాయి. దీర్ఘకాలంలో ఇది భవిష్యత్తు భద్రతకు ఉపయోగపడినా, తక్షణంగా ఉద్యోగుల చేతికి వచ్చే టేక్-హోమ్ శాలరీ తగ్గడం ఖాయం. ఉదాహరణకు వార్షికంగా రూ.25 లక్షల ఆదాయం ఉన్న ప్రొఫెషనల్‌కు, కొత్త వేజ్ రూల్ అమలైతే నెలవారీ జీతంలో సగటున రూ.6,000 నుంచి రూ.8,000 వరకు కోత పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎక్కువ అలవెన్సులు, తక్కువ బేసిక్‌తో జీతం తీసుకుంటున్న ఉద్యోగులకు ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ కోత ఒక్కసారిగా పెద్దగా అనిపించకపోయినా, ఇదే నెలనెలా బడ్జెట్‌ను అస్తవ్యస్తం చేసే “స్ట్రింగ్”గా మారే ప్రమాదం ఉంది. హోమ్ లోన్ EMIలు, స్కూల్ ఫీజులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలపై ప్ర‌భావం ప‌డుతుంది. కొత్త కార్మిక చట్టాల తర్వాత పాత ఖర్చుల అలవాట్లతో ముందుకెళ్తే నష్టం తప్పదు. జీతం తగ్గే పరిస్థితిని ముందే అంచనా వేసి, ఖర్చులను రీసెట్ చేయడం, అవసరం లేని వ్యయాలను కట్ చేయడం తప్పనిసరి. భవిష్యత్తు భద్రత పేరుతో తీసుకొచ్చిన ఈ నిబంధన, ప్రస్తుత జీవన వ్యయాల మధ్యలో మధ్యతరగతి ఉద్యోగుల‌కు కొత్త ఆర్థిక పరీక్షగా మారుతోంది.

పాత ఫార్ములా ఇక పని చేయదు! Old Formula No Longer Works!
“ఉద్యోగం తెచ్చుకో… పొదుపు చేయి… ఇల్లు కొను.” దశాబ్దాలుగా భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు ఇదే జీవిత ఫార్ములా. ఒకసారి ఉద్యోగం దొరికితే, మిగతావన్నీ సర్దుకుపోతాయని నమ్మకం బలంగా ఉండేది. కానీ 2026కి వచ్చేసరికి ఈ పాత సూత్రం ఇక పని చేయకపోవచ్చన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే జీతాల పెంపు కంటే ఖర్చులు వేగంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో ఉద్యోగాల స్వరూపం మారుతోంది. ఒకే కంపెనీలో 25–30 ఏళ్లు పనిచేసే కాలం ముగింపు దశకు చేరుకుంది. ఉదాహరణకు ఏడాదికి 8–10% జీతం పెరిగినా, స్కూల్ ఫీజులు, అద్దెలు, వైద్య ఖర్చులు 12–15% వరకు పెరుగుతున్నాయి. మ‌రోవైపు హోమ్ లోన్ EMI, ఇన్సూరెన్స్ ప్రీమియం కలిపితే నెలవారీ ఆదాయంలో సగానికి పైగా ఖర్చవుతోంది. మొత్తంగా పొదుపు పేరుకే మిగులుతోంది.

ఉద్యోగాలు స్థిరంగా లేవు .. Jobs Are No Longer Stable
ఒకప్పుడు ఉద్యోగం మారడం అపవాదుగా ఉండేది. ఇప్పుడు అది స‌ర్వ‌ సాధారణంగా మారింది. కంపెనీలు ఖర్చులు తగ్గించేందుకు ఉద్యోగాలను కాంట్రాక్ట్, ప్రాజెక్ట్ బేస్డ్‌గా మార్చుతున్నాయి. పనితీరు, టెక్నాలజీ మార్పులతో కెరీర్ మధ్యలో బ్రేక్ రావడం సహజంగా మారింది. ఉదాహరణకు
ఐటీ, మీడియా, స్టార్టప్ రంగాల్లో రెండేళ్లకోసారి ఉద్యోగం మారాల్సిన పరిస్థితి. స్థిర ఉద్యోగం అన్న భావన క్రమంగా బలహీనపడుతోంది.

ఒకే జీతంపై పెద్ద లోన్లు… పెరుగుతున్న రిస్క్..Big Loans on a Single Salary… Increasing Risk
(New Labour Laws) మారుతున్న పరిస్థితుల్లో ఒకే జీతంపై ఆధారపడి హోమ్ లోన్ వంటి పెద్ద బాధ్యతలు మోయడం మునుపటి కంటే ప్రమాదకరంగా మారుతోంది. ఉదాహరణకు ఆరు నెలలు ఉద్యోగం లేకుంటే EMIలు చెల్లించడం భారమవుతుంది. కెరీర్ బ్రేక్ వస్తే పొదుపు పూర్తిగా కరిగిపోవచ్చు. గతంలో భద్రతగా అనిపించిన హోమ్ లోన్, ఇప్పుడు దీర్ఘకాల ఒత్తిడిగా మారే అవకాశం ఉంది. అందుకే పెద్ద లోన్లకు ముందు ఉద్యోగ స్థిరత్వం కాకుండా క్యాష్ ఫ్లో భద్రత చూసుకోవాలి.

