ఎస్టేట్ ప్లానింగ్ ( Estate Planning) అంటే కేవలం ఆస్తులు పంపిణీ చేయడమే కాదు. కుటుంబానికి భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రాకుండా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేయడం. ఇందులో వీలునామాతో పాటు ట్రస్ట్‌లు, పవర్ ఆఫ్ అటార్నీ, హెల్త్‌కేర్ డైరెక్టివ్లు, బెనిఫిషియరీ వివరాలు వంటి పత్రాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అనారోగ్యం కారణంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి వస్తే ఎవరు ఆర్థిక వ్యవహారాలు చూసుకోవాలి? వైద్య చికిత్సకు సంబంధించిన నిర్ణయాలు ఎవరు తీసుకోవాలి? పిల్లల భవిష్యత్ ఎలా ఉండాలి? వంటి అంశాలన్నింటికీ ఎస్టేట్ ప్లానింగ్ సమాధానం చెబుతుంది.
ఆస్తి ఉంటే సరిపోదు.. వీలునామా లేకపోతే కుటుంబంలో తీరని వివాదాలే! Will Matters More Than Wealth
జీవితాంతం కష్టపడి సంపాదించిన ఇల్లు, స్థలం, బ్యాంకు డిపాజిట్లు, బంగారం, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు.. ఇవన్నీ ఒక తరం నుంచి మరో తరానికి ప్రశాంతంగా చేరాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఆస్తులు ఉండి కూడా సరైన ప్రణాళిక లేకపోవడం( Estate Planning) వల్ల వేలాది కుటుంబాలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి. అన్నదమ్ములు విడిపోవడం, తల్లిదండ్రులు కోరుకున్న విధంగా ఆస్తులు పంపకం కాకపోవడం, పిల్లల మధ్య విభేదాలు, సంవత్సరాల తరబడి కొనసాగే న్యాయపోరాటాలు.. వీటన్నింటికీ ఒకే కారణం ‘ఎస్టేట్ ప్లానింగ్’ లేకపోవడమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. చాలామంది బ్యాంకు ఖాతా, బీమా పాలసీ లేదా మ్యూచువల్ ఫండ్‌లో నామినీ పేరు నమోదు చేస్తే చాలు.. మరణానంతరం ఆ ఆస్తులన్నీ ఆ వ్యక్తికే దక్కుతాయని భావిస్తుంటారు. అయితే ఇది పూర్తిగా నిజం కాదు. నామినీ, చట్టబద్ధమైన వారసుడు ఒకరు కాదని, ఈ రెండింటి మధ్య ఉన్న తేడా తెలియకపోవడమే ఎక్కువ వివాదాలకు కారణమవుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నామినీ అంటే యజమాని కాదు.. Nominee Is Not the Owner
బ్యాంకు ఖాతా ( Estate Planning)తెరిచినా, ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా, బీమా పాలసీ తీసుకున్నా, డీమ్యాట్ లేదా మ్యూచువల్ ఫండ్ ఖాతా ప్రారంభించినా మొదట అడిగేది నామినీ వివరాలే. దీనిని చూసి చాలామంది నామినీ అంటే ఆస్తికి అసలు యజమానిగా భావిస్తారు. కానీ చట్టపరంగా నామినీ పాత్ర పూర్తిగా భిన్నం. ఖాతాదారుడు మరణించిన తర్వాత సంబంధిత ఆస్తి లేదా నిధులను తాత్కాలికంగా స్వీకరించి, చట్టబద్ధమైన వారసులకు అందే వరకు వాటిని సంరక్షించడం మాత్రమే నామినీ బాధ్యత. అందుకే నామినీని “కస్టోడియన్” లేదా “ట్రస్టీ”గా పరిగణిస్తారు. అంతిమ యాజమాన్య హక్కులు మాత్రం వీలునామా లేదా వారసత్వ చట్టాల ప్రకారమే నిర్ణయించబడతాయి.
