డబ్బు లేకుండా జీవితం ఊహించలేం. కానీ డబ్బు ఉన్నా… ఆర్థిక భద్రత లేకపోవడం నేటి సమాజంలో పెద్ద సమస్యగా మారింది. ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి పని చేస్తున్నాం. జీతం వస్తోంది… వ్యాపారం సాగుతోంది… ఆదాయం పెరుగుతోంది. అయినా సరే, “భవిష్యత్తులో సరిపోతుందా?” “రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తాం?” అనే ఆందోళన చాలామందిని వెంటాడుతోంది. దానికి కారణం ఒక్కటే…డబ్బు సంపాదనపై దృష్టి ఉంది గానీ, డబ్బు నిర్వహణపై అవగాహన లేదు.
డబ్బు లక్ష్యం కాదు – సాధనం మాత్రమే.. Money Is a Tool, Not a Goal
చాలామంది డబ్బును లక్ష్యంగా భావిస్తారు. “ఎక్కువ సంపాదిస్తే చాలు” అనుకుంటారు. కానీ నిజానికి డబ్బు అనేది ఒక సాధనం (Tool). మంచి జీవితం కోసం.. భద్రత కోసం.. కుటుంబ అవసరాల కోసం.. గౌరవంగా జీవించడానికి డబ్బు అవసరం. అయితే, ఆ డబ్బును ఎలా ఉపయోగిస్తున్నామనే దానిపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తారు.
ఆర్థికంగా ఎందుకు వెనుకబడిపోతున్నారు? Why People Fail Financially?
చాలామంది జీవితాంతం పనిచేస్తారు. అయినా పదవీ విరమణ సమయానికి సరిపడా పొదుపులు ఉండవు. అప్పులు ఉంటాయి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే.. అపోహలతో కూడిన పెట్టుబడులే కారణం అవ్వొచ్చు. అదేవిధంగా భయం వల్ల అవకాశాలను వదిలేసుకోవడం, అవగాహన లేకపోవడం , ప్లానింగ్ లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వంటివి డబ్బు విషయంలో చేసే చిన్న తప్పులే.. ఇవే సంవత్సరాల తర్వాత పెద్ద నష్టాలుగా మారుతాయి.
పొదుపే సంపద కాదు .. Only Saving Is Not Wealth..
“ఖర్చు తగ్గించు”.. “పొదుపు చెయ్యి”.. “డబ్బు దాచుకో” ఇవి అన్నీ మంచి మాటలే. కానీ… ఇవే సరిపోవు. పొదుపు అంటే ఏమిటంటే.. మీ ఆదాయంలో ఖర్చులు పోయాక మిగిలిన డబ్బు. కానీ ఆ డబ్బును అలాగే ఉంచితే…ద్రవ్యోల్బణం దానిని తినేస్తుంది. వాస్తవ విలువ తగ్గిపోతుంది అంటే పొదుపు మాత్రమే చేస్తే మీరు వెనక్కి వెళ్తున్నట్టే.
నిశ్శబ్ద శత్రువు ద్రవ్యోల్బణం..Inflation – The Silent Enemy..
ఈ రోజు రూ.100తో కొనే సరుకులను రేపు రూ.120 కొనుగోలు చేస్తుంటాం. ఇలా ఏటా జరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు 15 ఏళ్ల క్రితం సినిమా టికెట్: రూ.30.. ఇప్పుడు: రూ.200 పైబడే ఉంది. డబ్బు విలువ తగ్గుతూనే ఉంది. అందుకే…డబ్బు పెరగకపోతే .. పొదుపు చేసినా.. డబ్బు ఉన్నట్టే కాదు.
ఎఫ్‌డీలే సరిపోతాయా? Is Fixed Deposit Enough?
భారతీయ కుటుంబాల్లో ఎఫ్‌డీ అంటే భద్రత. పెళ్లి , రిటైర్మెంట్, భూమి అమ్మిన డబ్బులన్నీ చాలామంది ఎఫ్‌డీల్లోనే పెడుతుంటారు. కానీ నిజం ఏమిటంటే…FD వడ్డీ: 6–7%. ద్రవ్యోల్బణం: 5–6%. పన్ను తర్వాత రాబడి ఇంకా తక్కువగానే ఉంటుంది. అంటే మీ డబ్బు పెరుగుతున్నట్టు కనిపించినా నిజానికి స్థిరంగానే ఉంది. FDలు మనకు అత్యవసర అవసరాల కోసం, తక్కువకాల లక్ష్యాల కోసం, మానసిక భద్రత కోసం ఉపయోగపడతాయి. మొత్తం పొదుపులో 20–30% మాత్రమే FDల్లో ఉంచాలి.
Loan Is Not Always Bad.. అప్పు అంటే ఎప్పుడూ చెడ్డదేనా?
“అప్పు అంటే పాపం” అని మన సమాజంలో ఒక నమ్మకం. కానీ ఆర్థికంగా చూస్తే…అది పూర్తిగా తప్పు. Good Loan (మంచి రుణం), గృహ రుణం, వ్యాపార రుణం, విద్యా రుణం.. ఇవి భవిష్యత్తులో ఆదాయం లేదా ఆస్తిని సృష్టిస్తాయి.
