
విదేశాల్లో నివసిస్తున్న భారతీయులను ప్రవాస భారతీయులు Non-resident Indians (NRI) అని అంటారు. వారు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా వెలుపల నివసించే భారతీయ సంతతికి చెందిన లేదా భారతీయ మూలాలున్న వ్యక్తులు. Ministry of External Affairs నివేదిక ప్రకారం 3.2 కోట్ల మంది ఇతర దేశాల్లో ప్రవాస భారతీయులుగా నివసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలస జనాభాలో 5.5 కోట్ల మందిలో భారతీయ మూలాలున్నవారే అత్యధికులు. అయితే ఆదాయపన్నుకు సంబంధించిన వర్గీకరణ, చట్టం ప్రకారం ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా 182 కంటే తక్కువ రోజులు గానీ, నాలుగేళ్లలో 365 రోజులు, అందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 60 రోజులు భారతదేశంలో నివసించి ఉండకపోతే ఆ ఆర్థిక సంవత్సరానికి ఆ వ్యక్తి ఎన్ఆర్ఐగా పరిగణిస్తారు. నివాస భారతీయులకు, ప్రవాస భారతీయులకూ వేర్వేరు ఆదాయపన్ను రేట్లుంటాయి. అయితే ఎన్ ఆర్ ఐలకు ఆర్థిక లావాదేవీలు, పన్నులు, ఇన్సూరెన్స్, డీ మాట్ అకౌంట్ తదితర విషయాల్లో చాలా సందేహాలు ఉంటాయి. వాటిలో కొన్నింటిని ఓ సారి చూద్దాం.
చాలామంది NRIలు ఇండియాలో ఎలా Invest చేయాలా? అని అనుకుంటారు. అయితే america, australia, canadaలో ఉన్న NRIలకు ఈ విషయలో ఒక అవగాహన ఉంటుంది. వారు ఇండియాలో ఎప్పటినుంచో Invest చేస్తూ ఉంటారు. కానీ చదువు లేకుండా కార్మికులుగా ఇరాన్, ఇరాక్, దుబాయ్, ఖతర్, middle east countriesకు వెళ్లిన వారు ఎక్కువగా ఉంటారు. కాగా వారిలో చాలామందికి తాము సంపాదించిన మొత్తంలో కొంతభాగాన్ని ఎలా Invest చేయాలి? డబ్బులు ఎలా దాచుకోవాలి? ఇది ఎలా సాధ్యపడుతుందో తెలియదు. అయితే ఏ NRI అయినా సరే ఇండియాలో డబ్బులు దాచుకోవడానికి ఆ దేశంలోని బ్యాంకర్లను కలవడం ఉత్తమం.
* NRI లు ఇండియాలో తమ అకౌంట్ ని NRO అకౌంట్ కింద మార్చుకోవాలి. ఆ తర్వాత వాటిలో NRE ( non resident external account) SAVINGS ACCOUNT ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏ ఇన్వెస్ట్ మెంట్ చేసినా NRE అకౌంట్లో చేస్తే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.
* విదేశాల్లో సంపాదించిన డబ్బు గానీ, వేతనం గానీ మరే ఇతర నగదు గానీ ఖాతాలో వేయడానికి NRIలకు తప్పనిసరిగా NRE అకౌంట్ ఉండాలి. ఈ NRE అకౌంట్ లో ఎంత అమౌంట్ transfer పెట్టుకున్నా అందుకు tax కట్టనవసరంలేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఆ countryలో tax కట్టిన తర్వాతనే ఆ amountని NRE అకౌంట్ లో transfer చేస్తారు కాబట్టి.