వీలునామానే చివరి మాట.. Will Has Legal Priority
ఒక వ్యక్తి తన మరణానంతరం( Estate Planning) ఎవరికీ ఎంత ఆస్తి చెందాలనే విషయాన్ని స్పష్టంగా పేర్కొంటూ రూపొందించే చట్టబద్ధమైన పత్రాన్నే వీలునామా లేదా విల్ అంటారు. వీలునామా సక్రమంగా తయారుచేస్తే కుటుంబ సభ్యుల మధ్య సందేహాలకు తావుండదు. ఎవరికీ ఏ ఆస్తి చెందాలో ముందుగానే స్పష్టత ఉండటంతో కోర్టు వివాదాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ నామినీగా ఒకరి పేరు ఉండి, వీలునామాలో మాత్రం ఆ ఆస్తిని మరొకరికి ఇవ్వాలని రాసి ఉంటే, సాధారణంగా వీలునామాకే ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఎస్టేట్ ప్లానింగ్‌లో వీలునామాను అత్యంత కీలక పత్రంగా నిపుణులు భావిస్తున్నారు.
నామినీ… వారసుడు.. ఇద్దరూ వేర్వేరే.. Nominee Vs Legal Heir
చట్టబద్ధమైన వారసుడు( Estate Planning) అంటే సంబంధిత వారసత్వ చట్టాల ప్రకారం ఆస్తిపై హక్కు కలిగిన వ్యక్తి. జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు, కొన్ని సందర్భాల్లో తోబుట్టువులు లేదా ఇతర సమీప బంధువులు కూడా వారసులుగా పరిగణించబడవచ్చు. నామినీ మాత్రం ఖాతాదారుడు స్వయంగా ఎంచుకునే వ్యక్తి. కుటుంబ సభ్యుడే కావాల్సిన అవసరం కూడా లేదు. స్నేహితుడు, బంధువు లేదా తనకు నమ్మకమైన ఎవరినైనా నామినీగా నియమించవచ్చు. అందుకే నామినీగా పేరు ఉందంటే ఆస్తిపై పూర్తి యాజమాన్య హక్కు వచ్చేసినట్లు కాదని గుర్తుంచుకోవాలి.
వీలునామా లేకపోతే ఏం జరుగుతుంది? When There Is No Will?
చాలామంది వీలునామా( Estate Planning) రాయడాన్ని వాయిదా వేస్తుంటారు. మరికొందరు అది ధనవంతులకు మాత్రమే అవసరమని భావిస్తారు. కానీ వీలునామా లేకపోతే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. అలాంటి సందర్భాల్లో భారతదేశంలో అమల్లో ఉన్న వారసత్వ చట్టాల ప్రకారం ఆస్తుల పంపిణీ జరుగుతుంది. హిందువులకు హిందూ వారసత్వ చట్టం, ముస్లింలకు వ్యక్తిగత చట్టాలు, ఇతరులకు సంబంధిత నిబంధనలు వర్తిస్తాయి. ఈ ప్రక్రియలో వారసత్వ ధృవీకరణ పత్రాలు, కోర్టు అనుమతులు, న్యాయపరమైన ప్రక్రియలు అవసరమయ్యే అవకాశముంది. దీంతో కుటుంబ సభ్యులు సంవత్సరాల తరబడి ఇబ్బందులు పడాల్సి రావచ్చు.
డిజిటల్ ఆస్తులు కూడా గుర్తుండాలి.. Don’t Ignore Digital Assets
ఈ రోజుల్లో ఆస్తి ( Estate Planning)అంటే కేవలం ఇల్లు లేదా భూమి మాత్రమే కాదు. మ్యూచువల్ ఫండ్లు, షేర్లు, డీమ్యాట్ ఖాతాలు, క్రిప్టో ఆస్తులు, డిజిటల్ వాలెట్లు, ఆన్లైన్ బ్యాంకింగ్ ఖాతాలు కూడా వ్యక్తిగత సంపదలో భాగమే. అయితే చాలామంది ఈ వివరాలను కుటుంబ సభ్యులతో పంచుకోరు. ఫలితంగా మరణానంతరం ఆ ఆస్తులు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. అందుకే అన్ని ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, పెట్టుబడులు, బీమా పాలసీలు, అప్పులు, పాస్‌వర్డ్‌ల వివరాలను ఒక భద్రమైన పత్రంలో నమోదు చేసి కుటుంబ సభ్యులకు తెలియజేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
నామినీ వివరాలు ఎప్పటికప్పుడు మార్చుకోవాలి.. Keep Nominee Details Updated
వివాహం, పిల్లల జననం, విడాకులు, కుటుంబంలో మరణాలు( Estate Planning) వంటి పరిస్థితుల్లో నామినీ వివరాలను కూడా మార్చడం అవసరం. చాలామంది ఉద్యోగంలో చేరినప్పుడు ఒకసారి నామినీని నమోదు చేసి, ఆ తర్వాత ఎప్పుడూ అప్డేట్ చేయరు. దీనివల్ల భవిష్యత్‌లో అనవసర వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ప్రతి బ్యాంకు ఖాతా, బీమా పాలసీ, పీఎఫ్ ఖాతా, మ్యూచువల్ ఫండ్, డీమ్యాట్ ఖాతాలో నామినీ వివరాలు సరైనవిగా ఉన్నాయో లేదో క్రమం తప్పకుండా పరిశీలించడం అవసరం.
