జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కసారిగా ఉద్యోగం పోవచ్చు, ఆదాయం తగ్గవచ్చు, అనారోగ్యం వెంటాడవచ్చు. ఇలాంటి అనూహ్య మలుపుల మధ్య మన కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే ప్రధాన సాధనం టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ (Term Policy ) . అయితే అదే పాలసీ సకాలంలో ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రద్దయితే? అప్పటిదాకా మనం నమ్ముకున్న భద్రత ఒక్కసారిగా కరిగిపోతుంది. చాలామంది “ఒక నెల ఆలస్యం అయితే ఏం కాదు” అనుకుంటారు. కానీ టర్మ్ పాలసీల విషయంలో చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదంగా మారుతుంది. పాలసీ రద్దయ్యిందంటే కవరేజీ పూర్తిగా నిలిచిపోతుంది. ఆ సమయంలో ఏదైనా అనుకోని ఘటన జరిగితే, నామినీలకు ఒక్క రూపాయి కూడా రాదు. అందుకే టర్మ్ పాలసీ ల్యాప్స్ అంశంపై పూర్తి అవగాహన ఉండటం చాలా అవసరం.
టర్మ్ పాలసీ ఎందుకు రద్దవుతుంది? Common Reasons Behind Policy Lapse
టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ(Term Policy ) రద్దయ్యే ప్రధాన కారణం ప్రీమియం సకాలంలో చెల్లించకపోవడమే. కానీ దాని వెనుక అనేక పరిస్థితులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆకస్మిక ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి. ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులు, అప్పుల ఒత్తిడి… ఈ అన్నింటి మధ్య బీమా ప్రీమియం చివరి ప్రాధాన్యంగా మారిపోతుంది. మరికొందరికి సరైన బడ్జెట్ నిర్వహణ లేకపోవడం సమస్యగా మారుతుంది. నెలవారీ ఖర్చులపై స్పష్టత లేకుండా, ఆదాయం వచ్చిన వెంటనే ఖర్చు చేస్తే, ప్రీమియం గడువు దగ్గరయ్యేసరికి డబ్బు చేతిలో ఉండదు. ఉద్యోగం పోవడం లేదా జీతం తగ్గడం లాంటి ఆదాయ మార్పులు కూడా ప్రీమియం చెల్లింపును ప్రభావితం చేస్తాయి. ఆరోగ్య సమస్యలు మరో ప్రధాన కారణం. వైద్య ఖర్చులు పెరిగినప్పుడు, పాలసీదారుడి ఆర్థిక స్థిరత్వం దెబ్బతింటుంది. ఈ క్రమంలో బీమా ప్రీమియం వెనుకబడిపోతుంది. ఇంకొంతమందికి అసలు గడువు తేదీలపై అవగాహన లేకపోవడమే కారణం. ప్రీమియం తేదీలు గుర్తుంచుకోకపోవడం, రిమైండర్లు సెట్ చేయకపోవడం వల్ల అనుకోకుండా పాలసీలు ల్యాప్స్ అవుతుంటాయి.
పాలసీ రద్దైతే ఏం జరుగుతుంది? Impact of a Lapsed Term Policy
టర్మ్ పాలసీ (Term Policy )రద్దయ్యిందంటే, ఆ క్షణం నుంచి పాలసీ కవరేజీ ఉండదు. పాలసీ యాక్టివ్‌లో ఉన్నంత వరకు మరణ భద్రత ఉంటుంది. కానీ ల్యాప్స్ అయిన తర్వాత ఆ భద్రత పూర్తిగా ఆగిపోతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే… టర్మ్ పాలసీలకు సేవింగ్స్ లేదా క్యాష్ విలువ ఉండదు. ఇది పూర్తిగా రిస్క్ కవర్ మాత్రమే. కాబట్టి పాలసీ రద్దైతే ఇప్పటివరకు చెల్లించిన ప్రీమియాలు తిరిగి రావు. అదే సమయంలో కొత్త పాలసీ తీసుకోవాలంటే, వయసు పెరిగిన కారణంగా ప్రీమియం ఎక్కువ అవుతుంది.
గ్రేస్ పీరియడ్ అంటే ఏమిటి? Understanding the Grace Period
ప్రీమియం గడువు తేదీ దాటినా వెంటనే పాలసీ(Term Policy ) రద్దవ్వదు. బీమా సంస్థలు కొంత అదనపు సమయాన్ని ఇస్తాయి. దీనినే గ్రేస్ పీరియడ్ అంటారు. సాధారణంగా ఇది 15 నుంచి 30 రోజుల వరకు ఉంటుంది. ఈ సమయంలో ప్రీమియం చెల్లిస్తే పాలసీ యథావిధిగా కొనసాగుతుంది. అయితే ఈ గ్రేస్ పీరియడ్‌లో ఏదైనా అనుకోని ఘటన జరిగితే, చాలా సందర్భాల్లో క్లెయిమ్ అంగీకరిస్తారు. కానీ ఇది సంస్థనుబట్టి మారవచ్చు. అందుకే గ్రేస్ పీరియడ్‌ను చివరి అవకాశం అన్నట్టుగా భావించి వెంటనే ప్రీమియం చెల్లించడం మంచిది.
రద్దైన పాలసీని తిరిగి ప్రారంభించవచ్చా? Can a Lapsed Term Policy Be Revived?