* ఒకవేళ ఇండియా నుంచి మీకు రెగ్యులర్‌గా ఇన్కమ్ వచ్చినట్లయితే ఆ మొత్తాన్ని NRO అకౌంట్ లో వేసుకోవాలి. దీనికి మాత్రం కచ్చితంగా tax కట్టాలి. ఇందుకోసం NRIలు ఏమి చేయాలంటే.. మీరు ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో ఇండియన్ బ్యాంకు వద్దకు వెళ్లి NRO accountని ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
* మొత్తంగా NRIలు రెండు accountsని open చేయాలి. ఒకటి విదేశాల్లో సంపాదించింది దాచుకోవడానికి లేదా ఇన్వెస్ట్ చేయడానికి NRE accountని తెరవాలి. ఇండియా నుంచి వచ్చే మొత్తాన్ని వాడుకోవడానికి గాను NRO accountని open చేయాల్సి ఉంటుంది.
CLEAR YOUR ISSUES RELATED TO AADHAR
ఆధార్‌కు సంబంధించిన మీ సమస్యలను క్లియర్ చేయండి
మీ ఆధార్ కార్డ్ లో ఏవైనా సమస్యలు ఉంటే దానిని అప్ డేట్ చేసుకోవాలి. ఇండియాకి వచ్చిన తర్వాత ఏ బ్యాంకుకి వెళ్లాలో అని తిరగకుండా మనం ఏ దేశంలో ఉన్నామో అక్కడ నుండి ఇండియాలో ఏ బ్యాంకులు ఉన్నాయో సెర్చ్ చేసుకోవాలి. మనకి ఏ బ్యాంకు తక్కువ ఛార్జ్ లతో అకౌంట్ ఓపెన్ చేసు్తంద ఆఫర్స్ ఇస్తాయి. ఆధార్ వెరిఫికేషన్ అయిన తర్వాత Kyc Update చేసుకోవాలి. ఇన్వెస్ట్ మెంట్ కేవైసీ లేకపోతే NRI కేవైసీ కింద మార్చుకోవాలి. ఇండియన్ కేవైసీని మాత్రం కంటిన్యూ చేయకూడదు. దానిని NRI Kyc కింద convert చేసుకోవాలి.
Visit your Chartered Accountant
మీ చార్టర్డ్ అకౌంటెంట్ని సందర్శించండి
ఫినాన్షియల్ సంబంధించిన విషయాల కోసం మనం Chartered Accountantను విజిట్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే మన పాత ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ గానీ, ఫ్యూచర్లో వచ్చే ట్యాక్స్ సంబంధింత సమస్యల కోసం గానీ లోకల్ సీఏతో మనం నిత్యం టచ్ లో ఉండాలి. ఇది మనకి ఫ్యూచర్లో బాగా సహాయపడుతుంది.
Insurance
జీవిత బీమా పాలసీలు అంటే మనం అనుకోని సందర్భంగా మన కుటుంబానికి దూరమైనప్పుడు ఆర్థికపరంగా రక్షణగా ఉంటాయి. ముఖ్యంగా భారతదేశంలో జీవితా బీమా పాలసీలను చెల్లించడం అనేది పెట్టుబడి సాధనంగా పరిగణిస్తారు. భారతదేశంలో వివిధ కంపెనీలు జీవిత బీమా పాలసీలు అందిస్తున్నాయి. ప్రవాస భారతీయులకు కూడా ఇండియాలో కొన్ని ప్రత్యేక జీవిత బీమా పాలసీలు ఉన్నాయి. అయితే ఈ బీమా ప్లాన్ కొనుగోలు చాలా కష్టమని చాలా మంది భావిస్తున్నారు. ఇది కేవలం అపోహ మాత్రమేనని ఆర్థిక నిపుణులు అంటున్నారు. పాలసీ తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎన్ఆర్ఐలు హ్యాపీగా జీవిత బీమా పాలసీలు పొందవచ్చని సూచిస్తున్నారు. ఎన్ఆర్ఐలు జీవితబీమాల పాలసీలు తీసుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఓ సారి చూద్దాం
భారతీయ బీమా సంస్థలు ఏదైనా గ్లోబల్ లోకేషన్లో నివసిస్తున్న ఎన్ఆర్ఐలకు ప్రత్యేక బీమా పథకాలను అందిస్తున్నాయి. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ప్రకారం, భారతీయ మూలాల ప్రజలు వారి కుటుంబ అవసరాలను తీర్చడానికి బీమా పథకాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఫెమా చట్టం ప్రకారం భారతీయ జీవిత బీమా కంపెనీల్లో బీమా పొందిన వ్యక్తులు భారతదేశంలో నివసించాల్సిన అవసరం ఉండదు. ఎన్ఆర్ఐల కోసం భారతీయ జీవిత బీమా కంపెనీలు ఆన్లైన్ ద్వారా బీమా పథకాలను పొందేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఈ ఆన్లైన్ పథకాల వల్ల పాలసీ ఫీచర్లతో పాటు Premium రేట్లు ఇతర కంపెనీలతో బేరీజు వేసుకోవడానికి వీలవుతుంది. అయితే ఎన్ఆర్ఐ జీవిత బీమా పొందాలంటే వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి డాక్యుమెంట్లు బీమా సంస్థకు అందించాల్సి ఉంటుంది.