ఫిక్స్డ్ డిపాజిట్లలోనూ ఇదే నిబంధన.. Same Rule for Fixed Deposits
ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో ( Estate Planning)కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఖాతాదారుడు మరణించిన తర్వాత బ్యాంకు మెచ్యూరిటీ మొత్తాన్ని నామినీకి అందజేయవచ్చు. అయితే అందువల్ల నామినీ ఆ మొత్తానికి శాశ్వత యజమాని అయిపోడు. చట్టబద్ధమైన వారసులు లేదా వీలునామాలో పేర్కొన్న లబ్ధిదారులకే చివరకు ఆ నిధులపై హక్కు ఉంటుంది. అందుకే నామినీని యజమానిగా కాకుండా తాత్కాలిక సంరక్షకుడిగా మాత్రమే చట్టం చూస్తుంది.
కొన్ని సందర్భాల్లో మినహాయింపులు.. Limited Exceptions
కొన్ని బీమా పాలసీలు లేదా ఉద్యోగుల ప్రయోజన పథకాలలో ( Estate Planning)ప్రత్యేక నిబంధనల ప్రకారం నామినీకి నేరుగా లబ్ధిదారుడి హోదా లభించే అవకాశముంది. అయితే ఇది ప్రతి ఆర్థిక ఉత్పత్తికి వర్తించదు. ఏ చట్టం కింద ఆ పథకం అమలవుతుందో, దాని నిబంధనలు ఏమిటన్నదే తుది నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల ప్రతి పెట్టుబడి విషయంలో ఒకే విధమైన నిబంధన ఉంటుందని భావించడం సరైంది కాదు.
చిన్న నిర్లక్ష్యమే.. పెద్ద వివాదాలకు కారణం.. Avoid Family Disputes
ఆస్తి ఎంత ఉందన్నది కాదు.. దాన్ని ఎలా ప్రణాళికబద్ధంగా ( Estate Planning)వారసులకు అందిస్తున్నామన్నదే ముఖ్యం. జీవితకాలంలో ఒకసారి వీలునామా సిద్ధం చేయడం, నామినీ వివరాలను నవీకరించడం, అన్ని ఆస్తుల వివరాలను కుటుంబ సభ్యులకు తెలియజేయడం ద్వారా భవిష్యత్‌లో తలెత్తే అనేక న్యాయపరమైన, కుటుంబపరమైన సమస్యలను నివారించవచ్చు. ఎస్టేట్ ప్లానింగ్ అనేది ధనవంతులకు మాత్రమే అవసరమనే అభిప్రాయం ఇప్పుడు మారుతోంది. చిన్న ఇల్లు, కొద్దిపాటి పొదుపు, ఒక బ్యాంకు ఖాతా, బీమా పాలసీ మాత్రమే ఉన్నా సరే, సరైన ప్రణాళిక లేకపోతే అదే ఆస్తి కుటుంబంలో విభేదాలకు కారణమయ్యే ప్రమాదం ఉంది. అందుకే నిపుణులు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు… “ఆస్తి సంపాదించడం ఎంత ముఖ్యమో, ఆ ఆస్తి ప్రశాంతంగా వారసులకు చేరేలా ప్రణాళిక సిద్ధం చేయడం అంతకంటే ముఖ్యమైన బాధ్యత.”