‘డిస్క్రిషనరీ’ ఖర్చులపై కత్తెర..Curb on ‘Discretionary’ Expenses
కొత్త కార్మిక చట్టాలు, పెరుగుతున్న జీవన వ్యయంతో ఉద్యోగుల‌ చేతికి వచ్చే నగదు క్రమంగా తగ్గుతోంది. ఈ క్ర‌మంలో ముందుగా ప్రభావితమయ్యేది అత్యవసరం కాని ‘డిస్క్రిషనరీ’ ఖర్చులే. బయట ఫుడ్ ఆర్డర్ చేయడం, అవసరం లేని ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు కొనడం, వీకెండ్ షాపింగ్‌లు… ఇవన్నీ రోజువారీ జీవనానికి తప్పనిసరి కాకపోయినా, మధ్యతరగతి జీవనశైలిలో భాగమైపోయాయి. కానీ చేతిలో డబ్బు తగ్గినప్పుడు ఇవే మొదటి కట్‌కు గురవుతాయి. ఉదాహరణకు వారానికి రెండు సార్లు ఫుడ్ డెలివరీ చేస్తే నెలకు రూ.4,000–6,000 ఖర్చవుతోంది. ఏడాదికి రెండు సార్లు ఫోన్ అప్‌గ్రేడ్ చేయడం అంటే కనీసం రూ.30,000–50,000 వ్యయమ‌వుతుంది. ఇవన్నీ కలిస్తే నెల చివర నగదు కొరత స్పష్టంగా కనిపిస్తుంది

ఆదాయం తగ్గితే అలవాట్లు మారాలి..Spending Habits Must Change When Income Drops
(New Labour Laws) జీతం తగ్గినా, ఖర్చుల అలవాట్లు మారకపోతే సమస్యలు తప్పవు. ఉదాహరణకు టేక్-హోమ్ శాలరీ తగ్గినా అదే లైఫ్‌స్టైల్ కొనసాగిస్తే క్రెడిట్ కార్డు బాకీలు పెరుగుతాయి. ‘తర్వాత చూసుకుందాం’ అనుకుని ఖర్చులు వాయిదా వేస్తే, ఒక దశలో అప్పులు భారంగా మారతాయి. డబ్బు తగ్గితే డిసిప్లిన్ లేకపోవడం ప్రమాదం. ఇటువంటి స‌మ‌యంలో లైఫ్‌స్టైల్‌ను ఆదాయానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. దీనినే ఫైనాన్షియల్ రీసెట్ అంటారు. విలాసం–అవసరం మధ్య తేడా గుర్తించాలి. ‘ఇప్పుడే కావాలి’ అన్న భావనకు బ్రేక్ వేయాలి. ఉదాహరణకు బయట తినే ఖర్చును ఇంటి వంటతో భర్తీ చేయాలి.
గాడ్జెట్ ను అవసరం వచ్చినప్పుడే కొనుగోలు చేయాలి. చేతిలో నగదు తగ్గినప్పుడు ఖర్చులు కంట్రోల్‌లో పెట్టుకోకపోతే ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది.
ముందుగానే ఈ మార్పును అంగీకరించి, లైఫ్‌స్టైల్‌ను సర్దుబాటు చేసుకున్నవారే 2026 ఆర్థిక వాస్తవానికి తట్టుకోగలుగుతారు.