చెడు రుణం..Bad Loan
క్రెడిట్ కార్డ్ బాకీలు, విలాసవంతమైన వస్తువుల కోసం అప్పులు, అధిక వడ్డీ వ్యక్తిగత రుణాలు .. ఇవి కేవలం ఖర్చును మాత్రమే పెంచుతాయి. అప్పు చెడ్డది కాదు అప్పు ఉపయోగం చెడ్డదైతేనే సమస్య.
బంగారం: భావోద్వేగమా? పెట్టుబడా? Gold – Emotion vs Investment ..
భారతీయులకు బంగారం అంటే ప్రేమ. పండుగలు… పెళ్లిళ్లు… శుభకార్యాలు…బంగారం లేకుండా ఊహించలేం. కానీ పెట్టుబడి విషయానికి వస్తే ఒక స్పష్టత అవసరం. ఆభరణాలు కొంటే మేకింగ్ ఛార్జీలు, వేస్టేజ్, పన్నులు ఉంటాయి. వాటిని అమ్మేటప్పుడు ధర తగ్గుతుంది. మేకింగ్ ఛార్జీలు రావు. అంటే ఇక్కడ మనకు నష్టమే. పెట్టుబడి కోసం బంగారం కావాలంటే Sovereign Gold Bonds, Gold ETFs, Digital Goldలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇవి భద్రత + లిక్విడిటీ ఇస్తాయి.
స్టాక్ మార్కెట్ జూదం కాదు..Stock Market Is Not Gambling
స్టాక్ మార్కెట్ గురించి అత్యధిక అపోహలు ఉన్నాయి. నిజం ఏమిటంటే… అవగాహన లేకుండా చేస్తే అది జూదం. అవగాహనతో చేస్తే – సంపద సృష్టి. భారతదేశంలో లక్షల మంది మ్యూచువల్ ఫండ్స్, SIPల ద్వారా క్రమశిక్షణతో పెట్టుబడి పెడుతున్నారు. స్టాక్ మార్కెట్‌లో విజయం అంటే ఓర్పు, క్రమశిక్షణ, దీర్ఘకాల దృష్టి ఉండాలి. త్వరగా ధనవంతులు కావాలని ఆశిస్తే నష్టం తప్పదు.
బీమా పెట్టుబడి కాదు..Insurance Is Protection, Not Investment
బీమా గురించి చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే. ఎండోమెంట్, మనీ బ్యాక్ పాలసీల్లో పెట్టుబడి పెడుతుంటారు. వాస్తవంగా వాటిల్లో రాబడి: 4–5%. లాక్-ఇన్ ఎక్కువ. ఫ్లెక్సిబిలిటీ తక్కువ. సరైన విధానంలో బీమా అంటే.. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. పెట్టుబడులను వేరే చోట పెట్టాలి. బీమా = భద్రత, పెట్టుబడి = సంపద.. ఈ రెండింటిని కలపకూడదు.
సంపదకు మూడు స్థంభాలు..Three Pillars of Wealth
సంపద నిర్మాణానికి మూడు కీలక అంశాలు:
– Earning – సంపాదించడం
– Saving – పొదుపు
– Investing – పెట్టుబడి.. ఈ మూడు సమతుల్యతలో ఉన్నప్పుడే ఆర్థిక స్వేచ్ఛ సాధ్యమవుతుంది.
రిటైర్మెంట్ ప్లానింగ్ ఎందుకు అవసరం? Retirement Planning Matters
చాలామంది అనుకుంటారు… “రిటైర్మెంట్ ఇంకా చాలా దూరంగా ఉందని”. కానీ సమయం వేగంగా గడుస్తుంది. రిటైర్మెంట్ తర్వాత జీతం ఉండదు. వైద్య ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం తగ్గుతుంది. కాబట్టి ముందే ప్లాన్ చేయాలి. రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే SIPలు, పెన్షన్ పథకాలు, దీర్ఘకాలిక పెట్టుబడులు ఇవన్నీ చిన్న వయస్సులో మొదలుపెడితే రిటైర్మెంట్ సమయానికి మనపై ఆర్థిక భారం తగ్గుతుంది.
పిల్లలకు డబ్బు అవగాహన.. Teach Kids About Money
మన పిల్లలకు… చదువు నేర్పుతున్నాం. కెరీర్ గురించి చెబుతున్నాం. కానీ డబ్బు గురించి మాత్రం మాట్లాడడం లేదు. ఫలితంగా పెద్దయ్యాక వారు ఖర్చులపై నియంత్రణ లేక.. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచే పొదుపు అలవాటు చేయాలి. అవసరం vs కోరిక, పెట్టుబడి భావన నేర్పాలి.
డబ్బును నియంత్రించాలి.. Control Money, Don’t Let Money Control You
డబ్బు మన జీవితాన్ని నియంత్రించకూడదు…మనమే డబ్బును నియంత్రించాలి. అపోహలను వదిలి అవగాహనను అలవాటు చేసుకుంటే ఆర్థిక భద్రత తప్పదు. ఈ రోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయాలే రేపటి మీ జీవితాన్ని నిర్మిస్తాయి.