* భారతదేశంలోని బీమా సంస్థల ద్వారా బీమా పొందిన ఎన్ఆర్ఐకు Premium రేట్లు వారు నివసించే దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఒక్కోసారి నివసించే దేశాన్ని బట్టి బీమా సంస్థలు పాలసీను కూడా తిరస్కరించే అవకాశం ఉంటుంది. తక్కువ రిస్క్ ఉండే దేశాల్లో నివసించే ఎన్ఆర్ఐలు ఎలాంటి అడ్డంకులు లేకుండా పాలసీ పొందవచ్చు.
Things to consider
పరిశీలించాల్సిన అంశాలు
ఎన్ఆర్ఐలు భారతీయ బీమా సంస్థల్లో పాలసీ తీసుకుంటే కొన్ని మినహాయింపులను పరిశీలించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా పన్ను మినహాయింపులను సరి చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బీమా మెచ్యూర్ అయ్యాక పన్ను మినహాయింపుల కారణంగా గణనీయమైన రాబడి పొందవచ్చు. అయితే ఈ పన్ను మినహాయింపులు వాళ్లు నివసించే దేశానికి అనుగుణంగా ఉంటుంది.
* premium చెల్లింపులను ఖాతాదారులు విదేశీ కరెన్సీలో లేదా నాన్ రెసిడెంట్ ఆర్డనీరి ఖాతా (ఎన్ఆర్ఓ), నాన్ రెసిడెంట్ ఎక్స్‌టర్నెల్(ఎన్ఆర్ఈ), ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ (ఎఫ్సీఎన్ఆర్) ఖాతాలతో సహా వివిధ భారతీయ బ్యాంకు ఖాతాల ద్వారా చేయవచ్చు. ముఖ్యంగా పాలసీ డాక్యుమెంట్లు మనం premium ఎలా చెల్లించాలో నిర్ధారిస్తాయి.
* బీమా పాలసీ విదేశీ కరెన్సీలో నిర్ణయిస్తే ఎన్ఆర్ఈ లేదా ఎఫ్సీఎన్ఆర్ ఖాతా ద్వారా అదే కరెన్సీలో సెటిల్ చేయాలి. పాలసీ అనేది ఇండియన్ కరెన్సీ ద్వారా నిర్ణయిస్తే premium లు ఎన్ఆర్వో ఖాతా ద్వారా సేకరిస్తారు.
* డెత్ క్లెయిమ్ చేయాలంటే నామినీ పాలసీ డాక్యుమెంట్లో నిర్దేశించిన తుది మెచ్యూరిటీలకు సంబంధించి అవి పేర్కొన్న కరెన్సీలో అందిస్తారు. డెత్ క్లెయిమ్‌కు సంబంధించి పేర్కొన్న అన్ని వివరాలను నామినీ అందించాలి. ముఖ్యంగా ఎన్ఆర్ఐ మరణించిన దేశంలోని భారత రాయబారి కార్యాలయం Attested death certificate అందించాల్సి ఉంటుంది.