ఇన్వెస్ట్మెంట్ రిస్క్ పెరుగుతోంది..Investment Risk Is Rising
పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతున్న పొదుపుతో ఉద్యోగులో్ల‌ కొత్త ఆందోళన మొదలైంది. నెల చివర మిగిలే డబ్బు తగ్గుతున్నప్పుడు, ఆ లోటును పూడ్చుకోవాలన్న తొందరలో చాలామంది స్టాక్ మార్కెట్ లేదా ఇతర అధిక రిస్క్ ఉన్న పెట్టుబడుల వైపు పరుగులు తీస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయన్న ఆశతో పెట్టుబడి పెట్టడం, 2026 ఆర్థిక పరిస్థితుల్లో పెద్ద ప్రమాదంగా మారుతోంది. సాధారణంగా పెట్టుబడులు అదనపు డబ్బుతో చేయాలి. కానీ ప్రస్తుతం పరిస్థితి వేరుగా ఉంది. ఉదాహరణకు నెలకు మిగిలే రూ.5,000 కూడా స్టాక్ ట్రేడింగ్‌లో పెట్టి, ఒక్క మార్కెట్ కరెక్షన్‌తో మొత్తం నష్టపోతున్నారు. ఫ్రెండ్ సూచనలతో లేదా సోషల్ మీడియా ప్రభావంతో డెరివేటివ్స్‌లోకి వెళ్లి, ఉన్న సేవింగ్స్ ను చాలామంది పోగొట్టుకుంటున్నారు. ఇన్వెస్టింగ్ అనేది జూదం కాద‌ని గుర్తించాలి. “త్వరగా సంపాదించాలి” అన్న ఆలోచనే అసలు శత్రువు. పొదుపు తగ్గినప్పుడు సహజంగా వచ్చే ఆలోచన ఇదే. కానీ మార్కెట్ ఈ భావోద్వేగాలను క్షమించదు. ఇక‌ లోన్లు తీసుకుని మార్కెట్‌లో పెట్టుబడి పెడితే.. ఎక్కువసార్లు నష్టం, ఒత్తిడి, అప్పులే మిగులుతాయి.

స్మార్ట్ ఫైనాన్స్ అంటే..? What Does Smart Finance Mean?
స్మార్ట్ ఫైనాన్స్ అంటే ఎక్కువ రిస్క్ తీసుకోవడం కాదు. క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళిక అవసరం. ఆదాయం తగ్గినా, పెట్టుబడుల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. చిన్న మొత్తాలతో కూడా క్రమం తప్పకుండా దీర్ఘకాల పెట్టుబడి కొనసాగించాలి. ఎమర్జెన్సీ ఫండ్ లేకుండా మార్కెట్ రిస్క్ తీసుకోకూడ‌దు. క్యాష్ ఫ్లోపై పూర్తి అవగాహన ఉండాలి. చాలామందికి నెలకు ఎంత జీతం వస్తుందన్నది తెలుసు. కానీ ఆ జీతం నుంచి ఎంత పోతుందో స్పష్టంగా తెలియదు. పీఎఫ్‌కు ఎంత కట్ అవుతోంది? చేతికి వచ్చే టేక్-హోమ్ ఎంత? EMIలు, బిల్లుల తర్వాత నిజంగా మిగిలేది ఎంత? అనేది తెలుసుకోవాలి. నెల ఖర్చులు రూ.50,000 అయితే, కనీసం రూ.3–6 లక్షలు సిద్ధంగా ఉండాలి. ఆరు నెలలు ఉద్యోగం లేకున్నా EMIలు, బిల్లులు సాఫీగా చెల్లించగలగాలి. ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే చిన్న షాక్ కూడా పెద్ద సంక్షోభంగా మారుతుంది.

లాంగ్-టర్మ్ ప్లానర్‌గా ఆలోచించాలి..Think Like a Long-Term Planner
ఇప్పటి వరకు చాలామంది ఆలోచన ఒకటే “ఈ నెల జీతం పడితే చాలు.” అని. కానీ 2026లో ఈ ఆలోచన ప‌నికిరాదు. వచ్చే 5–10 ఏళ్లలో మ‌న‌ ఆదాయం ఎలా ఉంటుంది? ఉద్యోగం లేకపోయినా కుటుంబ ఖర్చులు ఎలా నడుస్తాయి? అనేది ఆలోచించాలి. నెలవారీ క్యాష్ ఫ్లో చూసి, దీర్ఘకాలిక ప్లాన్ వేసుకోవాలి. స్కిల్స్‌పై పెట్టుబడి పెట్టి, ఆదాయం కొనసాగించే మార్గాలు చూసుకోవాలి. జీతం తీసుకునే వ్యక్తి నుంచి ప్లానర్‌గా మారడమే అసలు మార్పు.

 

 

 

 

57
FINICAL PLANNING Tags:.Investment Risk Is Rising, 50% Wage Rule, Big Loans on a Single Salary… Increasing Risk, Blow to Small Businesses, Curb on ‘Discretionary’ Expenses, Fail to Plan — and Survival Gets Tough, Jobs Are No Longer Stable, New Labour Laws: Security or Burden?, Old Formula No Longer Works!, Spending Habits Must Change When Income Drops, Think Like a Long-Term Planner, Tough Times Ahead for Private Sector Employees!, What Does Smart Finance Mean?, Where the Real Change Is Happening

Post navigation

Previous Post: ఎంత సంపాదించినా ఈ దేశాల్లో పన్ను లేదు..! అవేమిటో తెలుసా? No Matter How Much You Earn, There’s No Tax in These Countries — Do You Know Which Ones?
Next Post: వెనిజులాపై అమెరికా దాడి…భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత? US Strikes on Venezuela… How Will the Indian Stock Market Be Affected?