టర్మ్ పాలసీ (Term Policy )రద్దయిందని భయపడాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో దాన్ని తిరిగి ప్రారంభించుకునే అవకాశం ఉంటుంది. దీనినే పాలసీ రివైవల్ అంటారు. అయితే ఇది కొన్ని నిబంధనలకు లోబడి ఉంటుంది. ముందుగా బాకీ ఉన్న ప్రీమియాలను చెల్లించాలి. కొన్ని సందర్భాల్లో వడ్డీ లేదా ఆలస్య రుసుము కూడా చెల్లించాల్సి రావచ్చు. పాలసీ ఎంతకాలంగా ల్యాప్స్ అయిందనే అంశం ఇక్కడ కీలకం. తక్కువ కాలం అయితే ప్రక్రియ సులభంగా ఉంటుంది.
రివైవల్ కోసం ఏం చేయాలి? Steps to Restart Your Term Policy
పాలసీని (Term Policy )తిరిగి ప్రారంభించాలంటే ముందుగా బీమా సంస్థకు అధికారికంగా దరఖాస్తు చేయాలి. ఇందులో తాజా వ్యక్తిగత వివరాలు, ఆదాయ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. పాలసీ ల్యాప్స్ అయి ఎక్కువ కాలం అయితే, బీమా సంస్థ ఆరోగ్య ధ్రువీకరణ కోరవచ్చు. అంటే పాలసీ తీసుకున్నప్పటి ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉందా లేదా అన్నది పరీక్షిస్తారు. అవసరమైతే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కంపెనీ సూచించవచ్చు. ఈ దశలో ఏదైనా కొత్త వ్యాధులు బయటపడితే, రివైవల్‌పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
బీమా మొత్తం మార్చుకోవచ్చా? Reassessing Coverage During Revival
కొన్ని సందర్భాల్లో పాలసీదారులు (Term Policy )తమ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను బట్టి బీమా మొత్తాన్ని పునఃపరిశీలించుకోవాల్సి వస్తుంది. ఆదాయం తగ్గితే, ఎక్కువ కవరేజీ కొనసాగించడం కష్టంగా మారవచ్చు. అప్పుడు బీమా మొత్తాన్ని తగ్గించుకోవడం ఒక ఆప్షన్‌గా మారుతుంది. అయితే నిపుణులు చెబుతున్నది ఒకటే. అవసరం లేకుండా కవరేజీ తగ్గించుకోవద్దు. కుటుంబ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సరైన మొత్తాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం.
కొత్త పాలసీ తీసుకోవడం మంచిదా? Old Policy vs New Policy
చాలామంది పాలసీ(Term Policy ) ల్యాప్స్ అయిన తర్వాత కొత్త పాలసీ తీసుకోవాలని అనుకుంటారు. కానీ ఇది ఎప్పుడూ మంచిది కాదు. ఎందుకంటే పాత పాలసీని తక్కువ వయసులో తీసుకుంటారు. అందువల్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. కొత్త పాలసీ తీసుకుంటే వయసు పెరిగిన కారణంగా ప్రీమియం ఎక్కువ అవుతుంది. పైగా ఏదైనా వ్యాధులు ఉంటే, పాలసీ లభించకపోవచ్చు. వచ్చినా ప్రీమియంపై లోడింగ్ విధించే అవకాశం ఉంది. అందుకే వీలైనంత వరకూ పాత పాలసీని రివైవ్ చేసుకోవడమే మేలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
రెగ్యులేటర్ ఏమంటోంది? What the Regulator Advises
బీమా రంగాన్ని పర్యవేక్షించే Insurance Regulatory and Development Authority of India కూడా పాలసీదారులకు ఇదే సూచిస్తోంది. ప్రీమియం గడువు తేదీలపై అవగాహన కలిగి ఉండాలని, ల్యాప్స్ అయిన పాలసీలను వీలైనంత త్వరగా పునరుద్ధరించుకోవాలని పదే పదే హెచ్చరిస్తోంది.
భవిష్యత్తులో ల్యాప్స్ కాకుండా ఉండాలంటే? How to Avoid Policy Lapse
టర్మ్ పాలసీని(Term Policy ) దీర్ఘకాలం నిరంతరాయంగా కొనసాగించాలంటే కొన్ని చిన్న జాగ్రత్తలు అవసరం. ప్రీమియం తేదీలకు ఆటో డెబిట్ సెట్ చేసుకోవడం, మొబైల్ రిమైండర్లు పెట్టుకోవడం, సంవత్సరానికి ఒకసారి పాలసీ వివరాలు సమీక్షించుకోవడం మంచిది. బీమా ప్రీమియాన్ని ఖర్చుగా కాకుండా కుటుంబ భద్రతగా భావిస్తే, దానికి ఎప్పుడూ మొదటి ప్రాధాన్యం ఇస్తారు.
పునరుద్ధరించుకోవడం మేలు.. Reviving the Policy Is the Better Option
టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ (Term Policy )అనేది మనకు కాదు… మనపై ఆధారపడినవారికి. పాలసీ రద్దైతే మనకు వెంటనే ఏ నష్టం కనిపించకపోవచ్చు. కానీ అవసరమైన సమయంలో కుటుంబం ఆర్థికంగా ఒంటరిగా మిగిలిపోతుంది. అందుకే పాలసీ ల్యాప్స్ అంశాన్ని చిన్న విషయంగా తీసుకోకూడదు. ఒకసారి రద్దయినా, అవకాశం ఉన్నంతవరకూ పునరుద్ధరించుకోవాలి. పాత పాలసీని కాపాడుకోవడమే కుటుంబ భవిష్యత్తును కాపాడుకోవడమని గుర్తుంచుకోవాలి.