What are mandatory for NRIs in taking insurance
బీమా తీసుకోవడంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
– మనం NRI గా విదేశాల్లో ఉన్నప్పుడు Insurance తీసుకోవాలంటే. కష్టం. ఎందుకంటే అక్కడ premium చాలా ఎక్కువ ఉంటుంది. అదే మన దేశంలో అయితే premium చాలా తక్కువ ఉంటుంది. మనం ఇండియాలో పాలసీ తీసుకుని విదేశాలకు వెళ్లిపోయినా ఎటువంటి నష్టం ఉండదు. అక్కడ మనకు ఏం జరిగినా ఆ పాలసీ మనకి వర్తిస్తుంది.
– మనం ఇండియాలో పాలసీ తీసుకోవాలనుకుంటే ఇండియాకి వచ్చిన తర్వాత టర్మ్ పాలసీకి అప్లై చేయకూడదు. ఎందుకంటే పాలసీ చేయడానికి చాలా time పడుతుంది. time సరిపోక కొంతమంది మధ్యలోనే విదేశాలకు వెళ్లిపోతారు. ఆ పాలసీ అలాగే ఉండిపోతుంది. అందుకే మనం NRI గా విదేశాల్లో ఉన్నప్పుడే term insurance కి ప్లాన్ చేసుకోవాలి. అక్కడి నుంచే online term insuranceకి apply చేసుకోవాలి. onlineలో మనకి తక్కువ premium ఉన్నవి తెలుసుకుని దానికి apply చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ విధిగా term insurance తీసుకోవాలి.
ఇన్వెస్ట్ మెంట్ చేయడానికి తొందరపడొద్దు
చాలామంది NRI లు ఇండియాకి వచ్చిన తర్వాత ఎందులోనో ఒకదానిలో invest చేయాలని తొందరపడుతుంటారు. ఇలా ఆలోచించడం తగదు. తొందరపడి ఎందులో పడితే అందులో invest చేయకూడదు. బాగా స్టడీ చేసిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయాలి.
Precautions must be taken in demat account
డీమ్యాట్ అకౌంట్లో జాగ్రత్తలు
చాలామంది ఇండియాలో ఉన్నప్పుడు డీమ్యాట్ account open చేస్తారు. NRI గా విదేశాలకు వెళ్లిన తర్వాత కూడా అదే డీమ్యాట్ account కొనసాగిస్తారు. అది కరెక్ట్ కాదు. ముందు మన ఇండియా డీమ్యాట్ అకౌంట్ ని NRI డీమ్యాట్ గా కన్వెర్ట్ చేసుకోవాలి. కన్వెర్ట్ కి ఆప్షన్ ఇవ్వనపుడు డీమ్యాట్ అకౌంట్ ని క్లోజ్ చేయవలిసి ఉంటుంది. మనం వేరే NRI డీమ్యాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవాలి. NRI డీమ్యాట్ అకౌంట్లో రెండు ఆప్షన్స్ ఉంటాయి. PIS account & Non PIS account. వాటి మధ్య గల తేడాను ఇప్పుడు తెలుసుకుందాం.
Difference between PIS account, non PIS account
పీఐఎస్ ఖాతా, నాన్ పీఐఎస్ ఖాతా మధ్య వ్యత్యాసం ఏమిటి
non PIS account డీమ్యాట్ account లాగే ఉంటుంది. మన saving bank అందులో link అయ్యి ఉంటుంది. మన సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ని NRI అకౌంట్ గా మార్చుకుంటే మన అకౌంట్లో ఉన్న షేర్స్ అన్ని కూడా NRI అకౌంట్లోకి convert అయిపోతాయి. ఇందు కోసం మనం tax pay చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం shares అమ్మడం లేదు కాబట్టి.