Related Posts

  • త్వ‌ర‌గా రిటైర్ అవ్వాల‌నుకుంటున్నారా..? how will we plan early retirement FINICAL PLANNING
  • సేవింగ్స్ కి ఇన్సూరెన్స్ కి తేడా ఏమిటి What is the difference between savings and insurance FINICAL PLANNING
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know FEATURE NEWS
  • 15*15*15 రూల్‌తో రూల్‌తో ఆర్థిక స్వేచ్ఛ how to get financial freedom with 15*15*15*  law FINICAL PLANNING
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks FEATURE NEWS
  • how to achieve early retirement and financial freedom ముందస్తు పదవీ విరమణ మరియు ఆర్థిక స్వేచ్ఛను ఎలా పొందాలి FINICAL PLANNING

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • How to make happy money book summery telugu హౌ టు మేక్ హ్యాపీ మ‌నీ బుక్ స‌మ‌రీ తెలుగు

Recent Posts

  • కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్‌.. కార్పొరేట్ రంగం విలవిల.. IT కంపెనీలకు బిగ్ సవాల్
  • ఇరాన్‌తో ట్రేడ్‌.. ట్రంప్ టారిఫ్‌లు..! భారత్‌పై ప్రభావం ఎంత? Iran Trade, Trump Tariffs! How Much Will India Be Impacted?
  • అపోహలు వీడండి.. అవ‌గాహ‌న‌తో పెట్టుబడులు పెట్టండి Break the Myths, Invest with Awareness
  • బడ్జెట్ ఎలా తయారవుతుందో తెలుసా? Behind the Scenes of Union Budget
  • PPF కేవైసీ కొత్త రూల్స్ తెలుసా! లేకుంటే మీ అకౌంట్ క్లోజ్ ! Do You Know the New PPF KYC Rules? Or Your Account Could Be Closed!
  • బ్యాంకు ఖాతా అవసరం లేకుండానే ఎఫ్‌డీ చేయొచ్చు..! Fixed Deposit Without a Bank Account Is Now Possible!
  • భారీ నష్టాల్లో సూచీలు.. ఒక్కరోజులోనే ₹8 లక్షల కోట్లు ఆవిరి..! Markets in Freefall: ₹8 Lakh Crore Wiped Out in a Single Day
  • వెల్త్ బిల్డింగ్ మంత్రం | లోన్లు–ఆస్తులు ఎలా ప్లాన్ చేసుకోవాలి? How to Build Wealth | Smart Loans & Asset Planning
  • వెండి ఆభరణాలపై కొత్త రూల్: కొనుగోలు చేసే ముందు ఇవి గమనించండి! New Rules on Silver Jewellery: What to Know Before Buying
  • ఎల్ఐసీ కొత్త పాల‌సీ.. ఒకసారి కడితే జీవితాంతం ఆదాయం LIC New Policy: Pay Once, Get Lifetime Income
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Caution is Essential Compared to Other Countries… Convenience Current Situation difference between Rich mindset And Poor mindset Direct Equity Drawbacks Expert Advice Geopolitical Tensions how To get financial freedom How to improve CIBIL Score Interest Rate Investor Enthusiasm Key Highlights Key Recommendations Market Expansion Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Recommendations for Investors Right Decisions Are the Key Security square off Stock Market Systematic Investment Plans (SIP) Tips for Investors what are the best financial rules What Are the Interest Rates? What is Personal loan and how to get personal loan what is scuttlebutt investing in stock market WHAT SHOULD AN NRI DO WITH HIS EPF ACCOUNT which is the best stock broking agency Which Option Suits Whom? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

January 2026
S M T W T F S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
« Dec    
  • సేవింగ్స్ కి ఇన్సూరెన్స్ కి తేడా ఏమిటి What is the difference between savings and insurance FINICAL PLANNING
  • బంగారంపై పెట్టుబ‌డి.. దండ‌గే! FINICAL PLANNING
  • క్రెడిట్ కార్డు… వీళ్ల‌కి వ‌రం what are the benifits of credit cards FEATURE NEWS
  • రూ.100 లక్షల కోట్ల మైలురాయికి చేరిన ఎస్‌బీఐ .. SBI Reaches ₹100 Lakh Crore Milestone FEATURE NEWS
  • Invest in new stocks కొత్త స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుండాలి.. MARKET
  • చిటికెలో రుణంతో జ‌ర భ‌ద్రం Secure with a loan in a pinch FEATURE NEWS
  • గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ అంటే..? MARKET
  • స్టాక్ మార్కెట్ కెరియ‌ర్‌ బాగుంటుందాcan i choose stock market as a carrier FEATURE NEWS

Copyright © 2026 .

Powered by PressBook News Dark theme