PISలో మనం NRI, NRA రెండింటి ద్వారా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
మనం కావాలనుకుంటే account ని non PIS account అకౌంట్ కిందైనా మార్చుకోవచ్చు. ఆ తర్వాత మనం ఏ transaction అయినా ఈజీగా చేసుకోవచ్చు. non PIS account charges కూడా తక్కువగా ఉంటాయి. PIS అకౌంట్లో ఏ బ్యాంక్స్ తో అనుసంధానమై ఉంటాయో ఆ బ్యాంకులోనే account ఓపెన్ చేయాలి.
CAN NRI APPLY FOR IPOS
ఎన్ఆర్ఐలు ఐపీవో కోసం దరఖాస్తు చేయవచ్చా
చట్టం ప్రకారం NRI లు ఈక్విటీ షేర్లు, NCD, భారతీయ IPOలో పెట్టుబడి పెట్టవచ్చు. NRI అకౌంట్లోకి కన్వెర్ట్ చేసుకుని IPOS కి అప్లై చేసుకోవచ్చు.
* IPOలో పెట్టుబడి పెట్టడానికి NRI అర్హత వివరాలను సదరు సంస్థ (ARHP) A red herring prospectus లో వివరిస్తుంది.
* ICICI వంటి కొన్ని బ్యాంకులు NRI కస్టమర్లకు ఆన్లైన్ IPOని అందించవు. కాగా దాదాపు అన్ని సందర్భాల్లో కంపెనీలు NRIలను IPOలో పెట్టుబడి పెట్టడానికి అర్హులుగా గుర్తించవు. ఎందుకంటే NRIలను IPOలో పెట్టుబడి పెట్టడానికి RBI అదనపు సమ్మతి అవసరం.
* ఎన్ఆర్ఐలకు కేటాయించిన షేర్ల గురించి RBI కి తెలియజేసే బాధ్యత కంపెనీలదే.. అయితే NRIలు IPO షేర్లను కొనడానికి లేదా విక్రయించడానికి RBI నుంచి ఎటువంటి ప్రత్యేక అనుమతులు అవసరం లేదు.
*IPO పెట్టుబడి, సంబంధిత బ్యాంక్ లావాదేవీలు నాన్-పిఐఎస్ సేవింగ్ బ్యాంక్ ఖాతా ద్వారా జరుగుతాయి. మీరు బ్యాంక్‌లో NRI 3-in-1 ఖాతాని కలిగి ఉంటే భారతదేశంలో IPOలో పెట్టుబడి పెట్టడానికి వీలవుతుంది. ఆన్లైన్లోనే apply చేసుకోవచ్చు.
* మీరు 3-ఇన్-1 ఖాతాను (అంటే Zerodha , Sharekhan , 5Paisa , ProStocks ) అందించని బ్రోకర్‌తో మీ డీమ్యాట్ ఖాతాని కలిగి ఉన్నట్లయితే , మీ వద్ద లేని బ్యాంకు నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని ఉపయోగించి IPOకు దరఖాస్తు చేసుకోవచ్చు.
* మీరు ఇండియాకి వచ్చిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్ రన్ అవుతూ ఉంటే NRO అకౌంట్ ని కన్వెర్ట్ చేయాల్సి ఉంటుంది. మన కేవైసీని NRI కేవైసీ కింద కన్వెర్ట్ చేసిన తర్వాత మన మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని NRI కేవైసీలో అప్ డేట్ చేయాలి. యూఎస్, కెనడా నుంచి ఎవరైనా మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ..అటువంటి వారి ఇన్వెస్ట్ మెంట్స్ ను అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీలు అంగీకరించవు. కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మాత్రమే NRI నుంచి ఇన్వెస్ట్ మెంట్స్ అంగీకరిస్తున్నాయి.